• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » యేసువారు నిజంగానే పునరుత్థానుడా? - 1

యేసువారు నిజంగానే పునరుత్థానుడా? - 1

      గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమనియు,నేను మీకు ప్రచురము చేయుచు చేయు యేసేక్రీస్తయి యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాతంలనెత్తి చెప్పుచు,వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అపొ//కా :17:2-3

ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి,మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. రోమా:4:25

యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. రోమా 10:9

నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. 2వ తిమోతి 2:8


        యేసు మరణించిన తరువాత పునరుత్థానమయ్యారని పౌలు ప్రచారం చేసినట్లు పై వాక్యాలలో తెలుస్తుంది.అయితే ఇది అంతిమ పునరుత్థానము గురించా? కాదు.కాని యేసు సిలువపై మరణించినట్లు అపోహకు గురయై తరువాత మూడవరోజు మృతులలో నుండి సజీవంగా లేచారని జరిగిన ప్రచారానికి సంబంధించిన పునరుత్థానము.

క్రింది వచనాలను గమనించండి.

       యేసు మృతిపొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకుని వచ్చును.మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటే ముందుగా ఆయన సన్నిధినిఒ చేరదము.ఆర్భాటముతోనూ,ప్రధానదూత శబ్ధముతోనూ దేవును బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును.క్రీస్తునందుండి మృతులైనవారు మోదట లేతురు.ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీదకొని పోబడుదుము.కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ వుందుము.కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనికొకడు ఆదరించుకొనుడి. 1వ ధెస్సలోనియకకు 4:14-18
        

        యేసు పునరుత్థానమును గూర్చి ప్రచారం చేస్తూ పై వచనాలలో అంతిమ పునరుత్థానము [GENERAL RESURRECTION] గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు యేసునందు నిద్రించిన వారు అనగా యేసుపట్ల విశ్వాసముంచి మరణించినవారు అందరికంటే ముందు లేస్తారని, అప్పటికి ఇంకా బ్రతికి ఉన్న క్రైస్తవులు యేసును అనుసరించి వెళ్తారు.అయితే అన్యుల గూర్చి ఇక్కడ ఏమీ చెప్పలేదు.అప్పటికి ఇంకా బ్రతికి ఉన్న క్రైస్తవులు మేఘాలలో కొనిపోబడి,యేసునుందు మరణించి మోదటి ఫలముగా పునత్థానము చెందిన వారితో కలిసి యేసును ఎదుర్కొని వెంబడిస్తారు.ఆ విధంగా అప్పటికి బ్రతికి ఉన్నవారు మరణము-పునరుత్థానము అనెడి సహజ ప్రక్రియలకు లోనుకాకుండా నిరంతరం బ్రతికి ఉంటారు.ఇది పౌలు ప్రచారం.ఇది ఎంతవరకూ వాస్తవమో పరిశీలిద్దాం. 
         
          యేసు పునరుత్థానము గూర్చి చర్చించే ముందు అంతిమ పునరుత్థానం [GENERAL RESURRECTION] గూర్చి ముందు ఆలోచిద్దాం.

        దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది.ఆ కాలమున సమాధులలో నున్న వారందరు ఆయన శబ్ధము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు. యోహాన్ 5:28-29

 
        
పునరుత్థానదినం నాడు- మృతులను తీర్పు గూర్చి సమాధిలలో నుండి లేపటానికి యేసు వస్తారని యోహాన్ సువార్తలోని పై వాక్యాలు తెలుపుతున్నాయి.ప్రళయం నాడు ప్రపంచం అంతా అంతమైపోతుంది.ఆ నాడు ప్రతిజీవి మరణించి,అంతా నాశనమైపోతుంది.ఆ తరువాత అంతిమ పునరుత్థానము [
GENERAL RESURRECTION] సంభవిస్తుందనేది యధార్ధం.అలాంటప్పుడు కొందరు క్రైస్తవులు మేఘాలలో యేసును ఎదుర్కొనబోయి నిరంతరం ఆయనతో సజీవంగా ఉండిపోవడానికి,ప్రళయం నాడు మరణించకుండా ఉండడం ఎలా సాధ్యం? ఈ విచిత్రమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడమే కాకుండా దీనిని ప్రచారం చేయమంటాడు పౌలు. [ఈ మాటల చేత ఒకరికొకరు ఆదరించికోండి] ఇంకా పై వచనాల [యోహాన్ 5:28-29]లో 'తాను మృతులను లేపుటకు వచ్చునప్పుడు కొందరు క్రైస్తవులు సజీవంగా ఉంటారు.వారిని మేఘములలో నాతోపాటు కొనిపోతాను.వారు నిత్యం నాతో ఉంటారూ అని యేసు చెప్పకపోవడం మరో విశేషం.
                                                                       Next Page-2
                                                                                

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine