అత్యధిక పాస్టర్లు ఈరోజు ఎంతోమంది అమాయక ప్రజలను యేసు దేవుడని,దేవునిలో భాగమని,ఆయన మనకొరకు రక్తం చిందించి మనపాపాలను కడిగివేసాడని బోధిస్తున్నారు.నిజానికి బైబిల్ అలా చెప్పిందా? అనేది ప్రశ్నే!
ఎవరైనా కాస్త బైబిల్ ని నిశితంగా గమనిస్తే పై విషయాలేవీ యధార్ధం కాదని ఇట్టే తేలిపోతుంది.
బైబిల్ గ్రధంలో ఉన్న యేసు బోధనకు,ఈ దైవజనులని చెప్పుకునే క్రైస్తవ పాస్టర్ల బోధనలకు ఏవిధమైన పొంతనా ఉండదు.పైగా ఇదంతా బైబిల్ సందేశం అని వాళ్లు వాదించడం ఇంకా విడ్డూరం.
యేసు వారు
దేవుడు పైన ఉన్నాడని చెప్తారు.
నేటి పాస్టర్లు లేదు..లేదు దేవుడే యేసు రూపంలో
క్రిందికి వచ్చాడని చెప్తారు.
నేను దేవుని యొక్క దాసుడను అని యేసు ఘోషిస్తుంటే…కాదు,కాదు..యేసు స్వయంగా దేవునిలోని భాగమేనని, దేవుడేనని వాదిస్తారు.
పాస్టర్లు చెప్పే బోధనలే యదార్ధం అని నమ్మే అమాయక స్థితిలో ఈరోజు అనేకమంది ప్రజలున్నంతకాలం ఈ తప్పుడు బోధనలు రాజ్యమేలుతూనే ఉంటాయి.వీరికోసం బైబిల్ ఏం చెప్పిందో చూడండి.
"....నానా విధములైన అన్యబోధనల చేత త్రిప్పబడకుడి. -హెబ్రీ 13:9
బైబిల్ యదార్ధమైన విషయాలు తెలుసుకోవాలంటే బైబిల్ ను పరిశోధించాల్సిందే.అప్పుడే మనకు సత్యం అనేది బయటపడుతుంది తప్ప నేటి పాస్టర్ల బోధనలు నమ్మినంత కాలం మనం అసత్యంలోనే మ్రగ్గిపోవాల్సివస్తుంది.
.......................................................................................................................
అసలు యేసు బోధనలలొ నిజమైన దేవుడెవరు తెలియాలంటే దీనిపై ఒకసారి క్లిక్ చేయండి.