• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!

"విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!

1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు)
"రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వేదములందుగనబడదు. -సత్యార్ధప్రకాశం పేజి నెం:270
"మూర్తిపూజకు లెల్లరు నజ్ఞానులైయుండి మనుష్యజన్మమును వ్యర్ధము చేసికొని మరణించిరి" -సత్యార్ధప్రకాశం పేజి నెం:273

2.వేదవేదాంగ పారంగత్ పండిత గోపదేవ్ శాస్త్రి
"దయానందుడు వేదములలోగాని,ఉపనిషత్తులలోగాని దేవాలయములను దర్శించమని, విగ్రహాది జడమూర్తులను ఉపాసించమని ఎక్కడలేదన్నాడు.కనుక దయానందుణ్ని నాస్తికుడన్నది ఈ లోకం.నా దృష్టిలో అసలు నాస్తికులు విగ్రహారాధకులే.ఈ విగ్రహారాధన పూర్వం వైదిక  మతస్తులలో లేదు.ఇది బౌద్ద,జైనుల నుండి మనకు సంక్రమించినది. -ఈశ్యావాస్య ఉపన్యాసములు పేజి నెం:102

3.యోగి వేమన
రాతి ప్రతిమ తెచ్చి రాజసంబునెంచి  పూజసేయు నరుడు పూజమాలి
భావ మందు నరుడు భావింపనేరడు విశ్వదాభిరామ వినురవేమ
"బుద్ధిలేని నరులు భగవంతుడు తమలోనే ఉన్న సత్యం గ్రహించలేక రాతిని విగ్రహంగ మలచి పూజలు చేస్తారు.ఇలాంటి వారికి ముక్తి లభించదు. -నిక్కమైన నీలాలు పేజి నెం:302

4.యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు
"యే రూపములో ఉన్నను వుగ్రహారాధనను మనము విషసర్పమును చూచినట్లు చూచి ద్వేషించుచు సర్వవిధముల చేతను దానినంతమొందిప మన శక్తియుక్తులను వినియోగించి పాటుపడవలయును.మనుజుడే దినమున విగ్రహారాధన పీడనుండి విడివడులో ఆదినమే అతని జీవితకాలములోకెల్ల మహాదినము. -ఈశ్వరుని పితృభావము పేజి నెం:3
"బుద్దిమంతులయిన వారందరును ప్రతిమార్చనను ముందుగా మాని ఈశ్వర మహిమలను విగ్రహములయందు గాక సృష్టియందు జూడ యత్నింపవలెను. -ఈశ్వరోపాసనము పేజి నెం:5,6
5.రాజా రామ్మోహన్ రాయ్ (బ్రహ్మ సమాజ స్థాపకులు)
"భగవంతుడొక్కడే అనియు,విగ్రహారాధన దేవునవమానించుట యగుననియు యజ్ఞయాగాది క్రతువులను చేయరాదనియు ,స్త్రీలకు సహగమనము తగదనియు, వితంతువులు మరలా వివాహము చేసుకోవచ్చనియు, కులభేదములు కూడదనియు ప్రచారం చేసిరి" -హిందూమత పునరుద్దరణము పేజి నెం:28

6.యుగ సంస్కర్త శ్రీ స్వామి వివేకానంద
"విగ్రహాలు, దేవాలయాలు, ప్రర్ధనాలయాలు, గ్రంధాలు -యివన్నీ మానవుడి పారమార్ధిక శైశవంలో- ప్రారంభావస్థలో- కేవల సహాయభూతాలు, ఊతగర్రలు. కాని అతడు పురోగాభివృద్ధి పొందాలి.గమ్యప్రాప్తి పర్యంతం సాధన చేస్తూండవలసిందే.వేదాలు ఇలా చాటుతున్నాయి. "అభ్యుదయాన్ని పొందే ప్రయత్నంలో బాహ్యపూజ-భౌతికారాధన- అధమం. మానసికమైన ఉపాసన మాధ్యమం; బ్రహ్మానుభూతే ఉత్తమం" -హిందూమతము పేజి నెం:17


7.శ్రీ కుమ్మితి ధర్మాంగద రెడ్డి

పాషాండ విగ్రహములను భగవంతుని స్థానములో పెట్టి భట్రాజుల వలె పొగడ్తలతో సంస్కృత శ్లోకములు రచించి వాటినిమంత్రములని జనులని నమ్మించి వంచన చేయుచున్నారు. -తొలిపులుకులు పేజి నెం:2 వేదాంత జ్ఞాననిధి.

8.బ్రహ్మశ్రీ గుత్తికొండ వెంకటేశ్వర శర్మ 
"దేవుని మందిరంలో రకరకాల దేవుళ్ల చిత్రాలు, బొమ్మలు, బాబాల ఫోటోలు, స్వాముల పటాలు వుండకూడదు. వేదాలు విగ్రహాలను పూజించటం అంగీకరించవు.ప్రపంచంలోని అన్ని మతాలకు ఒక్కడే దేవుడున్నాడు.మనం కూడా "దేవుడు ఒక్కడే" అని చెబుతూ యింటి నిండా దేవుని మందిరము నిండా  రకరకాల దేవుని బొమ్మలతో నింపేసి మనోనిశ్చలతను దూరం చేసుకొంటున్నాం.ఈ పద్దతి ధ్యానానికి మంచిది కాదు.ఒక్కో వారాన్ని ఒక్కొక్క దేవునికి అంకితం చేసి మనసు మలినం చేసుకొంటున్నం. -సాంప్రదాయక శాస్త్రపీఠం పేజి నెం:335

   స్వయంగా హిందూపండితులు "విగ్రహారాధనను అజ్ఞానమని, మూఢత్వమని, విషసర్పమని, "విగ్రహారాధకులను నాస్తికులని మరియు బాహ్యపూజ భౌతికారాధన అధమం" అని ప్రకటించడం చూసాం. అయితే పై ప్రకటనలు చేస్తుంది క్రైస్తవ,ముస్లిం పండితులు కాక స్వయంగా హిందూ పండితులే నన్నది ఇక్కడ అత్యంత గమనార్హం. వందశాతమూ నికార్సయిన హిందూ పండితుల ప్రకారం -మానవ జన్మను సార్ధకం చేసుకోవటానికి "పరోక్ష" ఈశ్వర (విగ్రహ)ఆరాధన నుండి "ప్రత్యక్ష" ఈశ్వర (నిరాకార) ఆరాధనలోనికి మారిన దినమే మహాదినం పర్వదినమని తెలుస్తోంది. మన దినకర్మ రాకముందే అలాంటి దినాన్ని పొందే మహద్భాగ్యాన్ని ఆ సర్వేశ్వరుడు మనందరికీ ప్రసాదించుగాక!  
సేకరణ: "విగ్రహం విజ్ఞానమా? అజ్ఞానమా?" అనే పుస్తకం నుండి.పేజి నెం:49-52.
More Articles

27 Responses to ""విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!"

  1. Unknown

    వాళ్లలో కొందరికి science తెలియదు, అసలు విగ్రహారాధన చేసేది మనలోని చెడుని విగ్రహంలోకి పంపిస్తాం, ఆ తరువాత మరి విగ్రహం ఆ చెడును పెంచుకుంటూ పోతుంది దానివల్ల ఇంకొకరి నుంచీ చెడును స్వీకరించలేదు, అభిషేకం చేసినప్పుడు ఆ చెడు ప్రక్రుతి అవసరాలుగా మారుతుంది(కుళ్ళిన వ్యర్ధం ఎరువులు), అంటే విగ్రహం మనిషిలోని చెడును తీసుకుని మళ్ళీ మనిషికి ఉపయోగ పడే మంచిగా చేసేందుకు ఉపయోగ పడుతుంది!

    1. Anonymous

      గౌరవనీయులైన మిత్రులు ప్రసాద్ గారు వారికి సైన్స్ తెలియదు అని అన్నారు. మీరు ఎవరికైతే సైన్స్ తెలియదు అంటున్నారో వారు గొప్ప వేద పండితులు అన్నది గమనార్హమైన విషయం. వారు వేదం ఆధారంగ విగ్రహారాధన మూఢత్వం అని ప్రకటించారు. మరి తమరు విగ్రహాల కొరకు ఇచ్చిన వివరణకు యే గ్రంధ ఆధారము ఇవ్వలేదు. అంటే మీరు ఇచ్చిన ఆ వివరణ కట్టుకధే కదా. కాబట్టి ఈ కట్టు కధలు మాని మీకు నిజంగానే హిందూ ధర్మం పట్ల ప్రేమ ఉంటే దయచేసి వేదం ఆధారంగ మాట్లాడగలరు.

    2. Unknown

      సార్ శ్రీరాం గారు వేదాలలో ఉన్నది పరమావధి కాదా? యెవరు చెప్పారు మీకు? మరి శాస్త్రలేమో శాస్త్రమే పరమావధి అని ప్రకటిస్తున్నాయి కదా. భగవత్ గీత 16:24 లో కావున నీవు చేయునదియు, చేయరానిదియు నిర్ణయించినపుడు శాస్త్రం నీకు ప్రమాణమై ఉన్నది అని దేవుడు స్వయంగా ప్రకటిస్తున్నాడు. దేవుని మాట మాకు ప్రమాణం మీ మాట మాకు ప్రమాణం కాదు.

    3. UG SriRam

      నేను పై వ్యాఖ్య రాసింది అహ్మద్ చౌదరి ని ఉద్దేశించి. ఇంతలో మీరేవరో మధ్యలో దూరారు. ఆయన హిందూ,ఇస్లాం,క్రైస్తవ మతాలను పోల్చటానికి చాలా ఎక్కువ గా శ్రమిస్తున్నారు. అటువంటి పోలికలను రామకృష్ణ పరమహంస శిష్యులు రాసిన పుస్తకాలలో ఎప్పుడో చేశారు. ఇప్పుడు మళ్లి చేయటమనేది వృధా ప్రాయస. మీకు తెలుసు కదా ఒక్కొక వేదం ఎన్నో వందల పేజిలు ఉంట్టుంది. జాకీర్ నాయక్ లా మీరు ఒక్కొక్క లైన్ తెచ్చి ఆ గ్రంథలో 20:27 లొ ఇలా రాశారు, ఇంకోక చోట 10:18 లో అలా రాశారు అని చర్చింటం బ్లాగులో అయ్యే పని కాదు.మీరేమైనా అయితే వాటి గురించి బ్లాగులో చర్చించుకొనే కన్నా శంకరాచార్య మఠాల కెళ్ళి చర్చించుకొంటే మంచిది. ప్రతి పేటకి ఒక గుడి కళ్ల ముందు చూస్తూ, హిందువులు బహుదేవతారాధకులని తెలిసి కూడా, బ్లాగులో రోజు విగ్రహా రాధన హిందువులు తీవ్రంగ వ్యతిరేకించారు అని బాకా ఊదటం మాత్రం బాగాలేదు.

  2. Unknown

    వీరేశలింగం పంతులుగారు విగ్రహారాధన చెయ్యకూడదు అని అనలేదు, ఆయన చెప్పింది అవి మోక్షం అనే మెట్టు ఎక్కడానికి ఒక చిన్న నిచ్చెన కానీ నువ్వు మోక్షం పొందాలి అంటే అదొక్కటే కాదు మానసికమైన ఉపాసన కూడా చెయ్యాలి అని.
    ప్రతీ ఒక్కడూ హిందూ మతాన్ని తప్పు అనే వాడే దాంట్లో మంచి చూసే వాడు లేదు అన్నది జమేరిగిన సత్యం!
    ఇక మీరు బ్లాగ్ పేరు సాక్ష్యం అనడం కాన్నా అభిప్రాయం అనడం ఉత్తమం!

    1. Unknown

      గౌరవనీయులైన మిత్రులు ప్రసాద్ గారు వీరేశలింగం గారు విగ్రహ ఆరాధనను చాల తీవ్రంగ ఖండించారు. మీరు అస్సలు ఆయన విగ్రహ ఆరాధనను ఖండించలేదని అంటున్నారు. ప్రసాద్ గారు మీరు ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు. విగ్రహ ఆరాధన వల్లనే పవిత్ర హిందూ ధర్మం అపవిత్రంగా దూషించ పడుతుంది. మీకు నిజంగా హిందూ ధర్మం మీద ప్రేమ ఉంటే పవిత్ర హిందూ ధర్మం ప్రబోధిస్తున్న నిరాకర ఉపాసనను ప్రచారం చేయండి. తమలాంటి వారి వల్లనే హిందూ ధర్మం దూషించబడుతుంది.

  3. శ్యామలీయం

    అసలు సిసలు అజ్ఞానం మీదే.

    సనాతన ధర్మావలంబకులు ఎవరూ విగ్రహాలను పూజించటం లేదు -పూజలో విగ్రహం ఒక ప్రతీక మాత్రమే.

    పూజామంత్రాలు అన్నీ భగవంతుని ఉద్దేశించి చెప్పినవే కాని ప్రతిమను ఉద్దేశించి చెప్పినవి కావు గదా.

    విగ్రహారాధన అనేది మిషగా వ్యతిరేకభావాలున్న ఒక పెద్దమనిషికి వివేకానందులు జ్ఞానోపదేశం చేసినకథ సుప్రసిథ్థం. మీరు వివేకానంద బోధకే తింగర అర్థాలు తీసి ఆయనకే ఎసరు పెట్టారే.

    మీ విద్వేషపూరిత బోధలు ప్రచారాలు మానండి. తక్షణమే!

    1. Unknown

      గౌరవనీయులైన శ్యామ లీయం గారు దేవుని స్థానంలో వేరే వారిని పెట్టడమే నిజమైన అజ్ఞానం. సనాతన ధర్మంలో సాకార పూజ అనేదే లేదు. మంత్రాలన్ని భగవంతుని ఉద్దేశించినవే అన్నది వాస్తవమే. మరి అప్పుడు అక్కడ ప్రతిమలు ఎందుకు? విగ్రహ ఆరాధన కోసం స్వామి వివేకానంద చేసిన జ్ఞానోపదేశం బాగా చదవండి. అక్కడ స్వామి వివేకానంద చర్చ తన తండ్రి విగ్రహాన్ని గౌరవించాలా? లేదా? అన్నది మాత్రమే కానీ తన తండ్రిని వేడుకోవాలా? లేదా? అన్నది కాదు.

  4. Jagadeesh Reddy

    మీరు చెబుతున్నవన్నీ ఆయా పండితుల అభిప్రాయాలు మాత్రమే. హిందువుల్లో ఎవరో ఒకరి అభిప్రాయాన్ని గుడ్డిగా నమ్మడమో కాకుండా, ఎవరి సాధనా స్థితిని బట్టి వారు ఆరాధనా పద్దతిని అనుసరిస్తూ ఉంటారు. అంత మాత్రం చేత మిగతా వారివి తప్పు అని, మనం చెప్పేదే సరయినదని మనకి మనమే నిర్దారిస్తే ఎలా? భగవంతుడు సాకారుడు, నిరాకారుడూ కూడా… మనం చదువుకొనేప్పడు ముందు అక్షరాలు నేర్చుకుంటాము నేర్చుకుంటాము.. కొద్ది కొద్దిగా ఎదుగుతూ చివరికి పట్టభద్రత సాధిస్తాము. అంత మాత్రం చేత, నేను చాలా తెలివయిన వాడిని, అక్షరాలు చదవను. అన్నిటి కన్న ఉత్తమమయినదే చదువుతాను అంటే ప్రయోజనం ఉండదు కదా… అలాగే విగ్రహారాధన అనేది భక్తిలో ప్రాధమిక భావన. సాధనలో ఉన్నత స్తితికి వెళ్ళిన తరువాత అప్పుడు నిరాకార భావనని అనుసరించవచ్చు. మరో ముఖ్య విషయం,.. మిగతా వ్యాపార మతాల్లాగా హిందువులకి ఒకరి గురించి అవసరం లేదు.. అందరినీ ఉద్దరించేద్దామన్న ఆశ అంతకన్నా లేదు. మీ మతం గురించి మీరు చెప్పుకోండి.. తప్పులేదు.. దయచేసి, ఎదుటి వారి గురించి వేలెత్తి చూపించకండి…

    1. UG SriRam

      Well Said. ఇటువంటి వాదనలు హిందూ మతం లో రామకృష్ణ పరమహంస కాలంలోనే అంటే సుమారు 150 సంవత్సరాల క్రితమే ముగిశాయి. ఈ బ్లాగులొ ఇప్పుడేదో కొత్తగా కనుగొన్నట్టు అనవసరం గా చర్చిస్తున్నారు. ఇతర మతాలతో హిందూ మతం పోలుస్తూ, జాకిర్ నాయక్ తరహాలో విశ్లేషణ చేయవలసిన అవసరమే లేదు.

  5. మఠం మల్లిఖార్జున స్వామి

    దేవునికి చేరువ కావాలనుకునేవారు ఎక్కే మొదటి మెట్టు విగ్రహారాధన. ఆ విషయాన్నే మీరు చెప్పారు అంటున్న పైవారందరూ చెప్పింది. విగ్రహారాధన అనేది భగవంతుని ఆరాధనలో ఒక భాగమే. మనిషికి ఏకాగ్రత కుదిరిన పిదప విగ్రహాలతో పనిలేదు, వారు కళ్ళుమూసుకుని తపస్సు చేసుకుంటారు. జ్ఞానోదయం పొందిన మహాపురుషులు చేసేది అదే. అందుకే అడవుల వెళ్లి తపస్సు చేసుకుంటారు సర్వసంగ పరిత్యాగులు. ఇక సంసారంలో ఉన్నవారికి ఆ మొదటి మెట్టు దాటటం కష్టమే కాబట్టి వాడు తుది వరకూ ప్రయత్నిస్తూనే ఉంటాడు.

    సుమారు 15 ఏళ్ల క్రితం దివ్యఖురాను తెలుగులో వచ్చిన కొత్తలో చదివాను, ఇప్పటికీ ఆ గ్రంధం నాదగ్గర పుస్తకాల్లో భద్రంగానే ఉంది. జన్మలో మోక్షం పొందాలంటే జీవితంలో ఒకసారైనా మక్కా వెళ్లి సాంప్రదాయికంగా తల వెంట్రుకలు, గడ్డలు, మీసాలు తీసుకుని తెల్లని లుంగీ కట్టుకుని, తెల్లని ఉత్తరీయం పైన కప్పుకుని అక్కడి నల్లరాతి గృహమైన కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చేయాల్సిందే కదా? మహమ్మద్ ప్రవక్త కాబాలో విగ్రహాలు తొలగించేవరకూ అక్కడ విగ్రహారాదన జరిగిన మాట వాస్తవం కాదా? దేవుడు అంతటా ఉన్నపుడు మక్కా వెళ్లి అక్కడి కాబా గడపను తాకి ప్రదక్షిణాలు చేసి ప్రార్థన చేస్తేనే కాని ఎందుకు మోక్షం లభించటంలేదు? ఎక్కడా లేని మహిమ అక్కడ ఉన్నదనే విశ్వాసంతోనే కదా అందరూ వెళుతుంది. గుడిలోని విగ్రహారాదన కూడా అలాంటి విశ్వాసమే. ఎవరి విశ్వాసం వారిది.

  6. Anonymous

    సాక్ష్యం మేగజైన్లో ప్రచురించబడిన "విగ్రహారాధనను తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు" ఆర్టికల్ పై స్పందించిన పెద్దలకు,హిందూ పండితులకు ప్రత్యేక కృతజ్ఞతలు.చర్చంతా థార్మిక గ్రంధాల ఆధారంగా జరిగితేనే ప్రయోజనకరం. స్వంత అభిప్రాయాలు,ఊహాజనిత సిద్ధాంతాల వలన ప్రజలకు నష్టమే గాని ఎటువంటి ప్రయోజనం చేకూరదు.అంతేకాక దూషణలు,వాగ్వాదాల వలన ఎటువంటి లాభం ఉండదు.కాబట్టి ఈ బ్లాగ్ ఆర్టికల్స్ పై థార్మిక గ్రంథాల ఆధారంతోనే స్పందించవలిసిందిగా కోరుచున్నాము. గ్రంథాధార విషయాల చర్చకు,ప్రచురణకు సాక్ష్యం మేగజైన్ ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది. ఈ బ్లాగును ఎంతో చక్కగా ఆదరిస్తున్న మీకందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలతో....సాక్ష్యం మేగజైన్ ఎడిటర్.

    1. మఠం మల్లిఖార్జున స్వామి

      రెఫరెన్సులు పెట్టనంత మాత్రాన విజ్ఞులు చెప్పిన విషయాలను మీరు తోసిపుచ్చడం భావ్యంకాదు. భూమి గుండ్రంగా ఉందని ఏ రెఫరెన్సు అవసరం లేదో విగ్రహారాధన గురించి చెప్పటానికి హిందువుకు ఏ రెఫరెన్సు అవసరం లేదు, వాటి గురించిన అవగాహన అందరికీ బాగానే ఉంటుంది. ఇక నేను పైన పేర్కొన్న విషయాలైన తెల్లటి దుస్తులు ధరించటం, తలనీలాలు ఇవ్వటం, ప్రదక్షిణ చెయ్యటం, అక్కడి బావితీర్థం వెంట తీసుకురావటం అన్నవి ధార్మిక గ్రంధమైన దివ్య ఖురాను (సురాహ్ ఆల్ బఖరహ్, భాగం-2, పేజీ-31) గ్రంధమునుండే చెప్పటం జరిగింది. ఆన్ లైన్ లోగల దివ్య ఖురాన్ లో ఈ విషయాలు చూడవచ్చు http://www.telugu-quran.com/en/telugu-pdf/MB-02.pdf అంతేగాక వికీపీడియా లోని "మక్కా" (Mecca) తెలుగు విశేషాలలో పైవిషయాలతో బాటు మక్కాలో విగ్రహారాదనకు సంబందించిన విశేషాలు కూడా తెలుసుకోవచ్చు. బహుళ ప్రాచుర్యం పొందిన Lapidus రచించిన ఇస్లామిక్ చరిత్రలో ఈ అన్ని విషయాలు చర్చించబడినవి. ఇక మీరు పైన పేర్కొన్న వారు సంఘసంస్కర్తలే కాని హిందూ మతగురువులు కారు. ఇస్లాం పద్దతుల వ్యతిరేకించే ఇస్లాం మతస్థుల అభిప్రాయాలు తీసుకుని ఇస్లాం పండితులు ఇలా చెప్పారు అని దోషాలు ఎంచలేము కదా? హిందూ మతం అనేది ఒక మహా సముద్రం, ఇది వందల కొలది భిన్న మత సిద్దాంతాల కలయిక అయినట్టిది. అందరి భావన, సిద్ధాంతం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే వ్యతిరేకంగా చెప్పబడినవే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఇక హిందూమతంలో విగ్రహారాధన గురించి నా బ్లాగులో ప్రేత్యేకించి ఒక టపా ముందు రోజుల్లో ఉంచగలను. ఇస్లాంలో ఉన్న మంచి విషయాలు చెప్పండి కాని ఇతర మతాల దోషాలు ఎత్తిచూపితే, దానివల్ల ఇస్లాం మతంపై నాలాంటి వారికి ఉన్న సదభిప్రాయం కూడా పోతుంది.

  7. Venky

    "చర్చంతా థార్మిక గ్రంధాల ఆధారంగా జరిగితేనే ప్రయోజనకరం. స్వంత అభిప్రాయాలు,ఊహాజనిత సిద్ధాంతాల వలన ప్రజలకు నష్టమే గాని ఎటువంటి ప్రయోజనం చేకూరదు."
    ------------
    మీ టపా ఏ ధార్మిక గ్రంధం ఆధారం గా మీరు వ్రాశారు మహాశయా?



    సరే కొందరు హిందూ పండితుల ఆధారం గా వ్రాశారు అనుకొందాం, అదే హిందూ మతం విగ్రహారాధనను గౌరవిస్తుంది అన్న విషయం మీకు తెలియదా?

    ఇక ముస్లిం, హిందూ, క్రైస్తవం లను కంపేరు చేసి చూడాలన్న మీ కుతూహలానికి సమాధానాలు అన్నీ, చర్చలు అన్నీ చాలా ఏళ్ల క్రితమే జరిగినాయి అని శ్రీరాం గారు మిగతా వారు అంటున్నారు, మీకు నిజంగానే తెలుసుకోవాలనుకొంటే వాటి రిఫరెన్సులు ఏమయినా చేసి చూసారా?

    1. Anonymous

      గౌరవనీయులు వెంకీగారికి..ప్రత్యేక కృతజ్ఞతలతో…మీరు ఈ టపా ఏ ఆధారంతో వేశారు అని ప్రశ్నించారు.నిజానికి పై వేద పండితులందరూ వేద శాస్త్రాలను పరిశీలించి చెప్పినవే అని విషయం గమనార్హం.తదుపరి టపా వేద శాస్త్రాలు ఏమని సెలవిస్తున్నాయి.వేద పండితులు ఈ విగ్రహారాధను ఖండించడానికి గల కారణం ఏమితి? ఇత్యాది విషయాలు మీకు కూలంకుషంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. గమనించగలరు.

  8. UG SriRam

    ఇక్కడ జరిగింది చర్చ కాదు. అభిప్రాయాలను చెప్పటం. ఇక్కడ చర్చించటానికి ఏమిలేదు. మీరు నిరాకర ఉపాసనను అంతగా నమ్ముతూంటే, ఆ నిరాకార దేవుడిని మీరు అలా చూస్తూ, తన్మయం చెందూ ప్రార్ధిస్తూండాలి. ఆ నిరాకారదేవుడి గురించి, అతని లక్షణాలు వర్ణిస్తూ అక్షరం రూపం లో రాయటం అంటే అర్థమేమిటి? నిరాకార దేవుడికి వచనం ద్వారా సాకారం కల్పించినట్లే! కనుక మీరు రోజూ బ్లాగులో పోస్ట్లు రాస్తూ నిరాకార దేవునికి సాకారం కల్పించే పని మాని, మీరు పూర్తిగా పగలు రాత్రి నిరాకార దేవుని చూస్తూ, ఆయనని పూజిస్తూ ధ్యానం లో నిమగ్నం అవుతారని ఆశిస్తున్నాను.

    1. Anonymous

      మనిషి నిరాకార ఉపాసన చేయాలా? సాకార ఉపాసన చేయాలా? అనే విషయం మన మహారుషులు ఏనాడో చెప్పారు.అవ్వన్నీ ఈనాడు గ్రంధాల రూపంలో భద్రపర్చి యున్నాయి.అందులో నుండి పండితులు చెప్పిన విషయాలను కూడా అందిస్తుంటే అది సాకారమే అన్న మీ మాటలు హాస్యాస్పందంగా ఉన్నాయని గమనించగలరు.అటువంటప్పుడు వేద గ్రంధాలను పఠించడం కూడా సాకారమవుతుంది.అందుచేత వేదాన్ని కూడా వదిలి పెట్టి మనుషులను దారి,తెన్నూ లేని అజ్ఞానులుగా బ్రతకమనా మీ ఉద్దేశ్యం లేక ఈ రోజు వీధికో బాబాలుగా వెలుస్తున్న వారి కాళ్ల దగ్గర పడి వారు కల్పిత,ఊహాగానాలను అనుచరించమనా?

  9. UG SriRam

    నా మాటల పై మళ్లీ చర్చించవచ్చు. మిమ్మని వీధికొక బాబాను నమ్మని ఎవ్వరు చెప్పటం లేదు. మీకు బాబాలు ఇష్టం లేకపోతే ఇంట్లోనో, మీకు నచ్చినచోటొ కుచొని ప్రార్ధనలు చేసుకోండి. క్రైస్తవుల గ్రంథం లో ఇలా ఉంది, హిందువుల గ్రంథంలో అలా ఉంది అంటు విమర్శలు చేయటం అనవసరం.

  10. Unknown

    వేదోపనిషత్తులుగాని,బైబిల్ గాని,ఖురాన్ గాని ఇవ్వన్నీ దైవ ప్రసాదిత గ్రంధాలే!వీటికి అందరికీ సర్వ హక్కులున్నాయి.ఇవి ఏ మతవర్గానికో సంబంధించినవి ఎంత మాత్రం కాదు.ఇక విగ్రహారాధన విషయానికొస్తే వేద శాస్త్రాల ప్రకారం విగ్రహారాధన పూర్తి వ్యతిరేకమే.కాని నిగ్రహం కొసం విగ్రహం అనే నినాదం కొంతమంది పండితులు తీసుకొచ్చారు.స్వామి దయానంద ఇది కూడా పూర్తి వ్యతిరేకించడమే కాక విగ్రాన్ని పూజించేవాడి హృదయం విగ్రహం అయిపోతుందని,ఉన్న జ్ఞానం పోయి అజ్ఞానం వస్తుందని నినదించాడు.ఆలోచిస్తే ఇది కూడా వాస్తవమే!ఏది,ఏమైనా విగ్రహారాధన వేదోపనిషత్తులకు వ్యతిరేకమే కాబట్టి మాని వేయడం మంచిది.పరమాత్మ ఎప్పటికీ పంచేద్రియాలకు అందనివాడే!

  11. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    మీ బ్లాగు లక్ష్యం ఒక్క ఇస్లాం మతాన్ని తప్ప ఇతర మతాలని ఆడిపోసుకోవటమే అని అర్థమవుతోంది.హిందూ మతం గురుంచి మహామహానుభావులే ఏమి తేల్చలేకపోయారు. మీకున్న అజ్ఞానాన్ని జ్ఞానమని భ్రమించి అందరి మీద రుద్దాలనే ప్రయత్నం మానుకోండి. ఇతర మతాల వాళ్ళు ఎలా నడుచుకోవాలో చెప్పే హక్కు మీకు లేదు.

    1. Unknown

      వాస్తవానికి మతం అనేది మనిషి నిర్మించుకున్నది.ధర్మం అనేది అన్ని కాలాలలో, అన్ని ధార్మిక గ్రంధాలలో ఒక్కటే!ఫలానా వ్యక్తిని ఇలా నడుచుకోండి అని చెప్పే పూర్తి హక్కు నాకు లేకపోవచ్చు.కాని మన ధార్మిక గ్రంధాలు ఏమి చెప్తున్నాయో తెలుసుకుని చెప్పాల్సిన బాధ్యత అందరితో పాటు నాకు కూడా ఉందని గమనించగలరు.బ్లాగు దర్శించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు!

    2. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

      ధర్మం ఎప్పుడూ అన్ని కాలాల్లో ఒకేలా ఉంటుందని మీకెవరు చెప్పారు.కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది.ఆయా కాలాలకు తగ్గట్లుగా పూర్వీకులు ధర్మాన్ని నిర్దేశించారు కూడా.ఇంత చిన్న విషయం తెలియని మీరు హిందూ ధర్మం గురుంచి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.నిర్గుణోపాసన ఉత్తమమే కానీ విగ్రహారాధనను వేదాలలో ఖండించలేదు.శ్రీ కృష్ణుడే స్వయంగా ఎవరు ఏ రూపంతో కొలిస్తే వాళ్ళకు ఆ రూపంలో సాక్షత్కరిస్తానని గీతలో చెప్పాక ఎవరో బాబాలు సంఘసంస్కర్తలు ఖండిస్తే అది ప్రమాణం అయిఫోదు.కాదనటానికి వాళ్ళెవరు? ఖురానులోని విషయాలు వక్రీకరించి ఎవరో ముల్లా ఎదో చెబితే మీరు దాన్ని పాటిస్తారా ? హిందూ మతం దూషణకు గురైంది అన్నారు, ఇస్లాం కన్నానా ?

      మన ధార్మిక గ్రంథాలు ఏం చెప్పాయో తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది.అది ముందు ఖురాను గురుంచి ప్రారంభిస్తే మంచిది.ఇస్లాం మాతానికే ఇప్పుడా అవసరం ఎక్కువుందని నా అభిప్రాయం

    3. Unknown

      అన్ని కాలాలలోను థర్మం ఒక్కటే వాటి ప్రిన్సిపల్ ఆజ్ఞలు ఏవైతో ఉన్నాయో అవి ఎప్పటికీ మారవు.అయితే వాటి యొక్క అనుచరణ విధానం కాలాను గుణమైన విధంగా కొద్దిగా మారవచ్చు.అంతే గాని థర్మం మారదు.ఏ కాలంలోనైనా దేవుడు నిరాకారుడే! పంచేద్రియాలకు అందనివాడే! మనం ఆయననే ఆరాధించాలి గాని ఏ సృష్టినిగాని,మహనీయులనుగాని వేడుకునే అవకాశం లేదు.వేద గ్రంధాలు విగ్రహారాధనను ఖండించలేదన్నారు.మీకు వీలయితే దీని తరువాత మరొక ఆర్టికల్ ఉంది చదవగలరు.వేదాలు విగ్రహారాధనను తీవ్రంగా ఖండించాయి.విగ్రహారాధనకు వేదాలలో అవకాశమే లేదని స్వయంగా హిందూ పండితులే చెప్పారు గమనించగలరు. అసలు భగవద్గీతలో శ్రీకృష్ణులవారు ఏమి చెప్పారు? అసలు ఏఏ రూపాలను పూజిస్తే నష్టమేమిటి?అది పూర్తి ధర్మ సమ్మతమా అనేది త్వరలో కొన్ని ఆర్టికల్స్ పెడతాను.ఇక ఖురాన్ ఆర్టికల్స్ ఆల్రెడీ ఈ బ్లాగులో పెట్టాము.త్వరలో మరిన్ని వస్తాయి కూడా!చివరిగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలతో…సాక్ష్యం మేగజైన్ ఎడిటర్.

    4. hari.S.babu

      యే విధమయిన చిహ్నాలూ లేకుండా అన్ని శాస్త్రాలకీ మూలమయిన గణితశాస్త్రమే మన లేదు!1 నుంచి 9 వరకూ వున్న అంకెలకి భౌతిక రూపాన్ని మీరు చూపించగలరా?అవి ఒక అగోచరమయిన సైధ్ధాంతిక విషయాన్ని గోచరింప జేసుకోవటానికి వాడిన దృశ్యరూపాలు కదా?అక్షర పరబ్రహ్మం అనే భావన గీతలో వుంది కదా,మరి అది హిందూ ధర్మానికి విరుధ్ధం యెలా అవుతుంది?

    5. Unknown

      హరిబాబుగారికి ముందుగా బ్లాగ్ దర్శించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.గీతలోని అక్షరపరబ్రహ్మ (అక్షరం అంటే నాశనం లేనివాడని,పరబ్రహ్మ అంటే ఈప్రకృతికి(ఈ సృష్టికి) అతీతమైనవాడని అర్థం) అనే భావన హిందూ థర్మానికి వ్యతిరేకమని ఎక్కడా అనలేదని గమనించగలరు.

  12. yallapragada hyma kumar

    అన్ని మతాలు చెప్తున్నది దేవుడు రూపరహితుడు సర్వాంతర్యామి. ఆయన అంతావ్యాపించి ఉన్నప్పుడు ఇక్కడ లేడు అక్కడ లేడు అని చెప్పటం లో అర్థం లేదు. నువ్వు పూజించే రాఇ లో లేడని చెప్పటం కూడా అర్థం లేదు. అలా చెప్తె సర్వాంతర్యామి అని చెప్పటం లో అర్థం లేదు.మూడనమ్మకాలు మూడభక్తీ రెండు ప్రమాదమే.హిందూ మతంతో విగ్రహమే సర్వం అని చెప్ప లేదు సర్వం ఈశ్వర(దేవుని) మయం అని చెప్తుతుంది.విగ్రహరాదన తొలి మెట్టు. నేను అంతావ్యాపించి ఉన్నాను అని చెప్పినప్పుడు విగ్రహం లో ఉండడా!
    బైబిల్లో ఇద్దరు నమ్మి పర్వతాన్ని పక్కకు జరగమంటే జరుగుతుంది అని చెప్పినప్పుడు, విగ్రహం లో అన్నాడని నమ్మి పూజిసై పలకడా!

  13. Telugu cultural Songs

    ప్రతీ మనిషికి సందేహాలు అనేవి రావటం అనేది జన్మసహజం.?
    ఎంతమందికి వేదజ్ఞానం ఉంది అనేది పెద్ద చిక్కులా మారింది? వేదాల్లో ద్రష్టలు అని ఒక్కరు, ఇద్దరు లేరు అనేది నిజమే కదా? ఇంకోసందేహం ఏంటంటే విగ్రహారాధన అనేది వేదాల్లో ఉందా లేదా అని చాలా మంది చర్చిస్తారు, చర్చిస్తున్నారు?
    అయితే, ఋషులు అని ఎవరిని పిలుస్తామో వారే ఎన్నో చోట్ల దేవతా ప్రతిష్టలు చేసినట్టు చెప్తారు అవి నిజం కాదా అని ఒక సందేహం? మరి ఆ ఋషులకు వేదాలు తెలియదా అని?
    ఇప్పుడు చాలా మంది వేదాలు అని అంటున్న వాటిని విభజించి అందించిన వేదవ్యాసుల వారికి తెలియదా విగ్రహ ప్రతిష్టలు చేయద్దు అని అలా బాసర క్షేత్రంలో ఎందుకు సరస్వతిని ప్రతిష్టించాడు ఇది నిజం కాదా అని?
    ఇంకా కొన్ని క్షేత్రాల్లో స్వయంభువుగా వెలిసాడు అని విన్నాం అవి నిజాలు కాదంటారా?
    వేదాల్లో విగ్రహారాధన గురించి ప్రస్తావించకపోతే ఇవన్నీ ఎలా వస్తాయి, వచ్చాయి అనేవి సందేహాలుగా ఉన్నాయి?

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine