కర్మయోగి: మోక్షం పొందటానికి ప్రతి ఒక్కరూ కర్మయోగిగా మారవలసి ఉన్నదని "గీత" ప్రబోధిస్తుంది. అసలు "కర్మ" అంటే సరియైన అర్ధం "ఏదైనా ఒక పని" ఉదాహరణకు తినడం, తినకపోవడం, నిద్రపోవడం చివరికి మౌనంగా ఉండి దేనినైనా ఆలోచించడం వరకూ చేసే పనులన్నీ కర్మలే అనబడతాయి. కాబట్టి ఏదైనా చేయడం, చేయకపోవడం అనేవి "కర్మ" పదానికే వర్తిస్తాయి.(గీత:3:5). ధార్మికపరంగా "కర్మ" అంటే నిర్దేశించిన పనిని చిత్తశుద్ధితో తప్పనిసరిగా చేయడం, చేయకూడదని వారించిన పనులు ఏ పరిస్థితులలోనూ చేయకపోవడం. ఇంకా సర్వేశ్వరుని ఆదేశాలను శిరసావహించడం మరియు వాటికి పూర్తిగా కట్టుబడి ఉండడం కర్మ అని విశదమవుతుంది. ఈ కర్మలు రెండు రకాలుగా విభజించబడి ఉన్నాయి. అవి
1.ధర్మబద్ధమైనవి అనగా ఫలానా పనులు చేయండి అని నిర్దేశించబడినవి.
2.ధర్మ విరుద్ధమైనవి అనగా చేయకూడదని నిషేధింపబడినవి.
వీటి గురించి గీత ఈ విధంగా బోధిస్తుంది.
కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ:
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి: భగవద్గీత::4:17
శాస్త్రములచే విధింపబడిన కర్మముల యొక్కయు, నిషేధింపబడిన వికర్మల యొక్కయు, ఏమియు చేయకనూరకుండుట యను అకర్మము యొక్కయు స్వరూపము ను బాగుగ తెలిసికొనవలసియున్నది. ఏలయనగా కర్మం యొక్క వాస్తవ తత్త్వము చాలా లోతైనది.
శాస్త్ర అనుసరణే ముక్తికి మార్గం!
అయితే ధర్మబద్ధమైన-ధర్మవిరుద్దమైన కర్మలు అంటే ఏమిటి? అనేది తెలుసుకోవడమెలా? ఈ విషయంలో "గీత" ఏముంటుంది?
యశ్శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారత:
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. గీత 16:23
తా:- ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తనయిష్టము వచ్చినట్లు ప్రవర్తించునో, అట్టివాడు పురుషార్థసిద్ధినిగాని, సుఖమునుగాని, ఉత్తమగతియగు మోక్షమునుగాని పొందనేరడు.
కార్యాచరణ విషయంలో శాస్త్రాలను ప్రమాణంగా చేసుకోవాలి.కాని ఎవరైతే శాస్త్రాలను ప్రమాణంగా తీసుకోకుండా తమ ఇష్టానుసారం జీవితం గడుపుతారో వారు మోక్షాన్ని పొందలేరని గీత స్పష్టం చేస్తుంది.
తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. గీత:16:24
తా:- కావున చేయదగునదియు,చేయరానిదియు నిర్ణయించునప్పుడు నీకు శాస్త్రం ప్రమాణమైయున్నది. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలిసికొని దానిననుసరించి నీ వీ ప్రపంచమున కర్మమును జేయదగును.
ఆజ్ఞాపినచబడిన కార్యాలను ఆచరిస్తూ నిషేధించబడిన వాటికి దూరంగా ఉంటేనే తప్ప మోక్షం పొందలేరనే విషయం పై అన్శాలను బట్టి స్పష్టమైపోయింది. కోరికలే మనిషికి శత్రువులు. అవి అతనిని విచక్షణ లేకుండ గ్రుడ్డివానిగ చేసేస్తాయి. తాను చేసే ప్రతిపనిని మంచిదిగానే భావించి శాస్త్రాల అనుసరణను నిర్లక్ష్యం చేస్తాడు. పై రెండు శ్లోకాలు ఆచరణనే "కర్మ" లేక ఖురాన్ ప్రకారం "షరీయత్" అని అంటారు. దీని అనుసరణ చేయకపోతే మోక్షం పొందలేరు.