• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » నల్లమలలో పురాతన నగరం?

నల్లమలలో పురాతన నగరం?

కర్నూలు, జూలై 3: దట్టమైన నల్లమల అటవీప్రాంతంలో ఒకప్పుడు నగరం ఉండేదన్న విషయం వెలుగులోకి వస్తోంది. సుమారు ఐదారు వందల సంవత్సరాల కిందట ఈ నగరం ఉండి ఉంటుందని అక్కడి చెంచుల ద్వారా తెలుస్తోంది. కర్నూలు ఆత్మకూరు సమీపంలోని బైర్లూటి నుంచి కాలినడకన శ్రీశైలం వెళ్లే దారిలో నాగలూటి వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఆ ఆలయానికి కొద్దిదూరంలో ముర్తుజావలి దర్గా అనే ప్రార్థనా మందిరం కూడా ఉంది. ఈ రెండింటికి దగ్గరలో కొంతదూరం కాలినడకన వెళ్తే ఒక బురుజు (కోట), శిథిలమైన కోటగోడలు కనిపిస్తున్నాయి. ఈ గోడలు, బురుజులను బట్టి ఇక్కడ పురాతన కాలంలో ఏదో నగరం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అంతేగాక అదేప్రాంతంలో భూమిలో కూరుకుపోయి ఉన్న కాళికామాత విగ్రహం కనిపిస్తోంది. తలమాత్రం బయటకు వచ్చి ఉండటం గమనార్హం. గతంలో ఇవి కనిపించేవి కావని గత ఏడాది కురిసిన అతి భారీ వర్షాలతో అక్కడఉన్న మట్టి కొట్టుకుపోయి ఇవి కనిపిస్తున్నట్లు అక్కడి చెంచుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ సిద్ధాపురం అనే ఒక నగరం ఉండేదని తమ పెద్దలు చెప్పేవారని వారు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని గ్రంథాలు కూడా ఉండేవని, అయితే ప్రభుత్వం తమను అడవి నుంచి బయటకు తరలించే సమయంలో ఇవి ఎక్కడో పోయాయని వారంటున్నారు. కాళికామాత విగ్రహం ఉన్న స్థలానికి సమీపంలో గుర్తుతెలియని బాషలో శాసనం ఉంది. దీన్ని క్రోడీకరిస్తే ఇంకా విలువైన ఆధారాలు లభ్యంకావచ్చని అంచనా వేస్తున్నారు. కాగా ఇక్కడి కోటగోడలకు సంబంధించిన రాళ్లనే 110 ఏళ్ల క్రితం దొంగల పునరావాసం కోసం నిర్మించిన సిద్ధాపురం చెరువు రివిట్‌మెంటుకు వాడారని ఆ గ్రామస్థులు వెల్లడిస్తున్నారు. దీని కారణంగానే బురుజు మొండిగా కనిపిస్తోందని వారంటున్నారు. పాత నగరమైన సిద్ధాపురం పేరునే తమ గ్రామానికి అప్పటి అధికారులు నిర్ణయించారని వెల్లడిస్తున్నారు. బ్రిటిష్ హయాంలో కొన్ని గ్రంథాలు, శాసనాలు లభించాయని, వాటిని వారు ఎక్కడ పెట్టారో తెలియదని పేర్కొంటున్నారు. కాగా పురాతన నగరంలో కేవలం దేవతలకు సంబంధించిన ఆలయాలు మాత్రమే ఉండేవని ఆ ప్రాంతీయులు చెప్పుకుంటున్నారు. అంతేగాక ఇపుడు వెలుగోడుగా వెలుగొందుతున్న మేజర్ గ్రామం స్థానంలో నాడు వేశ్యావాటిక ఉండేదని, అక్కడికి సమీపంలోనే ఏనుగుల మంద ఉండేదని దానే్న ‘కరివెన’గా పిలుస్తున్నారని, ఇపుడు పట్టణంగా వెలుగొందుతున్న ఆత్మకూరు ఆనాడు దట్టమైన అటవీ ప్రాంతమని తెలుస్తోంది. ఈ ఆధారాలను బట్టి పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. పురాతన నగరం గురించి తెలుసుకున్న పురావస్తుశాఖ అధికారులు సైతం తవ్వకాలు జరిపేందుకు సిద్ధపడినా నల్లమల అడవి పులుల అభయారణ్యంగా గుర్తించనది కావడంతో కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే తప్ప తవ్వకాలు జరపడానికి వీలుకాదని అంటున్నారు.
                                   ఆంధ్రభూమి దినపత్రిక సౌజన్యంతో....@ అహ్మద్ చౌదరి

                                 > మరిన్ని విషయాలకొరకు భారదేశ చరిత్ర క్లిక్ చేయండి

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine