• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » సాక్ష్యం మేగజైన్ నడపడంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం!

సాక్ష్యం మేగజైన్ నడపడంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం!

శాస్త్ర బోధనలు ఈరోజు నుండే కాదు ఎప్పటి నుండో మరుగున పడిపోయాలి.అమాయక ప్రజలు కల్పిత బోధనల వలన, నేనే దేవుణ్ణని చెప్పుకుంటున్న అనేక మాయదారి స్వామీజీల బారిన పడి మోస పోవడం, ఇంక అనేక మంది పండితుల మోసాలకు గురై పోవడం ఇవన్నీ నేను గమనించినప్పుడు భక్తి అంటే ఇలా ఒకరికొకరు మోసపర్చుకోవడం, గొప్పలు ప్రకటించుకోవడమేనా? ఉన్నవాళ్లకు ఒక రూటు, లేనివాళ్లకు ఒక రూటు ఇదేమి భక్తి అనిపించేది. ఈ మతం, భక్తి, దేవుడు అంతా ట్రాష్ అనిపించింది. వీళ్ల ఆగడాలకు మితి లేక నాస్తిక సమాజం ఉనికిలోకి వచ్చింది అనిపించింది. నిజానికి నాస్తికవాదం ఆస్తికత్వంలో నుంచే పుట్టుకొచ్చింది. ఈ పరిస్థితిలో భగవద్గీత తారసపడడం, దానితో పాటు బైబిల్, ఖురాన్ గ్రంధాలను అధ్యయనం చేయడం భగవద్ధేశ్చ్యగా జరిగిపోయింది. అప్పుడు నేను ధర్మ గ్రంధాలలో ఉన్న భక్తికిని, సమాజంలో నడుస్తున్న భక్తికిని ఏమాత్రం పొంతన లేదని తెలుసుకున్నాను.ఈరోజు సమాజంలో భక్తిని మనిషి అనుచరిస్తే మూర్ఖుడైపోతాడు. అహంకారి, దుర్మార్గుడు,విచక్షణ జ్ఞానం లేని మృగంగా మారిపోతాడు.అజ్ఞానిగా మారి చివరికి భక్తి పేరు చెప్పుకు జరిగే జాతరలలో గణేష్    నిమజ్జనం లాంటి పండుగలలో కూడా శరీరానికి బాగా సారా పట్టించి మత్తులో తూగుతాడు. కాని శాస్త్ర అనుచరణ మనిషిని జ్ఞానవంతుణ్ణి చేస్తుంది.భక్తి పేరు చెప్పుకు జిరిగే దారుణాలను అంతమొందిస్తుంది. మనిషి స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఇటువంటి థర్మ శాస్త్ర ప్రబోధనలను గుర్తించిన నేను ఎలాగైనా శాస్త్ర బోధనలను సామాన్యులకు అందజేయాలి. థార్మిక శాస్త్రాలలో ఉన్న యధార్ధాన్ని ప్రజల ముందు పెట్టాలి. జ్ఞానవంతులను, చైతన్య వంతులను చేయాలి.అనుకున్నదే తడవు "సాక్ష్యం సంచలన పత్రిక"ను స్థాపించాను. ఇటువంటి తపన ఉన్న ఎంతోమంది హిందూ,ముస్లిం, క్రైస్తవ సమాజాలకు చెందిన వ్యక్తులు ప్రోత్సాహాన్ని అందించారు.అందిస్తూనే ఉన్నారు. అలాగే కొంతమంది నుండి కూడా బెదిరింపులు కూడా అందాయి. మంచి పని ఏదైనా విమర్శలకు గురవ్వడం సహజమే కదా? అదీ శాస్త్ర థర్మంలో అయితే మరీ దారుణంగా ఉంటుంది. అలనాడు ఎంతో మంది ప్రాణాలను కూడా వదులుకోవల్సింది వచ్చింది కూడా! వీటికి దేనికి సాక్ష్యం మేగజైన్ తలవంచదు.అంతా భగవంతుణ్ణి చాయలోనే జరుగుతుంది. దీని ద్వారా కనీసం వందమందిలో ఒక్కరైనా గ్రహిస్తే మా తపనకు ధన్యత లభించినట్లే .శుభం. 

2 Responses to "సాక్ష్యం మేగజైన్ నడపడంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం!"

  1. మనోహర్ చెనికల

    మీ బ్లాగు నేను రెగ్యులర్ గా చదువుతాను.
    మీరు తెలుసుకున్న విషయాలు, తెలుపుతున్న విషయాలు ఆలోచించాల్సినవి. కాబట్టి మీరు నిర్భయంగా రాయండి.
    ఏ ఆధారాలు లేకుండా తమకున్న మిడిమిడి జ్ఞానంతో వక్రీకరించే వారికంటే యదార్ధాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస మంచిదే.
    ఈ ధర్మం ప్రశ్నించడాన్ని ఎప్పుడూ తప్పుబట్టలేదు. అలా పట్టేటట్లైతే ఉపనిషత్తులులేవు, గీతలు లేవు.
    అసలు ప్రశ్నలోంచే జ్ఞానం ప్రకాశిస్తుంది. ఐతే అది సమాధానం వెతకడంలో సహాయం చెయ్యకుండా మరిత గందరగోళంలోకి నెడితేనే ప్రమాదం. ఇప్పుడు సమాజం అలాంటి క్రాస్ రోడ్స్ లో ఉంది. ప్రశ్న వెయ్యడంలో ఉన్న సౌలభ్యం జవాబు వెతకడంలో ఉండదు కదా. వాలిని చెట్టుచాటునుండి రాముడు కొట్టాడు అని ఆక్షేపించడం సులువే, కానీ నిజానిజాలు తెలియాలంటే కిష్కింధకాండ చదవాలి. చదివితే పూర్తి నిజాలు తెలుస్తాయి. అప్పుడు ఆ సంఘటన గురించి మనం తీర్పు చెప్పుకోవాలి. కానీ చదవడానికి మనకు ఓపిక ఉండదు. సినిమాల్లో చూపించిన దాన్నో, ఎవరో రాసిన దాన్నో పట్టుకుని తయారైపోతాం.

    1. Unknown

      మీ ప్రోత్సాహానికి ప్రత్యేక కృతజ్ఞతలు మనోహర్ గారు. మాకు కొండంత ఆత్మస్థైర్యాన్ని అందించారు. మీరన్నట్టుగా ఈరోజు మిడి,మిడి జ్ఞానంతోనో, సినిమాల ప్రభావంతోనో వాదించేవారే తప్ప ఎవరూ శాస్త్రబద్ధమైన వాదన అందించడం లేదు. దీని కారణం తమ,తమ స్వనిర్ణయాల స్థాపన జరిగిస్తూ వాస్తవ థర్మాన్ని అణగదొక్కుతున్నారు. ఎలాగైనా ఈ విధానాన్ని రూపుమాపి శాస్త్రజ్ఞానాన్ని నెలకొల్పాలి. అదే మా ప్రయత్నం.కృతజ్ఞతలు సర్!

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine