• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » 2.అల్ బఖర

2.అల్ బఖర

ఆయతులు:286         అవతరణ:మదీనాలో

అనంతకరుణామయుడు,అపారకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1-5 అలిఫ్ లాం మీం.ఇది అల్లాహ్ గ్రంధము.ఇందులో ఏమాత్రం సందేహం లేదు.అల్లాహ్ భీతిగలవారికి ఈ గ్రంధం మార్గదర్శకం -వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు.నమాజును స్థాపిస్తారు.మేము ప్రసాదించిన దానినుండి [మా మార్గంలో] ఖర్చు చేస్తారు.మేము నీపై అవతరింపచేసిన గ్రంధాన్ని[ఖురాన్],నీకు పూర్వం అవతరింపచేసిన గ్రంధాలను విశ్వసిస్తారు.పలోకాన్ని దృఢంగా నమ్ముతారు.ఇలాంటి వారు తమ ప్రభువు తరపునుండి ఋజుమార్గంలో ఉన్నారు.సాపల్యం పొందేవారు వారే.

6-7 [ఈ విషయాలను]తిరస్కరించిన వారిని నీవు హెచ్చరించినా,హెచ్చరించకపోయినా ఒకటే.వారు విస్వసించేవారు కారు.అల్లాహ్ వారి హృదయాలకూ,వారి చెవులకూ ముద్ర వేశాడు.వారి కన్నులపై తెరపడింది.వారు కఠిన శిక్షకు అర్హులు.

8-20 "అల్లాహ్"ను,అంతిమదినాన్ని మేము విశ్వసించాము" అనేవారు కూడా కొందరు ఉన్నారు.కాని వాస్తవంగా వారు విస్వాసులు కారు.అల్లాహ్ నూ,విశ్వాసులనూ వారు మోసం చేస్తున్నారు.కాని యధార్ధంగా వారు తమను తాము తప్ప మరెవరిని మోసం చెయ్యటం లేదు.అయితే ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు.వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది.అల్లాహ్ ఆ రోగాన్ని మరింత అధికం చేసాడు.వారు చెప్పే ఈ అబద్ధానికిగాను, వారికి వ్యధాభరితమైన శిక్షపడుతుంది.
   "అవనిలో కల్లోలాన్ని రేకతించకండి"అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కర్తలం మాత్రమే" అని అంటారు-జాగ్రత్త!వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు.కాని వారు గ్రహించడంలేదు. "ఇతరులు విశ్వసించిన విధంగానే మీరూ విశ్వసించండి"అని వారితో అన్నప్పుడు వారు "మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వసించాలా?"అని జవాబిస్తారు -జాగ్రత్త! వాస్తంగా వారే మూర్ఖులు,కాని అది వారికి తెలియదు.విశ్వాసులను కలసినప్పుడు వారు "మేము విశ్వసించాము"అని అంటారు.కాని తమ షైతానులను ఏకాంతంగా కలసినప్పుడు వారు "అసలు మేము మీతోనే ఉన్నాము.వారిని కేవలం ఎగతాళి చేస్తున్నాము"అని అంటారు.-అల్లాహ్ వారిని ఎగతాళి చేస్తున్నాడు.ఆయన వారికి వ్యవధినిస్తూ పోతున్నాదు.వారు తలబిరుసుతనం వల్ల అంధులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు.సన్మార్గానికి బదులుగా అపమార్గాన్ని కొనుకున్న ప్రజలు వారే.కాని వారి యీ బేరం వారికి లాభదాయకమయింది కాదు.వారు ఏమాత్రం సత్యమార్గంలో లేరు.
  వారి ఉపమానం ఇలా వుంది:ఒకవ్యక్తి నిప్పు రాజేసినంతనే పరిసరాలన్నీ ప్రకాశించాయి.అప్పుడు అల్లాహ్ వారి కంటి వెలుగును హరింపజేసి అంధకారంలో ఏమీ కానరాని స్థితిలో వారిని వదిలాడు.వారు చెవిటివారు,మూగవారు,గ్రుడ్డివారు.ఇక వారు [ఋజుమార్గానికి]మరలిరారు.లేదా మరొక ఉపమానం :ఆకాశం నుండి భారీగా వర్షం కురుస్తోంది.దానికి తోడు చిమ్మచీకట్లు,ఉరుములు,మెరుపులు!ఉరుముల భీకర ధ్వని విని మృత్యుభయం చేత వారు తమ వేళ్లను చెవుల్లో దూర్చుకుంటారు. అల్లాహ్ ఈ సత్యతిరస్కారులను అన్ని వైపులనుండి పరివేష్టించి ఉన్నాడు.వారి పరిస్థితి,మెరుపులు వారి దృష్టిని ఎగర వెసుకుపోతాయా అనే విధంగా ఉంది.వెలుగును చూసినప్పుడల్లా వారు కొంత దూరం నడుస్తారు.చీకటి క్రమ్ముకోగానే ఆగిపోతారు.-అల్లాహ్ కోరితే వారి వినికిడినీ,వారి చూపులనూ సంపూర్ణంగా నశింపచేసేవాడే.నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు.

                                                                       Next : coming soon    

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine