ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. మార్కు సువార్త: 16:19.
పై వాక్యం చాలా స్పష్టంగా యేసు దేవుడుకాదని సెలవిస్తోంది. యేసు స్వయంగా దేవుని కుడి ప్రక్కన కూర్చున్నట్టు తెలియ జేస్తుంది. మరి ఈ వాక్యం ప్రకారం యేసు దేవుడెలా అయ్యాడు? క్రైస్తవ పండితుల బోధనల ప్రకారం యేసే దేవుడైతే ఆయన మరొక దేవుని దగ్గర ఎలా కూర్చున్నట్టు? బైబిల్ ప్రకారం దేవుడు ఒక్కడే గదా? కాబట్టి యేసే, యెహోవా అనే బోధ ఒక కల్పిత బోధ తప్ప మరేమీ కాదు. కేవలం అబద్ధ బోధకులు సృష్టించిన తప్పుడు సిద్ధాంతం!!.. కాదంటారా?