• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » "ఖుర్ఆన్" ప్రకారం బహుభార్యత్వం తప్పనిసరా?

"ఖుర్ఆన్" ప్రకారం బహుభార్యత్వం తప్పనిసరా?

నేడు ముస్లిం సమాజం పట్ల అనేక అపోహలు వ్యాపించి ఉన్నాయి. వాటిలో బహుభార్యత్వం ఒకటి.ముస్లింలు ఎన్ని వివాహాలనైనా చేసుకోవచ్చని అనేకులు భావిస్తుంటారు. కానీ అది సత్యదూరం. కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలలో, అనేక నిబంధనలతో మాత్రమే అందుకు అనుమతి లభిస్తుంది. నాటి అరబ్ సమాజంలో ఇస్లాం వ్యాప్తి చెందక ముందు స్త్రీకి భద్రత ఉండేది కాదు. పురుషుడు చాలా పెళ్లిళ్లు చేసుకునేవాడు. వ్యభిచారం సర్వసాధారణమై ఉండేది నాటి అరబ్ తెగల మధ్య చిన్న,చిన్న విషయాలకే భీకరయుద్దాలు జరిగేవి. అనేకమంది ప్రాణాలు కోల్పోయేవారు. వారి భార్యలు వితంతువులుగా, వారి సంతానం అనాధలుగా మారి సమాజం అస్తవ్యస్తంగా ఉండేది. ఈ దశలోనే ప్రవక్త ముహమ్మద్(స) వారు అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ఇస్లాంను వ్యాప్తి చేశారు.స్త్రీలను కొనడం,అమ్మడం, బలవంతంగా ఎత్తుకెళ్లడం, వ్యభిచరించడం మహా పాపమని ప్రవక్త బోధించారు.
          
          నాటి కాలంలో జరిగిన ఊహద్ యుద్ధం వల్ల అనేక విషమ పరిస్థితులు ఏర్పడ్డాయి. పురుషులు ఎక్కువ సంఖ్యలో చనిపోవడం వల్ల స్త్రీ, పురుష జనాభా నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసం ఏర్పడింది. అనాధాలైన పిల్లలు కనిపించేవారు. ఈ పరిస్థితుల్ని అధిగమించి సంక్షోభాన్ని నివారించేందుకు, అనాదలకు న్యాయం చేయలేమని భయం కలిగితే బహుభార్యత్వమ్ పాటించవచ్చునని ఇస్లాం అనుమతించిందే తప్ప తప్పనిసరి చేయలేదు.                         ఆకాలంలో అపరిమితంగా వున్న వివాహాల సంఖ్యను నాలుగుకు కుదించింది. పురుషుడు శారీరకంగా, ఆర్ధికంగా సమాన స్థాయి న్యాయాన్ని పాటించాలని అలా పాటించటం కష్టం కనుక ఏకపత్నీవ్రతమే శ్రేయస్కరమైనదని ఇస్లాం బోధించింది. ఇస్లాం కనుక బహుభార్యాత్వాన్ని నిషేధించి ఉంటే నాటి సమాజంలో స్త్రీలు,పిల్లలు అభాగ్యులుగా మిగిలిపోయేవారు. లైగీకనేరాలు, వ్యభిచారం ప్రబలి సమాజం నైతికంగా పతనమయ్యేది.

         ఇటువంటి ప్రత్యేక సందర్భాలను విస్మరించి కొందరు పురుషాహంకారులు చేసే తప్పులకు ముస్లిం సమాజాన్ని నిందించడం సరికాదు. నిజానికి ఏమతం బహుభార్యత్వాన్ని నిషేధించలేదని గ్రహించాలి. హిందువులు ఆరాధించే పురాణ పురుషులు, బైబిల్ లో అనేకమంది దైవప్రవక్తలు సైతం బహుభార్యత్వం పాటించినట్లు స్పష్టమవుతుంది.

         ఆధునికులమని చెప్పుకునే వారు నేటికీ వితంతు వివాహాలకు దూరంగా ఉంటారు. వీధి వంచితులైన వితంతువుల పట్ల సరైన ఆదరణ ఉండదు. కానీ 1400 సంవత్సరాల క్రితమే ప్రవక్త ముహమ్మద్(స) వితంతు వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. పైగా వితంతు వివాహం పుణ్యప్రదమైనదని బోధించారు. ఈ కారణం వల్లనే ముస్లిం సమాజంలో వితంతు స్త్రీల వివాహం సులభమయింది. ఇటువంటి మానవీయ విలువలను పాటించే ముస్లిం సమాజంపై కమ్ముకున్న అపార్ధాలను తొలగించవలసిన బాధ్యత ముస్లిం మేధావులపై ఉంది.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine