• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » గోపాల్ శర్మగారి సందేహములకు M.A.అభిలాష్ గారి సమాధానములు!

గోపాల్ శర్మగారి సందేహములకు M.A.అభిలాష్ గారి సమాధానములు!

గోపాల్ శర్మ గారి ప్రశ్నలు: శ్రీ అభిలాష్ గారికి,
ఆర్యా! మీరు ఒక ముస్లిం అయ్యుండి సర్వమతసమజనీనం కోసము మీరు సల్పుతున్న కృషి అభినందించదగ్గది, ఆహ్వానించదగ్గది.
పైన దుగ్గేశ్వరరావు,జై గొట్టిముక్కలగార్లు అడిగిన సందేహములు నాకు యున్నవి. తమ ముస్లిం మిత్రులు నెలవంకను ప్రామాణికంగా తీసుకోవడం, కాబా స్టోనును ముద్దాడటం, మక్కా మందిరము వైపునకు తిరిగి ప్రార్ధనలు చేయడం ఎందుకు చేస్తారు. నా సందేహ నివృత్తి చేయగలరు. ఇవ్వన్నియూ విగ్రహారాధన క్రిందకు రావా? వీటికి మీ థర్మ శాస్త్రములు ఏమని చెప్పుచున్నవి? నా సందేహములను మన్నించగలరు.

M.A.అభిలాష్ గారి సమాధానములు: గోపాల్ శర్మ గారికి నమస్కారములు!
“ఒక ముస్లిముగా “సర్వమతసమజనీనం” కోసము మీరు సలుపుతున్న కృషి అభినందించ దగ్గది, ఆహ్వానించదగ్గది” అని మీరు నన్ను ప్రశంసించినందుకు మీకు నేను కృతజ్ఞుడిని! సకల ఘనతలూ స్తోత్రాలూ సర్వోన్నతుడైన ఆ ఏకైక సర్వేశ్వరునికే చెందుతాయి.
ముస్లిము అనగా ‘’దైవ విధేయుడు’’ అనే అర్థము. ఇస్లాం అనగా ‘‘దైవ విధేయత” అనే అర్థము. ఇక, మనిషి ప్రవృత్తులు రెండు. వాటిలో ఒకటి- అనుకూలమైనది (విధేయతాపూర్వకమైనది). ఇదే “దైవ ధర్మము” అనగా “దేవునికి  ఇష్టమైన ప్రవర్తనా విధానము”  రెండవది- ప్రతికూలమైనది (అవిధేయతాపూర్వకమైనది). ఇదే “అ ధర్మము” అనగా “దేవునికి అయిష్టమైన ప్రవర్తనా విధానము”. తనలోనే ఉన్న ఈ రెండు చిత్త ప్రవృత్తులలో మనిషి తన స్వాభిష్టంతో దేనిని “నియంత్రణ” చేస్తాడు? మరియు దేనిని “వికాస” పరుస్తాడు? అన్నదే మనిషి జీవితానికి అసలు “పరీక్ష”. సర్వసృష్టికర్త అయిన ఆ సర్వేశ్వరుడు, “మంచి-చెడు” అనే ఈ  రెండు విధానాలను-
1. ప్రతీ మనిషి మస్తిష్కంలోనే నిక్షిప్తం చేసి ఉంచాడు. అందుకే- ఆస్తికుల నుండి నాస్తికుల వరకు “మంచి-చెడు”ల నియమాలు కొద్దిపాటి వ్యత్యాసముతో సమాంతరముగానే ఉంటాయి.
2. ధర్మశాస్త్రాలలోనూ “మంచి-చెడు” అనే ఆ రెండు విధానాలను పెట్టాడు. అందుకే వివిధ ధార్మిక వర్గాలలో “మంచి-చెడు”ల నియమాలు కొద్దిపాటి వ్యత్యాసముతో సమాంతరముగానే ఉంటాయి.
అంటే- “దైవ ధర్మము”-“అ ధర్మము” అనగా “మంచి”-“చెడు” అనే ఈ రెండు మార్గాలూ అనాది నుండీ ఉన్నవే! ఎప్పుడెప్పుడైతే మానవాళిలోని తెలివైన నిర్దాయులూ వంచకులూ అయిన అతి కొద్ది మంది తమ వ్యక్తిగత లేక వర్గపరమైన స్వలాభం కొరకు సామాన్యులూ అమాయికులూ అయిన అధికశాతం ప్రజలను ధర్మ అవగాహనలేని ఆజ్ఞానులుగా మార్చి, వారిని పాపిష్టి వారీగా మార్చిన కారణముగా అధర్మము విజృభించి, ధర్మము మందగించి పోయినప్పుడెల్లా, మనుషుల హృదయాలలో “మసక బారిపోయిన” ఆ పాత ధర్మమునే ధర్మశాస్త్రాలలో “మరుగున పడిపోయిన” ఆ పాత ధర్మమునే అదే సమాజానికి చెందిన ఒక ఉత్తమ వ్యక్తిని ఎన్నుకొని, అతనిపై తన ఆ ప్రాచీన “మంచి”-“చెడు” సమాచారాన్నే తిరిగి ఆ వ్యక్తి ద్వారా పునరుక్తం చేసే వాడు. ఈవిధంగా మానవ జన్మ పరమార్ధాన్ని  మానవాళి స్ఫురణకు తీసుకురావటం జరుగుతూ ఉండేది. అందుకే అనేక మంది ఋషులు, ప్రవక్తలు మరియు అనేక ధర్మశాస్త్రాలూ రావటం జరిగింది.
ఇదే విషయాన్ని మన గీతాశాస్త్రం 4:1-3శ్లోకాలలో- “ఈ యోగము (మానవుడు-మాధవుడు భావపరముగా ఏకమయ్యే విధానము) ను పూర్వము నేను సూర్యునికి (అదిమానవునికి) ఉపదేశించితిని. తరువాత వైవస్వత మనువునకు ఆ తరువాత ఇక్ష్వాకునకు ఇంకా రాజ ఋషులకు ఉపదేశించాను. అది ఇపుడు లోకమున అదృశ్యమై ఉన్నందున ఓ అర్జునా! ఇప్పుడు నీకు బోధించుచున్నాను.” అని ప్రకటించబడుతుంది.
ఇదేవిధంగా యేసు- మత్తయి సువార్త 5:17 వ వాక్యములో- నేను ధర్మశాస్త్రము (మోషే ద్వారా వచ్చిన గ్రంధము) అయిననూ పవక్తల వచనములైననూ నేర్వేర్చుటకేగాని కొట్టివేయుటకు నేను రాలేదు”. అని తెలియజేస్తున్నారు.     
అలాగే ఖురానులో- 42:13 వ వాక్యములో- “ఇదే విధముగా ఆదిలో నూహ్ (మహా ఋషి మనువు) కు బోధించిన ధర్మమునే అబ్రాహామునకు బోధించాను. దానినే మోషే మరియు యేసులకూ బోధించాను. ఆదే ధర్మమును ఓ ముహమ్మద్ నీకూనూ బోధిస్తున్నాను!” అని అల్లాహ్ ఖురాను గ్రంధములో ప్రకటిస్తున్నాడు.
దీనిని బట్టి ఒక ముస్లిముగా నేనే కాదు, ప్రతీ ముస్లిమూ, ప్రతీ మనిషి హృదయములో “మసక”బారి ఉన్న “ధర్మము”నే అలాగే, ప్రతీ మత వర్గము వారి ధర్మశాస్త్రములో “మరుగు”న పడి ఉన్న “ధర్మము”నే చెప్పాలి తప్ప, తమ దగ్గరున్న ఏదో క్రొత్త రంగును తీసుకొనివచ్చి ధర్మము పేరిట ఎదుటివారి నెత్తిన రుద్దతానికి పయత్నించ కూడదుకదా గోపాల్ శర్మగారూ! మూసిములే కాదు, హిందువులూ క్రైస్తవులూ అదే చేయాలి. కనుక నేను ఆదేచేస్తున్నాను. ఇందులో నాగొప్పతనము ఏమీలేదు. ఎందుకంటే- మనలోని  ప్రతి ఒక్కరి దగ్గరా ఉన్న ధర్మశాస్త్రాలలో “సత్య ధర్మము” ఉన్నది! కాకపోతే మనలోని ప్రతి ఒక్కరూ దానికి దూరముగా ఉన్నాము!!
ఇక, ముస్లిముల నెలవంక ప్రాధాన్యత విషయానికి వస్తే- ముస్లిముల ధార్మిక “కేలండరు” సూర్యమానము కాదు. చాంద్రమానము. కనుక వారు తమ పండుగలూ, పబ్బాలకు చెందిన విషయాలను దాని ఆధారుముగానే నిర్వహించుకుంటారు. కనుక కేవలము ఆవిధమైన సంబంధము కారణముగా మాత్రమే నేలవంకతో ముస్లిములకు సంబంధము ఏర్పడింది. ఆ  ఒక్క సంబంధము తప్పితే మరోవిధమైన ఏ సంబంధమూ నేలవంకతో ముస్లిములకు లేదు. 
పైదానికి కొనసాగింపు: 
ఇక, కాబా స్టోన్ విషయానికి వస్తే- బైబిలు-ఖురాను గ్రంధాల ప్రకారం- మనందరి అది పితామహుడైన “ఆదాము”. మన హిందూ శాస్త్రాల ప్రకారం- శంకరుడు. స్వర్గ లోకము నుండి భూలోకానికి వచ్చేటప్పుడు దానిని స్వర్గం నుండి తేచ్చుకున్నాడని ఒక అభిప్రాయము ఉంది.
మహోదయుడైన మన ఆదిమ తండ్రి, సర్వోన్నతుడైన మన ఏకైక సృష్టికర్తను ఆరాధించుకోవటానికి చతుర్స్రాకారము లో ఒక ఆలయాన్ని నిర్మించినప్పుడు ఆ “హిజ్రే = రాయి, అస్వద్=నల్లని” అనగా “నల్లని రాయి”ని ఒక మూలన అమర్చి  పెట్టినట్లు చరిత్ర చెబుతుంది. నోవాహు జల ప్రయాళయంలో అది కప్పబడిపోయింది. తిరిగి అబ్రాహాము-ఇష్మాయేలు ద్వారా పునరుద్ధరించబడింది.
అటు ఆదాముగాని ఇటు అబ్రాహాము-ఇష్మాయేలుగాని వందశాతమూ ఏకేశ్వరోపాసకులే అన్నది లోకవిదితం! అబ్రాహాము-ఇష్మాయేలు అనంతరం- చాలా కాలం తరువాత వారి సంతతికి చెందిన అధిక శాతం ప్రజలు “విగ్రహారాధకులు”గా మారిపోయారు. స్వచ్ఛమైన ఏకేశ్వర ఆరాధన కొరకు మాత్రమే నిర్మించబడిన “బాకా” లేక “కాబా” మందిరములో సుమారు 365 విగ్రహాలను పెట్టి పూజించటం ప్రాంభించారు. అంతటి అజ్ఞాన కాలములో సైతం ఆ “హిజ్రే అస్వద్”ను అరబ్బులు పూజించటంగాని మ్రొక్కటంగాని చేసిన దాఖలా చరిత్రలో ఎక్కడా లేదు. 
చతుర్స్రాకారముగా ఉన్న ఆ ఆలయం చుట్టూరా 7 సార్లు “ప్రదక్షణము” చేయాలి. దాని ప్రారంభ “గురుతు”గా మాత్రమే దానిని నేడు ఉపయోగిస్తున్నాకు. ఆ “నల్లని రాయి” ఉన్న మూల నుండి “ప్రదక్షణము” చేసే మైదానములో నేలపై ఒక నల్లని పట్టీ ఉంటుంది. దాని నుండి “ప్రదక్షణము”ను ప్రాంభిస్తారు. అంతకుమించి ఇస్లాంలో ఎలాంటి ప్రాముఖ్యతా లేదు. దానిని ముట్టుకోవటంగాని, ముద్దాడటంగాని హజ్ ప్రార్ధనా క్రతువులలో ఒక భాగం కాదన్నది అత్యంత గమనార్హం! ఇదీ ఇస్లాంలో కాబా స్టోన్ వినియోగము, స్థానమూ! 

తరువాత, కాబా మందిరమునకు అభిముఖముగా ప్రార్ధన ఎందుకు చేస్తారన్నది. ఖురానులో 2:142-152 వాక్యాలమధ్య దానికి సంబంధించిన ఆదేశము, కారణాలూ ఉన్నాయి. ఒక క్రమ శిక్షణ కొరకు అన్నదే ప్రధానంగా చెప్పబడింది. మీ ముఖాన్ని ఎటు త్రిప్పినా అల్లాహ్ (సర్వేశ్వరుని) సమ్ముఖము లభిస్తుంది, ప్రాక్పశ్చిమాలన్నీ అల్లాహ్ (సర్వేశ్వరుని) వే అని ప్రకటించబడింది. అందుకే ప్రయాణ సమయాలలో వాహనాల్లో ఉన్నప్పుడు ఎటు సౌకర్యము ఉంటే అటే ముఖము పెట్టి ముస్లిములు ప్రార్ధన చేసికుంటారు. కాబా మందిరమునకు అభిముఖముగా ప్రార్ధన చేయటానికిగల కారణము. గోపాల్ శర్మగారూ శెలవు!          

2 Responses to "గోపాల్ శర్మగారి సందేహములకు M.A.అభిలాష్ గారి సమాధానములు!"

  1. Unknown

    గౌ:శ్రీ అభిలాష్ గారికి,
    ఆర్యా! మా సందేహములకు మీరు స్పందితులైనందుకు ధన్యవాదములు. మీరు సెలవిచ్చిన కాబా స్టోన్,మందిరపు దిక్కు గురించి ఎరుక పర్చినందులకు కృతజ్ఞతలు. మరింత విషయ పరిజ్ఞానమునకై వాటికి సంబంధించిన గ్రంధములను సూచించగలరు.
    మక్కాలో ఉన్న మందిరమున గూర్చిన సమాచారములు మా వైధిక శాస్త్రములలో పేర్కొనబడినవి.నిజానికి ఆ మక్కేశ్వర ఆలయము వైధిక మతస్తులదే.వైధిక థర్మము అన్ని మతములకు తల్లి వంటిది అనేది మక్కేశ్వర ఆలయము ఒక గొప్ప ఉదాహరణ. తరువాత భౌగోళిక పరిస్తితులకు చెందిన మార్పులకు అక్కడ జాతులు స్థిరపడడం వలనను అది వాళ్లదిగ అయిపోయింది.

    1. Unknown

      గౌరవ నీయులైన గోపాల్ శర్మగారికి నమస్కారములు!
      కాబా స్టోన్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలిపే గ్రంధాల గురించి భవిష్యత్తులో తెలుపగలను. తమరు మక్కేశ్వర ఆలయ ప్రస్తావన వైదిక గ్రంథాలలో ఉన్నదని సెలవిచ్చిన విషయం వాస్తవమే! అలాగే వేద గ్రంధాలు ప్రాచీనమైనవన్న విషయాన్ని ఖురాన్ గ్రంధం 26:196, 197 వాక్యాలలో తెలుపుతున్నది. మక్కేశ్వర ఆలయ స్థాపకుడు ప్రథమ మానవుడైన ఆదాము. మన హిందూ శాస్త్రాల ప్రకారం- శంకరుడు లేక శివుడు. ఆయనగారు వైకుంఠం నుండి దిగిందే మన హిందూ దేశములో. ఇప్పటి శ్రీలంక. అరేబియా మన హిందూ దేశము నైసర్గికముగా ఒక్కటే కదా! ఇప్పుడైతే రాజకీయముగా వేరు. ప్రస్తుత ముస్లిములైతే- సుమారు గత 1436 సంవాత్సారాల నుండి మాత్రమే మక్కేశ్వర ఆలయంతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. అయితే, ఆ ఆలయంతో సంబంధము కలిగి ఉన్న ప్రథములు మన హిందూ దేశస్తులే!! అందుకే శాస్త్ర బద్ధంగా నిర్మిచిన మన ఆలయాలన్నీ దాని అభిముఖముగానే ఉంటాయి. తరువాత నేటికీ అక్కడ జరిగే క్రతువులన్నీ వైదిక క్రతువులను పోలి ఉంటాయి. ఉదాహరణకు: ఏకేశ్వర ఉపాసన తప్ప విగ్రహారాధన చేయకపోవటం, ఏడు మార్ల ప్రదక్షణ చేయటం. కుట్టులేని వస్త్ర ధారణ. వంటి తదితర క్రతువులు.
      ఇలాంటి ఇత్యాది వాస్తవాలను బహిర్గతం చేయటం వలన వివిధ ధార్మిక వర్గాల వారి మధ్య మత సామరస్యము పెరిగి, ఒకవైపు- మనజాతి పటిష్టమౌతుంది. మరొక వైపు- అంతర్జాతీయముగా దేశాల మధ్య శత్రుత్వము తగ్గి, స్నేహబంధాలు బలోపేతమవుతాయి. దీని వలన సరిహద్దు ఘర్షణలు సమసి, లక్షల కోట్ల సైనిక వ్యయము ఆదా ఔతుంది. ఆ ధనాన్ని బీదసాదల అభ్యున్నతికి ఖర్చు పెట్టవచ్చు. ఈ విధంగా లోక వినాశనానికి ఖర్చయ్యే ధనాన్ని లోక కళ్యాణం కొరకు వ్యంచేయవచ్చు!
      ప్రస్తుత మన ప్రయాస ఆ యా ధార్మిక వర్గాల మధ్య “ఐక్యత”ను “పెంచటా”నికి సాగాలే తప్ప “అనైక్యత”ను “సృష్టించటా”నికి కారాదు. ఇంకా, దానికి గాను ధర్మ గ్రంధాల ప్రబోదిత “విషయము”లలోని “సమాంతరత”ను వెలికి తీసి ప్రచారము చేయాలే తప్ప, ధర్మ గ్రంధాల విషయ “వివరణ”లోని “వైవిధ్యము”ను వెలికి తీసి, ప్రచారము చేసే ప్రయత్నము చేయరాదన్నది నా అభిప్రాయము. మీరేమంటారు గోపాల్ శర్మగారూ!

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine