• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-3

క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-3

3.యేసు స్త్రోత్రార్హుడైన దేవుడా?
                ఈయన (యేసు)వీరివారు; శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. 
                ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్త్రోత్రార్హుడై 
                యున్నాడు- ఆమేన్ -రోమా 9:5
   యేసు దైవత్వాన్ని నిరూపించడానికి ఉపయోగించే వాక్యాలలో పైన పేర్కొన్నదొకటి. ఈ వాక్యం ఎంతో స్పష్టంగా యేసును సర్వాధికారి అయిన దేవుడు అని ప్రకటిస్తుంది. ఇక యేసును దేవుడు అని నమ్మటానికి ఆలస్యం ఎందుకు? అన్నంత ఆత్రుతను మన క్రైస్తవ పండితులు ప్రదర్శిస్తుంటారు. ఇక్కడా వారి తొందరపాటుతనమే తప్ప వారు అనుకుంటున్నది పై వాక్యంలో ఏమీలేదు.
   బైబిలు ఒక ప్రాచీన గ్రంధం. అది ఎన్నెన్నో ఒడిదుడుకులను తట్టుకుని ఇప్పటికి మన వద్దకు చేరింది. ఒకప్పుడు అన్యుల ఘోరమైన దాడులలో తగలబడటం. తిరిగి ఎందరో ఎన్నెన్నో కష్టాలకోర్చి శ్రమించి ఆయా వ్యక్తుల నుండి కొన్నికొన్ని ప్రతులను సేకరించి వాటన్నిటినీ గ్రంధరూపం ఇవ్వటం అనేకసార్లు తటస్థించింది. మరోవైపు అనువాదాలు, వ్యాఖ్యానాల పరంపర వీటన్నింటిని అధిగమించేటప్పుడు అనువాద పరమైన వ్యాఖ్యానపరమైన కొన్ని తప్పులు సహజంగా దొర్లాయి. అలాంటి తప్పులలోని ఒక తప్పిదం కారణమే పైవాక్యం యేసు దేవుడనే అర్ధాన్నిస్తుంది. ప్రస్తుతం మనం చదువుతున్నది ప్రొటెష్టంట్ బైబిల్. ఇది గత 17వ శతాబ్దం నుండి మనకు దొరికింది. దీనికంటే ముందు ఉన్న క్యాధలిక్కు బైబిల్ అసలైనది. ఆ బైబిల్ నుండి సేకరించేటప్పుడే ఈ రోమా 9:5ను తప్పుగా లిఖించుకోవటం జరిగింది. అదే వాక్యాన్ని క్యాథలిక్ బైబిలులో గమనించగలరు.
                 వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవ రీత్యా వారి జాతివాడే.
                 సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడును గాక! ఆమెన్. 
                                                                                                 రోమా 9:5
     పై వాక్యాన్ని గమనించండి యేసు దేవుడు లెక స్తోత్రార్హుడు అనే అర్ధం ఏ మాత్రమైనా వస్తుందా? లేదే! అందుకే దేవుడైన యెహోవా తన గ్రంధాన్ని పరిశీలించి చదవమని యెషయా 34:16లో ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక బైబిల్ పాఠకుడు యేసు ఎవరు? దేవుడెవరు? అన్న ప్రశ్నలకు సరైన సమాధానం కోరుకుంటే బైబిల్ లోని అక్కడక్కడ వాక్యాలను తీసుకుంటే సరిపోదు. బైబిల్ ఇచ్చే పూర్తి సారాంశాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావాలి. అప్పుడే సత్యం ఏమిటో బయటపడుతుంది. అంతేగాని ఏదో ఒక మూలలో ఏదో ఒక వాక్యంలోని ఒక ప్రత్యేక ముక్కను పట్టుకుని దీనిని బట్టి యేసు దేవుడు అని నమ్మటం అలా ప్రచారం చేయటం ఘోరమైన పాపం అవుతుంది.
   రోమా 9:5 ప్రకారం యేసు నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు అనే విశ్వాసమే కనుక పౌలు కలిగి ఉంటే తన పద్నాలుగు పత్రికలలోని ప్రారంభవాక్యాలలో యెహోవాను దేవునిగా మరియు యేసును క్రీస్తుగా, ప్రభువుగా ఎందుకు పేర్కొంటాడు? ఉదాహరణకు ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.
               …మన తండ్రియైన (యెహోవా) దేవునినుండియు, ప్రభువైన యేసుక్రీస్తు
               నుండియు, కృపా సమాధానములు మీకు కలుగును గాక… -రోమా 1:2-7
    పై వాక్యంలో పౌలు దైవాన్ని మరియు యేసును వేర్వేరుగా ఎంతో స్పష్టంగా పేర్కొంటున్నాడు. ఒకవేళ ఆ యెహోవాయే యేసుగా రూపాంతరం చెంది వచ్చేసి ఉంటే కేవలం దేవుడైన యేసు కృప మీకు కలుగునుగాక! అని మాత్రమే చెప్పేవారు. ఒకవేళ రోమా 9:5లో యేసు స్తోత్రార్హుడైన దేవుడు అనే సత్యం పౌలుకు బయల్పడిందనుకుందాం. మరి ఆ తరువాత తాను రాసిన పదమూడు పత్రికలలోనూ రోమా పత్రికలో 1:2-7లోని వాక్యాన్ని తిరిగి ఎందుకు రాస్తాడు. ఉదాహరణకు ఈ క్రింది వాక్యాలను చదవండి.
               మన తండ్రియైన (యెహోవా) దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు 
               నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. -1.కొరింథీ 1:3
    ప్రతి పత్రిక ప్రారంభంలో పౌలు ఇదే విధంగా "తండ్రియైన దేవుని" మరియు "యేసు క్రీస్తు"ను పరస్పరం వేర్వేరుగా చూపి ఎంతో స్పష్టంగా రాసాడు. అంటే అతని దృష్టిలో యెహోవా దేవుడు మరియు యేసుక్రీస్తు వేరు వేరు, అయి ఉన్నారన్నమాట. అనువాదంలోని పొరపాటు కారణంగా రోమా 9:5లో పూర్తి బైబిల్ ఇచ్చే సందేశానికి వ్యతిరేకమైన యేసుదేవుడనే భావన ప్రకారం మనం నడుచుకుంటే- అది పూర్తి బైబిల్ సువార్తకు, యేసుబోధకు, ఆదిమ అపోస్తలుల విశ్వాసానికి వ్యతిరేకం అయిపోతుంది.
     సరే అయినప్పటికీ రోమా 9:5లో పౌలు చెప్పిందే నిజం అనుకుందాం. అటువంటప్పుడు పొలు, యేసును స్తుతించాలి కదా! అలా పౌలు యేసును స్తుతించినట్లు పౌలు వ్రాసిన 14 పత్రికలలో ఎక్కడైనా ఒక్కగాని ఒక్క వాక్యం కనిపిస్తుందా? లేదే! పైగా పౌలు ఎవనిని స్తుతిస్తున్నాడో ఈ క్రింది వాక్యాలలో గమనించగలరు.
               కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, 
               మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక
                                                                                         -1.కొరింథీ 15:57
               మా ద్వారా ప్రతి స్తలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను 
               కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో 
               ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. -2.కొరింథీ 2:14
               అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము 
               అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. -2.కొరిందీ 1:3
  పై వాక్యాలను పరిశీలించకుండానే పౌలు దృష్టిలో స్తోత్రార్హుడెవరో తేటతెల్లం అవుతుంది.(రోమా9:5లో) పౌలు, యేసును స్తోత్రార్హుడైన దేవుడు అని చెప్పి , ఆ తరువాత యెహోవా స్తోత్రార్హుడైన దేవుడు అని ఎందుకు ప్రకటిస్తాడు? పౌలు ఆ ప్రకటన కూడా ఎంతో విపులంగా వివరంగా -"కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి" అని ప్రకటిస్తున్నాడు. అంటే పౌలు యేసును స్తుతిస్తున్న కనీస అపోహ కూడా కలుగకుండా ఎంతో జాగ్రత్తగా కేవలం ఒక్క యెహోవా తండ్రికే స్తోత్రము చెల్లిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి రోమాలోని 9:5 వాక్యం అనువాదలోపమా? లేక పౌలు విశ్వాసమా? ఆదిమ అపోస్తలుల విశ్వాసం ప్రకారం యెహోవా తనను మాత్రమే స్తోత్రం చేసే జ్ఞానాన్ని మరియు యేసును పోలి నడుచుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక.ఆమీన్. (Next Page)     
   1         2      3        4          5          6         7        8          9        10   

7 Responses to "క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-3"

  1. శ్యామలీయం

    >ప్రశ్నలకు సరైన సమాధానం కోరుకుంటే బైబిల్ లోని అక్కడక్కడ వాక్యాలను తీసుకుంటే సరిపోదు. బైబిల్ ఇచ్చే పూర్తి సారాంశాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావాలి.

    భగవద్గీత విషయంలో నేను 'గీతలోనుండి అక్కడక్కడ శ్లోకాలను తీసుకుంటే సరిపోదు. గీయయొక్క పూర్తిగా అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి రావాలి' అన్న అభిప్రాయం వెలిబుచ్చితే రకరకాల విమర్శలు వచ్చాయి.

    1. Unknown

      ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఆ విషయానికి సంబంధించిన ముఖ్యమైనవి తీసుకుని ఒక నిర్ణయానికి రావచ్చు. ఎందుకంటే థార్మిక గ్రంధాలలో అనేక అంశాలుంటాయి. ఒకే అంశం ఉండదు. ఆ అంశానికి సంబంధించిన విషయాలను పరిగణలోకి తీసుకుని పరిశీలించుకుంటే సరిపోతుంది సర్. మీ మాటల ప్రకారం చూస్తే అసలు గ్రంథాలంటేనే దూరంగా ఉండాలి అనే విధంగా ఉంది. ఏదైనా ఒక విషయం చర్చకు వచ్చినప్పుడే దాని లోతుపాతులు తెలుసుకోవాలనుకుంటే వారు ఆ గ్రంథాలను అధ్యయనం చేస్తారు. ఇది కేవలం చర్చల వలనే జరుగుతుంది. కాని మీరు అర్ధం కాదు, అర్ధం కాదు అని సామాన్యులను థార్మిక జ్ఞానానికి దూరం నెట్టేస్తున్నారు. ఆ విషయం మీదే ముఖ్యంగా మీ మీద విమర్శలున్నాయి కాని మరో విషయంలో కాదని మనవి.ఒక వేళ మీరనుకున్న అభిప్రాయమే నిజమనుకుంటే ఇక ఏ ఆశ్రమంలో ఏ ఉపన్యాసాలు వినకూడదు. వినాలనుకుంటే మొత్తం భగవద్గీత వినాలి. సగం విన్నా సరిపోదు. బోధించేవారు మొత్తం భగవద్గీత కూర్చుని లేవకుండా బోధించేయాలి. వచ్చినవాళ్లంతా చచ్చినట్టు కదలకుండా ఒక్కసారే వినాలి. అప్పుడే మీరనుకున్నట్టు సారం అర్ధమవుతుంది.

    2. శ్యామలీయం

      మీరు తీవ్రంగా పొరబడుతున్నారు. నా ఉద్దేశం అది కాదు. కాని ఈ విషయంలో నాకు చర్చలు చేసే ఉద్దేశం లేదు. అస్థానపతితమైన నా వ్యాఖ్యను తొలగించండి. స్పందించినందుకు కృతజ్ఞతలు.

    3. Unknown

      మీ అభిప్రాయం అది కాకపోతే చాలా సంతోషం సర్. మీ అభిప్రాయాల పట్ల, మీపట్ల నేను ప్రత్యేక గౌరవభావం చూపుతాను సర్. మీరు తప్పకుండా చర్చలలో పాల్గొనాలని మనవి.

    4. శ్యామలీయం

      మీ అభిమానానికి కృతజ్ఞుడను. చర్చలలో నా మాటలవలన నాకూ ఉపయోగం లేదు, ఇతరులకూ ఉపయోగము లేదన్నట్లుంది కదా. ఎందుకు ఇతరులను ఇబ్బందిపెట్టి, నేనూ ఇబ్బంది పడటం? వీలైనప్పుడు నా బ్లాగులద్వారా నా అభిప్రాయాలను చెబుతాను, లేకుంటే భర్తృహరి చెప్పినట్లుగా జీర్ణమంగే సుభాషితం.

    5. Jai Gottimukkala

      చౌదరి గారూ, "కూర్చుని లేవకుండా" & "చచ్చినట్టు కదలకుండా" తరహా భాష అవసరమా?

    6. Unknown

      శ్యామలీయంగారి కామెంట్ కు ఆవిధంగా స్పదించాను తప్ప బాధ పెట్టే ఉద్దేశ్యం కాదు.అవి కేవలం మామూలు మాటలని అభిప్రాయపడుతున్నాను జై గారు!

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine