• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Editorial » ఎడిటర్ ఛాయిస్ : మత ప్రచారం పేరుతో జాతిదురాక్రమణ..?

ఎడిటర్ ఛాయిస్ : మత ప్రచారం పేరుతో జాతిదురాక్రమణ..?

Label: Editorial

సమాజంలో ఈరోజు అత్యధికంగా జరుగుతున్నది ఎంతమాత్రం ధర్మప్రచారం కాదు. ఇది కేవలం మతప్రచారమే! దీనిని అడ్డుగా పెట్టుకుని జాతిదురాక్రమణ చేస్తున్నారు.ఈ విషయంలో క్రైస్తవులు, ముస్లిములు కూడా ముందున్నారు.
  క్రైస్తవులు అయితే మరీ దారుణం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను రూపుమాపి ప్రాశ్చాత్య కల్చర్ ను స్థాపిస్తున్నారు.
  కట్టు, బొట్టుతో ఎంతో చక్కగా అలరారే భారతీయ స్త్రీలను తాళిబొట్టుకు దూరం చేసి మొగుడు దూరమయిన వితంతువులుగా మార్చేస్తున్నారు.
  విచిత్రం ఏమిటంటే యేసువారు చేయని కొన్ని సంప్రదాయాలను బైబిల్ సమర్ధించని అనేక విషయాలను కల్పించి భారతీయుల చేత నమ్మిస్తున్నారు. అలాంటి వాటిలో "ఈస్టర్" పండుగ ఒకటి. యూదులు మృతుల సమాధులను అలంకరించేవారు. అది వారి సంప్రదాయం కావచ్చు. దానిని ఇక్కడ భారతదేశంలో స్థాపించడం ఏమిటి?
  క్రైస్తవులలో మతప్రచారం తప్ప ధర్మప్రచారం లేదు.
  భారతీయ పేర్లు తొలగించి-ఇంగ్లీష్ పేర్లు తగిలించటం.
  భారతీయ సంస్కృతిని రూపుమాపి-ప్రాశ్చాత్యసంస్కృతిని స్థాపించటం
  భారతీయ పుణ్యపురుషులను దూషించి-అక్కడి పుణ్యపురుషులను కొనియాడటం.
 ఇదసలు థర్మమా? మతప్రచారంపేరుతో జరుగుతున్న జాతిదురాక్రమణ తప్ప ఏమీకాదు.
  యేసు మతప్రచారకుడా? థర్మప్రచారకుడా?
  యేసువారు ఏనాడూ తనను గాని, మర్యం గారినిగాని, పరిశుద్ధాత్మ, లేక శిలువను ఆరాధించమని చెప్పలేదు. సరికదా ఆ పైనున్న తండ్రి (సర్వేశ్వరుడి)ని ఆరాధించమని చెప్పారు. ఇదీ థర్మప్రచారం అంటే!
  కాని ఇక్కడ క్రైస్తవులు చేస్తున్నది ముమ్మాటికీ మతప్రచారమే!."మతం" అనే మాటకు అభిప్రాయం అని అర్ధం! ఎవరి అభిప్రాయాన్ని వారు ఏర్పరచుకుని బైబిల్ సమర్ధించని సిద్ధాంతాలను కల్పించుకుని 2000వేలకు పైగా క్రైస్తవ డినామినేషన్స్ గా ఏర్పడి పూర్తిగా భారతీయులలో ప్రాశ్చాత్య కల్చర్ ను వైరస్ లాగా ఎక్కిస్తున్నారు.
  వీరి మత ప్రచారం పేరుతో కేరెక్టర్స్ (పాత్రలు) మార్చుతున్నాయి తప్ప థర్మపు విధానం ఎక్కడొస్తుంది?
  శ్రీరాముడుని వదిలి - యేసును
  దుర్గామాతను వదిలి - మేరీమాతను
  శివలింగాన్ని వదిలి - శిలువను పూజిస్తున్నారు. ఇక్కడ పాత్రలు మారాయిగాని సిద్ధాంతం మారలేదు. నిజానికి బైబిల్ కు ప్రాశ్చాత్య కల్చర్ కు ఏవిధమైన సంబంధం లేదు. వేద శాస్త్రాలు దేవుడిని పంచేద్రియాలకు అతీతమైనవాడిగా తెలియజేస్తున్నట్టే బైబిల్ కూడా తెలియజేస్తుంది తప్ప యేసును గాని మర్యం నుగాని, పరిశుద్ధాత్మను గాని పూజింపమని ఎక్కడా చెప్పబడిలేదు.
  ఈవిధంగా బైబిల్ లో లేని కల్పిత సిద్ధాంతాలను స్థాపిస్తూ ఇక్కడి సంస్కృతిని రూపుమాపుతూ యూరోపియన్ పద్ధతులను స్థాపించి జాతిరూపురేఖలను మార్చివేస్తున్నారు. ఇది దేశానికి చాలా ప్రమాదకరం. ఈ విషయంలో ముస్లిములలో అత్యధికులు కూడా థర్మప్రచారం పేరు చెప్పి వారి వేషదారణను, బాషను, జాతియొక్క మూలాలను త్రెంచేసి తమజాతులలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప విశ్వాసాలు ఎక్కడ చూస్తున్నారు. పోనీ జాతులలో కులుపుకున్న వారి విషయంలో ఏవైనా ఆలనా,పాలనా ఉంటుందా అంటే ఏమీ ఉండదు. కాబట్టి థర్మాన్ని స్వీకరించడమంటే నిజ దైవాన్ని గుర్తించి ఆరాధించడం తప్ప జాతుల చిహ్నాలను, సంస్కృతి సంప్రదాయాలను మార్చుకోవడం ఎంతమాత్రం కాదు. మనందరమూ మత ప్రచారం పేరుతొ సాగుతున్న జాతిదురాక్రమణను అడ్డుకుని తీరాల్చిందే! లేకపొతే దేశానికే ప్రమాదం.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine