• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -2 (పాపమంటే ఏమిటి? పాపాలు ఎన్ని రకాలు?)

M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -2 (పాపమంటే ఏమిటి? పాపాలు ఎన్ని రకాలు?)

గౌరవ నీయులైన పాఠక మిత్రులారా!
మొదటి భాగంలో, పాప పరిహారానికి - 1. ‘చెడు మాని, మంచి చేయటం’ 2. ‘పాపములను క్షమించమని యెహోవాను కోరటం’  3. ‘పాప ములను, దోషములను యెహోవా యెదుట ఒప్పుకోవటం’ అనే మూడు ప్రత్యామ్నాయాలు పాతనిబంధన కాలంలో ఉన్నాయని పరిశుద్ధ బైబిలు గ్రంధం ద్వారా తెలుసుకున్నాము.  దీనిని బట్టి, పాత నిబంధన కాలంలో- కేవలం ఒక్క రక్తం ద్వారా తప్ప పాప పరిహారానికి మరొక ప్రత్యామ్నాయం లేనే లేదని అధిక శాతం క్రైస్తవ పండితులు చేస్తున్న వాదన ‘అసత్య వాదన’ అని పరిశుద్ధ బైబిలు గ్రంధ (2 వ దినవృత్తాంతాలు 7:14; సంఖ్యాకాండము 14:19, 20;  -కీర్తన 32: 5) వాక్యాల ద్వారా సుస్పష్టమయ్యింది.

మానవాళి జీవన ప్రణాలిక ఏమిటి?  
       రోగనివారణ జరగాలంటే, రోగము రాకకు గల కారణాలు ఏమిటో ముందస్తుగా గుర్తించటం అనివార్యం. ఎందుకంటే- వచ్చిన ద్వారం గుండానే దానిని సాగనంపటం సులువు అవుతుంది కనుక! అయితే ‘పాపము’ అనే ఈ భయంకరమైన రోగము తలెత్తటానికి పరిశుద్ధ బైబిలు గ్రంధము తెలిపే ‘మూల కారణములు’ ఏమిటో తెలియాలంటే- దేవ దేవుడు, మానవాళి కొరకు చేసిన ‘జీవన ప్రణాళిక’ను గురించి కొంతవరకు తెలుసుకోవాలి. దానికి సంబంధించి  ఈ క్రింది వాక్యాన్ని గమనించగరు.
              నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను
              ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.                                                                                -ద్వీతీయోపదేశకాండము 30:19

         పై వాక్యము ద్వారా, మనిషి ముందు- ‘జీవము లేక ఆశీర్వాదము’ మరియు ‘మరణము లేక శాపము’ అనే రెండు ఆప్షన్స్ పెట్టినట్లు సర్వోన్నతుడైన దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రెండు గమ్యాలకు చేర్చే ‘మంచి’ మరియు ‘చెడు’ అనే రెండు విధానాలను కూడా ఆయన పెట్టాడు. వాటిని చూపించే ‘పట్టిక’ పేరే ‘ధర్మశాస్త్రం’. ఈ క్రింది గమనించగలరు.

          యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును
కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని
       పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.                                                                                                -నిర్గమకాండము 16:4

         ‘చేయవలసిన’ మరియు ‘చేయకూడని’ ఆజ్ఞలను అంటే- (Dos and Don’ts) ను గురించి తెలిపేదే ‘ధర్మశాస్త్రం’. దేవ దేవుడు దానిని మనకు ఇచ్చింది, దాన్ని పొగొడుతూ కూర్చోవటానికో లేక మోసుకుంటూ తిరగటానికో కాదు. మనకు ‘మేలు’ కలుగుట కొరకు ఆయన పాటించమన్న అందులోని 'ఆజ్ఞల’ను పాటిస్తూ మరియు మనకు ‘కీడు’ కలుగకుండుట కొరకు ఆయన మనకు వారించిన అందులోని 'ఆజ్ఞల’కు దూరంగా ఉంటూ, ఈ జీవితాన్ని పాటించటానికి. అలా పాటిస్తారా లేదా అని నేను మిమ్మును ‘పరీక్షించున్నా'ను అని పై వాక్యంలో దేవ దేవుడు తెలుపుతున్నాడు!

           ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రంలోని 'ఆజ్ఞల’ను పాటిస్తే, ఇహలోక జీవితంలో ‘ఆశీర్వాదము’ మరియు ‘పరలోకజీవితం’లో ‘నిత్య జీవము’ను  లభిస్తాయి. ఒకవేళ  ధర్మశాస్త్రంలోని'ఆజ్ఞల’ను పాటించకపోతే, ‘ఇహలోక జీవితం’లో ‘శాపము’ను మరియు ‘పరలోకజీవితం’లో ‘నిత్య మరణము’నకు గురికావలసివస్తుంది. ఈ మహా కార్యమును ప్రారంభించి, దీనిని గాలికి వదిలేసి ఆయన ఎక్కడయినా వెళ్ళి పడుకున్నాడా? లేక మానవాళికి పరీక్ష స్థలమైన ఈ భూగోళంపై దృష్టి పెట్టి ఉన్నాడా? అన్న ప్రశ్నలకు పరిశుద్ధ బైబిలు గ్రంధం ఇచే సమాధానం ఏమిటో ఈ క్రింది గమనించగలరు.

              యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డ వారిని మంచి వారిని అవి
              చూచుచుండును.                 -సామెతలు 15:3
                     
             సకల మనవాళికి పరీక్ష స్థలమైన ఈ భూగోళంపై నివసిస్తున్న మంచి వారిపై మరియు చెడ్డ వారిపై కూడా ఆయన నిరంతరం తన దృష్టిని పెట్టి ఉన్నాడని పైవాక్యం ద్వారా బోధ పడుతుంది. అంటే మానవాళి జీవిత పరీక్ష సునిసితమైన నిఘాలో జరుగుతుందన్నమట! పరిశుద్ధ బైబిలు గంధం ప్రకారం- ఇదీ దేవ దేవుడు రచించిన మానవ జీవన ప్రణాళిక!

పరిశుద్ధ బైబిలు ప్రకారం- పాపము అనగా ఏమిటి?
             ఏ ‘పాప’క్షమాపణ కొరకు ‘రక్త ప్రోక్షణం’ తప్పనిసరి అని నేటి అధికశాతం బోధకులు ప్రకటిస్తున్నారో, ఇంతకూ ఆ ‘పాపం’ అంటే ఏమిటీ? అది ఏన్నిరకాలూ? అన్న ప్రశ్నలకు సుస్పష్టమైన సమాధానాలను ముందుగా తేలుసుకోవటం ఎంతైనా అవసరం. ఈ క్రింది వాక్యాన్ని గమనించగలరు.

             పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము. 
                                                                (-1 వ యోహాను 3:4), 
             ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము…  -రోమీయులకు 6:23

           పై వాక్యమును బట్టి- ‘పాపము’ అనగా ‘ఆజ్ఞ తిక్రమము’ అని అర్థం అవుతుంది. అంటే- మానవాళి ‘ఇహ’-‘పరాల’ సాఫల్యానికి దేవ దేవుడు ఏ 'ఆజ్ఞల’ను ఇచ్చాడో వాటిని అతిక్రమించటం వలన ఇటు ‘మనిషి వ్యక్తిగత జీవితం’ మరియు అటు ‘సాంఘీకంగా ఇతరుల జీవితాలు’ నాశనం అయిపోతాయి. అందుకే ‘ఆజ్ఞ తిక్రమము’ను ‘పాప’ కార్యముగా నిర్ధారిచాడు ఆ దేవ దేవుడు.

పాపాలు ఎన్నిరకాలు?
           ‘పాప’మంటే ఏమిటో అర్థమయ్యింది. ఇక ‘పాపం’ ఒకే రకంగా ఉంటుందా? లేక వివిధ రకాల పాపాలు ఉంటాయా? అన్నది తెలుసుకోవలసి ఉంది. సాధారణ పాపములు మరియు గొప్ప పాపము క్షమించ బడే పాపములు క్షమిచ బడని పాపములు వగైరా… ఉదాహణకు:

గొప్ప పాపము! Great Sin!
            మరునాడు మోషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా
            యొద్దకు కొండ యెక్కి వెళ్లెదను; ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము 
            చేయగలనేమో అనెను.                          -నిర్గమకాండము 32:30

         పాపాలలో సాధారణమైనవే కాక ‘గొప్ప పాపము’ (Great Sin) కూడా ఒకటి ఉంటుందని పైవాక్యమును బట్టి అర్థమౌతుంది. ఇంతకూ ఏమిటి ఆ ‘గొప్ప పాపము’ అని ప్రశ్నిస్తే, పై వాక్యానికి కొనసాగింపుగా ఉన్న ఈ క్రింది వాక్యం ఇస్తున్న సమాధానాన్ని గమనించగలరు.  

           అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి అయ్యో యీ ప్రజలు గొప్ప
           పాపము చేసిరి; వారు బంగారు దేవతను తమకొరకు చేసికొనిరి.                                                                                                            -నిర్గమకాండము 32: 1
         ఈ వాక్యమును బట్టి- దేవ దేవునితో పాటు మరొక దేనినైనా సహవర్తులుగా చేస్తే, అదే ఆయన దృష్టిలో ‘గొప్ప పాపము’ (Great Sin) అవుతుంది! తనతోపాటు ఇతరులను సహవర్తులు చెయ్య కూడదనే విషయంలో దేవ దేవుడు చేస్తున్న హెచ్చరిక లోని ‘స్పష్టత’నూ మరియు ‘తీవ్రత’నూ ఈ క్రింది వాక్యంలో గమనించగలరు.

           నేను మీతో చెప్పినవాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను; వేరొక దేవుని పేరు
           ఉచ్చరింప కూడదు; అది నీ నోటనుండి రానియ్య తగదు. -నిర్గమకాండము 23: 13
         
          ఒకే ఒక్కడైన దేవ దేవుడు తనను తప్ప ఇంతరులెవరినీ ‘దేవుని’గా గుర్తించకూడదు, వేరొకని నైనా దేవుడు అని నోటితో కనీసం ఉచ్చరించకూడదు అని ఎంతో ‘స్పష్టం’గా మరియు ఎంతో ‘తీవ్రం’గా హెచ్చరించినప్పటికీ, నేటి అధికశాతం క్రైస్తవ బోధకులు- ‘యేసు దేవుడు’ అని మరియు ‘పరిశుద్ధాత్మ దేవుడు’ అని దేవ దేవుని ఆ ఆజ్ఞను రెండు సార్లు అతిక్రమిస్తున్నారు! ఈవిధంగా క్రైస్తవులలోని అధికులు రెండింతలు ‘గొప్ప పాపము’ (Great Sin) నకు పాల్పడుతున్నట్లు పరిశుద్ధ బైబిలు గంధం ద్వారా తెలుస్తుంది. మొత్తమ్మీద ‘గొప్ప పాపము’ (Great Sin) అన్నది కూడా ఒకటి ఉన్నదని తెలుస్తుంది.

క్షమాపణ ఉన్న పాపము! క్షమాపణ లేని పాపము!!
            మనుష్యకుమారునికి (అనగా యేసుకు) విరోధముగా మాటలాడువానికి
           పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి
ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.–మత్తయి 12:32
 
పై వాక్యలో రెండు రకాల పాపాలు కనిపిస్తున్నాయి. వాటిలో…
1. మనుష్య కుమారునికి అంటే- యేసుకు విరోధాముగా మాటలాడు వానికి కలిగే పాపానికి పాపక్షమాపణ ‘ఉంది’.
2. పరిశుద్ధాత్మకు విరోధాముగా మాటలాడు వానికి కలిగే పాపానికి పాపక్షమాపణ ‘లేదు’.

బుద్ధిపూర్వకంగా చేసే పాపాలు!
          మనిషికి ధర్మశాస్త్రాలతో సంబంధం లేకుండానే అతనికి ఉన ‘విచక్షణా జ్ఞానం’తోనే ‘మంచి’-‘చెడు’లను గుర్తిస్తాడు. అయినప్పటికీ తన స్వార్ధం కొరకో, స్వలాభం కొరకో చెడని తెలిసికూడా ‘చెడు’ చేస్తాడు! దానినే బుద్ధి పూర్వకంగా చేసే ‘పాపమ’ని అంటారు. ఈ క్రింది బైబిలు వాక్యాన్ని గమనించగలరు.
            అయితే దేశమందు పుట్టినవాడేగాని పర దేశియే గాని యెవడైనను సాహసించి
            పాపముచేసినయెడల. వాడు యెహోవాను తృణీకరించినవాడగును గనుక అట్టి
            వాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టి వేయబడును; వాడు యెహోవా
            మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయ
           బడును; వాని దోషశిక్షకు వాడే కారకుడు.     -సంఖ్యాకాండము 15:30, 31

పొరపాటుగా జరిగే పాపాలు!
            ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారి మధ్యను నివసించు పరదేశి యేగాన
పొరబాటున ఎవడైనను పాపము చేసినయెడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను.            -                                                               -సంఖ్యాకాండము 15:29
   ఇవే కాక, ఇంకా వివిధ రకాల పాపాలు ఉన్నాయని బైబిలు గంధం తెలియజేస్తుంది. అయితే, ఏ యే పాపాలకుఏయే విధమైన ప్రాయశ్చిత్తాలు ఉన్నాయని పరిశుద్ధ బైబిలు గంధం తెలియపరుస్తుందో తదుపరి భాగంలో తెలుసుకుందాము!
M.A.Abhilash
09666488877
tmcnewstmc@gmail.com
వీడియో ప్రసంగాల కొరకు Sakshyam TV చూడండి.

5 Responses to "M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -2 (పాపమంటే ఏమిటి? పాపాలు ఎన్ని రకాలు?)"

  1. Unknown

    మీరు తెలిపినటువంటి విషయములను మేము కాదనడం లేదే! మరొక పాపం కూడా బైబిలో ఉంది. అది జన్మత:పాపం దానిని ఎందుకు దాస్తున్నారు? థర్మశాస్త్రం శాపగ్రస్తమైనది. దాని నుండి, పైన పేర్కొన్న పాపముల నుండి ప్రభువు రక్తంతో పవిత్రులునుగా చేశారు."ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల" అని ఎవరి గురించి చెప్పబడింది? అది యేసుప్రభువులవారి గురించి కాదా? ఆయన కేవలం క్రైస్తవుల పాపాన్ని మాత్రమే కాదు లోక జనులను తన రక్తం ద్వారా పవిత్రులను గావించాడు.దాని నిమిత్తమే తండ్రియైన దేవుడు తన యేక కుమారుడిని బలి గావించి మనలకు రక్షణ కలిగించాడు. దాని గురించి యేసుప్రభువులవారు శిలువపైకెక్కి ఆత్మార్పణ చేసుకుని మనకోసం శిలువపై మరణించి మూడవదినమున తిరిగి లేచారు.మేమేమి గ్రుడ్డిగా నమ్మడం లేదు ఇవిగోండి ఆధారాలు.1.కోరింధి:15:14-28,మత్తయి 28:6-8,1.కోరింధి:6:14, అపోస్తలు 10:39-43,కొలసీ 1:18-23,ఎపెసీ 1:2-14, రోమా 5:12-21,1పేతురు 2:22-24,మార్కు 16:1-20, హెబ్రి 9:10-28,యోహాను 19:1-4,11:25,8:18-24,1పేతురు 1:4,అపోస్తలులు 17:31-33,మార్కు 15:25,37,యోహాను 6:39,1కోరింధీ 15:3 ఇలా ఎన్నో ఆధారాలు బైబిల్ గ్రంధంలో దేవుడు వ్రాయించాడు.ఇవేవీ మీరు పరిశీలించకుండా "యేసు శిలువపై మరణించలేదని" ప్రకటించడం న్యాయమా? సమంజసమా? ఇప్పుడు తమరి సమాధానం చెప్పండి?

    1. Unknown

      ప్రియమైన సోదరులు డేవిడ్ లించ్ గారికి స్వాగతం! సుస్వాగతం!! ఈ విధమైన మీ రాకడనే మేము ఎంతగానో కోరుకుంటున్నాము. మీరు రానే వచ్చారు. మా తరఫున మరియు ‘సాక్ష్యం మాగ్జిన్’ పాఠకుల తరఫున మీకు శుభాభినందనలు! ప్రేమ పూర్వకమైన మా ఈ చర్చ మాకూ, మీకూ మరియు సకల పాఠక మిత్రులకూ ఇహ-పరాల సాఫల్యానికి మర్గం అవును గాక!

      సర్వశక్తిగల దేవ దేవుడు తన పరిశుద్ధ గ్రంధంలో పాపపరిహారానికి దేనిని ప్రత్యామ్నాయంగా ఉంచాడో దానినే మనందరికీ బయలు పరచి, మన వ్యక్తిగత, సామూహిక జీవితాలలో నిండిపోయిన పాపములను పూర్తిగా తొలగించుకునే సౌభాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక! ఆనేన్.

    2. Unknown

      మిత్రులు డేవిడ్ లించ్ గారూ! మీరు (December 29, 2015 at 6:53 PM) న పెట్టిన కామెంట్ పై మా వివరణను గమనించగలరు.
      //మీరు తెలిపినటువంటి విషయములను మేము కాదనడం లేదే!\\ అని మీరు అంగీకరిచింది- పాతనిబంధన కాలంలో- పాప పరిహారానికి ఒక్క రక్తపొక్షణం మాత్రమే కాక, (2 వ దినవృత్తాంతాలు 7:14; సంఖ్యాకాండము 14:19, 20; -కీర్తన 32: 5) ప్రకారం- 1. ‘చెడు మాని, మంచి చేయటం’, 2. ‘పాపములను క్షమించమని యెహోవాను కోరటం’, 3. ‘పాప ములను, దోషములను యెహోవా యెదుట ఒప్పుకోవటం’ అనే మూడు ప్రత్యామ్నాయాలు పాతనిబంధన కాలంలో ఉన్నాయన్నదే కదా!

      ఇక, //మరొక పాపం కూడా బైబిలో ఉంది. అది జన్మత:పాపం దానిని ఎందుకు దాస్తున్నారు?\\ అని మీరు అన్నారు. అంటే దీని బట్టి- యేసు సిలువ బలియాగము 'కర్మ పాపము"నకు కాక కేవలం "జన్మ పాపము" కొరకు మాత్రమే జరిగిందన్నది మీరు ఒప్పుకున్నట్లే కదా!?

      పరిశుద్ధ బైబిలు గ్రంధమునకు పాత నిబంధన "పునాది" భాగం గానూ మరియు క్రొత్త నిబంధన దాని "కట్టడం" గానూ ఉన్నాయన్నది దృష్టియందు ఉంచుకోవాలి. కనుక మన చర్చ అర్ధవంతం కావాలంటే- లేఖనాల ఆధారాలతో సాగాలి.

      ఈ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే- "పాపపరిహారానికి రక్తం ఒక్కటే పరిహారమా?" అన్న ప్రశ్నకు సమాధానంగా- 1.కోరింధి:15:14-28,మత్తయి 28:6-8,1.కోరింధి:6:14, అపోస్తలు 10:39-43,కొలసీ 1:18-23,ఎపెసీ 1:2-14, రోమా 5:12-21,1పేతురు 2:22-24,మార్కు 16:1-20, హెబ్రి 9:10-28,యోహాను 19:1-4,11:25,8:18-24,1పేతురు 1:4,అపోస్తలులు 17:31-33,మార్కు 15:25,37,యోహాను 6:39,1కోరింధీ 15:3 ఇలా ఎన్నో ఆధారాలు కావలం క్రొత్త నిబంధన నుండి మాత్రమే ఇచ్చారు. ఇది సైద్ధాంతిక చర్చకు తగిన పద్ధతి కాదు కనుక. (ఇలా కేవలం రిఫరెన్సులు పెట్టేస్తే ఎలా? వాటిని వాక్యరూపంలో పెర్కొని అవి చెప్పే వాస్తవాలు ఏమిటో విశ్లేషించి, వివరించాలి).

      పాత, నిబంధన, క్రొత్త నిబంధన, అందులోని యేసు బొధనలు, యేసు శిష్యులు మరియు పౌలు బోధలన్నిటి సారాంశాన్ని తీసుకోవాలి. అలా కాక, బైబిలులోని తనకు నచ్చిన అక్కడక్కడి వాక్యాలతో తమ విశ్వాసాన్ని నిరూపించే ప్రయత్నం చేయకూడదు.

      అలాగే ఉపమాన రీతిలో చెప్పిన దానిని అక్షరార్ధంలో తీసుకోవటమో లేక అక్షరార్ధంలో చెప్పిన దానిని ఉపమాన రీతిలో తీసుకోవటమో చెయ్యకూడదు.

      ఇదెందుకు చెబుతున్నానంటే- //థర్మశాస్త్రం శాపగ్రస్తమైనది\\, //ప్రభువు రక్తం పవిత్రులును\\, //ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల\\ వంటి ప్రయోగాలను మీరు అక్షరార్ధంలో తీసున్నట్లు తెలుస్తుంది. మీరనుకుంతున్నదే నిజమైతే, //థర్మశాస్త్రం శాపగ్రస్తమైనది\\ కనుక అందులో ఉన్న మంచి-చెడులను పాటించ వలసిన అవసరం లేదనే కదా మీ ఉద్దేశ్యం? అదే వాస్తవమైతే- "భవిష్యత్ కాలములో" శాపగ్రస్తం కాబోయే దానిని దేవుడు "భూతకాలం"లో ఎందుకిచ్చాడు? అనంత జ్ఞానియగు దేవ దేవునికి "భవిష్యత్ కాల జ్ఞానం" లేదా?

    3. Unknown

      మరి శాపగ్రస్తమైన ధర్మ శాస్త్రమును గురించి యేసు ఏమంటున్నారో ఈ క్రింది గమనించగలరు.

      17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు. 18. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 19. కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. 20. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను. -మత్తయి 5:17-20
      వీటి గురించి ఏమంటారు డేవిడ్ లించ్ గారూ!

      //ప్రభువు రక్తం పవిత్రులునుగా చేయును\\ అన్నవాక్యాన్ని ఉటంకించారు. "రక్తమాంసములను ప్రలోక రాజ్యమును స్వతంత్రిచుకోవు" అన్న వాక్యమును బట్టి "ప్రభువు రక్తం" అన్నది ఆయనలోని "త్యాగశీలత"ను ఇక్కడ "రక్తం" అని ఉపమాని రీతిగా పేర్కోనటమయ్యింది. కాని దానికి విరుద్ధంగా "రక్తం" అనే ప్రయోగాన్ని "త్యాగశీలత"గా తీసుకోవటానికి బదులు "రక్తము"ను "రక్తం"గానే తీసుకున్నారు. ఈ తప్పుడు దృక్పథమే ఇతర మత వర్గాల వారికంటే క్రైస్తవులనే ఎక్కువ పాపిష్టివాళ్ళుగా మార్చింది. అందుకె అంతర్జాతీయ నేరగణాంకాల ప్రకారం కైస్తవులు అధికంగా నివసిస్తున్న దేశాలే Top Ten స్థాయీలో ఉన్నయన్నది గమనార్హం! (www.nationmaster.com; www.wiki.answers.com/Q/what are the top 10 countries for prostitution; www.nationmaster.com; www.mapsofworld.com/world-top-ten) చూడగలరు. ఒకవేళ మీరు చెబుతున్న "పాపపరిహా సిద్ధాంతం" మత్రమే సరైనది అయితే క్రైస్తవ సమాజానికి ఈ దుస్థితి ఎందుకు దాపురిస్తుంది?

      //ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల\\ ఇక్కడ మీరు ముందుగా తేల్చ వలసింది, యేసు దేవుడా? లేక దేవుని గొర్రెపిల్లా? అన్నది.

      ఎందుకంటే- మానవుడు జన్మతహ పాపిష్టివాడు, కనుక ఆ పాపిష్టివాని పాపం పోవాలంటే మరొక పాపిష్టివాని "రక్తం" చెల్లదు కదా! “అందుకే పరిశుద్ధుడైన దేవ దేవుడగు యెహోవాయే నరవతారం ఎత్తి, నరుల చేత తిట్టిచుకొని, కొట్టించుకొని చివరకు చంపించుకున్నాడు!” అన్నది కైస్తవ బోధకుల కట్టు కథ ఒకటి ఉంది కదా! మరి దాని గురించి మీరు ఏమంటారు డేవిడ్ లించ్ గారూ!
      గమనిక: వ్యాసాల రూపంలో మేము పెడుతున్నట్లే మీరూ పెడితే పాఠకులకు సౌలభ్యంగా ఉంటుందన్నది మా ఆలోచన!

  2. yallapragada hyma kumar

    నేనో పామరుడ్ని…అసలు రక్తమే ఎందుకు..రక్తం తో ఎలా కడుగు తాడు.రక్తం+బలి రెండూ కావాలా? ఏసు శిలువ తరువాత పుట్టిన వారి పాపాలు కడిగివేయబడితే…మళ్ళీ చేసే పాపాల పరిస్థితేంటి.స్టేజి మీద ఇద్దరు ప్రసంగీకులుంటారు ఇద్దరికి తెలుగు వచ్చు కానీ ఒకరు ఇంగ్లీషులో మరొకరు తెలుగులో చెప్తారు దేనికి?హిందూ ప్రసాదం తినరు దేనికి? ఈ ప్రశ్నలు ఈ వ్యాసకర్తకి కాదు.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine