• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » సాక్ష్యం మ్యాగజైన్ పాఠకులకు శుభవార్త!

సాక్ష్యం మ్యాగజైన్ పాఠకులకు శుభవార్త!

గౌరవ నీయులైన పాఠక మిత్రులారా!
మా పత్రిక కుల, మత, వర్గ పక్షపాతాలకు మరియు జాతుల, దేశాల అహంకారాలకు అతీతంగా- సశాస్త్రీయమైన సత్యాలకే ప్రాధాన్యతను ఇస్తుందన్నది మీ అందరికీ ఎరుకే. ప్రస్తుత మన ఆధునిక నాగరిక ప్రపంచానికి- లక్ష బిలియన్ డాలర్ల ప్రశ్న- "నేటి గొప్ప నాగరిక దేశాలకు చెందిన ఆధునిక విద్యావంతులే నేరాలు-ఘోరాల్లో ఎందుకు ముందు వరసలో ఉన్నారు?" అన్నది. దీనికి మా సుదీర్ఘమైన పరిశోధన చెప్పేదేమిటంటే- నేటి ఆధునిక విద్యా విధానంలో, "మనిషి జన్మ వాస్తవ లక్ష్యం ఏమిటీ?" అన్నప్రశ్నకు సరైన సమాధానం లేకపోవటమే! ఆ ప్రశ్నకు సరైన సమాధానాన్ని మన ఉమ్మడి ధర్మ శాస్త్రాలైన వేదోపనిషత్తులు, వాటి సారాంశమైన భగవద్గీత, పరిశుద్ధ బైబిలు మరియు ఖురాన్ సుస్పష్టమైన సమాధానాన్ని ఇస్తున్నాయి.
మన ధర్మశాస్త్రాలు రెండు రకాల విద్యలను గురించి చెబుతున్నాయి. వాటిలో…
1. ‘పారమార్ధిక విద్య’ అనగా తన జన్మను ‘సార్ధకం’ చేసుకొనే విద్య.
2. ‘భౌతిక విద్య’ అనగా తన భౌతిక జీవనాన్ని ‘సౌఖ్యవంతం’ చేసుకొనే విద్య.

     పై రెండు విద్యలలో మొదటి దానిని పూర్తిగా విస్మరించాము కనుక ఒకవైపు- ‘నైతికం’గా అథపాతాళానికి దిగజారి పోతున్నాము. రెండవ విద్యలో తీవ్రంగా కృషి సలుపుతున్నాము కనుక మరొకవైపు- ‘భౌతికం’గా ఆకాశ తారలను దుకుంటున్నాము. అయినా జీవితాలలో సుఖసంతోషాలు లేవు.
    అందుకే విశ్వవిక్యాత శాస్త్రవేత్త ఐన అల్బర్ట్ ఐనిస్టీన్-
"ధర్మం లేని విజ్ఞాన శాస్త్రం కుంటిది. విజ్ఞాన శాస్త్రం లేని ధర్మం గుడ్డిది" అని ప్రకటించాడు.

       నేటి ప్రపంచాన్ని పట్టి పీడించే అతి ప్రధాన సమస్యలు- ‘అనైతికత’, ‘అమానవీయత’ మరియు ‘అనైక్యత’. సకల సమస్యలకు మూల ప్రేరకాలైన ఈ ప్రధాన సమస్యల నుండి బయట పడాలంటే, మన ధర్మ గ్రంధాల ప్రతిపాదిత ‘వాస్తవ ధార్మిక దృక్పథాల’ను ‘అవగాహన’ చేసుకొని, వాటిని ‘ఆచరించటం’ మరియు ‘ప్రచారం’ చేయటం ఒక్కటే ఏకైకమార్గం. ఈ సందర్భంగా యుగ సంస్కర్త ‘స్వామీ వివేకానంద’ చెప్పిన ఒక వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.

              "ప్రవక్తలు వేరు; మతాచార్యులు/పురోహిత వర్గం లేదా మత ప్రచారకులు వేరు. 
                మూఢ విశ్వాసాలను వ్యతిరేకించటం ప్రవక్తల పని కాగా, మూఢ నమ్మకాలను
                పెంచేందుకు నడుం కట్టింది పురోహిత వర్గం. ఈ ప్రత్యేక వర్గానికి ప్రపంచంలో 
               మరేదీ పట్టదు. నిజానికి ఈ ప్రపంచం ప్రకృతి ప్రసాదం. దార్శనికులైన ప్రవక్తలు
               మూఢ విశ్వాసాలను సవాలు చేసినవాళ్లు. కాగా, మతాచార్యులు లేదా పురోహిత
               వర్గమే 2000 రకాల ఆచారాలనూ, కర్మకాండలనూ సృష్టించారు".

        దీని కారణంగా- వ్రవక్తలు దైవం తరఫున అందించిన ‘సశాస్త్రీయ ధర్మం’, ఒకవైపు హిందు- క్రైస్తవ-ముస్లిం వర్గాలకు చెందిన వంచకులైన పండితుల ద్వారా కల్పించబడిన వేలాది మూఢ విశ్వాసాల-మూఢాచారాల క్రింద పడి, ‘కను మరుగు అయిపోయింది’. మరోవైపు  వారు కల్పించిన ‘అశాస్త్రీయ ధర్మం’ జనసామాన్యంలో ‘సర్వసామాన్యం అయిపోయింది’. ఆ తప్పుడు ధర్మం వలన ఒక్క పూజారి వర్గానికి తప్ప సామన్య భక్తులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సరికదా- దానిని  అనుసరిస్తున్నకారణంగా సామాన్య భక్తజనం- ఒకటి భావదాస్యానికి మరియు పైన పెర్కొన్న నైతిక బలహీనతలకు గురైపోతారు. ప్రస్తుత మత వర్గాల నేపథ్యం ఇదే!

ఈ నేపథ్యంలో మనం చేయవలసిన మౌలిక కార్యాలు రెండు: వాటిలో…
1. గీతా-బైబిల్-ఖురన్ శాస్త్రాల ప్రతిపాదిత ‘అర్ధవంతమైన ఆలోచనా-ఆచరణా విధానాలు’ ఏవో వెలికి తీసి, వాటిని ఆచరణలో పెట్టాలి.
2. స్వార్థ పరులైన మతాచార్యులు కల్పించిన ‘అర్ధరహితమైన ఆలోచనా-ఆచరణా విధానాలు’ ఏవో గుర్తించి, వాటిని ఖండించాలి.

మన భారత రాజ్యాంగ ఆదేశమూ అదే!
మన భారత జాతికి ఉమ్మడి లౌకిక ధర్మశాస్త్రం- ‘పవిత్ర రాజ్యాంగం’ అన్నది ప్రతి భారత పౌరుడూ అంగీకరిచేదే! అది మనకు ఇచ్చే ఆదేశము ఏమిటి అని ప్రశ్నిస్తే…
         “ప్రజాబాహుళ్యంలో శాస్త్రీయమైన ఆలోచనాశక్తినీ, మానవతావాదాన్నీ,కార్యాకారణ
           సంబంధాన్నీ తెలుసుకోగలిగిన జిజ్ఞాశనూ సంస్కరణ భిలాషనూ పెంచి పోషించాలి”.
-భారత రాజ్యాంగం (ప్రాథమిక బాధ్యతలు- అధ్యాయం: iv A లో 51 వ అధికరణ ‘A’ (H) ఆదేశం) అని సమాధానం వస్తుంది. దీనిని బట్టి అటు మన ఆధ్యాత్మిక ధర్మ శాస్త్రాలైన గీతా-బైబిల్-ఖురన్ గ్రంధాలు మరియు ఇటు మన ఉమ్మడి లౌకిక ధర్మ శాస్త్రమైన ‘భారత రాజ్యాంగం’ ఏకగ్రీవంగా ఆదేసిచేది ఏమిటంటే-

1.    ప్రజల ‘మస్తిష్కాల’లో పెనవేసుకొని ఉన్న ‘అజ్ఞాన భావాలు’ తొలగి, ‘శాస్త్రీయ భావాలు’ ఏర్పడాలన్నది.
2.    ప్రజల ‘నడవడిక’లో సర్వసామాన్యమై ఉన్న ‘అజ్ఞాన పూరిత ఆచారాలు’ సమసి, ‘జ్ఞాన యుక్త ఆచారాలు’ ఏర్పడాలన్నది.
పైన పేర్కొన్న రెండు పనులు జరగాలంటే- మనం నాలుగు పనులుచెయ్యాలి. వాటిలో…
1. లౌకిక విద్య అనగా ‘భౌతిక విజ్ఞాన శాస్త్రం’లో అద్భుతమగా రాణించాలి.
2. భారత రాజ్యాంగం నిర్దేశించే- పౌరహక్కుల, విధుల, బాధ్యతల సమాచారాన్ని పాఠ్యాంశంగా పెట్టి, వాటి అవగాహన కలిగిచాలి.
3. స్వార్ధపరులైన మతాచార్యులు కల్పించిన ‘మత సంబంధమైన కరమకాండల’ను వెలికి పట్టుకోని, వాటిని ఖండిచాలి.
4. మన ఆధ్యాత్మిక ధర్మ శాస్త్రాలైన ‘గీతా-బైబిల్-ఖురన్ గ్రంధాల విద్య’ను Kg నుండి Pg వరకు అందించాలి.

          అతి వేగంగా జరుగుతున్న ప్రస్తుత మన సమాజ పతనావస్థను నిలిపి, దాని పునర్నిర్మాణం చేయాలంటే- పైన పేర్కొన్న నాలుగు కార్యాలను చేయటం తప్పనిసరి అన్న విషయాన్ని ప్రజాబాహుళ్యానికి విస్తృతంగా అవగత పరచనిదే సాధ్యం కాదు!  అందుకే మేము- ‘సాక్ష్యం మ్యాగ్జిన్’ ద్వారా ‘హిందూ-క్రైస్తవ-ముస్లిం’ వర్గాల ధార్మిక వ్యవస్థలలో ఏర్పది ఉన్న ధర్మశాస్త్ర విరుద్ధ ‘మూఢ నమ్మకాల’ను మరియు ‘మూఢాచారాల’ను ఎత్తి చూపి, వాటిని ‘గీతా-బైబిల్-ఖురన్ గ్రంధాలు’ ఖండిస్తున్న వైనాన్ని చూపిస్తూ, వాటి వలన సమాజానికి కలుగుతున్న ఘోర నష్టాన్ని బహిర్గతం చేయ దలిచాము.

హిందూ శాస్త్రాలకు విరుద్ధమైన కొన్ని హిందూ దృక్పథాలు!
1. విగ్రహారాధాన దృక్పథం, 2. అనేక జన్మల దృక్పథం, 3. దేవుని అవతార వాద దృక్పథం వగైర…

బైబిలు గ్రంధానికి విరుద్ధమైన కొన్ని క్రైస్తవ దృక్పథాలు!
1. త్రిత్వ దృక్పథం, 2. సిలువ మరణ దృక్పథం, 3. దేవుని అవతార వాద దృక్పథం వగైర…

ఖురాను బోధలకు విరుద్ధమైన కొన్ని ముస్లిముల దృక్పథాలు!
1. సమాధుల (దర్గాల) ఆరాధనా దృక్పథం, 2. సిఫారసు దృక్పథం, 3. అమర వీరుల సంస్మరణ పేరిట వార్షికంగా శరీరం రక్తసిక్తం చేసుకునే దృక్పథం (మాతం) వగైర…

       పైన పేర్కొన్న వివిధ దృక్పథాల సత్యతను ‘గీతా-బైబిల్-ఖురన్  గంధాల’ వెలుగులొ ఒక పరిశోధానా పరంపరను ప్రారభిస్తున్నాము. ‘మూఢ నమ్మకాల’ మరియు ‘మూఢాచారాల’ నిర్మూలన కొరకు ప్రారంభించబడిన ఈ ‘మహా యజ్ఞం’లో జాతి ప్రేమికులూ, సమాజ హితైషులూ తప్పక పాల్గోనాలని కోరుతున్నాను. ముఖ్యంగా ‘హిందూ-క్రైస్తవ-ముస్లిం’ వర్గాలకు చెందిన వారు,  దీనిని ‘విమర్శన’ దృష్టితో కాక, ‘పరిశీలన’ దృష్టితో చూడాలని ప్రేమ పూర్వకంగా కోరుతున్నాము. దీనిని జయప్రదం చేయటం- మన ఆధ్యాత్మిక ధర్మశాస్త్రాలైన ‘గీతా-బైబిల్-ఖురన్ గంధాల’ మరియు మన ఉమ్మడి లౌకిక ధర్మశాస్త్రమైన ‘భారత రాజ్యాంగం’ స్ఫూర్తిని పరిపూర్ణం చేసినవారవుతాము.
       ఇక, ఈ ‘మహా యజ్ఞం’ సఫలత ద్వారా మాతమే- "నేటి గొప్ప నాగరిక దేశాలకు చెందిన ఆధునిక విద్యా వంతులలో సైతం ప్రబలుతున్న నేరాలు-ఘోరాలకు పరిష్కారం సాధ్యం కాగలదు!". ఈ సమస్య పరిష్కారానికి ఇది తప్ప, మరొక మర్గాంతరం లేనే లేదన్నది మా దృఢ నిశ్చయం!
Director
Sakshyam Magazine
K.S.Chowdary
వీడియోల కొరకు Sakshyam TV చూడండి

2 Responses to "సాక్ష్యం మ్యాగజైన్ పాఠకులకు శుభవార్త!"

  1. Aravind

    వివిధ దృక్పథాల సత్యతను ‘గీతా-బైబిల్-ఖురన్ గంధాల’ వెలుగులొ ఒక పరిశోధానా పరంపరను ప్రారభిస్తున్నాము. ‘మూఢ నమ్మకాల’ మరియు ‘మూఢాచారాల’ నిర్మూలన కొరకు ప్రారంభించబడిన ఈ ‘మహా యజ్ఞం’ శుభవార్త ఎలా అవుతుంది చౌదరిగారు. కొంతమందికి గుండెల్లో గుబులవుతుంది. ఇప్పటికే క్రైస్తవుల్లో ఉన్న కల్పితాలను,మోసాలను ఎండగడుతూ ఉన్నారు. ఇప్పుడు హిందువులపై,ముస్లింలపై పడుతున్నారన్నమాట.ఆల్ డి బెస్ట్.మరొక ముఖ్య విషయం మీ ఆర్టికల్ చాలా వివరణాత్మకంగా ఉంది. మీ మేగజైన్ నేను మెచ్చేదేమిటంటే ఒక మతానికి కొమ్ముకాయకపోవడం, మత గ్రంధాలు అన్నిటినీ పేర్కొనడం,గౌరవించడమే!

    1. Unknown

      మనందరి సృష్టికర్త అయిన ఆ సర్వేశరుని దయతో పాటు మీలాంటి విజ్ఞుల తోడు ఉంటే, ఎంతటి దుర్మార్గాలనైనా వెలికి తియ్యవచ్చు, ఎండగట్టవచ్చు, నిర్మూలించవచ్చు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, సత్యాన్ని ధర్మాన్ని కోరుకునే వారే తప్ప, వాటిని గుర్తించటానికి, స్థాపించటానికి ముందుకు రావటానికి సాహసించే వారు బహు అరుదైపొయారు. అందుకే అసత్యం, అధర్మం వెర్రితలలు వేస్తుంది. సత్యాన్ని ధర్మాన్ని గురించి తెలిసికూడా నిర్లక్ష్యం చేసేవారూ మరియు వారి సంతానం అసత్యం, అధర్మం కారణంగా విజృంభించే ఘోరమైన దుష్పరిణామాలకు బలికాక తప్పదు.

      దీపం ఉండగానే ఇల్లుచక్కపెట్టుకోవాలి అన్న నానుడి ప్రకారం మన జాతిని మనమే ఉద్ధరించుకోవాలి. ఒకవేళ మనం మన జాతిని సంస్కరించుకునే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, గతంలో మాదిరిగా ఆ సర్వేస్వరుడు పరుల పాలనకు తిరిగి అప్పగించే అవకాశం లేకపోలేదు. అప్పుడు చేతులు కాలినతరువాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. కనుక మన జాతి పతనానికి కారణాలు ఏమిటో గుర్తించవలసిన బాద్యతను మనమే వహించాలి. వాటి పరిష్కారాలనూ మనమే చేపట్టాలి. అప్పుడు మాత్రమే మనం "గీతా-బైబిలు-ఖురాన్" గ్రంధాల ప్రకారం- ఉత్తమ దైవ భక్తులమూ కాగలము, "భారత రాజ్యాంగం" ప్రకారం- ఉత్తమ భారత పౌరులమూ కాగలము. అయితే, మిత్రులు అరవీంధ్ గారూ ఈ "మహా యజ్ఞం"లో మీరూ భాగస్తులు కావాలని, కాగలరని ఆశిస్తున్నాము.

      ‘మూఢ నమ్మకాల’ మరియు ‘మూఢాచారాల’ నిర్మూలన కొరకు ప్రారంభించబడిన ఈ ‘మహా యజ్ఞం’ శుభవార్త ఎలా అవుతుంది? అని మీరు ప్రశ్నించారు. నిజమే ధర్మాన్ని మతంగా మార్చేసి, దానిని వ్యాపారంగా చేసుకొని సంపాదించుకుంటున్నవారికి మరియు ప్రజలను ఆకర్షించటానికి
      కొత్తకొత్త ‘మూఢ నమ్మకాల’ను, ‘మూఢాచారాల’ను సృష్టిస్తున్నవారి గుండెల్లో గుబులు పుడుతుందన్నది నిజమే!

      మీ మేగజైన్ నేను మెచ్చేదేమిటంటే ఒక మతానికి కొమ్ముకాయకపోవడం, మత గ్రంధాలు అన్నిటినీ పేర్కొనడం, గౌరవించడమే! అని మీరు కొనియాడారు. సంతోషం. అదేవిధంగా ఎప్పుడైనా మాలో ఏ చిన్నపాటి పక్షపాతత వైఖరిని గమనించినా, దానినీ సరిచెయ్యాలని మిమ్మల్ని సవినయంగా కోరుతున్నాము.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine