• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » క్రైస్తవులారా! అబద్ధ బోధకుల నుండి క్రైస్తవ్యాన్ని కాపాడండి!!

క్రైస్తవులారా! అబద్ధ బోధకుల నుండి క్రైస్తవ్యాన్ని కాపాడండి!!

ప్రియ క్రైస్తవులారా! ఒక వైపు యెహోవా దేవుడు, మరొక వైపు యేసు క్రీస్తు అబద్ధ ప్రవక్తలను గురించి మిమ్ములను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారో గమనించగలరు.
         మీకు ప్రవచములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మును బ్రమ పెట్టుదురు.వారు నన్ను తృణీకరించువారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చేననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో - మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. యిర్మియా 23:16-17.
    నిజమే నేటి అధికశాతం బోధకులు దేవుని వాక్యాన్ని బట్టి కాక, ఎవనికి తోచిన దర్శనం చొప్పున వాడు సామాన్య ప్రజలను భ్రమలకు గురిచేస్తూ ఎవరి సంఘం వారు కట్టుకుంటూ పోతున్నారు. అలాంటి వారి మాటలు వినవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అటువంటి వారి గురించి యేసు ఏవిధంగా హెచ్చరిస్తున్నారో ఈక్రింది గమనించగలరు.

       "ఆబద్ధ ప్రవక్తల"ను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొర్రెల చర్మములు వేసికొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. - మత్తయి 7:15.
        (యేసు) ఇట్లనేను- శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు విధవ రాండ్ల యిండ్లను దిగ మ్రింగుచు మాయ వేషముగా దీర్ఘప్రార్ధనలు చేయదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను.  -లూకా 20:45-47
     పై వాక్యాలలో హెచ్చరిస్తున్నట్లే సంఘస్తుల ద్వారా బాగుపడి సంఘాన్ని ఏమాత్రం పట్టించుకొనని మరియు అమాయకుల ఆస్తులను కాజేసే క్రూర స్వభావం కలిగిన బోధకులే నేడు ఎక్కువైపోయారు. ప్రజలను దోచుకుంటే దోచుకున్నారు. కనీసం స్వచ్చమైన "క్రీస్తు బోధ" బోధిస్తున్నారా అంటే అదీ లేదు. వారి లక్షణాలు.
      మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీ (క్రైస్తవుల)లోనూ అబద్ధ బోధకులుందురు. వీరిని బట్టి సత్యమార్గము (క్రైస్తవ్యం) దూషింపబడును. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ (సంఘస్తుల) వలన లాభము సంపాదించుకొందురు. - 2పేతురు 2:1-3
    ఈ వాక్యమును బట్టి వారిని ఈ మూడు లక్షముల ద్వారా కనిపెట్టవచ్చు.
1.పడియవ వంతు అందరి దగ్గరా తీసుకుంటారు. కానీ వారు మాత్రం ఎవరికీ ఇవ్వరు. ఇది వారిలో ఉన్న లోభత్వానికి గుర్తు. వాస్తవానికి యేసు - "ఉచితంగా పొందితిరి ఉచితంగా ఇయ్యుడి. -మత్తయి 10:82 అని ఆజ్ఞాపించి ఉన్నారు. ఇక,
2.పరిశుద్ధ గ్రంధంలో లేని కల్పనా వాక్యములు (తప్పుడు విశ్వాసములు) బోధిస్తుంటారు. అందుకే "అనైతికత - అనైక్యత"ల వంటి చెడులు నేటి క్రైస్తవ సమాజంలో నూ ఏర్పడ్డాయి.
3.కడు బీద విశ్వాసుల వలన సైతం లాభము (కానుకలు) సంపాదించుకుంటారన్నది అందరికీ తెలిసిందే. పైవాక్యం ప్రకారం అబద్ధ బోధకుల మౌలిక లక్షణాలు ఇవే! అలాంటి వారిని గురించి యేసు శిష్యుడైన యోహాన్ హెచ్చరికను ఈక్రింది గమనించగలరు.
       చిన్న పిల్లలారా,యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో (క్రైస్తవులలో) నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబoద్ధులు కారు. -1.యోహాను 2:18-19
       పై వాక్యాల ప్రకారం - క్రైస్తవులలో నుండే క్రైస్తవ్యాన్ని నాశనం చేసే అబద్ధ బోధకులు వస్తారని తెలుస్తుంది. అలాంటి వారి నుండి క్రైస్తవ్యాన్ని కాపాడుకొని, క్రీస్తు ప్రకటించిన సత్య సువార్త ద్వారా "నైతికత - ఐక్యత"లను తిరిగి సాధించాలనుకునే క్రైస్తవులు బైబిల్ "యధార్ధ సువార్త"ను తెలుసుకోవల్సిన అవసరం ఉంది.
Written by : M.A.అభిలాష్

4 Responses to "క్రైస్తవులారా! అబద్ధ బోధకుల నుండి క్రైస్తవ్యాన్ని కాపాడండి!!"

  1. Unknown

    నమస్తే! ! మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను ఒక Youtube ఛానల్ మొదలుపెట్టాను. నాకు మీ ఆశీర్వాదం కావాలి. ఈ చానల్ కి Subscribe చయండి.
    www.youtube.com/kcknani

    1. Unknown

      మీ వీడియోలు చూశాను. చాలా బాగున్నాయి బ్రదర్.ఆల్ ది బెస్ట్!
      www.youtube.com/sakshyamtv

  2. Aravind

    అసలు క్రైస్తవం వలననే దేశం సగం నాశనమవుతుంది. అది తెలియజేయకుండా "క్రైస్తవ్యాన్ని కాపాడండి." అని చెప్పడం విడ్డూరంగానూ,విచిత్రంగానూ ఉంది.క్రైస్తవులకు బైబిల్ ఎందుకు? దాన్ని వాళ్ళు పాటిస్తున్నారనుకుంటున్నారా? క్రైస్తవ విశ్వాసాలకు,బైబిల్ విశ్వాసాలకు వ్యత్యాసాన్ని మీ పుస్తకాలలో చాలా వరకూ చూపించారు కదా? ఇప్పుడు ఈమాట ఎలా అంటున్నారు సర్? వాళ్ళ విశ్వాసాలే సరిలేనప్పుడు ఇక క్రైస్తవాన్ని ఎలా రక్షించుకోగలరు?

    1. Unknown

      సోదరులు అర్వింద్ గారూ! మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంది. ఒక్క క్రైస్తవ్యమే కాదు, వైదికం పేరిట, ఇస్లాం పేరిట ఎదైతే వారి వారి ప్రజలలో పరివ్యాప్తమై ఉనాయో అవి మూఢ విశ్వాసాలతో మూఢాచారాలతో కలుషితమై ఉన్నాయి. ఇక, స్వచ్చమైన వైదికం-క్రైస్తవ్యం-ఇస్లాం గీతా-బైబిలు-ఖురాను గ్రంధాలలో మరుగున పడి ఉన్నాయి.

      కైస్తవులారా! అబద్ధ బొధకుల నుండి క్రైస్తవ్యాన్ని కాపాడండి! అన్న నా నినాదం ఉద్దేశ్యం ఏమిటంటే, కల్తీ క్రైస్తవ్యాన్ని బోధించే అబద్ధ బొధకుల నుండి "స్వచ్చమైన క్రైస్తవ్యము"ను కాపాడండి అన్నదే!

      వివిధ నామాలతో పిలువబడే గీతా-బైబిలు-ఖురాను గ్రంధాలు ప్రతిపాదించే ధర్మం ఒక్కటే! ఆ గ్రంధాల వైవిద్యం- "విజయా మిల్క్", "విశాఖా మిల్క్", "కేశవా మిల్క్" వంటిదే కాని, "క్లీనిక్ ప్లెస్ షాంపూ", "ప్యారాచుట్ కొకొనెట్ ఆయిల్", "క్రేన్ వక్కపొడి" లాంటిది కాదు. మొదటి మూడిటిలో ఆ ప్యాకెట్టులపై ఉన్న లేబిళ్ళు మాత్రమే వేరు. కాని వాటి లోపల ఊన్న పదార్ధం మట్టుకు ఒక్కటే! అయితే, రెండవ రకం ప్యాకెట్టుల పైన ఉన్న లేబిళ్ళూ వేరు మరియు ప్యాకెటులలోని పదార్ధాలూ వేరు. ఈ విషయాన్ని గుర్తించనంతవరకూ ఈ మత వర్గాల మధ్య వైరం అంతం కాదు, కాబోదు!!

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine