• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » ARTICLES » భగవద్గీత శాస్త్రాన్ని చదివే హిందువులు ఎంతమంది?

భగవద్గీత శాస్త్రాన్ని చదివే హిందువులు ఎంతమంది?

Label: ARTICLES

హిందువులలో అత్యధికులు సనాతన థర్మం గూర్చి వాదించేవారే గాని అసలు సనాతనథర్మమంటే ఏమిటో తెలియదు. హైందవ శాస్త్రాలైన వేదోపనిషత్తులు గాని, భగవద్గీత గాని ఎవరూ పెద్దగా చదవరు. ఎవరో స్వామీజీయో, బాబాయో చెప్పిన నాలుగు మాటలు వినేసి ఈ బ్రతుక్కి చాలు అనే ఉద్దేశ్యంతో ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ థార్మిక గ్రంధాలనేవి మనిషి ఏవిధంగా జీవించాలో మార్గాన్ని చూపించేవి. అటువంటి వీటినే ఇంత అశ్రద్ధ చేయడం సమంజసమా చెప్పండి. భక్తి పేరు చెప్పుకుని కనిపించిన ప్రతి బాబా మీద పడడం చాలా అజ్ఞానం. ఎవరికైతే వేద పరిజ్ఞానం ఉంటుందో వారి మాటలే అక్షర సత్యమవుతాయి అదీ వేద గ్రంధాలు సమర్ధిస్తేనే! నిజానికి ఈరోజుల్లో అటువంటి పండితులు బహు అరుదు! మనమే వేద నిపుణులు కావాలి. ఆ సర్వేశ్వరుడు అందరూ పఠించి పాటించడానికే ఆ అపౌరిషేయములు పంపించాడు తప్ప వాటిని కళ్ల కద్దుకుని ఏదో గూటిలో పెట్టుకుని పూజించడానికి కాదు. వాటిని పఠించి మనం ఎలా నడవాలో తెలుసుకుని మన జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే మనశ్శాంతి, ముక్తి రెండూ దక్కుతాయి. శాస్త్ర అనుచరణ లేకపోతే ఇవేవీ దక్కవు. ఈక్రింది శ్లోకం ఒకసారి చూడండి.
         యశ్శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారత:
         న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. గీత 16:23 
   తా:- ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తనయిష్టము వచ్చినట్లు ప్రవర్తించునో, అట్టివాడు పురుషార్థసిద్ధినిగాని, సుఖమునుగాని, ఉత్తమగతియగు మోక్షమునుగాని పొందనేరడు.
   పై శ్లోకం ప్రకారం ఎవరైనా సరే తన ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటే మనిషికి మనశ్శాంతిగాని, సుఖముగాని ముక్తిగాని ఏవీ దొరకవు. మన జీవితం శ్శాస్త్రప్రకారం ఉండాల్సిందే! ఆ బాబా ఇలా చెప్పాడు, ఈ స్వామీజీ ఇలా చెప్పాడని కాకుండా శాస్త్రం ఏమి చెప్పిందో దాని ప్రకారం నడవాలి. దానికి ఆధారం ఈ క్రింది శ్లోకం చూడండి.
          తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ
          జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. గీత:16:24
        తా:- కావున చేయదగునదియు,చేయరానిదియు నిర్ణయించునప్పుడు నీకు శాస్త్రం ప్రమాణమైయున్నది. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలిసికొని దానిననుసరించి నీ వీ ప్రపంచమున కర్మమును జేయదగును.
    కాబట్టి మిత్రులారా మనం జీవితంలో ముఖ్యంగా భక్తి విషయానికి వస్తే శాస్త్ర అనుమతితోనే మన భక్తి భావాలుండాలి. మనక్రతువులుగాని, పూజలుగాని, ఆరాధనలుగాని ఏవైనా సరే శాస్త్ర అనుమతి ఉండాల్సిందే! అప్పుడే మనకు అన్నీ దక్కుతాయి. అంతేగాని నలుగురితో నారాయణ, గుంపులో గోవిందయ్య అనే చందాన మన జీవితం ఉండకూడదు. అసలైన భక్తి అంటే ఏమిటో, నిజమైన థర్మమంటే ఏమిటో ఆ వాస్తవ సృష్టికర్త ఎవరో తెలియాలంటే మనం ఈ వేద గ్రంధాలను అధ్యయనం చేయాలి. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. జైహింద్!!

12 Responses to "భగవద్గీత శాస్త్రాన్ని చదివే హిందువులు ఎంతమంది?"

  1. పల్లా కొండల రావు

    వేద గ్రంధాలు అంటే ఏవి? ఎక్కడ లభిస్థాయి?

    1. Unknown

      వేదాలు ప్రపధమ గ్రంథాలు. ఆ తరూవాతి స్థానంలో ఉపనిషత్తులు, బ్రాహ్మణికాలు,భగవద్గీత ఇత్యాది గ్రంథాలను ప్రామాణికమైనవిగా పేర్కొంటారు సర్. బహుశా శ్రీశైలంలో దొరకవచ్చు.

    2. Unknown

      Swethaswetharopanishath..4:19 of there god has no image no statue

  2. కాయ

    " పూజలుగాని, ఆరాధనలుగాని ఏవైనా సరే శాస్త్ర అనుమతి ఉండాల్సిందే! అప్పుడే మనకు అన్నీ దక్కుతాయి."

    అన్నీ దక్కుతాయా ? నువ్వు టెస్ట్ చేసినట్లే చెప్తున్నావే! అనుభవంలో లేని విషయాలు వ్రాసే టపుడు చదువరులకు లేని పోని విషయాలు అంటగట్టడం మోసం చేయడం అవుతుంది.

    1. Unknown

      కాయగారు అసలు మీరు ఏ ఉద్దేశ్యంతో కామెంట్ పెడుతున్నారో అర్ధం కావడం లేదు. శాస్త్ర అనుమతి ఉండాలనేది నామాట కాదు.పై గీతా శ్లోకం ఒకసారి చదవండి. శాస్త్ర ప్రకారం కాకుండా ఇష్టానుసారం చేస్తే సుఖంగాని ముక్తిగాని ఉండవని గీతే చెప్పినప్పుడు ఆశాస్త్రాల ప్రకారం నడిచినప్పుడు అవి దొరకవా? అని ఆలోచించండి అంతేగాని చదువరులను మోసం చేయడం అనే మాట మీరు 100% భగవద్గీతను అన్నట్టే ఉందని గమనార్హం. ఇక ఎవరి అనుభవం వారిది.నిజానికి ఒకరి అనుభవం మరొకరికి ప్రామాణికమా? శాస్త్రం ప్రామాణికమా? ఒకసారి ఆలోచించుకోండి.చాలు!

  3. Unknown

    ఇదివరకు ఒక సారి కామెంట్ పెడితే దానికి రిప్లై కాదు కదా… కనీసం పబ్లిష్ చేయలేదు.... పోనీ కామెంట్ అసభ్యం గా, పబ్లిష్ చేయటానికి వీలు లేకుండా వుందా అంటే అది లేదు.... దీన్ని బట్టి మిమ్మల్ని కార్నర్ చేసే కామెంట్స్ చేస్తే వాటి గతి అది అన్న మాట.... అవగాహన లేకుండా బ్లాగ్స్ లో మీ ఇష్టం వచ్చినట్టు రాస్తే ఎలా సార్.... ఇంతకీ భగవద్గీత శాస్త్రం ఎలా అయిందో..... సరే గాని అపౌరుషేయాలు అంటే ఏమిటో చెప్తారా....

    1. Unknown

      సాక్ష్యం బ్లాగులో ఇప్పటివరకూ ప్రతి కామెంటూ పబ్లిష్ చేసాము.మీ కామెంట్ విషయం మా జ్ఞప్తి పరిధిలో లేదు.కలిగిన అసౌకర్యానికి క్షమించాలి.ఇక ఇందులో ఏవిషయమైనా మా జ్ఞానపరిధి మేరకు పూర్తి అవగాహనతోనే వ్రాస్తున్నాము తప్ప కల్పిత విషయాలు కాదు.అలాగని మా స్వంత ఆలోచనలు కూడా కాదు. ప్రతిదానికి గ్రంథాధారం ఉంటుంది. గమనించగలరు. ఏ విషయమైనా మనం విశ్లేషించేటప్పుడు థార్మిక గ్రంధాలే మూలాధారం. ఇక భగవద్గీత శాస్త్రమని గీతలోనే ఉంది.(గీత 16:23,24 శ్లోకాలు గమనించండి.ఇంకా చాలా ఆధారాలున్నాయి. శాస్త్రమంటే శాసించేదని అర్ధం.) ఆ అక్షరబ్రహ్మ చేత ప్రబోధించబడిన గ్రంధాలను అపౌరుషేయములని అంటారు.వేదం,గీత ఇత్యాదివి అపౌరుషేయముల పరిధిలోకి వస్తాయి.రామాయణం,మహాభారతం ఇత్యాది పుస్తకాలను ఇతిహాసాలు అని పిలుస్తారు తప్ప ఇవి అపౌరుషేయములు కాదు అలాగని శాస్త్రములు కాదని మనవి.

    2. Unknown

      మరొక ముఖ్య విషయం సర్! అపౌరుషేయములు అంటే పురుష (మానవ) ప్రమేయం లేనిది అని అర్థం. అంటే కేవలం దైవ ప్రేరేపితమైనవి. బ్లాగ్ దర్శించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు కిరణ్ గారు!!

  4. పండు

    నా పక్కన కూర్చుని పనిజేసుకునె ఒకాయన తాను నాస్తికుడిని అంటాడు, చాలా కష్టపడి పనిచెస్తూ, మంచి జీతం అందుకుంటూ బాగా వున్నాడు. నాకు తెలిసిన సుభద్రమ్మ మడి, నిష్ట, పూజ, పునస్కారం లేకుండా చిన్న పని కూడా చెయ్యదు , నలుగురు కూతుళ్ళతో నానా బాధలు పడుతోంది.
    నా ప్రశ్న: సుఖమంటే ఏమిటి?
    మరొ ప్రశ్న: మోక్షమంటే ఏమిటి?
    నేనిప్పుడు శ్రీశైలం వెళ్ళి ఆ వేదాలకోసం వెతకలేను గాని, మీరేమన్న చెబుతారా?

    1. Unknown

      సుఖమంటే ఎ.సి రూములు,కార్లు, ఎత్తైన భవంతులు కలిగి ఐశ్వర్యవంతులుగా ఉండడం అనుకుంటారు.వేద శాస్త్రప్రకారం నిజానికి సుఖమంటే ఉన్నదానిలో సంతృప్తి పొందుతూ కష్ట,నష్టాల్ను కూడా అవళీలగా తట్టుకుంటూ ఎవరైతే మనశాంతిగా జీవిస్తారో వారు సుఖవంతులు. సహజంగా మనం వాళ్ల హొదా,స్థితిగతులను చూసి సుఖవంతులనుకుంటాము.నిజానికి ఎవరికి వారికే ఇవి తెలుస్తాయి తప్ప బయటికి కనిపించవు.ఇక మోక్షమంటే మనిషి మరణాంతరం పొందే ఉన్నతమైన స్థితిని, లేక శాశ్వత స్థానాన్ని మోక్షమన్నారు.దీనికి వివరణ ఒక ఆర్టికల్ రూపంలో ఇస్తాము గమనించగలరు.కృతజ్ఞతలు సర్!!1

  5. Unknown

    ఆలోచనాత్మకమైన విషయాలు వాస్తున్నారు. మనసారా అభినందనలు. ఎదుటి వారి అభిప్రాయాలను కానీ వారు చేసే పనులను కానీ ఖండించే విషయానికి వస్తే, మీ చేస్తున్నది, నా దృష్టిలో, బ్రైన్ సర్జరీ. దానిని చెయ్యడానికి లోపల వున్న విషయాలని తీసేటప్పుడు అది వారికి నొప్పి బాధ రాకుండా జరగాలి కద. అందుకని మరీ నిష్కర్షగా, నిర్మొహమాటంగా కాకుండా మరికాస్త నిదానంగా మరికాస్త నెమ్మదిగా ఇంకాస్త అనునయంగా, అభినందిస్తూ చెప్పాలేమో.
    ఆలోచించండి. ఎందుకంటే ఈ లోకంలొ ఎవరైనా తప్పులు ఎవరూ చెయ్యరు. ఎవరైనా చిన్న సత్యాలనుంచి ఉన్నత సత్యాలకు ఎదిగిన వారే ఎదుగుతున్నవారే. ఎవరైనా వారి పరిధిలో ఉన్న సత్యాలనే నమ్ముతూ వుంటారు. వాటి కన్నా మరింత ఉన్నత సత్యం ఉన్నదని వారికి అర్థమైనప్ప్పుడు, అది వారికి ప్రయోజనం చేకూరుతుందని నిజంగా వారు నమ్మినప్పుడే వారు ఆ ఉన్నత సత్యాన్ని ఆచరిస్తారు. కనుక తక్కువ సత్యంతో జీవిస్తూ వున్నవారిని హీనపరచడం, తక్కువ చేసి మాట్లాడడం కానీ ఎవరూ చెయ్యకూడదు. భగవద్గీత శ్లోకాలలో కూడా ప్రక్షిప్తాలు వున్నాయని మహాపండితులైన గురువులే అంటున్నారు. గీతలో ఇప్పుడు మనం చూస్తున్న అన్ని శ్లోకాలనూ శ్రీ కృష్ణుడు ఆనాడు చెప్పలేదని అనేక మహానుభావులు తేల్చి చెప్తున్నారు కూడా. అది కూడా మనం అలోచించాల్సిన విషయమే.
    అయినా నాకు తెలియక అడుగుతానూ..
    "శాస్త్ర సంబంధమైన విషయాలలో ఏది శాస్త్రీయం ఏది అశాస్త్రీయం అని అర్థమయ్యేట్టు వివవరించి చెప్పేవారు శాస్త్రి గారు." మరి మీరు పురోహిత కార్యం చేస్తూ ఆ చౌదరి అన్న పేరు పెట్టుకున్నారేమిటి? :) మీ కృషిని మీ హృదయాన్ని మనసారా అభినందిస్తూ - Dr. గౌతమ్ కశ్యప్ Gautham Kashyap, 88855 88090

  6. hari.S.babu

    దానిని శాస్త్రం అనే గౌరవం రచయితకు ఉంటే మొత్తం సారం చెప్పి దాని ప్రకారం ఏది సరైనదో దానిని బోధించాలి గానీ దీనిని తీసుకెళ్ళి ఇస్లాముతో పోల్చి ఇస్లాము చెప్పే విగ్రహారాధనవ్యతిరేకతని సమర్ధించేవాటిని మాత్రం ఇందులోనుంచి యెత్తి చూపించే అనైతికమైన పనిని ఎందుకు చేస్తున్నట్టు?

    ఐన్స్టీన్ సాపేక్షతా సిద్ధాంతాన్ని ప్రజలకి పరిచ్యం చెయ్యాలంటే E=mc2 సూత్రాన్ని మాత్రం చెబితే సరిపోతుందా?మొత్తం చెప్పకుండా "ఐన్స్టీన్ విశ్వంలో కాంతి వొంగుతుందని అన్నాడు!" అని కొతేషన్లు వొదలడం తెలివైనవాడు చేసే పని కాదు,అవునా?

    మూర్తి పూజ,అమూర్త్యారాధన ఆనె రెండు మార్గాలూ సరైనవే,ఒకటి యెక్కువ అకాదు,మరొకటి తక్కువా కాదు అని మొహం మీద కొటినట్టు నిరూపించి చెప్పినా కూడా మళ్ళీ అదే పాట యెత్తుజోవడం ఏమిటి?

    ఇస్లామును గురించిన వ్యాసాలలో అదొప్క అద్భుతమైన మతం అనంట్టు లోపాలే లేవన్నట్టు రాయడమొ ఇతర మతాల దగ్గిర కొచ్చేస్రైకి ఇన్ని లోపాల్ని వెదకడమూ దేనిని సూచిస్తుందో చెప్పగలరా?కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిలిలా నటించకండి - తొందర్లోనే పాలు తాగడానికి మూతి లేకుండా పోతుంది,ఖబడ్దార్!

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine