ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం కూడా. అందుకే ఆదినుండి ఏకేశ్వరవాదం పవిత్రమైనదిగా, వికాశవంతమైనదిగా మరియు బహుదైవవాదం అనగా విగ్రహారాధన అపవిత్రమైనదిగా, వినాశవంతమైనదిగా సకల థర్మశాస్త్రాలూ ఘోషిస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన అనేకమంది హిందూ వేదవేత్తలు హిందూజాతిని ఎప్పటికప్పుడు విగ్రహారాధన విషయంలో హెచ్చరిస్తూనే ఉన్నారు. అలాంటి మహనీయులలో - ఆర్యసమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతి ఒకరు. ఈయన విగ్రహారాధన వలన మానవుడు మోక్షాన్ని వ్యర్ధం చేసుకుంటాడని ఇంకా అనేక నష్టాలు చవిచూస్తారని హెచ్చరించారు.
విగ్రహ పూజయే థర్మార్ధ కామ మోక్షములకు సాధనమని అనుకొని
పురుషార్ధమును సాధించక మనుష్యజన్మమును వ్యర్ధం చేసుకొందురు.
సృష్టికర్త మహోన్నతుడు,సర్వమూ తెలుసుకొనేవాడు, యావత్తు సృష్టి ఆయన ఆదీనంలో నడుస్తోంది. అటువంటి శక్తిసంపన్నుడను ఏరాతి రూపంలో బంధించగలము. అది దైవాన్ని అవమానించుట కాదా? అని దయానందుడే హెచ్చరించేవాడు.
"
ఎవడైన ఒకడు మీరు కూర్చుండే సింహాసనం మీదకాని మీ పేరు మీదకాని
ఒకరాయిని ఉంచుతానని అంటే మీరు కోపోద్రేకులై అతనిని కొట్టుటకు
సిద్ధపడతారు. లేదా తిట్టటమైన చేస్తారు. అలానే పరమేశ్వరుని ఉపాసించే
(వేడుకునే) స్థానమైన హృదయం మీదనో పేరు మీదనో పాషాణాది విగ్రహాలను
ఉంచితే పరమేశ్వరుడు ఆ దుష్టబుద్ధి కలవారిని ఎందుకు నాశనం చేయడు?"
ఈ విధంగా స్వామి దయానందుడు విగ్రహారాధన వ్యక్తి పతనానికి దారి తీస్తుందని, దాని వలన విగ్రహారాధికులు మోక్షసిద్దులను కోల్పోతాడని తీవ్రంగా హెచ్చరించియున్నారు.