• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మలున్నాయా?

వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మలున్నాయా?

పరలోకాన్ని వ్యతిరేకించే కొందరి నమ్మకాల్లో ఓ నమ్మకం "పునర్జన్మ" సిద్ధాంతం.ఈ విశ్వాసం లేక సిద్ధాంతం ప్రకారం మనిషి తన కర్మల సత్ఫలితాలను, దుష్ఫలితాలను అనుభవించడానికి ఈ లోకంలోనే పదే పదే జన్మిస్తాడని,తన కర్మల ఫలితంగా ఒకప్పుడు మనిషిగా జన్మిస్తే మరొక్కప్పుడు ఏదో ఒక జంతువుగానో,కీటకంగానో లేక చెట్టుచేమల రూపంలోనో జన్మించి మరల,మరల ఈ లోకంలోకే వస్తాడు అన్నది.ఈ సిద్ధాంతం ఓ కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది.గ్రీకు,రోమన్లు ఈ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు.ఈజిఫ్ట్ ప్రాచీన చరిత్రలోను ఈ విశ్వాసం కానవస్తుంది.వీటి ప్రభావంగా ఓ కాలంలో యూదుల్లోను ఈ నమ్మకం వ్రేళ్లూనుకుంది.మన భారతదేశంలోని హిందువుల్లోను,జైనుల్లోను,బౌద్ధుల్లోను దీనికి మంచి ప్రాచుర్యం లభించింది.
    ఈ పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు,నమ్మకాలన్నిటిని,ఆధునిక విజ్ఞాన శాస్త్రం,జీవితం గురించి నేడు తెలుసుకున్న యదార్ధాలు పూర్తిగా కొట్టిపారేశాయి.ఈ సిద్ధాంతాన్ని మనం విజ్ఞానం,తర్కం వెలుగులో సమీక్షిస్తే ఇది కేవలం ఓ అసత్యమైన నమ్మకం లేక సిద్ధాంతం అని చెప్పడంలో సందేహం ఏమాత్రం ఉండదు.
     పునర్జన్మ సిద్ధాంతం పరలోక సిద్ధాంతానికి వ్యతిరేకమే కాకుండా దీనివల్ల మతానికి,మత భావాలకు కూడా తీవ్రమైన విఘాతం కలుగుతుంది.ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడితే నాగరికులు,విద్యావంతులు అనబడే వారి దృష్టిలో దీనికి ఎలాంటి విలువే ఉండదు.మతం ఓ శక్తిగా మారి అది పైకొచ్చే మార్గాలన్నీ మూసివేయబడతాయి.ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు సైతం దీన్ని తమ ఆచరణలో పెట్టకుండా దూరంగానే ఉంచుతున్నారు.దాన్ని తమ నిజజీవితంలో ఆచరించడం లేదు,ఆచరించనూలేరు.
       పునర్జన్మ విశ్వాసంలో సాధారణ ప్రజలకు ఎంతో కొంత ఆసక్తి,ఆకర్షణ ఉండడానికి కారణం,కేవలం ఈ విశ్వాసం ద్వారా మనిషి సంబంధం తన జన్మభూమి నుండి తెగిపోకుండా ఉండడమే;అతడు మరణించినతరువాత కూడా ఏదో ఒక రూపంలో ఈ ప్రపంచంతో సంబధం కలిగి ఉంటాడన్న భావమే.ఈ ధరిత్రి ఎడల అతనికున్న అనురాగం,మమకారం,ప్రేమ అతణ్ణి జరుగబోయేదాని గురించి ఆలోచించే అవ్కాశమే ఇవ్వవు.అసలు జీవితం పరిమితమైన ఈ ప్రపంచం కంటే అనేక రెట్లు అధికమని తెలిస్తే ఎంత బాగుంటుంది!
          పునర్జన్మ సిద్ధాంతం గురించి సహేతుకమైన,ఆచరణయోగ్యమైన దృష్టికోణాలతో సంగ్రంగా పరిశీలించే అవకాశం ఇక్కడ లేకపోయినా ఓ మౌలిక విషయం వైపు మాత్రం దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తాను.జంతు,వృక్షశాస్త్ర అధ్యయనం వల్ల మనకు తెలిసేదేమిటంటే,వృక్ష సంతతి మాట అటుంచి కేవలం జంతుజాలాలు ,మనిషి నడుమ ఉన్న వ్యత్యాసమే భర్తీ చేయ వీలులేనటువంటిదని,వృక్ష సంతతి మరియు జంతు సంతతిలో స్పృహ అనేదే లేదు అని తెలుస్తుంది.తన గురించి తాను అర్ధం చేసుకునే స్పృహ కేవలం మనిషిలోనే ఉంది.ఏ జంతువులోనో,ఏ చెట్టులోనో మనిషి ఆత్మ,తాను జంతువు రూపంలోనో,చెట్టుచేమల రూపంలోనో ఉన్నానని,తాను చేసిన దుష్కృత్యాలకు ఫలితం ఇలా ఈ రూపంలో లభిస్తుందని ఎలా తెలుసుకోగలరు?
         మనిషి ఆత్మ,స్పృహరహితమైన జంతువు లేక వృక్షం ఆత్మగా మార్చబడి శిక్షించబడుతోంది అని ఏ ప్రబుద్దుడైనా అంటే,మనిషి ఆత్మ,జంతువు ఆత్మకు ఉన్న తేడా ప్రకారం,ఓ మనిషి ఆత్మ,జంతువు ఆత్మగా మార్చబడితే మోదట దానికి ఉన్న వ్యక్తిత్వంగాని,శక్తిగాని దానికి ఉండదు అని అతడు గ్రహించాలి.ఇలా జరిగినప్పుడు మరో ఆత్మ ఉనికిలోనికి వస్తుంది.ఆ వ్యక్తిత్వంగాని,ఆ ఆత్మగాని ఉండకపోతే శ్క్షించబడేదెవరు? చెట్లు,జంతువులు వగైరాలు పూర్వజన్మ దుష్కృతం వల్ల శిక్షల రూపంలో ఉనికిలోనికి వచ్చాయి అని మనం ఒప్పుకున్నా ఆ శిక్ష మానవాత్మలకు కాదు,శిక్షకు అర్హులు కానటువంటి ఇతర అమాయక ఆత్మలకు లభిస్తోంది.ఈ చెట్టుచేమలు,జంతుజాలం మనిషికి గొప్ప వరాలు.అవి పాపాల ఫలితంగానే ఉనికిలోనికి వచ్చాయి అని అనడం,వాటిపై అభాండాలు వేసి అత్యాచారం చేసినట్లే.పాప ఫలితంగా మనకు ఈ వరాలు లభిస్తాయి అని అనుకుంటే ఈ పాపం మానవత్వానికి మానవజాతికి ఎంతో అవ్సరం అని అనక తప్పదు.సరికదా మానవ మనుగడ,ప్రపంచ అందచందాలు ఈ పాపాల ఫలితంగానే సాగుతున్నాయని కూడా చెప్పవచ్చు.ఈ నేపధ్యంలో,మన హృదయాల్లో దైవం కోసం రవ్వంత కృతజ్ఞతాభావం కూడా పొడసూపదు.మనం ఈ ప్రపంచాన్ని,ఇక్కడి వరాలను వనరులను,వనరుల్ని మరో దృష్టితో చూడాల్సి వస్తుంది.పేదసాదల్ని,కష్టాల్లో కడగండ్లలో జీవితం నెట్టుకువచ్చేవారిని,పాపాత్ములని,వీళ్లు పాపాత్ములు కాకపోతే వీరికి ఈ స్ధితి దాపురించేదే కాదు అని అనుకోవలసివచ్చేది మనం.
         పునర్జన్మ సిద్ధాంతం వేద బోధనలకు కూడా వ్యతిరేకమే.వేదాల్ని అధ్యయనం చేస్తే,ఆర్యులు పరలోకాన్ని నమ్మేవారని తెలుస్తోంది.వారి విశ్వాసం ప్రకారం మరణానంతరం మనిషికి మరో జీవితం లభిస్తుందని,అది మనిషి కర్మలకు అనుగుణంగా మేలైనదైనా,కీడైనదైనా అయివుండవచ్చు.
         "మంత్రం" మరియు బ్రాహ్మణాల్లోను "పితృలోక" విశ్వాసం ఉంది.ఆ విశ్వాసంలో పునర్జన్మకు తావేలేదు.ఆ తరువాతి "సూత్ర"కాలంలో,పితృలోక విశ్వాసానికి తోడు పునర్జన్మ సిద్ధాంతం కూడా చోటుచేసుకుంది.ఆ తరువాత పురాణ కాలం నాటికి పితృలోక విశ్వాసంతో పాటు పునర్జన్మ విశ్వాసం చెరిసమంగా మనకు కానవస్తాయి.వేదాలు పునర్జన్మను నమ్మవు.ఇది యదార్ధం.ఎవరైతే వేదాల నుండి పునర్జన్మ సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తారో,వారు న్యాయంగా వ్యవహరించరు.కొందరైతే ఖుర్ ఆన్ నుండి కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని సాధించే ప్రయత్నం చేశారు.కాని వారి ఈ ప్రయత్నాలకు సత్యంతో ఎలాంటి సంబంధం లేదు.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తన గ్రంధం "ఇండియన్ ఫిలాసఫీ"సంపుటం-1లోని 113-116 పేజీల్లో,వేదాల్లో పునర్జన్మ సిద్ధాంతం లభించదు అని రాశారు.ఇలాగే అనేక మంది హిందూ విద్వాన్సుల భావం కూడా అదే.ప్రాచ్యమతాల ప్రఖ్యాత అధ్యయనకర్త "మూక్స్ ముల్లర్" వేదాలను అధ్యయనం చేసిన తరువాత,"వేదాల్లో పునర్జన్మ సిద్ధాంతం అనేదే లేదు అందు పరలోకవాదమే లభిన్స్తుంది" అని రాశాడు.
              వేదాల్లో ఇలా ఉంది:
     "వారు పరలోకాన్ని మరచి,బుద్ధీజ్ఞానాలను వదిలేసి మాచే నిర్ణయించబడ్డ హద్దులను దాటే ప్రయత్నం చేస్తున్నారు." [ఋగ్వేదం-1:3-4]
      "గుర్రానికి ప్రతిదినం గడ్డి ఎలా కేటాయించబడుతుందో ఓ అగ్నీ!ధనాన్ని [కూడగట్టి]భద్రపరిచే వారి నుండి అంతిమ దినం నాడు నేను లెఖ్ఖ గైకొంటాను" [యజుర్వేదం-50:11-75]
      సత్యార్ధ విద్యాలంకార్ ఇలా రాశారు:
      "వేదాల్లో పునర్జన్మ సిద్ధాంతం లేదు.ఈ విషయం గురించి నేను జూదం కూడా ఆడగలను [బెట్టుకాస్తాను]" పునర్జన్మ:పేజి.104
      డా.పరాడా చౌహాన్ ఇలా రాశారు:
      "వేదాల్లో పునర్జన్మ గురించి ఉంది.అయితే అందులో ఈ జన్మ తరువాత కేవలం ఒకే ఒక జన్మ గురించి రాసుంది.వేలాది జన్మ గురించి కాదు." [పునర్జన్మ మరియు వేదాలు:పేజి.93]
      వేదాల్లో ఇలా ఉంది:
      "అగ్ని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు సూర్యుణ్ణి పొందే ప్రయత్నం చేయండి.మాతరిశ్వుడు,భృగుడు అనేవాళ్లు మా ద్వారానే రెండు జన్మలను తెలుసుకొని నమ్మారు." [ఋగ్వేదం:1-11-1]
       మరణానంతర జీవితం గురించి ఖుర్ ఆన్ ఇచ్చిన ప్రస్ఫుటమైన విశ్వాసం ప్రకారం,పై వేదమంత్రాలు సత్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు.తత్సంబంధమైన ఊహాగానాలకు బదులు దైవవాణి ద్వారానే ఈ విశ్వాసాన్ని అర్ధం చేసుకోవచ్చు.దివ్యఖురాన్ తన అనేక ప్రత్యేకతలకు తోడు "అల్ ముహైమిన్" కూడా అంటే గతించిన సర్వసత్య బోధనలను తనలో నిక్షిప్తం చేసుకున్న గ్రంధం అని అర్ధం.ఎవరైతే ఖురాన్ ను అధ్యయనం చేస్తారో వారు సకల ఆకాశ గ్రంధాలను [దైవగ్రంధాలను],సర్వప్రవక్తల మౌలిక బోధనలను అధ్యయనం చేసినట్లే.మౌలికంగా,ఖురాన్ మరే క్రొత్త సిద్ధాంతంతోగాని,మరే ఇతర క్రొత్త సందేశంతోగాని అవతరించలేదు.ఈ గ్రంధం ఎప్పుడైతే పరలోకాన్ని ధృవపరుస్తోందో, మరణానంతర జీవితానికి సంబంధించిన మూలసిద్ధాంతం కూడా సకల సత్యధర్మాలకు అదే అయి ఉండింది అని అర్ధం చేసుకోవచ్చు.సత్యధర్మం ఎల్లప్పుడు పరలోక విశ్వాసాన్నే బోధించింది అని అనడానికి,గత గ్రంధాల్లో తత్సంబంధమైన ఆధారాలు,బోధనలు లభిస్తాయి.ఇతర నమ్మకాలు,సిద్ధాంతాలన్నీ కేవలం మనుషుల మనోమస్తిష్కాల నుండి వెలువడ్డవే.
                                                                   Next Page

8 Responses to "వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మలున్నాయా? "

  1. purushotham jinka

    బాబాయ్, నువ్వు మాత్రం ఏసు మళ్ళి బతికాడు అని అంటే మేము నమ్మాలి, కాని నువ్వు మాత్రం హిందువుల పునర్జన్మ నమ్మకాన్ని అని కేవలం ఓ అసత్యమైన నమ్మకం ఎలా చెప్పగలవు?
    అసలు నువ్వు అంత హేతువాదివి అయితే చనిపోయిన వాళ్ళు ఎలా బతుకుతారు అని నమ్ముతున్నావు?
    ముస్లింలు/సిక్కులు/బౌద్దులలొ ఎవరైనా మీలా దళితుల వద్దకి వెళ్ళి మతం మారితే డబ్బులు ఇస్తామని చెప్పి మత మార్పిడులని ప్రొత్సహించిన వారు ఉన్నారా?
    అసలు క్రిస్టియన్ మతంలొ ఉన్నన్ని మూడ నమ్మకాలు మిగతా మతాల్లో ఉన్నాయా?
    అన్ని మతాల్లోను ఎవో కొన్ని లోపాలు ఉండవచ్చు అవి వాళ్ళ మతస్తులే చూసుకొంటారు. ఒకటి మా మతం గొప్పదని చెప్పు లేదా అన్ని మతాలు సమానం అని చెప్పు అంతే గాని పరాయి మతాల నమ్మకాలు కేవలం ఓ అసత్యమైన నమ్మకం అని చెప్పొద్దు.

    నువ్వు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పు బ్రిటీష్ వారి కాలం లొ క్రిస్టియన్ మిషనరీలు మత మార్పిడులని ప్రొస్తహించకపోతే నువ్వు క్రిస్టియన్ గా పుట్టేవాడివా?

    ఒకటి గుర్తు పెట్టుకో నమ్మకమే జీవితం.
    gopijinka@gmail.com

    1. Anonymous

      1.ముస్లింలు/సిక్కులు/బౌద్దులలొ ఎవరైనా మీలా దళితుల వద్దకి వెళ్ళి మతం మారితే డబ్బులు ఇస్తామని చెప్పి మత మార్పిడులని ప్రొత్సహించిన వారు ఉన్నారా?
      A.పై విషయాలన్నీ కరెక్టే.
      2.అసలు క్రిస్టియన్ మతంలొ ఉన్నన్ని మూడ నమ్మకాలు మిగతా మతాల్లో ఉన్నాయా?
      A.ఈ విషయంలో మూఢనమ్మకాలు లేని మతం ఏది?ముస్లిం[అదీ నామమాత్రము ముస్లిం]లలో ఉన్న మూఢనమ్మకాలకంటే హిందూ,క్రిష్టియన్లలో ఉన్న మూఢనమ్మకాలు చాలా ఎక్కువ.
      3.నువ్వు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పు బ్రిటీష్ వారి కాలం లొ క్రిస్టియన్ మిషనరీలు మత మార్పిడులని ప్రొస్తహించకపోతే నువ్వు క్రిస్టియన్ గా పుట్టేవాడివా?
      A.నేను సనాతనధర్మాన్ని[ఇస్లాం అని అరబీలో అంటారు] ఫాలో అయ్యేవాడిని. నేనొక దైవదాసుడను.[అరబీలో ముస్లిం అంటారు]
      4.ఒకటి గుర్తు పెట్టుకో నమ్మకమే జీవితం.
      A.ఆ నమ్మకమేదో ధార్మిక గ్రంధాల పరంగా ఉండాలి.మనకిష్టమైన నమ్మకాలు కలిగియుండడానికి ధర్మానికి ఏ విధమైన సంభంధం లేదు నాయనా! స్పందనకు కృతజ్ఞుడిని.

  2. Unknown

    వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మ ఉంది. అయితే జన్మల చక్రం లేదు.

    1. Anonymous

      స్పందనకు కృతజ్ఞుడ్ని గౌతంగారు.మీతో ఏకీభవిస్తున్నాను.

  3. Anonymous

    "నేను సనాతనధర్మాన్ని[ఇస్లాం అని అరబీలో అంటారు] ఫాలో అయ్యేవాడిని. నేనొక దైవదాసుడను.[అరబీలో ముస్లిం అంటారు] "

    మీకామెంటు పిచ్చపిచ్చగా నచ్చింది. హిందువులు తమ మతాన్ని "హిందూ" శబ్దంతో disassociate చేసుకోవడానికి" సనాతన ధర్మ"మనే కాన్సెప్టును వాడినట్లుగా, మీరూ వాడారు. మతాలన్నీ ఎవరు సనాతనమన్న విషయంలో factsని invent చేసుకుంటూ పోతే, "ఏది ప్రాచీన భాష" టైపు ప్రశ్నలా తయారవుతుందన్న నా అభిప్రాయాన్ని నిజంచేశారు. మనం సరిగ్గా తర్కాన్ని వాడాలేకానీ scientologyకూడా సనాతనమని వాదించొచ్చు :)

  4. hari.S.babu

    1.మీరేమి చెప్పదల్చుకున్నారో నాకర్ధం కాలేదు.పునర్జన్మలు,పరలోకం అనేవి రెండూ ఆధునిక విజ్ఞాన శాస్త్రపు రీజనింగు వాడకపోతే చక్కగా యే వైరుధ్యమూ లేకుండా వొదిగి పోతాయి కదా!

    2.ఈ పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు,నమ్మకాలన్నిటిని,ఆధునిక విజ్ఞాన శాస్త్రం,జీవితం గురించి నేడు తెలుసుకున్న యదార్ధాలు పూర్తిగా కొట్టిపారేశాయి.
    ??విజ్ఞాన శాస్త్రం రెంటినీ కొట్టి వేస్తుంది కదా?

    3.జంతు, వృక్ష శాస్త్ర సంబంధమయిన కలగాపులగపు విషయాలతో స్పృహ అనే కొత్త పదాన్ని చేరుస్తున్నారు ఇప్పటికే వున్న గందరగోళపు పదాల లిష్టు లోకి!

    4.ఆధునిక శాస్త్ర విజ్ఞానం అనేదాన్ని ఇందులోకి లాక్కొస్తే మొత్తం పరలోకం కూడా యెగిరిపోతుంది - అబధ్ధమై పోతుంది.కాబట్టి పునర్జన్మలు - పరలోకం అనే జంటల్లో యేదో ఒకటి అబధ్ధమై పోయి మరొకటి నిజం కావడం జరగదు.

  5. Ben Abraham

    Janana chakram

  6. Unknown

    జన్మ పునర్జన్మ ల గురించి ఆలోచన పక్కన పెట్టండి ఏ మత మైనా మరణాంతరం ఉనికి వుంది అంటారు వాస్తవం అయినప్పటికి ఆత్మ పుట్టుుక లేనిది అది ప్రకృతి కన్నా పురాతన మైనది ప్రకృతి ఓకానోక స్తితి లొ ప్రారంబమై కొంత కాలాని ముగుస్తుంది కాని నాశనము కాదు మరి ప్రకృతి కి నాశనము లేనప్పుడు ఆత్మ ఏల నాళనముఅవుతుంది బిగ్బ్యాంగ్ సృష్ఠి బ్లాక్ హోల్ ముగింపు ఇదే సిద్దాంతం పనరావృతం అవుతొంది మరి ఆత్మ అందులో పునరావృతంం అవుతోంది దాని గూర్చి వేరే గ్రంథము చెపుతొంది కాని జంతువు కి తాను ఏవరొ ప్రశ్నవేయు శక్తి లేదు శక్తిగల మనం అనవసర సిద్దాంతాల్ని విశ్వసిస్తాం పదార్దానికి నాశనం లేదు మరి ప్రాణం ,చేతన,ఆత్మ కి ఎలా వుంటుంది అని ప్రశ్నించు ని ఆత్మ ని అడుగు ,అనేక జన్మల పిదప లభించిన మానవ జన్మ పరమాత్మ సాన్నిద్యం కై తపించాలి గాని దేవుడు ఎవరు అని ప్రశ కు సమాదానం కోసం కాదు మనకు న్న స్వతంత్రత భగవానుడు ఇచ్చినదిి కాదు మనకు స్వతహగా మనతొ వున్నదేే కాబట్టి ఈరోజు ఇక్కడ భూమి పై వున్నాం అదె పుణ్యం గడించి వుంటె గత జన్మ లోగనుక ఈ జన్మ లొ బిల్ గేట్స్ కి మనవడు గానొ కొడుకు గానొ పుట్టి వుండేవారం

← Newer Post Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine