• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Bible Articles » ఫిలిప్పీ 2:9-11 ప్రకారం “ప్రతి వాని మోకాలును యేసు నామములో ఎవని ముందు వంగాలి? యేసు ముందా? యెహోవా ముందా?”

ఫిలిప్పీ 2:9-11 ప్రకారం “ప్రతి వాని మోకాలును యేసు నామములో ఎవని ముందు వంగాలి? యేసు ముందా? యెహోవా ముందా?”

Label: Bible Articles

అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. — ఫిలిప్పీ 2:9-11

    
   1. పై వాక్యంలో “ప్రతీ వాని మోకాలును యేసు నామమున వంగునట్లు” అంటే ఎవని ముందు వంగునట్లు అని అర్థం? యేసు ముందా? యెహోవా ముందా? ఈ వాక్యంలో “యేసు నామమున యేసుముందు వంగునట్లు” అని లేదు కదా!
        
   2. వాస్తవానికి “ప్రతీ వాని మోకాలును యేసు నామమున తండ్రి అయిన దేవుని ముందు వంగునట్లు” అన్నది పౌలు అసలు ఉద్దేశం  అన్నది గమనించాలి. ఇదే విషయాన్ని పౌలు ఈ క్రింది వాక్యాలలో చెబుతున్నాడు.


నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు  అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.  – రోమా 14:11-12

మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. –ఎఫెసి 5:20-21

మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి. – కొలస్సీ 3:17   

పై వాక్యాలలో రోమా 14:11-12 వాక్యాలలో పౌలు ఉటంకిస్తున్న లేఖనంలో స్వయంగా దేవుడైన యెహోవా ప్రతీ మోకాలు ఎవని ముందు వంగాలని చెబుతున్నాడు? “ప్రతీ మోకాలును నా యెదుట వంగును” అన్న దానిని బట్టి ప్రతీ మోకాలూ వంగాల్సింది దేవుడైన యెహోవా ముందు అన్నది గమనార్హం. అంతేకాదు “ప్రతి మోకాలును దేవుని ముందు వంగును” అని చెప్పి “గనుక మనలో ప్రతి వాడును దేవునికి (యెహోవాకు) లెక్క అప్పగింపవలెను” అని చెబుతున్నాడు. అంటే ఏ దేవునికైతే మనం లెక్క అప్పగించాల్సి ఉందో ఆ దేవునిముందే మన మోకాలూ వంగాల్సి ఉంది అన్న విషయాన్ని పౌలు స్పష్టపరుస్తున్నాడు.

దీనిని బట్టే పౌలు ఎఫెసి 5:20-21 వాక్యాలలో యేసు క్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. ఇంకా కొలస్సీ 3:17 వాక్యంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించమంటున్నాడు.  కాబట్టి ప్రతీ మోకాలును కచ్చితంగా వంగాల్సింది యేసుముందు కాదు! కానీ యెహోవా ముందు మాత్రమే! ఇదే విషయాన్ని స్వయం గా యెహోవా ఈ క్రింది విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు.

నా (యెహోవా) యెదుట ప్రతీ మోకాలును వంగుననియు ప్రతీ నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పెరట ప్రమాణము చేసియున్నాను. — యెషయ 45:23

పై లేఖనాన్నే పౌలు రోమా 14:11-12 వాక్యాలలో ఉటంకిస్తూ ప్రతివాని మోకాలూ దేవుని  (యెహోవా) ముందు వంగాలని చెబుతున్నాడు.

పౌలు, ప్రార్థనలు, విజ్ఞాపనములు, విన్నపాలు ఎవనికి తెలియజేయమంటున్నాడు? యేసుకా? యెహోవాకా?

దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి (యెహోవాకు) తెలియజేయుడి. – ఫిలిప్పీ 4:6

పై వాక్యంలో పౌలు ప్రార్ధన, విజ్ఞాపములు, విన్నపాలు యేసుకు కాక దేవునికి (యెహోవాకు) తెలియజేయమంటున్నాడు! దీనిని బట్టి నిజంగా ఫిలిప్పు 2:9-11 వాక్యాల ప్రకారం పౌలు ఉద్దేశంలో ప్రతి వానీ మోకాలూ యేసు నామంలో యేసు ముందు వంగటమే అయితే మన ప్రార్థనలు, విన్నపాలు యేసుకు తెలియజేయమని చెప్పక, దేవునికి (అంటే యెహోవాకు) తెలియజేయమని ఎందుకు చెబుతాడు? కాస్త ఆలోచించగలరు.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine