• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » యేసు రక్షకుడిగా వచ్చింది ఎవరి కోసం? ఇశ్రాయేలు జాతికొరకా? అన్యులకొరకా?

యేసు రక్షకుడిగా వచ్చింది ఎవరి కోసం? ఇశ్రాయేలు జాతికొరకా? అన్యులకొరకా?

యేసు యూదుల (ఇశ్య్రాయేలు) ప్రజల సంస్కరణ నిమిత్తం మాత్రమే పంపబడ్డారు. సంస్కరణ అనేది మార్గము తప్పి అనుసరిస్తున్న వారికి మాత్రమే అవసరం గాని సన్మార్గగాములకు అవసరము లేదు అనే విషయాన్ని గ్రహించాలి.ఈ విషయాన్ని యేసు ఈ క్రింది వాక్యాలలో స్పష్టంగా చెప్పారు.

                

                అందుకు యేసు - రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కర లేదు.
                మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతి
                మంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. లూకా 5:31-32

   యేసు తన శిష్యులను ప్రచారం నిమిత్తం పంపించే సమయంలో అన్యులలో ఏమాత్రం ప్రచారం చేయవద్దని అయితే ఇశ్రాయేలీయులలో మార్గం తప్పిన ప్రజల వద్దకే గాని మరి యెవరివద్దకు వెళ్లవద్దని స్పష్టంగా ఆదేశించారు.ఇది చదవండి.

                యేసు ఆ పండ్రేండుమందిని పంపుచు, వారిని చూచి వారికాజ్ఞాపించిన
               దేమనగా - మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే 
               పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని,ఇశ్రాయేలు వంశములోని నశించిన
               గొఱ్ఱెల యొద్దలకే వెళ్లుడి. మత్తయి 10:5-6

ఆ విధంగా ఆజ్ఞాపించడంలోని ఆంతర్యం ఏమిటో ఈ క్రింది వాక్యంలో స్పష్టపర్చుచున్నారు.

               ఆయన-ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెల యొద్దకే గాని మరి ఎవరి 
               యొద్దకును నేను పంపబడలేదనెను. మత్తయి 15:24

ఆయన సంస్కరించడానికే గాని మరిదేని నిమిత్తం రాలేదని ఇంకా స్పష్టమైన విధంగా ఈక్రింది వాక్యంలో నిర్వచించారు.

               యేసు ఆ మాటవిని -రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు; 
               నేను పాపులనే పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని 
               వారితో చెప్పెను. మార్కు 2:17

    పై వాక్యాలన్నీ యేసు ఎందు నిమిత్తం పంపబడ్డారో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఏ జాతిలోనైనా సంస్కర్త పంపబడినప్పుడు -ఆ జాతిలోని అధిక శాతం ప్రజలు మార్గభ్రష్టత్వంలో మునిగి వుంటారు.మరికొంతమంది అయితే సన్మార్గంలోనే వుంటారు.అట్టి వారికి సంస్కరణలతో పని వుండదు.ఈ భావాన్నే ఆయన తన మాటలలో "రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు" అని చెప్పారు.ఈ విధంగా ఆయన కేవలం ఇశ్రాయేలు జాతివారికి మాత్రమే సంస్కర్తగా వచ్చారని స్పష్టపర్చారు.అంతేకాదు వారిలోను మార్గం తప్పినవారి కోసమే వచ్చానని స్పష్టం చేసివున్నారు.
   ఇంత స్పష్టంగా యేసు వారు ఇశ్రాయేలు జాతికొరకు అని చెప్పిన తరువాత కూడా మీకు రక్షణ కావాలంటే యేసును నమ్ముకోండి అనే ప్రచారం భారత దేశ ప్రజలకు వర్తిస్తుందా? యేసు వారి ఆజ్ఞలు భారత దేశ ప్రజలకా?ఇశ్రాయేలీయులకా?
   పై వాక్యాలను బట్టి యేసు రక్షకుడుగా వచ్చింది కేవలం ఇశ్రాయేలీయులకొరకే గాని మరెవరికొరకూ కాదు.
 నేటి భారత పాస్టర్లు ఇక్కడి థార్మిక గ్రంధాలను,మహనీయులను విమర్శిస్తూ, తూలనాడుతూ క్రైస్తవం స్థాపించడం అనేది చాలా దారుణం. క్రైస్తవాన్ని స్వీకరించి ఆఖరికి బైబిల్ కూడా సమర్ధించని సిద్ధాంతాలను పట్టుకు వేలాడటం మరీ దారుణం.
 మీరు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి దారి చూపుతారా? అని ఆనాటి శాస్త్రుల పట్ల యేసు విమర్శ నేటి క్రైస్తవ పండితులకు సరిగ్గా సరిపోతుంది.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine