గతంలో విగ్రహారాధనకు సంబంధించిన ఆర్టికల్స్ వచ్చినప్పుడు కొంతమంది విగ్రహారాధన శాస్త్ర బద్ధమేనంటూ వాదించారు. అయితే హాస్యాస్పదమైన విషయమేమిటంటే ఒక్కరూ కూడా శాస్త్రీయ ఆధారాలు చూపించలేకపోయారు. కొంతమంది తమ,తమ బ్లాగుల్లో విగ్రహారాధనకు సంబంధించి ఏవో కొన్ని శ్లోకాలను పరిశీలించకుండానే విగ్రహారాధన థర్మ బద్ధమంటూ ఆపాదించేశారు.గతంలో కొంతమందైతే విగ్రహారాధన వలన కొన్ని కోట్ల మందికి ఉపాధి కలిగియుంది కాబట్టి కరెక్ట్ అని వాదించారు. ఈరోజు మద్యం వ్యాపారం కూడా కొన్ని కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కలిగిస్తోంది. దానిని సమర్ధించడం భావ్యమా? పంచేద్రియాలకు అతీతుడైన భగవంతుడిని, అదృశ్యుడైన భగవంతుడిని దృశ్యరూపంలో వేడుకోవడం థర్మమా? విగ్రహాలలోనూ,పుణ్యపురుషుల బొమ్మలలోనూ దేవుడిని చూడడం మూర్ఖత్వం కాదా? ఒకసారి ఆలోచించండి? భగవద్గీతలో విగ్రహారాధనకు అనుమతి ఉంటే ఒకసారి చూసించండి? విషయ అవగాహన కొరకు చర్చించుకోవడంలో తప్పేముంది?