• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)

M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)

సర్వశక్తిగల దేవుని పేరుతో… 
యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30

గౌరవ నీయులైన పాఠక మిత్రులారా!
మనిషిలో ప్రక్కృతి సిద్ధంగానే ‘మంచి’-‘చెడు’ గుణాలు మిశ్రమంగా ఉంటాయి. తన మనో ప్రపంచంలో విజృంభిస్తూ ఉన్న ‘చెడు’ గుణాలను ఎంతవరకు ‘నియంత్రిస్తాడు’ మరియు అదే మనో ప్రపంచంలో పెల్లుబుకుతూ ఉన్న ‘మంచి’ని ఎంతవరకు ‘వికాస పరుస్తాడు’ అన్నదే మనిషి జీవితానికి సర్వసృష్టికర్త పెట్టిన పరీక్ష! 

అయితే ఈ రహస్యాన్ని గుర్తించని వారు, సామాన్య ప్రజల నుండి ‘అపార గౌరవ మరియాదల’ను మరియు ‘అపార సంపద’ను ‘అడ్డమైన మార్గాం’లో సంపాదించాలనే ‘చెడు భావన’ నెత్తికెక్కిన వారు పవిత్ర ధార్మిక  వ్యవస్థలో ప్రవేసించి, కొన్ని ‘తప్పుడు విశ్వాసాల’ను మరియు ‘తప్పుడు ఆచారాల’ను కల్పించి, వాటిని పవిత్ర ధర్మగ్రంధాల ప్రబోధనలుగా బొంకుతూ మార్కెటింగ్ చేస్తారు. సామాన్య భక్తజనం మనస్తత్వం ధర్మ గ్రంధారాల ఆధారంగా చెబితేనే తప్ప ఏవిషయాన్నీ వినరు.
గమనిక: అందుకే తమ కాల్పనిక ’తప్పుడు విశ్వాసాల’ను మరియు ‘తప్పుడు ఆచారాల’ను ధర్మగ్రంధాలలో ఉన్నట్లు ప్రజలను  భ్రమింపజేయటానికి ఈ వంచక పండితులు ధర్మశాస్త్రాలలోని వాక్యాలను సాగాదీస్తూ, వంగదీస్తూ ఉంటారు! కాని వాటిని ‘వాంగ్మూలం’ (Statement) రూపంలో చూపించలేరన్నది ఈ మొత్తం చర్చలో అత్యంత గమనార్హ విషయం!
ఉదాహరణకు: నర హత్య, వ్యభిచారం, దొంగతనం వంటి నేరాలకు జంతుబలుల ద్వారా పాపపరిహారం పొందినట్లు కనీసం ఒక్కగాని ఒక్క ఆధారాన్ని పూర్తి పాత నిబంధన చరిత్రలో ఎక్కడా చూపించ లేరు! ‘రక్తం ద్వారా మాత్రమే పాప పరిహారం అవుతుంది’, ‘రక్తం ద్వారా మాత్రమే నిత్యజీవం లభిస్తుంది’ వగైరా… విషయాలను ‘వాంగ్మూలం’ (Statement) రూపంలో చూపటం ఏ బోధకునికీ సాద్యం కాదు, కాబోదు!     

యేసు సిలువ మరణం తప్పని సరి కావాలంటే- దానికంటే ముందు, ‘పాపపరిహారానికి ఒక్క రక్తం మాత్రమే తప్పనిసరి’ అని పరిశుద్ధ బైబిలు గ్రంధం ప్రకటించటం షరతు! పాపపరిహారానికి ఒక్క రక్తం మాత్రమే కాక, వేరే ప్రత్యమ్నాయాలు కూడా ఉన్నాయని ఒకవేళ పరిశుద్ధ బైబిలు గ్రంధం చూపించి ఉంటే, యూదుల రక్తదాహం క్రమంలో అనేక మంది ప్రవక్తల సిలువ దండనలలో భాగంగానే యేసుకు కూడా సిలువ దండన వేయబడిందని తేలుతుంది. అప్పుడది ఒక ‘సాధారణ హత్యాయత్న’మే తప్ప ‘పవిత్ర సిలువ బలియాగము’ కాజాలదు కదా!పాపపరిహారానికి బైబిలు చూపే అనేక ప్రత్యామ్నాయాలను ఈ క్రింది వాక్యాధారంగా గనించగలరు!
1. చెడు మాని, మంచి చేయటం వలన పాపాలకు పరిహారం లభిస్తుంది!
           నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను
          వెదకి తమ చెడు మార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి
          ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.                                                                                            -2 వ దినవృత్తాంతాలు 7:14
2. పాపములను క్షమించమంటే పాపాలకు పరిహారం లభిస్తుంది!

       ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ఈ ప్రజలదోషమును
       పరిహరించి యున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజల దోషమును దయచేసి
       క్షమించుమని యెహోవాతో చెప్పగా యెహోవానీ మాటచొప్పున నేను క్షమించియున్నాను.                                                                               -సంఖ్యాకాండము 14:19,20
3. పాపములను, దోషములను ఒప్పుకుంటే పాపాలకు పరిహారం లభిస్తుంది!  
       నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా
       సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు కొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును
       పరిహరించియున్నావు.                                             -కీర్తన 32: 5
      పైవాక్యాలలో పాపాల పరిహారానికి- 1. చెడు మాని, మంచి చేయటం 2. పాపములను క్షమించమని యెహోవాను కోరటం 3. పాప ములను, దోషములను యెహోవా యెదుట ఒప్పుకోవటం అనే మూడు ప్రత్యామ్నాయాలను పరిశుద్ధ బైబిలు గ్రంధం ప్రతిపాదిస్తుంది! పాత నిబంధన కాలంలో- కేవలం ఒక్క రక్తం ద్వారా తప్ప పాప పరిహారానికి మరొక ప్రత్యామ్నాయం లేనే లేదని అధిక శాతం క్రైస్తవ పండితులు చేస్తున్న వాదన అసత్య వాదన అని పరిశుద్ధ బైబిలు గ్రంధ వాక్యాల ద్వారా తేలిపోతుంది.
       గమనిక: వాక్యాధారంతో తప్ప వ్యర్ధమైన విషయాలతోగాని, వాక్యాల వక్రీకరణతోగాని కాక, బైబిలు గ్రంధ వాక్యాల ‘వాంగ్మూలం’ (Statement) రూపంలో తమ సిద్ధాంతానికి అధారాలు చూపించాలని క్రైస్తవ మిత్రులకు మనవి
M.A.Abhilash
9666488877
tmcnewstmc@gmail.com
వీడియో ప్రసంగాల కొరకు Sakshyam TV చూడండి.

13 Responses to "M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)"

  1. Zilebi


    చాలా సరి ఐన మాట చెప్పారు : ప్రభువు శిలువ పై మరణించ లేదు ; ఆ తరువాయి భారతదేశము నకు వచ్చి చాలా కాలము జీవించిన పిదప మరణించెను

  2. Unknown

    మీరు జిలేబీయో, జాంగ్రీయో నాకు తెలియదుగాని యేసుప్రభువు భారతదేశం వచ్చారని రుజువు చేయగలర? ఏదనుకుంటే అది వ్రాసేస్తే సరిపోతుందా? రుజువులు అవసరం లేదా? ప్రభువు శిలువ పై మరణించ లేదని మీకు తెలుసా?

    1. Unknown

      డేవిడ్ లించ్ గారు యేసు సిలువై మరణించినట్లు నిరూపిస్తానని చాలెంజ్లు విసిరారు కదా? నిరూపించండి.మాకందరికీ తెలుస్తుంది కదండీ!

    2. శ్యామలీయం

      ఈ అసలైన క్రైస్తవం అన్న వ్యాసాన్ని పరిశీలించండి.

    3. Unknown

      ముందుగా మా శ్యామలీయం మాష్టారిగారికి కృతజ్ఞతలు. చాలా గొప్ప వ్యాసాన్ని పరిచయం చేశారు. నిజమైన క్రైస్తవ్యం,వైధికం ఊకటే అన్నది బైబిల్, వైధిక శాస్త్రాలను లోతుగా పరిశీలించినవారికి ఇట్టే తెల్సిపోతాయి. అయితే వ్యాసంలో వైధికానికి,క్రైస్తవానికి వ్యతిరేకమైన కొన్ని అంశాలను కూడా పేర్కొనడం జరిగింది. వీలు వెంబడి చర్చల్లోకి తీసుకొస్తాము.

    4. Unknown

      మిత్రులు డెవిడ్ లించ్ గారూ! మీరు-
      //యేసు ప్రభువు మనందరి పాపమునకు రక్తం చిందించి మన కాడిని తొలగించుట బైబిల్లో స్పష్టముగా పేర్కొనబడుట మీరు గమనించకపోవుట విచారకరం.\\ అని మీరు అన్నారు. అయితే మీరు దానికి ఎలాంటి బైబిలు ఆధారాన్ని చూపించ లేదు. ఈ విషయం అంతకంటే విచారకరం!

      //మీరు చర్చ అంటున్నారు కాబట్టి మేము ప్రభువు చిత్తముతో నిరూపిస్తాము\\ అని మీరు అన్నారు. అది వాస్తం కాదు. ఎందుకంటే-

      //ఈ సాక్ష్యం మేగజైన్వి అన్నీ కట్టుకధలని నిరూపించగలము. మీ వాదనలకు బైబిల్ తోనే గట్టిగా సమాధానము ఇస్తాము. నేను రెడీ! మీరు తోక ముడుచుకోక తప్పదు\\. అని (Rev & Apo : David Lynch, December 1, 2015 at 11:06 AM) వ తారీకున మిరు చాలంజ్ విసిరారు కనుకనే మేము "పరిశుద్ధ బైబిలు ప్రకారం- యేసు సిలువపై మరణించలేదు" అనే అంశాన్ని ప్రారంభించాము డెవిడ్ లించ్ గారూ!.

      కాబట్టి మీరు ఈ అంశానికి భిన్నంగా మాటలాడుతున్న వారిని పట్టించుకోకుండా, బైబిలు ఆధారాలు లేని పైపై మాటలను చెప్పకుండా "వాక్యం టు వాక్యం" మాత్రమే మాటలాడాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను. మన ఈ చర్చను వేలాదిమంది చదువుతున్నారు. కనుక దీనిని మనం ఒకటి- వాక్యాధారంగానూ రెండు- ఉత్తమంగానూ సాగించవలసి ఉంది. సర్వశక్తిగల దేవ దేవుడు- బైనిలు ప్రబోధిత సత్యాలపైనే మనందరినీ నడిపించుగాక! ఆమేన్.

    5. Unknown

      మిత్రులు అభిలాష్ గారికి శుభాభివందనములు. చాలా మంచి విషయములను పేర్కొనిరీ.క్రైస్తవమన్నది బ్రిటీష్ పాలకులు పోతూ,పోతూ భారతదేశంలో వదిలినటువంటి ఒక భయంకరమైన అనుక్షిపణి దీని ప్రభావం పెరుగుతూ,పెరుగుతూ ఇక్కడి సంస్కృతిని నాశనం చేయుట మనం గమనిస్తూనే యుంటిమి. ఇక మీ అంశమునకు వస్తే క్షమిస్తే పోయే పాపములకు ఒకడు శిలువపై రక్తం చిందించాల్కిన అవసరమున్నదా? ఇది ఆటవికముగాను,హాస్యాస్పదముగాను యున్నది.థర్మాన్ని బోధిస్తున్న యేసును ఆనాటి యూద పండితులు తమ ఆగడాలు అంతరించిపోతాయన్న భయము కలిగి యేసును చంపాలని చూశారు.కానీ ఆయన చనిపోకుండా కొంతమంది శిష్యులు దాచిపెట్టారు.ఇవి ఇప్పుడున్న బైబిల్ పుస్తకములలో పూర్తిగా లేకపోవచ్చును. కానీ ఎన్నో పరిశీనాత్మకమైనటువంటి గ్రంధములలో స్పష్టముగా పొందుపర్చబడియున్నవి. మేము నమ్మినదే సత్యము గుడ్డిగా వాదించే క్రైస్తవులకు ఎన్ని విషయములు తేటపర్చినను వృధా ప్రయాసే!వారు నిజానికి బైబిల్ ను కూడా పూర్తిగ నమ్ముట జరుగదు.ఇక ఆలోచించాల్సిన విషయము యూదులు యేసును శిలువ వేసిరి. ఈ క్రైస్తవులు మాగురించే శిలువ ఎక్కాడని పండుగలు చేసుకుంటూ యుండిరి. ఇంతకీ వీరు సమర్ధిస్తున్నది యూదులనా? లేక యేసునా?

    6. Unknown

      గౌరవనీయులైన గోపాల్ శర్మగారికి నమస్కారాలు! చాలా కాలం తరువాత దర్శనం ఇచ్చారు, సంతోషం. ఒక్క కైస్తవమే గాక, ఇస్లాం, వైదికం ఇంకా తదితర ధార్మిక వ్యవస్థల పై "నిస్వార్ధ పరులైన ధార్మిక పండితుల" అధిపత్యం కంటే, "సామ్రాజ్యవాదుల" ఆధిపత్యం అధికంగా ఉంది. ఇది మనకు అర్ధం కావాలంటే- ప్రజలు మతాలు మారుతున్నా వారిలో "మానవత్వం" మటుకు రావకపోవటమే! దీనికి కారణం ఏమితంటే- "నిస్వార్ధ పరులైన ధార్మిక పండితుల" మనుషుల "మనసుల"ను "చెడు" నుండి "మంచి" వైపునకు మార్చుతారు. కాని "సామ్రాజ్యవాదులు" అయితే, "మనసుల"ను కాక "మనుషుల"ను "ఒకవర్గం" నుడి "మరొకవర్గం"లోనికి మారుస్తారు! దీని వలన "వర్గ మార్పిడి" జరుగుతుందే తప్ప, "ప్రవర్తనలో మార్పిడి" జరగదు. అదే దౌర్భాగ్యం నేడు అన్ని మత వర్గాలలోనూ నడుస్తుంది. ఈ దుస్థితి నుండి ధార్మిక వ్యవస్థను కాపాడాలంటే, ధర్మాన్ని వ్యాపరంగా చేసుకున్న "స్వార్ధపరులైన పండితులు" కాక, "నిస్వార్ధ పరులైన ధార్మిక పండితులు" ముందుకు రావాలి. మీరేమటారు గోపాల్ శర్మగారూ!

    7. Zilebi

      మీరు లించో గించో నాకు తెలీదుస్మీ అండి కాని ప్రభువు భారద్దేశమ్ వచ్చి యే తన తనువుని బాసెను ఇదియె సత్యము

      ప్రభువు రక్తమున పాపములు శమించు గాక

  3. Unknown

    సోదరులు డేవిడ్ లించ్ గారూ! పరిశుద్ధ బైబిలు గ్రంధం ప్రకారం- పాపపరిహారానికి ప్రత్యామ్నాయం ఏమిటో సవివరంగా తెలపవచ్చు కదా! మీరు కాలాయాపన ఎందుకు చేస్తున్నారు? మీ సిద్ధాంతానికి పరిశుద్ధ బైబిలు గ్రంధంలో ఆధారాలు లేకే కదా!? అటువంటప్పుడు, మీరు //ఈ సాక్ష్యం మేగజైన్వి అన్నీ కట్టుకధలని నిరూపించగలము. మీ వాదనలకు బైబిల్ తోనే గట్టిగా సమాధానము ఇస్తాము. నేను రెడీ! మీరు తోక ముడుచుకోక తప్పదు\\. అని, ఇంకా- //మీరు చర్చ అంటున్నారు కాబట్టి మేము ప్రభువు చిత్తముతో నిరూపిస్తాము\\ అని ఎందుకు సవాలు విసిరారు? అలాగే, //యేసు ప్రభువు మనందరి పాపమునకు రక్తం చిందించి మన కాడిని తొలగించుట బైబిల్లో స్పష్టముగా పేర్కొనబడుట మీరు గమనించకపోవుట విచారకరం అని \\ (Rev & Apo : David Lynch, December 1, 2015 at 11:06 AM) వ తారీకున అన్నారు. అలాంటి ప్రకటనలను ఆర్భాటంగా చేసేసి, మీ విశ్వాసాన్ని బల పరిచే బైబిలు వాక్యాన్ని కనీసం ఒక్కటి కూడా చూపకపోవటం అన్నది- "పాపపరిహారానికి రక్తప్రోక్షణమవశ్యం" అన్నది పరిశుద్ధ బైబిలు గ్రంధ ప్రబోధనకు వ్యతిరేకమైన ఒక కాల్పనిక అన్య అసత్య విశ్వాసమని అర్థం అవుతుంది.

    ఇంతకూ యేసు సిలువ బలియాగము జన్మ పాపా పరిహారానికా? కర్మ పాపాల పరిహారానికా? గతంలో జరిగి పోయిన పాపాల పరిహారానికా? లేక భవిష్యత్తులో జరగబోయే పాపాల పరిహారానికా? అన్నది కూడా మీరు తెలపవలసి ఉంటుంది!

  4. Unknown

    ముఖ్యముగా- "పరిశుద్ధ బైబిలు గ్రంధం ప్రకారం- యేసు సిలువపై మరణించలేదు" అన్న అంశానికి సంబంధించిన రెండవ భాగం వచ్చేసింది. కాని, మీది ఒక్క వాక్యం కూడా ఇంతవరకూ రాలేదు. మీరు మా మీద విసిరిన సవాలును చూడాలని వేలాది మంది"సాక్ష్యం మ్యాగ్జిన్" పాఠకులు ఎదురుచూస్తున్నారు.

    1. Aravind

      ఇంకెక్కడి డేవిడ్ లించ్? ఎప్పుడో పారిపోయాడు.వీళ్ళు మాయమాటలు చెప్పి హిందువులను మార్చడానికి తప్ప వీళ్ళకి అంత నాలెడ్జ్ ఎక్కడ ఎడ్చింది. కారు కూతలు కోస్తారు. ఎవడైనా ధైర్యంగా ముందుకొస్తే తోక ముడుచుకుని పారిపోతారు. అంతా మాయగాళ్ళు. మీ పని మీరు కొనసాగించండి. మాలాంటివాళ్లకు చాలా ఉపయోగం. కొన్ని రోజుల క్రితం రాముడు,కృష్ణుడు,హిందూ దేవతలు సాతానూలని ఒక పాష్టర్ అరుస్తుంటే నాకు భలే ఒళ్ళు మండింది. పరాయి మతం కోసం ఇక్కడి పుణ్యపురుషులను సాతానులని దూషించడమా? వీళ్ళను ఏమి చేయాలి? మాకు మరింతగా బైబిల్ సమాచారం కావాలి. ఈ "సాక్ష్యం మేగజైన్" ద్వారా మంచి పని చేస్తున్నారు.కృతజ్ఞతలు.

    2. Unknown

      హలో మిస్టర్ అరవింద్.నీవు చాలా ఓవరేక్షన్ చేస్తున్నావు. ఎవడో మీ దేవుళ్ళను దూషించాడని మొత్తం క్రైస్తవులను దూషిస్తున్నారు తమరి బుద్ధి ఏమైంది? తోక ముడుచుకుని పారిపోవాల్సిన అవసరం మాకు లేదు. యేసు" శిలువపై మరణించాడని" నిరూపిస్తాను.ఇకనుండీ పరిశీలించుకోండి.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine