• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » ARTICLES » హిందూ శాస్త్రుల కులతత్వాన్ని ఖండిస్తున్న హిందూ శాస్త్రాలు -1 : -ముహమ్మద్.యం.ఎ.అభిలాష్

హిందూ శాస్త్రుల కులతత్వాన్ని ఖండిస్తున్న హిందూ శాస్త్రాలు -1 : -ముహమ్మద్.యం.ఎ.అభిలాష్

Label: ARTICLES

థర్మ పరిరక్షణ జరుగుతున్నది పండితుల వలనే! అలాగే థర్మానికి చేటు కలుగుతున్నదీ పండితుల వలనే!! అందరిలోనూ మంచివారు-చెడ్డవారు ఉన్నట్లే, పండితులలోనూ మంచివారు,చెడ్డవారు ఉన్నారు. పండితులూ మానవమాతృలే కదా! థర్మపు యధార్థ స్వరూపాన్ని గ్రహించాలనుకొనే వారు చూడవలసింది శాస్త్రాల ప్రబోధనలనే గాని శాస్త్రుల వ్యాఖ్యానాలను కాదు. ఇది ప్రతి థార్మిక వర్గానికీ వర్తిస్తుంది. శాస్త్రుల తప్పుడు వ్యాఖ్యానాలనే శాస్త్రాల ప్రబోధనలనుకుని వాటిని దూషించడం తొందరపాటు తనమే కాక, అత్యంత అన్యాయం కూడా. అలాంటి వారిలో డా.బి.ఆర్.అంబేద్కర్ లాంటి మేదావీ ఉండటం కడు విచారకరం. హేతుబద్ధమైన, న్యాయవంతమైన సార్వ జనీన ప్రబోధనలను కలిగి ఉన్న థర్మ శాస్త్రాలను చేత పట్టుకుని తమ వర్గ ప్రయోజనాలకు అనుగుణంగా వాటిని తప్పుగా వ్యాఖ్యానించేవారు రెండు ఘోర నేరాలకు పాల్పడుతున్నట్లే. మొదటిది- తప్పుడు వ్యాఖ్యానం చేసే నేరం. రెండవది- దాని కారణంగా థర్మ శాస్త్రాల వంటి గొప్ప ఆధ్యాత్మిక సంపదకు మేధావులు దూరమైపోయే నేరం. వాటి నుండి త్వరగా బయటపడే సద్భుద్ధి అలాంటి నేరాలకు పాల్పడే శాస్త్రులందరికీ కలుగును గాక! తథాస్తు.  
         
             థర్మ గ్రంథాలు చెప్పెదొకటైతే, మత బోధకులు వ్యాఖ్యానించేది వేరొకటి! అన్న రీతిలో నేటి థార్మిక వ్యవస్థ నడుస్తుంది. దానికి బండ గుర్తు ఏమిటంటే - గొప్ప థర్మ గ్రంథాలు కలిగి ఉండి వాటిని నమ్ముతున్న ప్రజలు గొప్పవారు కాలేకపోవటమే! దానికి కారణం- గొప్ప ధర్మ గ్రంథాల గొప్ప సందేశమును సామాన్యులకు యథాతథంగా అందించని వంచకులు,స్వార్థపరులైన పండితులే! ప్రతి థార్మిక వర్గంలోనూ అటువంటి వారే అధిక శాతం తిష్ఠ వేసి ఉన్నారు. అలాంటి కోవకు చెందిన హిందూ పండితుల ప్రకారం -"మానవులు పుట్టుకతో అథికులు- అథములు అవుతారు!" అన్న తీర్మానం ఒకటి ఉంది.అయితే దానిని హిందూ శాస్త్రాలు అంగీకరిస్తున్నాయో లేక తిరస్కరిస్తున్నాయో ఈ క్రింది గమనించగలరు.
వేదం:
జనం మనుజాతం = అందరూ మను (ఆది మానవుని) సంతానం - ఋగ్వేదం 1:45:1
అజ్వేష్ఠాస: ఆకనిష్ఠాస: ఏతే భారత: = కొందరు పెద్దలు లేరు, కొందరు చిన్నలు లేరు, వీరందరు పరస్పరం సోదరులే. ఋగ్వేదం 5:60:5
ఉపనిషత్:
ఆ ప్రజాపతి ఒంటరిగా ఉన్నందున తృప్తినొందలేదు. అందువలన ఒక్కటిగా ఉండి వాడు ఆనందించుట లేదు. అతడు రెండవ దానిని కోరెను. అప్పుడతడు స్త్రీ పురుషుల ఇరువురి జంట ఎట్లండునో ఆ రీతిగా నుండెను. అనగా తనని రెండు భాగములు (అర్ధాంగి)గా చేసుకొనెను. అపుడతడే సతీపతి అనే ఇద్దరు వ్యక్తులుగా మారెను.కాబట్టి మనుష్యుడు చీల్చిన వెదురు బొంగు వలె ఉన్నాడని యజ్ఞవల్క రుషి చెప్పి యున్నాడు.అందుచేత పురుషుని యందుండి ఈ అర్ధభాగము స్త్రీ చే పరిపూర్ణం చేయబడెను. అట్లు ఆ స్త్రీ పురుషుల వలన మనుష్యులు జన్మించెను. -బృహదారణ్యక ఉపనిషత్తు 3:4:3
            క్రైస్తవ-ఇస్లాం థర్మ శాస్త్రాల ప్రకారమైతే మానవులంతా ఒకే జంట సంతానం. పైన పేర్కొన్న హిందూ శాస్త్రాల ప్రకారమూ మానవాళి యావత్తూ ఒకే జంట సంతానమని సుస్పష్టమవుతుంది. దీనిని బట్టి పుట్టుకతో ఒకరు "ఎక్కువ" మరొకరు "తక్కువ" అని ప్రకటించే హిందూ పండితుల ప్రకటనను హిందూ శాస్త్రాలు తిరస్కరిస్తున్నట్టే కదా! అంటే - జన్మత: ప్రజలు నిమ్నోన్నత స్థితులను కలిగి ఉంటారనేది కొందరు జాత్యాహంకారులు సృష్టించిన ఒక కాల్పనిక వర్గీకరణ మాత్రమేనని తెలుస్తుంది. (Next Page.)

3 Responses to "హిందూ శాస్త్రుల కులతత్వాన్ని ఖండిస్తున్న హిందూ శాస్త్రాలు -1 : -ముహమ్మద్.యం.ఎ.అభిలాష్"

  1. durgeswara

    నీ బొంద. అతి తెలివితేటలు. నీ పథకము నీది...... కానియ్

  2. Chiru Dreams

    అతుకులతెలివితేటలు అని మీ గురించి హరిబాబుగారు అంటే ఏంటో అనుకున్నా.. నిజమే సుమీ....

  3. Aravind

    తమరి ఆర్టికల్స్ ఆలోచనాత్మకంగానే ఉంటాయ్.మీరు మరిన్ని విషయాలు వ్రాయండి.బ్రాహ్మణ పైత్యం గాళ్ళను పట్టించుకోవల్సిన్దేమీలేదు.వారు ఇప్పటివరకూ మమ్మల్ని వెధవల్ని చేసింది చాలు.ఇక అంత దద్దమ్మలు లేరు.నాకు ఇప్పటివరకు హిందుబుక్స్ చదవలేదు.మీరు వ్రాస్తున్న విషయాలు తెలుస్తుంటే చదవాలన్న కుతూహలం ఆసక్తి కలుగుతుంది. వారు చేయవలసింది మీరు చేస్తున్నరు.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine