
సాక్ష్యం గ్రూప్ "సాక్ష్యం మేగజైన్" ద్వారా అనేక ఆధ్యాత్మిక,సామాజిక అంశాలను మీకు అందిస్తూ మీ అందరి ఆదరాభిమానాలకు చాలా దగ్గరయ్యింది. ఘాటు విమర్శకుల మన్ననలను సైతం పొందుతూనే ఉంది. ఇది ఒక మతానికి, వర్గానికి కట్టుబడి లేకుండా కేవలం థర్మాన్ని మాత్రమే పరిగణిస్తూ పని చేస్తూ ఉంది. దానిలో భాగంగానే సాక్ష్యం టి.వి. పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ ని ప్రారంభించింది. అనేక ఆధ్యాత్మిక అంశాలతో పాటు సామాజిక అంశాలు ఇంకా షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు కూడా అందించే ప్రయత్నం చేస్తాం!. గౌరవనీయులైన మీరందరూ కూడా ప్రేమతో ఆదరిస్తారని కోరుకుంటున్నాము. తధాస్తు!! శుభమ్!!!.