
థార్మిక పండితులు చాలా మంది మాకు మెయిల్ చేస్తూ మా పుస్తకాలను కూడా మీరు పరిచయం చేయండి.మేము మా పుస్తకాలను ఉచితంగా కూడా అందిస్తాము అంటూ తమ యొక్క సహాయ సహకారాలను గురించి తెలియజేస్తున్నారు. శుభపరిణామమే!అయితే సాక్ష్యం మేగజైన్ పండితుల ఆమోదం పొందితేనే మీ పుస్తకాలను పాఠక లోకానికి అందించగలం. దైవానుగ్రహం మా శాయశక్తులా పాఠక లోకానికి సత్యపూరితమైనవి, అజ్ఞానరహితమైనవి మాత్రమే అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో భాగంగా ధర్మానికి ఏవిధమైన నష్టం కలిగించే విషయాలున్నా ఆ పుస్తకం ఎట్టి సమయంలోనూ స్వీకరించబడదు.ఒకవేళ తిరస్కరించబడిన పుస్తకాల విషయంలో గాని,ఆర్టికల్స్ విషయంలో గాని ఆయా రచయితలు మా సాక్ష్యం మేగజైన్ సభ్యులతో చర్చించాలనుకుంటే ఆ ఏర్పాటు కూడా కలిపించే ఏర్పాటు చేస్తాము. మీ రచనల పట్ల సత్యాసత్యాల గూర్చి మరింతగా మా సభ్యులతో ప్రేమగా చర్చించవచ్చు.ఈ మేగజైన్ ఒక వర్గానికి గాని,మతానికి గాని ఎట్టి సమయంలో కొమ్ము కాయదు అని మనవి చేసుకుంటున్నాము. ఈ మేగజైన్ కు పునాది వేదోపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్, హదీసు గ్రంధాలే.ఏ విషయమైన వీటి వెలుగులోనే చర్చించబడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ రచనలను పంపండి.ఆ సర్వోన్నతుడైన సృష్టికర్త మనందరికీ సన్మార్గాన్ని చూపించి జీవింప జేసే భాగ్యం ప్రసాదించుగాక!తథాస్తు!!