కనీసం స్వీయ జీవశక్తి లేని యేసు దేవుడు ఎలా కాగలరు?
జీవముగల తండ్రి[యెహోవా]నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే… -యోహాన్ 6:57 మీ జీవము ఎవరిది?అని ప్రశ్నిస్తే 'నా జీవము నా తండ్రి ప్రసాదితం' అని యేసు సమాధానం ఇస్తున్నారు.అంటే నా స్వీయ జీవశక్తితో నేను జీవించటం లేదు అనేకదా!యేసు-'నా తండ్రి మూలముగా జీవిస్తున్నాను ' అని ఎందుకు ప్రకటిస్తున్నారు? ఆయన ఈ క్రింది యధార్ధాన్ని తెలుసుకున్నారు.ఏమిటి ఆ యధార్ధం? యెహోవాయే నిజమైన దేవుడు,ఆయనే జీవముగల దేవుడు,సదాకాలము ఆయనే రాజు. -యిర్మియా 10:10 కనుక ఈనాటి అధికశాతం క్రైస్తవ పండితులు చేసే యేసు దేవుడు అనే వాక్య విరుద్ధ అబద్ధ ప్రచారాన్ని నమ్మక, యేసు పరిచయం చేస్తున్న స్వీయ జీవశక్తిని కలిగియున్న యెహోవానే నిజమైన దేవునిగా నమ్ముకోండి.కనీసం జీవశక్తి లేకుండా,మరొకనిపై ఆధారపడి ఉన్న యేసు ఎలా దేవుడు కాగలరు?