• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-2

క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-2

1.మనము అనగా ముగ్గురా?
             దేవుడు -మన పోలిక చొప్పున నరులను చేయుదుము -ఆది 1:26
యేసు దైవత్వాన్ని నిరూపించడానికి ఈ వాక్యంలో దేవుడు "మన పోలిక చొప్పున" అన్నాడు కదా! మన అంటే ముగ్గురు!! అని వివరిస్తుంటారు. మన అంటే ముగ్గురే ఎందుకవుతారు? ఇద్దరు కావచ్చు లేక అంతకంటే అధికమూ కావచ్చు. కొందరనుకుంటున్నట్టు ముగ్గురే అనుకుందాం. ఈ విషయం ఎప్పటినుండి ప్రచారంలోకి వచ్చింది? యేసు అనంతరం దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత, అంటే అప్పటివరకూ "త్రిత్వం" గురించి ఎవరికీ తెలియదు. త్రిత్వానికి సంబంధించి "మనము" అనే పదాన్ని దేవుడు ఆదికాండంలోనే ప్రయోగించి ఉంటే అనేక వేలమంది ప్రవక్తలు, పరిశుద్ధులు, జ్ఞానులు మరియు యోగులూ గతించారు.మరి వారెవరూ ఈ విషయాన్ని వివరించలేదు. యేసు బోధించిన థర్మాన్ని రోమనీకరణ చేసిన తరువాతే ఈ త్రిత్వపు వాదన క్రైస్తవంలో చోటు చేసుకుంది. కనుక క్రీస్తుబోధనే ప్రమాణంగా తీసుకుని ఆలోచించవలసిన అవసరం నేటి ప్రతి క్రైస్తవుడి పైనా ఉన్నది. యేసు బోధనల ప్రకారం ఈ విషయాన్ని పరిశీలిద్దాం.

2.నామములోనికి అంటే ?
             కాబట్టి మీరు (శిష్యులు) వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; 
             తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు 
             నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు…మత్తయి 28:19
    వాస్తవానికి యేసు యొక్క దైవత్వాన్ని వ్యక్తం చేసే ఎలాంటి అంశాలు ఈ వాక్యంలో లేవు. అయితే ఈ వాక్యం ప్రకారం యేసు దైవత్వాన్ని ఆపాదించే ప్రయత్నం ఏమిటంటే - "తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు అని చెప్పి "నామములోనికి బాప్తిస్మము ఇస్తున్నారు కదా!" అన్నది. నామము అని ఏకవచనంలో చెప్పబడిందే గాని బహువచనంలో చెప్పబడలేదు కదా అన్నది తర్కం. వాక్య నిర్మాణ కనీస జ్ఞానం లేనివారు మాత్రమే ఈ తర్కం చేస్తారు.
       ఉదాహరణకు: వాక్యనిర్మాణం చర్వితచరణంగా ఉండరాదు. ఇది వ్యాకరణ సూత్రం అయినంత మటుకు వాక్యాలలో తక్కువ వాక్యాలలో విషయం సంపూర్ణం కావాలి. అప్పుడే వాక్య నిర్మాణంలో కళ ఉంటుంది. ఆ సూత్రం ఆధారంగానే పైవాక్యం చెప్పబడింది. ఉదాహరణకు "తల్లిదండ్రులు" అంటే తల్లి మరియు తండ్రి అని అర్ధం. దానిని సంక్షిప్తం చేయడానికి తల్లిదండ్రులు అనే సమాసాన్ని ఏర్పచారు. ఈ వాక్యాన్ని సరిగా అర్ధం చేసుకోక పోతే అతి ఘోరమైన అర్ధం వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. అదేమిటంటే- అతని తలి దండ్రులు అన్నారనుకోండి. అతనికి తల్లి ఒకతే ఉందికాని తండ్రులు ఎందరో ఉన్నారనే అర్ధం వస్తుంది. ఎందుకంటే "తండ్రులు" అనేది బహువచనంలో వాడారు కదా! ఇది భాషా పరిజ్ఞానం లేనివారు చేసే వ్యాఖ్యానం. అలాగే పైన పేర్కొన్న బైబిల్ వాక్యపు వ్యాఖ్యానం కూడా. ఉదాహరణకు: తండ్రి యొక్క నామములోనికి, కుమారుని యొక్క నామములోనికి, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మమియ్యవలెను అనేది వ్యాకరణా శాస్త్రం ప్రకారం తప్పవుతుంది. అందుకే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు "నామము"లోనికి అని చెప్పబడింది. పై పంక్తుల్లో "యొక్కయు" అని మూడు సార్లు వచ్చింది. యొక్కయు అంటే ఏమిటి? అదే "నామము యొక్కయు" అన్నమాట. దీనిని బట్టి అర్ధమయ్యేది ఏమిటంటే ఈ "యొక్కయు" అన్నదానిలోనే "నామము" అన్నది కూడా నిగూఢంగా ఉన్నది. దానిని understood అని అంటారు.
        పోనీ నమములోనికి అని ఏకవచనంతో తండ్రి కుమారా పరిశుద్ధాత్మలైన ముగ్గురూ సమవుజ్జీవులు అనుకుందాము. మరి ఇలాంటి వ్యాఖ్యానాన్ని ఆదిమ అపోస్తలులు ఎందుకు చెయ్యలేదు. పై ముగ్గురూ సమానం అని క్రీస్తుదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు అనే పద ప్రయోగం వారెందుకు చెయ్యలేదు. నేడు క్రీస్తు, పరిశుద్ధాత్మల ఆరాధన జరుగుతుంది. నాడు ఈ ఇద్దరి ఆరాధన ఎందుకు చెయ్యలేదు? క్రీస్తుతో నేటి మన సంబంధానికి ఆదిమ అపోస్తలుల ఆదర్శమే కొలబద్దకావాలి. ఎందుకంటే వారు క్రీస్తు పట్ల తమ ప్రత్యేక విశ్వాసం ఆధారంగానే క్రీస్తు ద్వారా ఆశీర్వదించబడ్డారు. ఆనాటి ఆర్తులు కావాలంటే - ఆనాటి అపోస్తవులు యేసును క్రీస్తుగా మరియు యెహోవాను మాత్రమే దేవునిగా నమ్మారు. నేడు మనం కూడా అలాగే నమ్మాలి. విశ్వసించాలి మరియు ప్రచారం కూడా చేయాలి. అప్పుడే మనకు రక్షణ.   (Next Page)
            1           2       3       4        5          6       7      8         9      10  

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine