తస్మాచ్చాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహార్హసి. గీత:16:24
కావున నీవు చేయదగినదియు, చేయరానిదియు నిర్ణయించునపుడు నీకు శాస్త్రం ప్రమాణమై యున్నది. శాస్త్రమునందు చెప్పబడినదానిని తెలిసికొని దానిననుసరించి నీవీ ప్రపంచమున కర్మమును చేయదగును.
"Do everything that i have commanded you (as alaw); do not add anything to it or take anything from it.
"నేను మీకాజ్ఞాపించుచున్న ప్రతిమాటను అనుసరించి గైకొనవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దాని నుండి ఏమియు తీసివేయకూడదు. ద్వితీ:12:32
ఇత్తబి ఊ మా ఉంజిలా ఇలైకుం మిర్రబ్బికుం వల తత్తబి ఊ మిందూనిహీ ఔలియా ఖలీలం మా తజక్ కరూన్ ఖురాన్:7:3
(మానవులారా!) మీ ప్రభువు తరపునుండి మీపై అవతరింపచెయ్యబడిన దానిని అనుసరించండి. దానిని కాదని ఇతరుల (ప్రబోధనల)ను అనుసరించకండి. కాని మీరు హితబోధను స్వీకరించటం అరుదు.
పై ధార్మిక శాస్త్రాలైన భగవద్గీత,బైబిల్,ఖురాన్ గ్రంధాలు మన జీవిత నడవడిక అంతా శాస్త్రపరంగా ఉండాలని ఘోషిస్తున్నాయి. దాని అనుసరణలో జీవితం గడపడమే నిజమైన భక్తి, తద్వారా ముక్తీనూ!!