• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » ARTICLES » విగ్రహారాధన- మహామోసం!-మహాదోపిడి!! -1

విగ్రహారాధన- మహామోసం!-మహాదోపిడి!! -1

Label: ARTICLES

8 Responses to "విగ్రహారాధన- మహామోసం!-మహాదోపిడి!! -1"

  1. durgeswara

    భ్రాంతికి లోనవటం అన్ని విషయాలలోనూ అమ్దరిలోనూ జరుగుతుంది. యానమ్దులవారు తనకున్న మానసిక వ్యతిరేకతలను,తానుచూసిన స్థలంలో గల కొన్ని విషయాలను సార్వజనీనంగా చెప్పచుశారు. అయినా అహైమ్దవ సమాజం ఆయన చెప్పిన వాటిలో మంచినిమాత్రమే గ్రహించి చెడును వదిలివేసింది . ఆయనను వ్యతిరేకించి అంతచేయాలనే మూర్ఖత్వానికి దిగజారలేదు. అది ఈ ధర్మం లో బోధింపబడదు.
    అమ్దువలనే అవి పుస్తకాలలో ఉండిపోయాయి మనసులకెక్కలేదు.

    ఇక విగ్రహమంటే చిహ్నం. ఓ గుర్తు / మనస్సును పరమాత్మవైపు మల్లించటానికి అనేకరూపాలలో అన్ని మతాలలో ఉంది. హిందువులకు, విగ్రహాలు, ముస్లిములకు నెలవంక, కాబాస్టోన్ ,ఇంకా మక్కా మమ్దిరమనే ఓగుర్తు, అలాగే క్రైస్తవులకు శిలువ . ఇవన్నీ ఏదో ఒక పదార్ధం తో చేయబడినవే. కాకుంటే ఎవరి పిచ్చి వారికానందమని ఎవరి విషయంలో వారు మాది మాత్రమే సత్యమని భీష్మించుకుంతారు. నేను నమ్మినది మాత్రమే సత్యం, నేనుచూపినదే దారి అనేచైతన్యరాహిత స్థితిని ఈ ధర్మం ఒప్పుకోదు. మనిషి యొక్క ఆథ్యాత్మిక స్వేఛ్ఛకు హద్దులు విధిమ్చదు.
    ఇక భగవంతుడేక్కడవుంటాడు? ఎక్కడొ ఆకాశంలో మబ్బుల చాటున ఓ ప్రదేశానికి మాత్రమే పరిమితమయ్యే వానిగా ఈ ధర్మం భావించదు. అన్నింటా నిండి ఉండగల సర్వశక్తిశాలి భగవంతుడు అనే సత్యాన్ని, ఆయన అనంతగునగణాలను నమ్ముతుంది ఈ మార్గం. అలాకాదు నేనిలా నే ఉంటానన్నా అభ్యంతరపెట్తదు. ఎదో ఒక భావనతో పరమాత్మ వైపు మళ్లతం మాత్రమే కోరుకుంటుంది.
    ఇక ఈ మార్గాలన్నింిలో ను కలి ప్రభావం వలన జరిగే చెడులు ఆయా ధర్మాలవి కాదు. మనుషుల బుధ్ధిహీనతద్వారా సంభవించేవి. అందుకే నెతి నేతి అని ముందుకు వెళ్లమంటుంది వేదం. పరదూషణ ఆపి గవంతుని పట్ల ప్రేమపెంచుకుంటే నీకు అన్యమెమీ కనపడదు. అంతా నీవారే.అన్నీ నీవే . ఈవిశ్వప్రేమవైపు మల్లమంటుంది ఈధర్మం మానవులను.
    ఇక ఇలా ఎలా అన్న వ్రర్ధచర్చలవల్ల ప్రయోజనముందా? ముందు మనమార్గంలో మనం భగవ్ద్దర్శనం పొందాక అది తప్పు ఇది తప్పు అని విమర్శిద్దాం
    జైశ్రీరాం

    1. Jai Gottimukkala

      "ముస్లిములకు నెలవంక, కాబాస్టోన్ ,ఇంకా మక్కా మమ్దిరమనే ఓగుర్తు"

      ఒకప్పుడు ముస్లిములు జెరూసలేం వైపు తిరిగి ప్రార్తనాలు చేసేవారు. అప్పటిలో మహమ్మద్ ప్రవక్తకు యూదులకు సత్సంబంధాలు ఉండేవి. మక్కా కాబా అంతకముందు విగ్రహారాధనకు అంటక ముందు ఆలవాలం. యూదులతో ముస్లిములకు సంబంధాలు చెడ్డ తరువాత కిబ్లా కాబా వైపు మార్చడం జరిగింది.

    2. Unknown

      దుర్గేశ్వర్ గారికి నమస్కారాలు!
      శివుని విగ్రహం వద్ద ఎలుక చేష్టల సంఘటనతోనే బాల దయానందునికి జ్ఞానోదయం అయ్యింది. అక్కడ ఆయనకు కలిగింది “భ్రాంతి”కాదు. వాస్తవానికి “భ్రాంతి” పోయి, “జ్ఞానం” కలిగింది. ఆయన చేప్పింది, వ్రాసింది ఆయన గురైన భ్రాంతి కారణంగా కాదు, ఆయనుకు తనకు కలిగిన “జ్ఞానం” కరణంగానే- “కార్యాకారణ సిద్ధాంతం” ఆధారముగా “వేదశాస్త్రాల వేలుగు”లో “పూర్తి వివేచన”తో ఆయన తన రచనలు చేశారు. ఆయన “భ్రాంతి”లో ఉన్నరని మీరు చెబుతున్నారు. సర్వసమర్ధుడైన సర్వోన్నత ఏకైక సృష్టికర్తతో “ప్రత్యక్ష్య” సంబంధాన్ని పెట్టుకోవాలన్న సత్యాన్ని గ్రహించలేక, నిశ్చేష్టమైన నిస్సహాయమైన “సృష్టితాల”ను వేడుకొనేవారే అసలు “భ్రాంతి”లో ఉన్నరన్నది మీరు గ్రహించాలి!
      పైగా మీలాంటివారు ఆయనను ఎదో దయతలచి వదిలేసి, ఆయనను ఆదరించింట్లు చెప్పుకొచ్చారు. ఆయన మరణం ఎలా సంభవించినదో మీకు తెలియదేమో కానీ, లోకానికి తెలుసు. ఆనాడు దయానందుడు అతి దుర్మార్గపు విగ్రహారాధనపై వైదిక ఆధారాలతోనే కాక, హేతుబద్ధమైన ఆధారాలతో చేసిన దాడితో తమ పేకమేడ లాంటి ఈ విగ్రహారాధనా వ్యవస్థ కూలిపోతే, తాము కనీసం భిక్షం ఎత్తుకోవటానికి సైతం పనికిరాము అనే ఆందోళనతోనో లేక విగ్రహారాధన వేదవిరుద్ధం అని ప్రజలకు తేలిసిపోతే ప్రజలు వీధులలో పరుగులు పెట్టించి మరీ తమను చంపేస్తారనే భయముతోనో, స్వయంగా ఆయన శిష్యుడితోనే ఆయనకు విషం పెట్టించి హత్య చేశారు మీ విగ్రహారాధనా వ్యవస్థ ధ్వజవాహకులు! ఈ విషయం మీకు తేలియాదో లేక మీకు తెలిసినా ఇతరులకు తెలియదని మీరు అనుకుంటున్నారో నాకు తేలియటం లేదు!!

      విగ్రహం అంటే ఏముంది ఒక చిహ్నం లేక గుర్తు అని మీరు సెలవిచ్చారు! మన పూర్వీకులు ప్రాచీన కాలంలో కనిపెట్టిన “సమాచార సాంకేతిక పరిజ్ఞానం”. దానినే “శిల్ప ఆగమన శాస్త్రము” అని వ్యవహరిస్తారు. నేటి ఆధునిక కాలములోనూ వాటి సహాయము లేకుండా మన మనుదడ సాగాదు. నేటి పరిభాషలో వాటినే- “ఇకాన్స్” అని అంటారు.
      సర్వసమర్ధుడైన సర్వోన్నత ఏకైక సృష్టికర్త కలిగి ఉన్న “సృష్టి-స్థితి-లయ” శక్తులను “స్ఫూరింప”జేసే చిహ్నాలే లేక గుర్తులే (ఇకాన్స్) బ్రహ్మా-విష్ణూ-మహేశ్వర విగ్రహాలు. అలాగే ఇతర విగ్రహాల పరిస్థితీనూ.
      ఉదాహరణకు: శ్రీరాముని విగ్రహమును చూచిన వ్యక్తిలో “త్యాగ శీలత” వంటి “పరివర్తన” కలగాలంటే- ఆయన తన సవతి తల్లి కొరకు సవతి తమ్ముని కొరకు చేసిన “త్యాగ శీలత”ను “స్ఫురణ”కు తెచ్చుకొని దానిని ఆచరణలో పెట్టాలనే “దీక్ష”ను బూనాలా? లేక ఆయన విగ్రహాన్ని చూచిన వ్యక్తి దాని వద్దకు వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే, నైవేద్యం పెడితే, క్షీరాభిషేకం చేస్తే, తైలాభిషేకం చేస్తే లేక దణ్ణం పెడితే ప్రయోజనామా?
      మొదటి పద్ధతి వలన “భక్తునికి లాభము”. రెండవ పద్ధతి వలన “పూజారికి లాభము”. అందుకే నేటి “విగ్రహారాధనా పూర్వక అధ్యాత్మిక విధానం” వలన “ప్రజలు భక్తిపరులైన నేరస్థులు” ఆవుతున్నారు! “పూజారులు శ్రమరహిత ధనికులు” అవుతున్నారు!!
      తరువాత ఎవడి పిచ్చి వాడికి ఆనందం అని మీకు శెలవిచ్చారు. అంటే, ఇలోకంలో ఒక వ్యక్తి తన సృష్టికర్త విషయములో ఎలాంటి- “హక్కులు-బాద్యతలు” కలిగి ఉండాలో ఇంకా- ఒక వ్యక్తి తన తోటి వ్యక్తులతో ఎలాంటి- “హక్కులు-బాద్యతలు” కలిగి ఉండాలో అన్నదానికి ఎలాంటి నియమ నిబంధనలూ ఉండవంటారా? ఇదంతా ఒక గ్రుడ్డిదర్బారంటారా?
      మనిషి చేసే ఏ సామాన్యమైన పనికైనా “హద్దులు-సుద్దులు” ఉంటాయి కదా! అటువంటప్పుడు “అధ్యాత్మికత” వంటి ఒక ఉత్కృష్ఠ కార్యానికి “హద్దులు-సుద్దులు” ఉండవా దుర్గేశ్వర్ గారూ!
      చేడులు “కలి ప్రభావం” వలన కలుగుతున్నాయి! అని తమరు సెలవిచ్చారు. కనుక చెదులకు పాల్పడేవారికి అటు దేవుడుగానీ ఇటు ప్రభుత్వంగాని శిక్షించకూడదు! ఎందుకంటే- అతడు చేసిన చెడులకు కారణము అతని “ఇచ్ఛ” కాదు. “కలి ప్రభావం” కనుక!!
      ముందు మనం భగవద్దర్శనం పొందాక విమర్శించుకుందాం అన్న సలహా ఒకటి మీరు ఇచ్చారు. దీనిని బట్టి- మీరు “విమర్శ”కు మరియు ‘వివరణ”కు వ్యత్యాసాన్ని గుర్తించ లేదనుకుంటున్నాను. మేము “విగ్రహారాదన”ను విమర్శించటం లేదు. “విగ్రహారాధన” శాస్త్రబద్ధమే అనటానికి ఏదైనా ఆధారం ఉంటే- హిందూ శాస్త్రాలనుండే చూపందని సవినయముగా కోరుకుంటున్నాము. దానిని మీరు “విమర్శ” అని తప్పించుకుంటే ఏలా దుర్గేశ్వర్ గారూ!
      ఈ లాంటి- నిరాధారనైన విషయాలను అత్యంత బాధ్యతగల వ్యక్తులు చెబుతున్నందుకే సామాన్య వక్తుల వ్యక్తిత్వాలు సర్వనాశనం అయిపోతున్నాయి దుర్గేశ్వర్ గారూ! మన సమాజం ఇంకా ఇంకా భ్రష్టు పట్టిపోకుండా ఉండాలంటే- వేద విరుద్ధమైన-హేతు విరుద్ధనైన దృక్పథాలకు తిలోధకాలిచి, శాస్త్రాధారమైన-హేతుబద్ధమైన దృక్పథాలను మాత్రమే గైకొని నైతికముగా కూలిపోతున్న మన సమాజాన్ని మనము కాపాడుకుందాము. మీరేమంటారు దుర్గేశ్వర్ గారూ!?

  2. Unknown

    శ్రీ అభిలాష్ గారికి,
    ఆర్యా! మీరు ఒక ముస్లిం అయ్యుండి సర్వమతసమజనీనం కోసము మీరు సల్పుతున్న కృషి అభినందించదగ్గది, ఆహ్వానించదగ్గది.
    పైన దుగ్గేశ్వరరావు,జై గొట్టిముక్కలగార్లు అడిగిన సందేహములు నాకు యున్నవి. తమ ముస్లిం మిత్రులు నెలవంకను ప్రామాణికంగా తీసుకోవడం, కాబా స్టోనును ముద్దాడటం, మక్కా మందిరము వైపునకు తిరిగి ప్రార్ధనలు చేయడం ఎందుకు చేస్తారు. నా సందేహ నివృత్తి చేయగలరు. ఇవ్వన్నియూ విగ్రహారాధన క్రిందకు రావా? వీటికి మీ థర్మ శాస్త్రములు ఏమని చెప్పుచున్నవి? నా సందేహములను మన్నించగలరు.

    1. Jai Gottimukkala

      శర్మ గారూ, అప్పటి అరబ్ దేశంలో ఇవన్నీ సర్వసామాన్యమే. కాబా యాత్ర ఇస్లాం కంటే ముందటి నుంచి ఉన్నదే. వీటిని మార్చేంత సాహసం మహమ్మద్ చేయలేదు అని అనుకోగలం.

      విగ్రహారాధన మరియు బహుళ దేవతా సంస్కృతికి మహమ్మద్ వంశం వారు ఎప్పుడూ ఒప్పుకోలేదని ఒక వాదన ఉంది. వీరినే రాయిపై తల కొట్టని వారు (पत्थर पे माथा नहीं मारा) అని కూడా అంటారు. ఈ వంశ చరిత్ర నిజమో కాదో తెలీదు కానీ ఇటువంటి వారు < 622 (హిజ్రా) ముందు చాలా తక్కువ అని మాత్రం చెప్పగలము.

      మీరు షైతాన్ పద్యాలు (satanic verses) గురించి వినే ఉంటారు. వీటిని ఉటంకించినందుకు సల్మాన్ రష్దీ గారిపై ముస్లిములు "మరణ దండనం" విధించారు. అల్లత్, మనత్ & ఉజ్జా అనే దేవతలను మక్కా ప్రాంతీయులు పూజించే వారు. వీరిని ఆ స్థాయి నుండి తొలిగించే ప్రయత్నం మహమ్మద్ ప్రవక్తకు చాలా కష్టాలను తెచ్చింది.

    2. Unknown

      గోపాల్ శర్మ గారికి నమస్కారములు!
      “ఒక ముస్లిముగా “సర్వమతసమజనీనం” కోసము మీకు సలుపుతున్న కృషి అభినందించ దగ్గది, ఆహ్వానించదగ్గది” అని మీరు నన్ను ప్రశంసించినందుకు మీకు నేను కృతజ్ఞుడిని! సకల ఘనతలూ స్తోత్రాలూ సరోన్నతుడైన ఏ ఏకైక సర్వేశ్వరునికే చెందుతాయి.
      ముస్లిము అనగా ‘’దైవ విధేయుడు’’ అనే అర్థము. ఇస్లాం అనగా ‘‘దైవ విధేయత” అనే అర్థము. ఇక, మనిషి ప్రవృత్తులు రెండు. వాటిలో ఒకటి- అనుకూలమైనది (విధేయతాపూర్వకమైనది). ఇదే “దైవ ధర్మము” అనగా “దేవునికి ఇష్టమైన ప్రవర్తనా విధానము” రెండవది- ప్రతికూలమైనది (అవిధేయతాపూర్వకమైనది). ఇదే “అ ధర్మము” అనగా “దేవునికి అయిష్టమైన ప్రవర్తనా విధానము”. తనలోనే ఉన్న ఈ రెండు చిత్త ప్రవృత్తులలో మనిషి తన స్వాభిష్టంతో దేనిని “నియంత్రణ” చేస్తాడు? మరియు దేనిని “వికాస” పృస్తాది? అన్నదే మనిషి జీవితానికి అసలు “పరీక్ష”. సర్వసృష్టికర్త అయిన ఆ సర్వేశ్వరుడు, “మంచి-చెడు” అనే ఈ రెండు విధానాలను-
      1. ప్రతీ మనిషి మస్తిష్కంలోనే నిక్షిప్తం చేసి ఉంచాడు. అందుకే- ఆస్తికుల నుండి నాస్తికుల వరకు “మంచి-చెడు”ల నియమాలు కొద్దిపాటి వ్యత్యాసముతో సమాంతరముగానే ఉంటాయి.
      2. ధర్మశాస్త్రాలలోనూ “మంచి-చెడు” అనే ఆ రెండు విధానాలను పెట్టాడు. అందుకే వివిధ ధార్మిక వర్గాలలో “మంచి-చెడు”ల నియమాలు కొద్దిపాటి వ్యత్యాసముతో సమాంతరముగానే ఉంటాయి.
      అంటే- “దైవ ధర్మము”-“అ ధర్మము” అనగా “మంచి”-“చెడు” అనే ఈ రెండు మార్గాలూ అనాది నుండీ ఉన్నవే! ఎప్పుడెప్పుడైతే మానవాళిలోని తెలివైన నిర్దాయులూ వంచకులూ అయిన అతి కొద్ది మంది తమ వ్యక్తిగత లేక వర్గపరమైన స్వలాభం కొరకు సామాన్యులూ అమాయికులూ అయిన అధికశాతం ప్రజమను ధర్మ అవగాహనలేని ఆజ్ఞానులుగా మార్చి, వారిని పాపిష్టి వారీగా మార్చిన కారణముగా అధర్మము విజృభించి, ధర్మము మందగించి పోయినప్పుడెల్లా, మనుషుల హృదయాలలో “మసక బారిపోయిన” ఆ పాత ధర్మమునే ధర్మశాస్త్రాలలో “మరుగున పడిపోయిన” ఆ పాత ధర్మమునే అదే సమాజానికి చెందిన ఒక ఉత్తమ వ్యక్తిని ఎన్నుకొని, అతనిపై తన ఆ ప్రాచీన “మంచి”-“చెడు” సమాచారాన్నే తిరిగి ఆ వ్యక్తి ద్వారా పునరుక్తం చేసే వాడు. ఈవిధంగా మానవ జన్మ ప్రమార్ధాన్ని మానవాళి స్ఫురణకు తీసుకురావటం జరుగుతూ ఉండేది. అందుకే అనేక మంది ఋషులు, ప్రవక్తలు మరియు అనేక ధర్మశాస్త్రాలూ రావాటం జరిగింది.
      ఇదే విషయాన్ని మన గీతాశాస్త్రం 4:1-3శ్లోకాలలో- “ఈ యోగము (మానవుడు-మాధవుడు భావపరముగా ఏకమయ్యే విధానము) ను పూర్వము నేను సూర్యునికి (అదిమానవునికి) ఉపదేశించితిని. తరువాత వైవస్వత మనువునకు ఆ తరువాత ఇక్ష్వాకునకు ఇంకా రాజ ఋషులకు ఉపదేశించాను. అది ఇపుడు లోకమున అదృశ్యమై ఉన్నందున ఓ అర్జునా! ఇప్పుడు నీకు బోధించుచున్నాను.” అని ప్రకటించబడుతుంది.
      ఇదేవిధంగా యేసు- మత్తయి సువార్త 5:17 వ వాక్యములో- నేను ధర్మశాస్త్రము (మోషే ద్వారా వచ్చిన గ్రంధము) అయిననూ పవక్తల వచనములైననూ నేర్వేర్చుటకేగాని కొట్టివేయుటకు నేను రాలేదు”. అని తెలియజేస్తున్నారు.
      అలాగే ఖురానులో- 42:13 వ వాక్యములో- “ఇదే విధముగా ఆదిలో నూహ్ (మహా ఋషి మనువు) కు బోధించిన ధర్మమునే అబ్రాహామునకు బోధించాను. దానినే మోషే మరియు యేసులకూ బోధించాను. ఆదే ధర్మమును ఓ ముహమ్మద్ నీకూనూ బోధిస్తున్నాను!” అని అల్లాహ్ ఖురాను గ్రంధములో ప్రకటిస్తున్నాడు.
      దీనిని బట్టి ఒక ముస్లిముగా నేనే కాదు, ప్రతీ ముస్లిమూ, ప్రతీ మనిషి హృదయములో “మసక”బారి ఉన్న “ధర్మము”నే అలాగే, ప్రతీ మత వర్గము వారి ధర్మశాస్త్రములో “మరుగు”న పడి ఉన్న “ధర్మము”నే చెప్పాలి తప్ప, తమ దగ్గరున్న ఏదో క్రొత్త రంగును తీసుకొనివచ్చి ధర్మము పేరిట ఎదుటివారి నెత్తిన రుద్దతానికి పయత్నించ కూడదుకదా గోపాల్ శర్మగారూ! మూసిములే కాదు, హిందువులూ క్రైస్తవులూ అదే చేయాలి. కనుక నేను ఆదేచేస్తున్నాను. ఇందులో నాగొప్పతనము ఏమీలేదు. ఎందుకంటే- మనలోని ప్రతి ఒక్కరి దగ్గరా ఉన్న ధర్మశాస్త్రాలలో “సత్య ధర్మము” ఉన్నది! కాకపోతే మనలోని ప్రతి ఒక్కరూ దానికి దూరముగా ఉన్నాము!!
      ఇక, ముస్లిముల నెలవంక ప్రాధాన్యత విషయానికి వస్తే- ముస్లిముల ధార్మిక “కేలండరు” సూర్యమానము కాదు. చాంద్రమానము. కనుక వారు తమ పండుగలూ, పబ్బాలకు చెందిన విషయాలను దాని ఆధారుముగానే నిర్వహించుకుంటారు. కనుక కేవలము ఆవిధమైన సంబంధము కారణముగా మాత్రమే నేలవంకతో ముస్లిములకు సంబంధము ఏర్పడింది. ఆ ఒక్క సంబంధము తప్పితే మరోవిధమైన ఏ సంబంధమూ నేలవంకతో ముస్లిములకు లేదు.

    3. Unknown

      పైదానికి కొనసాగింపు:
      ఇక, కాబా స్టోన్ విషయానికి వస్తే- బైబిలు-ఖురాను గ్రంధాల ప్రకారం- మనందరి అది పితామహుడైన “ఆదాము”. మన హిందూ శాస్త్రాల ప్రకారం- శంకరుడు. స్వర్గ లోకము నుండి భూలోకానికి వచ్చేటప్పుడు దానిని స్వర్గం నుండి తేచ్చుకున్నాడని ఒక అభిప్రాయము ఉంది.
      మహోదయుడైన మన ఆదిమ తండ్రి, సర్వోన్నతుడైన మన ఏకైక సృష్టికర్తను ఆరాధించుకోవటానికి చతుర్స్రాకారము లో ఒక ఆలయాన్ని నిర్మించినప్పుడు ఆ “హిజ్రే = రాయి, అస్వద్=నల్లని” అనగా “నల్లని రాయి”ని ఒక మూలన అమర్చి పెట్టినట్లు చరిత్ర చెబుతుంది. నోవాహు జల ప్రయాళయంలో అది కప్పబడిపోయింది. తిరిగి అబ్రాహాము-ఇష్మాయేలు ద్వారా పునరుద్ధరించబడింది.
      అటు ఆదాముగాని ఇటు అబ్రాహాము-ఇష్మాయేలుగాని వందశాతమూ ఏకేశ్వరోపాసకులే అన్నది లోకవిదితం! అబ్రాహాము-ఇష్మాయేలు అనంతరం- చాలా కాలం తరువాత వారి సంతతికి చెందిన అధిక శాతం ప్రజలు “విగ్రహారాధకులు”గా మారిపోయారు. స్వచ్ఛమైన ఏకేశ్వర ఆరాధన కొరకు మాత్రమే నిర్మించబడిన “బాకా” లేక “కాబా” మందిరములో సుమారు 365 విగ్రహాలను పెట్టి పూజించటం ప్రాంభించారు. అంతటి అజ్ఞాన కాలములో సైతం ఆ “హిజ్రే అస్వద్”ను అరబ్బులు పూజించటంగాని మ్రొక్కటంగాని చేసిన దాఖలా చరిత్రలో ఎక్కడా లేదు.
      చతుర్స్రాకారముగా ఉన్న ఆ ఆలయం చుట్టూరా 8 సార్లు “ప్రదక్షణము” చేయాలి. దాని ప్రారంభ “గురుతు”గా మాత్రమే దానిని నేడు ఉపయోగిస్తున్నాకు. ఆ “నల్లని రాయి” ఉన్న మూల నుండి “ప్రదక్షణము” చేసే మైదానములో నేలపై ఒక నల్లని పట్టీ ఉంటుంది. దాని నుండి “ప్రదక్షణము”ను ప్రాంభిస్తారు. అంతకుమిన్చి ఇస్లాంలో ఎలాంటి ప్రాముఖ్యతా లేదు. ఇదీ ఇస్లాంలో కాబా స్టోన్ వినియోగము, స్థానమూ!
      తరువాత, కాబా మందిరమునకు అభిముఖముగా ప్రార్ధన ఎందుకు చేస్తారన్నది. ఖురానులో 2:142-152 వాక్యాలమధ్య దానికి సంబంధించిన ఆదేశము, కారణాలూ ఉన్నాయి. ఒక క్రమ శిక్షణ కొరకు అన్నదే ప్రధానంగా చెప్పబడింది. మీ ముఖాన్ని ఎటు త్రిప్పినా అల్లాహ్ (సర్వేశ్వరుని) సమ్ముఖము లభిస్తుంది, ప్రాక్పశ్చిమాలన్నీ అల్లాహ్ (సర్వేశ్వరుని) వే అని ప్రకటించబడింది. అందుకే ప్రయాణ సమయాలలో వాహనాల్లో ఉన్నప్పుడు ఎటు సౌకర్యము ఉంటే అటే ముఖము పెట్టి ముస్లిములు ప్రార్ధన చేసికుంటారు. కాబా మందిరమునకు అభిముఖముగా ప్రార్ధన చేయటానికిగల కారణము. గోపాల్ శర్మగారూ శెలవు!

    4. maro prasthaanam

      కాబా కు ప్రదక్షిణ చేయటం విగ్రహారాధన క్రిందకు ఎలా రాదో వివరించాలని మనవి…

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine