• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » ARTICLES » Bible Articles » దేవుడు నరునిగా అవతరించాడా?

దేవుడు నరునిగా అవతరించాడా?

Label: ARTICLES, Label: Bible Articles

ఎప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే దేవుడిని అంటూ మీ అందరికోసం అవతరించానంటూ అనేకమంది స్వామీజీలు, బాబాలు ప్రకటించుకుంటూనే వున్నారు. అమాయక ప్రజలు ధార్మిక జ్నానం లేక, వైధిక శాస్త్రాల పఠనాశక్తి పొందక ఇటువంటి మాయల్లో పడి నిట్ట నిలువుగా మోసాలకు గురైపోతూనే ఉన్నారు. ఇవ్వన్నీ రూపుమాప బడాలంటే ధర్మం పేరిట సమాజమ్లో జరుగుతున్న వికృత చేష్టలకు అంతం రావాలంటే ప్రతి ఒక్కరూ, ఏ మత వర్గస్తుడైనా ధార్మిక గ్రంధాల పరిజ్నానం పొందాల్సిందే!
    నిజానికి దేవుడు నరునిగా వస్తాడా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఒకసారి ఈ క్రింది భగవద్గీత శ్లోకాన్ని చదవండి.
               అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ:
               పరం భావ మజానంతే వమామయ మనుత్తమం. గీత:7:24
భావం: నాశరహితమయినట్టియు సర్వోత్తమయినట్టియు,ప్రకృతికి పరమైనట్టియు నా స్వరూపము తెలియని అవివేకులు నన్ను పాంచభౌతిక దేహం పొందినవానిగా తలంచుచున్నారు.

గమనించాల్సిన విషయాలు:
  • ఆయన నాశరహితుడు
  • సర్వోత్తముడు
  • ఆ పరబ్రహ్మను పాంచభౌతిక దేహం పొందినవానినిగా తలంచుచున్నారు. ఎవరు అంటే అవివేకులు (అజ్ఞానులు) అని గీతాశాస్త్రం ఘోషిస్తోంది.
  • జ్ఞానులు దేవున్ని నరునిగా దేహం పొందాడని భావించరు.
  • మరొక అద్భుత విషయమేమిటంటే పంచభూతాలంటే 1.అగ్ని 2.నీరు 3.గాలి 4.భూమి 5.ఆకాశం. వీటిలో ఏది దేవుడు ధరించడు.
మరి ఇప్పుడు జరుగుతున్న ఆరాధన వీటికి సంబంధించిదే కదా! ఒకసారి ఆలోచించండి.
మరొక గీతాశ్లోకం చూడండి.
                యోమామ జమనాదిం చ వేత్తిలోక మహేశ్వరం
                అస్సమూఢస్స మర్త్యేషు సర్వపాపై: ప్రముష్యతే! గీత:10:3
భావం: ఏవడు నన్ను పుట్టుకలేనివానిగను, అనాదిరూపునిగను, సమస్త లోకములకు నియామకునిగను తెలిసికొనుచున్నడో అతడు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై సర్వ పాపముల నుండి లెస్సగా విడవబడుచున్నాడు.
  • దేవుడు జన్మ రహితుడు (పుట్టుకలేనివాడు)
  • అనాది-ఆది, అంతం లేనివాడు.
  • సమస్తలోకములను శాషించేవాడు.
     పై శ్లోకంలో ప్రధానంగా దేవున్ని జన్మరహితునిగా పేర్కొనబడింది. ఏవిధంగానూ ఆయన జన్మించలేదు. నిజానికి ఆయన జన్మనిచ్చేవాడే గాని జన్మించేవాడుకాదు. అందుకనే ఆయన అనాదిం: ఆది,అంతం లేనివాడిగా పేర్కొనబడింది.
   అందుకనే కాబోలు అర్జునుడు శ్రీకృష్ణులవారిని ఒక ప్రశ్న అడిగాడు.
   అర్జునుని ప్రశ్న: కిం తద్బహ్మ? దేవుడెవరు? గీత:8:1
   శ్రీకృష్ణుని జవాబు: నాశరహితుడైన సృష్టికర్త పరమందున్నాడు. గీత:8:3
   అంటే ఆ సృష్టికర్త ఈ సృష్టికి అతీతంగా పరమందున్నాడు. ఆయన భూమి మీదకు రాలేదు అనే విషయాన్ని చాలా చక్కగా మన వైదిక శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇదే విషయాన్ని యేసువారు కూడా చెప్పారు.
             భూమి మీద ఎవరికిని తండ్రి అని పేరు పెట్టవద్దు.ఒక్కడే మీ తండ్రి.
            ఆయన పరమందున్నాడు. బైబిల్ మత్తయి 23:9
మరొక బైబిల్ వాక్యం చూడండి.
            దేవుడు నిశ్చయంగా ఈలోకమందు నివాసం చేయడు. 1రాజులు 8:27
అలాగే ప్రవక్త(స) వారు కూడా తెలిపారు.
           అల్లాహ్ సప్తాకాశాల పైన పరమందున్నాడు.
   కాబట్టి మహాశయులారా! మన దేవుడైన ఆ సర్వేశ్వరుడిని జన్మరహితునిగా, చావుపుట్టుకలుకు అతీతునిగా, సమస్త లోకములకు నియామకునిగా విశ్వసిస్తూ ఇహలోకపు పుణ్యపురుషులను, మహనీయులను గౌరవిస్తూ… పంచేంద్రియాలకు అతీతుడైన ఆయనను మాత్రమే వేడుకోవాలి. ఇదే నిజమైన దైవ ఆరాధనా పద్ధతి!. 

20 Responses to "దేవుడు నరునిగా అవతరించాడా?"

  1. deepika gogisetty

    http://deepika-neerajanam.blogspot.in/2015/02/blog-post_26.html

    1. Unknown

      దీపికా గారు మీ బ్లాగు పోస్ట్ చూసాను.దానిలో నా అభిప్రాయాన్ని కూడా ఉంచాను.మరొక పోస్ట్ వివరంగా ఉంచే ప్రయత్నం చేస్తాను గమనించగలరు.

    2. hari.S.babu

      @ aurhor: మరొక అద్భుత విషయమేమిటంటే పంచభూతాలంటే 1.అగ్ని 2.నీరు 3.గాలి 4.భూమి 5.ఆకాశం. వీటిలో ఏది దేవుడు ధరించడు.
      Haribau:ఈ వాక్యంలో ఉన్న భావాన్ని ఒప్పుకుంటే ఈ పంచబూతాల్లో ఉన్నది ఏమిటి?దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఉండకపోవటం అంటే దేవుడు తనది కానిది దేన్నన్నా తస్కరించి సృష్టిని చేశాడా?

      అసలు ముస్లిములు దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఆ దేవుణ్ణి చూడడానికి ఎందుకు భయోత్పాతానికి గురి అయి అట్లా చూడటమే దేవుణ్ణి అవమానించటం అని వింతగా వాదిస్తున్నారు?

      నా వ్యాఖ్యానంలో అస్పష్టత ఉందనిపిస్తే ఇంకా విపులంగా అడగటానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఉండడు అంటే ఈ సృష్టి దేవుడిది కాని దేవుడికి సంబంధం లేని దేనితో సృష్టించబడినదని మీరు చెప్తున్నారు!

  2. Zilebi

    పాపం ! దేవుడు ! ఏకాకి !
    సోమరి ! కుమ్మరి ! బికారి !

    భామా జిలేబి , మత్స్యము
    నామము కూర్మపు వరాహ నరసింహమనన్!
    వామనుడు పరశురాముడు
    రామా! కృష్ణా! దశబల ! రమ్మా కల్కీ !

    @హరిబాబు గారు,

    మీరే మంటారు ?

    నారదా
    జిలేబి !

  3. hari.S.babu

    @author:మరొక అద్భుత విషయమేమిటంటే పంచభూతాలంటే 1.అగ్ని 2.నీరు 3.గాలి 4.భూమి 5.ఆకాశం. వీటిలో ఏది దేవుడు ధరించడు.

    haribabu:ఈ వాక్యంలో ఉన్న భావాన్ని ఒప్పుకుంటే ఈ పంచబూతాల్లో ఉన్నది ఏమిటి?దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఉండకపోవటం అంటే దేవుడు తనది కానిది దేన్నన్నా తస్కరించి సృష్టిని చేశాడా?

    అసలు ముస్లిములు దేవుడు స్ర్ష్టించిన సృష్టిలో అదెవుణ్ణి చూడడానికి ఎందుకు భయోత్పాతానికి గురి అయి అట్లా చూదటమే దేవుణ్ణి తిరస్కరించహ్టం అని వాదిస్తున్నారు?

    నా వ్యాఖ్యానంలో అస్పష్తత ఉందనిపిస్తే ఇంకా విపులంగా అదగటాంకి సిద్ధంగా ఉన్నాను.దేవుడు స్ర్ష్టించిన స్ర్ష్టిలో దేవుడు ఉండడు అంతే ఈ స్ర్ష్టి దేవుడికి సంబంధం లేని దేనితో సృష్టించబడినదని మీరు చెప్తున్నారు!

  4. hari.S.babu

    @author:జ్ఞానులు దేవున్ని నరునిగా దేహం పొందాడని భావించరు.

    haribabu:"అహం వైశ్వానరో.." దగ్గిర్నుంచి "నాల్గు విధములౌ వారు నన్ను భజింతు రర్జున.." అని ఎవరు ఎవరి గురించి చెప్పిన వాక్యాలో ఆ శ్లోకాల్ని కూడా సాక్షాలు చూపిచి చెప్తారా?

  5. hari.S.babu

    aurhor: మరొక అద్భుత విషయమేమిటంటే పంచభూతాలంటే 1.అగ్ని 2.నీరు 3.గాలి 4.భూమి 5.ఆకాశం. వీటిలో ఏది దేవుడు ధరించడు.
    Haribau:ఈ వాక్యంలో ఉన్న భావాన్ని ఒప్పుకుంటే ఈ పంచబూతాల్లో ఉన్నది ఏమిటి?దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఉండకపోవటం అంటే దేవుడు తనది కానిది దేన్నన్నా తస్కరించి సృష్టిని చేశాడా?

    అసలు ముస్లిములు దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఆ దేవుణ్ణి చూడడానికి ఎందుకు భయోత్పాతానికి గురి అయి అట్లా చూడటమే దేవుణ్ణి అవమానించటం అని వింతగా వాదిస్తున్నారు?

    నా వ్యాఖ్యానంలో అస్పష్టత ఉందనిపిస్తే ఇంకా విపులంగా అడగటానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఉండడు అంటే ఈ సృష్టి దేవుడిది కాని దేవుడికి సంబంధం లేని దేనితో సృష్టించబడినదని మీరు చెప్తున్నారు!

  6. hari.S.babu

    శిల్పాగమ శాస్త్రం అనేదాన్ని కూదా శిల్ప ఆగమన శాస్త్రం అని అంటున్న మీకు, సంస్కృతంలో ఓ అంటే ఢం రాని మీకు వైదిక సాహిత్యాన్ని అర్ధం చసుకోగలనన్న అహంకారం దేనికి?మీరు ముస్లిం అని మాకు తెలుసు! అసలు మీ మతం గురించి "మా మతంలో ఈ మంచి ఉంది" అని చెప్పి పాజిటివ్ ప్రచారం చేసుకోకుండా హిందూమతంలో విగ్రహారాధన లేదు/ హిందూమతంలో బహుదేవతారాధన లేదు/హిందూమతలో కూదా ఇస్లాం మతం ఉంది అని నిరూపించాలన్న నెగిటివ్ ప్రచారపు దురద ఎందుకు?

  7. hari.S.babu

    అసలు ముస్లిములు దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఆ దేవుణ్ణి చూడడానికి ఎందుకు భయోత్పాతానికి గురి అయి అట్లా చూడటమే దేవుణ్ణి అవమానించటం అని వింతగా వాదిస్తున్నారు?

    నా వ్యాఖ్యానంలో అస్పష్టత ఉందనిపిస్తే ఇంకా విపులంగా అడగటానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఉండడు అంటే ఈ సృష్టి దేవుడిది కాని దేవుడికి సంబంధం లేని దేనితో సృష్టించబడినదని ముస్లిములు చెప్తున్నారు!

    దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఉండకపోవటం అంటే దేవుడు తనది కానిది దేన్నన్నా తస్కరించి సృష్టిని చేశాడా?

    1. Anonymous

      మీప్రశ్న అసమంజసం.
      కురాను ప్రకారం అల్లాకు భూమిపై రాబవడానికి అనుమతి లేదు. ఆయనే రేరాజు.

    2. hari.S.babu

      @dairtyLog:కురాను ప్రకారం అల్లాకు భూమిపై రాబవడానికి అనుమతి లేదు. ఆయనే రేరాజు

      haribabu:నేను అడుగుతున్నది ఒకటి.మీరు చెప్తున్నది ఇంకొకటి.ఆయన రాజు కావటం గురించి కాదు నా సందేహం."""దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఉండకపోవటం అంటే దేవుడు తనది కానిది దేన్నన్నా తస్కరించి సృష్టిని చేశాడా?" అని మాత్రమే.

      P.S:దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఉండడు అంటే ఈ సృష్టి దేవుడిది కాని దేవుడికి సంబంధం లేని దేనితో సృష్టించబడినదని ముస్లిములు చెప్తున్నారు?!

    3. hari.S.babu

      @dirtylog:ఆయనే రేరాజు

      haribabu:ఇది మరొక జోకు:-) ఎందుకంటే రేరాజు అంటే చంద్రుడు.పదానికి అర్ధం రాత్రి కాలంలో మాత్రమే వెలుగుతూ అక్నిపిస్తాడు కాబట్టి.మరి అల్లాహ్ కూడా అంతేనా?

  8. Anonymous

    నాకు ఒక విషయం వివరైంచండి మహమ్మదు చౌదరి గారు, ఉదాహరణకి దేవుడు సూర్యుడిని మనకోసం స్రుష్టీంచాడు కాబట్టి సూర్యారాధన ఒద్దంటున్నారు, అదే దేవుడి మీకోసం ఖురాన్ స్రుష్తీంచాడు మరి దానిని కూడా సూర్యుడి లాగే చూడాలి కదా? మరి అల్లా తో సమానంగా ఎందుకు చూడాలి?

    అదేసమయం లో దీపిక గ్ఆరు అడిగిన ప్రశ్నకి ఇప్పటిదాకా జవాబివ్వకపోవడం డ్రుల్లల్ కాదు.

    1. Unknown

      నా పేరు k.s.చౌదరి..ఖురాన్ అల్లాః తో సమానంగా ఎవరూ చూడరు.ఒకవేళ చూస్తే అది అజ్ఞానమే అవుతుంది. దీపికగారు అడిగిన ప్రశ్నలకు చాలానే ఆర్టికల్స్ వచ్చాయి.గమనించగలరు.

    2. Anonymous

      మహమ్మదు లేక అహమ్మదు పేరులేని ముస్లింలెవరు? అదికామన్. మీరు చాలా అమాయకంగా మాట్లాడుతున్నరు.
      99.99% అల్లాతో సమానంగా కురాన్ని చుసేవాల్లే మనదేశంలోనె కాదు ఇస్లాం పుట్టిన అరబ్ దేశాల్లో కూడా అంతే. ఇంకాచెప్పాలంటే మా సర్కిల్ లో ముస్లీంలందరూ కురాన్ తో పాటుకగా కాబా బొమ్మని, పచ్చరంగ్uనీ కూడా చూస్తారు. ఆమధ్యన ఒక తమిళ ముస్లింఛానల్లో ఒకాయన అరబ్బీ దైవభాషని దాన్ని అవమానించకూడదంటరు.
      అయినా సూర్యారాధకులకు, మన అల్లారాధకులకు తేడా పెద్దలేదు. ఒకరు పగలు మరొకరు రాత్రి అంతే. కానీ ఒప్పుకోం.

  9. Anonymous

    సార్, మన సాక్య్ం లో ఇదివరకున్న రచ్చబండ అనే విభాగ్aం ఎటు మార్చారు?

    1. Unknown

      సర్ రచ్చబండను డిజైన్ చేయడం జరుగుతుంది.త్వరలో తెలియజేస్తాను.కృతజ్ఞతలు.

    2. Unknown

      @ K.S.Chowday

      మీరు ఇంతక్రితం డిజిటల్ ఎకనామి పై మోడి ప్రభుత్వం టాక్స్ వేస్తున్నాదని ఆందోళన చెందుతూ రాశారు. మీరు ఈ పత్రికను/బ్లాగు ను నడుపుతున్నారు కదా! మీకు గూగుల్/ బ్లాగు సంస్థల నుంచి నంబర్ ఆఫ్ క్లిక్స్ అధారంగా ఎమైనా డబ్బులు వస్తాయా? ఈ ప్రశ్న అడగటానికి కారణం అటువంటి టాక్స్ ల వలన బ్లాగర్లకు ఇబ్బందా?

    3. Anonymous

      నా తెలిసినంతవరకూ డబ్బులు వస్తై. కొన్నేళ్ళ క్రితం నేనూ పత్రిక నడిపాను, డబ్బూ కొంచెం సంపాదించానఉ.. కురాను ప్రకారం ఈరకంగా డబ్బు సంపాదించడం నేరం. నేను మన సాక్స్యం పత్రికని దాదాపు గత రెండేళ్ళుగా ఫాలో అవుతున్న. ఈ మధ్యన యాడ్స్ విపరీతంగా వస్తున్నై. లేఅవుటూ లోనూ బాగా ఇమ్ప్రొవె అవ్వాలి.

  10. Anonymous

    భగవద్గీత లో దేవుడు పుట్టడు అని చెప్పింది నిజమే కానీ భగవంతుడు పడతాడు. దేవుడికి ,భగవంతుడికి వ్యత్యాసం వుంటుంది. కానీ ఇద్దరు ఒక్కడే. అదే భగవద్గీతలోనే సంభవామి యుగే యుగే అని చెప్పాడని మరవద్దు.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine