• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » యేసు బోధనలలో దేవుడెవరు?

యేసు బోధనలలో దేవుడెవరు?

మర్యం కుమారుడైన మసీహ్ [మెస్సయ్య]యే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి మసీహ్ [యేసు] ఇలా అన్నారు: ఇస్రాయేలు వంశీయులారా! అల్లాహ్ [యెహోవా]కు దాస్యం చేయండి.ఆయన నాకూ ప్రభువే [దేవుడే] మీకూ ప్రభువే [దేవుడే],ఇతరులను అల్లహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు.వారు నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు.
అల్లాహ్ "ముగ్గురిలో ఒకడు" అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.వాస్తవానికి దేవుడు ఒక్కడే.మరొక దేవుడు లేడు.వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో అవిశ్వాసానికి ఒడిగట్టిన వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది.
అయితే వారు అల్లాహ్ [యెహోవా] వైపునకు మరలరా? క్షమించు అని ఆయనను వేడుకోరా? అల్లాహ్ [యెహొవా] అమితంగా మన్నించేవాడు మరియు కరుణించేవాడూనూ .   దివ్య ఖుర్ ఆన్  5 : 72-74

1.యేసు స్వయంగా దేవుని [అల్లాహ్/ప్రభువు/యెహొవా] వైపునకు పిలిచేవారు
1.అందుకు యేసు - ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము.మన దేవుడైన ప్రభువు [అల్లాహ్] అద్వితీయ ప్రభువు.  మార్కు :12 :29
2.అందుకు యేసు - నీ దేవుడైన ప్రభువు [అల్లాహ్]నకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను.లూకా : 4 : 8
3. నాసహొదరుల యొద్దకు వెళ్లి -నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని [అల్లాహ్]యొద్దకు ఎక్కిపొవుచున్నానని వారితొ చెప్పమనెను. యోహాన్ :20:17
యేసు కేవలం "అల్లాహ్ ఒక్కడే దేవుడు" అని చెప్పడమే కాదు ఆరాధించి చూపించారు.

11.యెహొవా [అల్లాహ్] నే యేసు ప్రార్దించేవారు.
1. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా  బాప్తిస్మము  పొంది ప్రార్దన చేయుచుండగా ఆకాశము తెరవబడి ....లూకా : 3:21
2. ఆయన [యేసు]   పెందలకడనే  లేచి యింకను చాలా చీకటి  యుండగానే అరణ్య ప్రదేశ్యమునకు వెళ్లి అక్కడ ప్రార్ధన చేయుచుండెను. మార్కు 1;35
3.ఆయన [యేసు] ప్రార్దన చేయుటకూ   కొండకు వెళ్ళి దేవుని [అల్లాహ్] ను ప్రార్ధించుటయందు రాత్రి గడిపెను.లూకా : 6:12

111.అద్భుతాలు చేసేటప్పుడు సహితం యేసు అల్లాహ్ ను ప్రార్ధించేవారు.
1.అందుకాయన [యేసు] ప్రార్ధన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది [దయ్యము] వదలి పోవుట అసాధ్యమని వారితో చెప్పెను.  మార్కు : 9:29
2.లాజరు విషయమై యేసు కన్నీటి ప్రార్ధన చేసెను. యొహాను : 11:35-41

1V.కష్ట కాలంలొ మరింత వేదనతో యేసు అల్లాహ్ ను ప్రార్ధించుచుండేవారు.
1.కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్ధించుచు…మార్కు : 14:35
2. ఆయన [యేసు] వేదన పడి మరింత ఆతృ తగా ప్రార్ధన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయెను. లూకా : 22:44
3. తిరిగి పోయి,యింతకు ముందు పలికిన మాటలనే యేసు పలుకుచు ప్రార్ధించెను. మార్కు : 14:39

V. శిష్యులను కూడా తండ్రి [అల్లాహ్]నే ప్రార్ధించమని యేసు బోధించేవారు
1. నీవు ప్రార్ధన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి [అల్లాహ్]కు ప్రార్ధన చేయుము.అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి [అల్లాహ్] నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి 6:6
2. అందుకాయన [యేసు] - మీరు ప్రార్ధన చేయునప్పుడు తండ్రి [అల్లాహ్] నీ నామము పరిశుద్ధ పరచబడుగాక…లూకా 11: 2-4
3. మరియు మీరు ప్రార్ధన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటినన్నింటినీ పొదుదురని వారితో చెప్పెను. మత్తయి 21:22

V1.అల్లాహ్ [ప్రభువు] కే కృతజ్ఞతా స్తుతులు యేసు చెల్లించేవారు.
1.ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి - తండ్రీ [అల్లాహ్] ఆకాశమునకును,భూమికిని ప్రభువా ,నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను. లూకా 10:21
2.యేసు కన్నులు పైకెత్తి - తండ్రీ [అల్లాహ్] నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. యోహాను 11:41
3.ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను.శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. మత్తయి 15:36

V11.యేసు చేసిన కార్యములకు ప్రజజలు అల్లాహ్ [దెవుని]నే మహిమ పరిచేవారు
1. మూగవారు మాటలాడుటయును,అంగహీనులు బాగుపడుటయును,గ్రుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని [అల్లాహ్]ను మహిమపరచిరి. మత్తయి 15:31
2…వారందరూ విభ్రాంతి నొంది - మనమీలాంటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు,దేవుని [అల్లాహ్]ను మహిమపరచిరి. మార్కు 2:12
3.వెంటనే వాడు చూపు పొంది దేవుని [అల్లాహ్]ను మహిమపరచుచు ఆయన [యెసు]ను వెంబడించెను.ప్రజలందరూ అది చూచి దేవుని [అల్లాహ్]కు స్తోత్రము చేసిరి. లూకా 18:43

V111.తండ్రి గొప్పవాడు [అల్లాహు అక్బర్] అని యేసు స్పష్టంగా ఎలుగెత్తి ప్రకటించేవారు.
1. దాసుడు [యేసు] తన యజమాని [అల్లాహ్] కంటే గొప్పవాడు కాడు.పంపబడినవాడు [అపోస్తులు] పంపినవాని [యేసు] కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 13:16
2. …యొక స్త్రీ ఆయనను చూచి - నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన [యేసు] - అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. లూకా 11:27-28
3.యేసు..దేవుని [అల్లాహ్] సువార్త ప్రకటించుచూ గలిలయకు వచ్చెను. మార్కు 1:14-15
4.తండ్రి [యెహోవా] నా యేసు] కంటే గొప్పవాడు. యోహాను :14:28
5…నా తండ్రి [అల్లాహ్] అందరికంటే గొప్పవాడు. యోహాను 10:29

1X.యేసు బోధనలు విస్మరిస్తే కలిగే పర్యవసానం

1.నేను [యేసు] చెప్పు మాటల ప్రకారము మీరు చేయక  - ప్రభువా,ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? లూకా 6:46
2.మరియు యీనా [యేసు] మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతీవాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన భుద్ధిహీనుని పోలి యుండును. మత్తయి :7:26
3.అప్పుడు - నేను [యేసు] మిమ్మును ఎన్నడును ఎరుగను;అక్రమము చేయువారలారా, నాయొద్ద నుండి పొడని వారితో చెప్పుదును. మత్తయి 7:23

X.అపార్ధానికి గురియైన ఒకే ఒక్క యేసు బోధ
నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను.యోహాను 10:30
తండ్రి [దేవుని] యందు నేను [యేసు]ను ,నా [యేసు] యందు తండ్రి [దేవుడు] యు ఉన్నామని నమ్ముడి. యోహాను 14:11
యేసు చెప్పినది అస్తిత్వము విషయములో కాదని కేవలం ఆలోచనల విషయములోనే అని యేసు చెప్పిన మరికొన్ని వాక్యాలను బట్టి మనకు అర్ధమవుతుంది.

ఉదా : కొన్ని వాక్యాలు పరిశీలిద్దాం
1.నేను [యేసు] నా తండ్రి [దేవుని] యందును మీరు [శిష్యులు] నా [యేసు] యందును, నేను [యేసు] మీ [శిష్యులు] యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగరు. యోహాను 14:20
2. …పరిశుద్ధుడవైన తండ్రీ, మనము [యేసు మరియు దేవుడు] ఏకమైయున్నలాగున,వారును [శిష్యులందరు] ఏకమై యుడునట్లు నీవు నాకనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యోహాను 17:11
3.వారి [శిష్యులు] యందు నేను [యేసు]ను ,నా [యేసు] యందు నీవు [దేవుడు]ను ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి… యోహాను 17:23

పై వాక్యముల ప్రకారము శిష్యులు + యేసు + దేవుడు ఒకరి యందు ఒకరు అస్తిత్వములో ఏకమై యుంటే దేవుడు + యేసుతో పాటు శిష్యులందరూ దైవత్వంలో భాగస్వాములైపోతారు.కాబట్టి ఆలోచనలలోనే ఏకం కాగలరు. గాని అస్తిత్వములో ఏకం కాలేరన్నది నిర్వివాదాంశం.

X1. యోహొవా [అల్లాహ్] ను వదలి ఇతరులను ఆరాధించడం వ్యభిచారం మరియు శాపగ్రస్తము.ఎందుకంటే ???
1. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయై యున్నాడు.సైన్యములకధిపతి యగు యెహొవా [అల్లాహ్] అని ఆయనకు పేరు. యెషయా 54:5
2.యెహొవా [అల్లాహ్] ఈలాగు సెలవిచ్చుచున్నాడు.నరులను ఆశ్రయించి శరీరులను తన కాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా [అల్లాహ్] మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఇర్మియా 17:5
3. …'నీవు నీ దేవుని [యెహొవా]ను విసర్జించి వ్యభిచరించితివి. హోషేయ 9:1
4. ప్రభువా [అల్లాహ్] నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. కీర్తన 86:5
5......అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్ధకి తిరిగి రమ్మని యెహొవా  సెలవిచ్చుచున్నాడు. యిర్మియా 3:1

ప్రియ చదువరీ !

 యేసు బోధనల వెలుగులో దేవుడు [తండ్రి/ప్రభువు/యెహొవా/అల్లాహ్] ఒక్కడే అని రూడీ అయిన తర్వాత ఆలస్యమెందుకు? నేడే ! ఇప్పుడే !! విరిగి నలిగిన హృదయంతో దేవును తట్టు తిరుగుము.ఆజ్ఞాతిక్రమం [ముఖ్యముగా ప్రధానమైన ఆజ్ఞ మీరడం] వల్ల వచ్చిన గొప్ప పాపము నుండి క్షమించమని దేవునికి మొరపెట్టుము.అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు.

X11.చివరిగా యేసు చేసే హెచ్చరిక!!
1.ప్రభువా, ప్రభువా అని నన్ను [యేసును] పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు. మత్తయి 7:21
2....అల్లాహ్ [యెహొవా]కు భాగస్వాములుగా చేసే వారికి అల్లాహ్ స్వర్గాన్ని [నిత్యజీవాన్ని] నిషిద్ధం చేశాడు.వారి నివాసం నరకం.అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడెవడూ లేడు. దివ్య ఖుర్ ఆన్  :5:72.

                         యేసు సువార్త ద్వారా తెలిసిన విషయం

సర్వ సృష్తికర్తయైన అల్లాహ్ [యెహొవా] ఒక్కడే ఆరాధనకు అర్హుడైన దేవుడు అన్న ప్రధానమైన యేసు యొక్క ఈ బోధను తృణీకరిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశింపరని స్పష్టమగుచున్నది.     DOWNLOAD

2 Responses to "యేసు బోధనలలో దేవుడెవరు?"

  1. Bro. Isaac E. Kusuma

    This is all trash.

  2. Anonymous

    Actually all religions are trash. They depend on faith but not on facts (neither historical nor scientific). They thrive on the gaps in our understanding. When a reason for a particular phenomena were to be rightly identified by science, they just flee from that domain (and this is the reason why we see religious beliefs being replaced by scientific explanations but not the other-way around).

    Religion always works for the people who are power-lust, lazy and evil-minded. The gods always seem to be favoring those kind of people alone.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine