• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-5

క్రైస్తవపండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు-5

5.యేసు నిజమైన దేవుడా!?
         మనము సత్యవంతుడైన (యెహోవా) వానిని ఎరుగవలెనని దేవుని 
         కుమారుడు (యేసు) వచ్చి మనకు వివేకమనుగ్రహించి యున్నాడని 
         ఎరుగుదుము. మనము దేవుని (యెహోవా)కుమారుడైన యేసుక్రీస్తు
         నందున్న వారమై సత్యవంతుని(యెహోవా)యందున్నాము. ఆయనే 
         (యెహోవాయే) నిజమైన దేవుడును, నిత్యజీవమునైయున్నాడు.
                                                                      -1వ యోహాను 5:20
   పై వాక్యం విషయంలోనూ అధికశాతం క్రైస్తవపండితులు గలిబిలికి లోనైయున్నారు. "నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు" అనగా యేసు అనుకుని పొరబడుతుంటారు. వాక్యాన్ని కాస్త పరిశీలనగా చూస్తే అసలు విషయం స్పష్టం అవుతుంది. ఆ విధమైన ఆలోచన కలగటానికి కారణం యేసు (యోహాను 14:6లో) "నేనే సత్యమును" అని ప్రకటించి ఉన్నారు కనుక. కాని బైబిల్ ఒక విస్తారమైన గ్రంథం. ఒక లోతైన సందేశం కలిగి ఉన్న గ్రంథం. దాని పద ప్రయోగం విసృతమైనది. అంటే ఒకే పదం అనేకుల కొరకు ఉపయోగించబడి ఉంటుంది. దాని ఈ లక్షణాన్ని గుర్తించనివారు, దాని సరళ సందేశాన్ని వక్రంగా అర్థం చేసుకునే ప్రమాదం అధికంగా ఉండి. క్రైస్తవ సమాజం ఇప్పటికే అలాంటి గందరగోళానికి గురైపోయింది. కూడా! అందుకే క్రైస్తవ సమాజం విశ్వాసపరమైన వైరుధ్యాలకు గురైపోయి, మూడువేల సంఘాలుగా విడిపోయింది. నైతిక పతనానికి లోనైపోయింది. భావసారూప్యత లేని వర్గం అది ఎంత విస్తరించిపోయినా ఒకరోజు అంతర్గత కుమ్ములాటలతో రణరంగంగా మారిపోయింది. అందుకు క్రైస్తవ మేధావులు, పండితులు "వాసి"తో పాటు "రాశి"కి ప్రాధాన్యతనివ్వవలసి ఉన్నది. ఇతర వర్గాలలో ఉన్న విశ్వాసపరమైన అస్పష్టత,అనైక్యత, అనైతికత, అంతర్గత సంఘర్షణల వంటి చెడులన్నీ క్రైస్తవంలో కూడా ఉంటే ఇక, క్రైస్తవానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ముఖ్యంగా బైబిలులాంటి ఒక గొప్ప గ్రంధాన్ని కలిగి ఉండి కూడా క్రైస్తవానికి ఇలాంటి దుస్థితి దాపురించటం కడు శోచనీయం.
సరే పై వాక్యాన్ని విశ్లేషించుకుందాము. పై వచనంలో సత్యం లేక సత్యవంతుడు లాంటి పదాలు కారణంగా ఆ వాక్యంలో దేవుడు అని చెప్పబడుతున్నది యేసును గురించి అని అపోహ పడుతున్నారు కొందరు పండితులు. ఈ క్రింది వాక్యాన్ని గమనించండి.
              యేసు-నీవన్నట్టు నేను రాజునే; సత్యము (యెహోవా)ను గూర్చి సాక్ష్య
              మిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని 
                                                                                        -యోహాను 18:38
    ఈ పై వచనానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఇందులో యేసు జన్మమునకు గల మూల కారణం ఏమిటో స్వయంగా యేసు నోటనే చెప్పబడి ఉన్నది. యేసు పుట్టుకకు గల మౌలిక కారణం ఏమిటి? "సత్యము"నకు సాక్ష్యమిచ్చుట. ఏమిటి సత్యము? సత్యము అనగా సర్వసృష్టికర్త అయిన యెహోవా. అంటే యెహోవాను గురించి సాక్ష్యమిచ్చుటకు యేసు పుట్టారన్నమాట. దీని వివరణనే యేసు ప్రత్యక్ష శిష్యుడైన యోహాన్ (1యోహాను 5:20లో) "మనము సత్యవంతుడైన వానిని అనగా దేవుని (యెహోవాను) ఎరుగవలెనని యేసు వచ్చి మనకు వివేకమను గ్రహించియున్నాడని యెరుగుదం" అని చెబుతున్నాడు. ఇంకా ఆ వాక్యంలోనే - ఆ సత్యవంతిడే నిజమైన దేవుడు అని చెప్పటానికి కారణం ఏమిటి? అంటే…
             యెహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవముగల దేవుడు ఆయనే 
              సదాకాలమందు రాజు  -యిర్మియా 10:10
    పైవాక్యం ఆధారం చేసుకునే యేసు, యేసు అనంతరం యేసు శిష్యులు సువార్తను ప్రకటించారు. కాని నేడు ఈ పరంపరకు పూర్తి వ్యతిరేకంగా అసలుసిసలైన యెహోవా దేవుడిన్ని పూర్తిగా విస్మరించేసారు. యేసును అనుసరించవలసింది పోయి, ఆయనను దైవంగా ప్రతిష్ఠించుకున్నారు. ఇది నిజానికి యేసు బోధలకు పూర్తి విరుద్ధం. అయితే యేసుకు దైవత్వాన్ని ఆపాదించటానికి ఎన్నెన్నో ప్రయాసలు పడుతూ వారు, అందులో భాగంగానే 1వ యోహాను 5:20 వచనాన్ని తప్పుడు వ్యాఖ్యానం చేస్తుంటారు. దానికి కొందరు ప్రభావితులు కూడా అవుతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే, కొన్ని వాక్యాలు అటు దేవునికి మరియు ఇటు యేసుకు ఇంకా ఇతరులకు కూడా వర్తిస్తుంటాయి. అలాంటి కొన్ని వాక్యాలను తరువాతి పేజీలలో గమనించగలరు. (Next Page)
   1       2      3        4          5          6         7        8          9        10   

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine