• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు!-3 (బైబిలు ప్రకారం- పాప పరిహారానికి ఒక్క రక్తప్రోక్షణమే అవసరం లేదు!)

M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు!-3 (బైబిలు ప్రకారం- పాప పరిహారానికి ఒక్క రక్తప్రోక్షణమే అవసరం లేదు!)

         గౌరవ నీయులైన పాఠక మిత్రులారా!
       ‘ఆజ్ఞాతిక్రమమే పాపము (-1 వ యోహాను 3:4) పాపము వలన వచ్చు జీతము మరణము’… (రోమీయులకు 6:23)  అని మరియు అలాగే ‘గొప్ప పాపము!’ (Great Sin!), (నిర్గమకాండము 32:30) ‘క్షమాపణ ఉన్న పాపము!’, ‘క్షమాపణ లేని పాపము!!’, (మత్తయి 12:32), ‘బుద్ధిపూర్వకంగా చేసే పాపాలు!’ (సంఖ్యాకాండము 15:30, 31), ‘పొరపాటుగా జరిగే పాపాలు!’ (సంఖ్యాకాండము 15:29)… ఉన్నాయని గత అంశ్యములో తెలుసుకున్నాము. పాపపరిహారానికి ‘తర్కం’ చూపించే పత్యామ్నాయాన్నే పరిశుద్ధ బైబిలు గ్రంధమూ చూపిస్తుందా? లేక వేరే పత్యామ్నాయాన్ని చూపిస్తుందా? అన్న ప్రశ్నలకు సుస్పష్టమైన సమాధానమే ఈ వ్యాసం.

‘తర్కం’ ప్రకారం పాపపరిహారం!
       పరిశుద్ధ బైబిలు గ్రంధం ప్రతిపాదించే ధర్మం ‘అత్యంత హేతుబద్ధమైనది’ మరియు ‘అత్యంత తార్కికమైనది’. అయితే ఆ గ్రంధాన్ని ప్రబోధించే అర్హులుగా చెప్పుకునే అధిక శాతం క్రైస్తవ బోధకులు ప్రతిపాదించే ధర్మం మటుకు- ‘అత్యంత హేతువిరుద్ధమైనది’ మరియు ‘అత్యంత తర్కరహితమైనది’. ఈ విషయం ఇప్పుడు మీకు చాలా విడ్డూరంగానూ, విచిత్రంగానూ అనిపించవచ్చు. అయితే బైబిలు గ్రంధ సమాచారంతో కూడిన మా వ్యాసాలను చదివిన తరవాత, అది నిజమేనని మీరే అంగీకరిస్తారు!
      ఏది చేయటం వలన ఒక సమస్య తలెత్తిందో ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి? అని ప్రశ్నిస్తే, ‘తర్కం’ ఇచ్చే సమాధానం ఏమిటి?- ఏది చేయటం వలన సమస్య తలెత్తిందో దానిని చేయటం మానివేయటమే! ఇదే ‘తర్కం’ చేసే పాపపరిహారం! ఇంతకు మించి, దీని కొరకు పెద్దగా మల్లగుల్లాలు పడిపోవలసిన అవసరం ఏమీ లేదు! 
పాతనిబంధన ప్రకారం పాపపరిహారం!

      ఒక వ్యక్తి వివిధ ఆజ్ఞలను అతిక్రమిస్తే అనగా తప్పులు చేస్తే- దాని ప్రతికూల పరిణామాలకు ఎవరెవరు గురి కావచ్చు? అని ప్రశ్నిస్తే, 1. అతను వ్యక్తిగతంగా తన మానసిక లేక శారీరక ఆరోగ్యాన్ని పాడుచేసుకోవచ్చు, 2. లేదంటే- ఎదుటివారిని మానసికంగా లేక శారీరంగా లేక అతనికి సంబంధించిన వస్తువులకు నష్టం కలగజేయవచ్చు, ఇంకా, 3. పర్యావర్ణానికి ప్రమాదం కలగవచ్చు, 4. తన సృష్టికర్తకు నొప్పిచినవాడు కావచ్చు. బైబిలు గ్రంధంలో దేవ దేవుడు ఇచ్చి ఉన్న ఏ ఆజ్ఞను అతిక్రమించినా కాస్త ఇంచుంచు ఆ విధమైన నష్టాలే సంభవిస్తాయి. దీనిని బట్టి ‘పాపము’ అనగా ‘నష్టము’ అని అర్థం అవుతుంది. అటువంటప్పుడు, కలిగిన ఆ ‘నష్టము’ను భర్తీ చేయటమే ‘పాపము’నకు పరిహారం అవుతుంది కదా!

     ఇంతకూ పాపపరిహారానికి ‘తర్కం’ చెప్పిన పరిష్కారాన్నే పరిశుద్ధ ‘బైబిలు గ్రంధం’ చెబుతుందా? లేక వేరే పరిష్కారాన్ని చెబుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానంగా ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.
         21. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని
        అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణము
        నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును. 22. అతడు చేసిన అపరాధములలో
        ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రదుకును. 
        23. దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా?
       వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు
        యెహోవా వాక్కు.  -యెహేజ్కేలు 18:21-23

        పాపపరిహారానికి ‘తర్కం’ ఏది చెప్పిందో పరిశుద్ధ బైబిలు గ్రంధం కూడా అచ్చం అదే చెప్పింది. ఇప్పుడు బైబిలు ప్రతిపాదిత పాప పరిహార విధానం ‘అత్యంత హేతుబద్ధమైనది’ మరియు ‘అత్యంత తార్కికమైనది’ అని మేము ప్రారంభంలో చెప్పింది పై వాక్యాల ద్వారా నిజమయ్యింది కదా!

     దీని ప్రకారం- 1. తనకు నష్టదాయకమైన పాపాలను విడనాడితే తన వరకు ప్రాయశ్చిత్తం అయిపోతుంది. 2. ఇతరులకు తలపెట్టిన నష్టాన్ని భర్తీ చేసేస్తే అక్కడికది ప్రాయశ్చిత్తం అయిపోతుంది. అలాగే 3. పర్యావర్ణానికి చేటూ చేసే పనులు మానుకుంటే అదే దానికి ప్రాయశ్చిత్తం అయిపోతుంది. ఇక మిగిలింది దేవుడు. 4. తన పట్ల పాల్పడిన పాపాలకు ఆయన ఏవిధంగా ప్రాయశ్చిత్తం చేస్తాడో ఈ క్రింది గమనించగలరు.
       ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను
       దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదు నని తాను మాట యిచ్చిన కీడుచేయక
       మానెను.             -యోనా 3:10  

       నేటి అధిక శాతం క్రైస్తవ బోధకులు చెబున్నదే నిజమైతే- “వారు చేయుచున్న క్రియలను చూచి’ అని కాక, ‘వారు ఇస్తున్న బలులను చూచి దేవుడు వారిని రక్షించెను” అని పైన పేర్కొన్న పరిశుద్ధ బైబిలు వాక్యంలో ఉండాలి. అలాంటి ‘వాంగ్మూలం’ (Statement) రూపంలో పూర్తి బైబిలు గ్రంధంలో కించిత్తు కూడా లేదు!  దీనిని బట్టి- పాపపరిహారానికి రక్తప్రోక్షణం ఒక్కటే మార్గమంగా పాతనిబంధన కాలంలో ఉండేదనే అధికశాతం క్రైస్తవ బోధకుల ప్రచారం అసత్యమని పై వాక్యాల ద్వారా నిరూపితమయ్యింది.
      
         నిజమే ‘ఆజ్ఞ అతిక్రమము’ వలన ‘పాపము’ వచ్చినప్పుడు, దానిని పోగొట్టువాలంటే చేయవలసింది ఏమిటి? అని ప్రశ్నిస్తే, కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వాడెవడైనా ఇచ్చే సమాధానం- అతిక్రమించిన 'ఆజ్ఞల’ను తిరిగి పాటించటం అన్నదే కదా! ఈ మాత్రం దానికి అటు- బలవంతుడైన దేవ దేవుడే వచ్చి, బలహీనులైన ఈ మానవుల చేతిలో పడి చావవలసిన అవసరమూ లేదు! ఇటు- తాము చేసిన పాపకార్యాలకు మానవులే దేవుడు మీద పడి దారుణగా, కిరాతకంగా, హృదయ విదారకంగా హత్య చేయవలసిన అగత్యం అంతకంటే లేదు!!
        అధికశాతం క్రైస్తవ బోధకులు చెప్పే కట్టు కథల్లో ఒకటి- “దేవ దేవుడు, క్రీస్తుకు పూర్వం పాత నిబంధన కాలంలో మానవుల పాపాలకు జంతువుల రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం గావించే ప్రోజెక్ట్ సఫలం చేయటానికి చాలా ప్రయత్నం చేసి చేసి విఫలమయ్యాడు!! ఇక ఇలాగైతే లాభం లేదని, ఈ దుష్ట మానవుల మొండి పాపాలు సమసి పోవాలంటే వాళ్ళచేతిలో పాడి ఇక తానే బలవ్వాలనే ఒక సరికొత్త ప్రోజెక్ట్ చేపట్టి, యేసు అవతారంలో ఈ లోకానికి వచ్చాడు" అన్నది. పుక్కిటి పురాణాలు వినే తెలివిలేని దద్దమ్మలకు ఈ కథ ఎంతో వినసొంపుగా ఉండవచ్చు! అర్థంపర్థం లేని ఇలాంటి కథలను నమ్మేవారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. ఎవరి విశ్వాసం వారిది కనుక మనం ఎవ్వరినీ తప్పు పట్ట కూడదు.

      అయితే ఇక్కడ మా అభ్యంతరం ఏమిటంటే- ‘అత్యంత హేతుబద్ధమైన’ మరియు ‘అత్యంత తార్కికమైన’ సిద్ధాంతాలను ప్రబోధించే పరిశుద్ధ బైబిలు గ్రంధమును చేత పట్టి ‘అత్యంత హేతువిరుద్ధమైన’ మరియు ‘అత్యంత తర్కరహితమైన’ విషయాలను బోధించటంపైనే! అలాంటి కాకమ్మ కథలతో ఏమాత్రం సంబంధం లేని పరిశుద్ధ బైబిలు గ్రంధమును వదిలేసి, అలాంటి పిట్ట కథలతో ఏదైనా ఒక గ్రంధాన్ని సొంతంగా రచిచుకొని దాని ద్వారా వాటిని బోధించుకుంటే మేము మీ జోలికి రాము, రావలసిన అవసరం మాకు లేదు! కాని పరిశుద్ధ బైబిలును చేత పట్టుకొని దానితో ఏమాత్రం సంబంధం లేని కథలను చెబుతూ మీరు ప్రజలను వంచితున్నంతకాలం వాటిని బైబిలు ద్వారా నిరూపించమని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము.

     “పరిశుద్ధ బైబిలు బొధలను అనుసరిస్తున్నందుకు క్రైస్తవ సమాజం ఇతర మత వర్గాల కంటే అధికంగా నైతిక పతనానికి గురయ్యిందా? లేక అధిక శాతం క్రైస్తవ పండితుల పుక్కిటి పురాణాలను అనుసరిస్తున్నందుకా?”
M.A.Abhilash
09666488877
tmcnewstmc@gmail.com
వీడియో ప్రసంగాల కొరకు Sakshyam TV చూడండి.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine