• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Bible Articles » దేవ దేవుడైన యెహావాకు మనుషులు ‘మరణించుట’ ఇష్టమా? ‘జీవించుట’ ఇష్టమా?-9

దేవ దేవుడైన యెహావాకు మనుషులు ‘మరణించుట’ ఇష్టమా? ‘జీవించుట’ ఇష్టమా?-9

Label: Bible Articles


గౌరవ నీయులైన పాఠక మిత్రులారా!
గత వ్యాసం ద్వారా- దేవ దేవుడైన యెహావా, దయావాత్సల్యతలు, దీర్ఘ శాంతము బహుకృప గలవాడని (నెహెమ్యా 9:17), క్షమించుటకు సిద్ధమైన మనస్సును కలిగి, మొఱ్ఱపెట్టు వారందరియెడల కృపాతిశయము గలవాడని (కీర్తన 86:5), ఆకాశ, అంతరిక్షములను అంటేంత  కృపగలవాడని (కీర్తన 36:5) ఒకవైపు పాత నిబంధన కొనియాడుతున్న విషయాన్ని తెలుసుకున్నాము. మరోవైపు- దేవ దేవుడైన యెహోవా స్వరూపమే ప్రేమా మయం (1. వ యోహాను 4:8) అని మరియు యేసును ఒక కరుణామూర్తిగా సృస్టించి, ఈ లోకానికి పంపించటానికి గల మూల కారణం- దేవ దేవుడైన యెహోవాకు మానవాళి పట్ల ఉన్న అంతులేని ప్రేమే అని (యోహాను 3:16) క్రొత్త నిబంధన కొనియాడుతూన్న వైనాన్నీ తెలుసుకున్నాము.

దీనిని బట్టి- పాత నిబంధన కాలపు దేవుడైన యెహోవా ‘అత్యంత కఠినాత్ముడు’ అని మరియు క్రొత్త నిబంధన కాలపు దేవుడైన యేసు ‘అత్యంత కరుణామయుడు’ అని నేటి అధిక శాతం క్రైస్తవ బోధకులు చేస్తున్నది- పరిశుద్ధ బైబిలు గ్రంధానికి పూర్తిగా వ్యతిరేకమైన అత్యంత దుర్మార్గపు ప్రచారమని తేలిపోయింది.

 క్రైస్తవ బోధకులు ఈ విషయాన్ని ముందుగా తేల్చి చెప్పాలి!
పాపిష్టి మానవుల పాపాలను క్షమించటానికి ఈ క్రింది రెండు పనులు చేసాడని చెబుతున్నారు. అవి రెండూ పరస్పరం పూర్తిగా విరుద్ధమైనవి! వాటిలో…

1. మానవుల పాపాలు క్షమించబడాలంటే- 'పరిశుద్ధ రక్తం' అవసరం. ఒక్క దేవ దేవుడైన యెహావా తప్ప మానవులెవరూ పరిశుద్ధలు కారు. కనుక ఆయనే స్వయంగా యేసు రూపంలో 'నరావతారం' ఎత్తి, మానవుల పాపాల పరిహారంగా తన 'రక్తము'ను ధారబోసాడన్నది.

2. మానవుల పాపాలు క్షమించబడాలంటే- 'పరిశుద్ధ రక్తం' అవసరం. కనుక సాధారణ లైంగిక సంబంధం ద్వారా జన్మించిన వారు పాపులు కాబట్టి- లైంగిక సంబంధం లేకుండా మహిమాన్వితంగా ఒక కన్నె స్త్రీ ద్వారా యేసు అనే ఒక వ్యక్తిని పుట్టించి, మానవుల పాపాల పరిహారంగా అతని 'రక్తము'ను ధారబోయించాడన్నది.

పరస్పరం విరుద్ధమైన పై రెండు సిద్ధాంతాలలో ఏది సత్యమో ఏది అసత్యమో గౌరవనీయులైన క్రైతవ బోధకులు ముందు తేల్చి చెప్పాలి. ఎందుకంటే- పాపనికి 'పరిహారం' అనే ఒకే సమస్యకు పరస్పరం పూర్తిగా విరుద్ధమైన రెండు పరిష్కార మార్గాలు ఉండవు కదా! కనుక 'పాప పరిహారానికి యేసు రక్తం తప్పనిసరి' అని వాదించే వారు పై రెండిటిలో దేనిని బైబిలు గ్రంథం సమర్థిస్తుందో ముందుగా తేల్చి చెప్పాలి!   

ఇంత అజ్ఞాన పూరితమైన పనులు మహాజ్ఞాని ఐన దేవ దేవుడు చేస్తాడా?
తన పరిచారకులు, తను నియమించిన క్రమ శిక్షణను అతిక్రమించి, నేరం చేస్తే కనీస 'ఇంగితం జ్ఞానం' (commonsense) కలిగిన ఏ యజమాని అయినా రెండు పనులు చేస్తాడు. ఒకటి-  వారిని 'క్షమించటం' లేదా రెండు- వారిని 'శిక్షించటం'. దీనికి బదులుగా… "ఒరేయ్! దుర్మార్గుల్లారా!! మీరు పాల్పడిన నేరాలకు మీకు క్షమాపణ జరగాలంటే- దానికి పరిహారంగా మీరందరూ నా మీద ఉమ్ములు వేసి, నన్ను దూషించి, నాతల మీద ముళ్ళ కిరీటం పెట్టి, కొరడాలతో కొట్టి, నన్ను నానా హింసలకు గురిచేసి, చివరకు హృదయ విదారకంగా అత్యంత కర్కశంగా చంపేయాలి. అప్పటికిగాని మీరు చేసిన పాపాలకు 'ప్రాయశ్చిత్తం' చేయటం నా వలన సాధ్యం కాదు!" అనో లేక "నా ప్రియ కుమారుడిని ఆ విధంగా చంపేస్తేనేగాని మీ పాపాలకు 'ప్రాయశ్చిత్తం' నేను కలిగించ లేను!" అనో ఎవడైనా అంటాడ!? అసాధ్యం! అలా అనటం అలా ఉంచి, ఆవిధంగా ఊహించటమే అత్యంత హాస్యాస్పదంగా ఉంది కదూ!?

పాపపరిహారానికి అలాంటి పనులు చేయటం ఒక సాధారణ మానవుడి దృష్టిలోనే అత్యంత అజ్ఞాన చేష్టలు అయినప్పుడు, అనంత జ్ఞాని మరియు సర్వశక్తిమన్తుడు అయిన యేహోవా దేవుడు ఎలా చేస్తాడు? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి! ఇదంతా తప్పు అని చెప్పటానికి ఒకే ఒక్క ఆధారం- పై విషయాలు పరిశుద్ధ బైబిలు గ్రంధంలో వాంగ్మూలం (Statement) రూపంలో పేర్కొని లేకపోవటమే! అంటే- అవి అక్కడక్కడి వాక్యాలను ఎంచుకొని, వాటిలోని కొన్నింటిని సాగదీసి, మరి కొన్నింటిని వంగదీసి అల్లిన కట్టు కథలు మాత్రమే.

దేవునికి మనుషులు 'మరణించుట' ఇష్టమా? 'జీవించుట' ఇష్టమా?
క్రైస్తవ బోధకుల ప్రకారం- పాత నిబంధన కాలంలో లోకుల పాపాలను పరిహరించటానికి దేవ దేవుడు వేలాది పశువులను 'బలి' పేరిట చంపించాడు. అయినప్పటికీ ప్రజల పాపాలు తగ్గలేదు. కనుక- ఆతరువాత లోకుల పాపాల పరిహారానికి యేసును 'బలి' పేరిట చంపించాడు. మూగజీవులను, అమాయకులను చంపించి, వారి రక్తాన్ని కళ్ల చూస్తేనేగాని అయన మానవులను క్షమించలేని బలహీనుడా!? ఇదేమి తత్త్వం (Philosophy)! పోనీ ఆయన రాక్షశుడూ కాదు! ఫ్యాక్షనిస్టూ కాదు!! మానవులు మరణించటం గురించి అయన విధానం ఏమిటో ఈ క్రింది వాక్యంలో గమనించగలరు.  

దుష్టులు మరణము నొందుట చేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.-యెహెజ్కేలు 18:23

పై వాక్యాల ప్రకారం- ఘోర పాపిష్టులైన దుష్టులే చావకూడదని ఎంతగానో కోరుకొనే యెహోవ దేవుడు, ఎవరో చేసుకున్న పాపాలకు పరిహారంగా ఏ పాపమూ ఎరుగని అమాయకుడైన యేసును ఎందుకు బలి చేసేస్తాడు!? 'మరణము' అంటే దేవునికి ఎంత అయిష్టమో ఈ క్రింది వాక్యములో గమనించగలరు.

మరణము నొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించు వాడను కాను. కావున మీరు మనస్సుత్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.-యెహెజ్కేలు 18:32

ఈ వాక్యాల ప్రకారమైతే- అసలు 'మరణము' అంటేనే తనకు సంతోషం లేదని ప్రకటించే దేవ దేవుడు, అత్యంత నీతి మంతుడైన యేసును ఎవరో చేసుకున్న పాపాలకు పరిహారంగా 'మరణము'నకు ఎందుకు అప్పగిస్తాడు? పై వాక్యాల ప్రకారం-  దేవ దేవుడైన యెహోవాకు మనుషులు జీవించటమే తప్ప మరణించటం ఇష్టం లేదని సుస్పష్టం అయ్యింది. అసలు మనుష్యుల విషయములో అయన కోరుకుంటున్నది ఏమిటో ఈ క్రింది వాక్యములో గమనించగలరు.

ఆయన (యెహోవా) మనుష్యులందరు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.-1 తిమోతికి  2:4

రక్షణ పొందటానికి కావలసిన సత్యమును తాను ప్రసాదించిన జ్ఞానం ద్వారా మనుష్యులందరూ తెలుసుకోవాలని యెహోవ దేవుడు నిర్ణయించుకున్నట్లు పై వాక్యం ద్వారా తెలుస్తుంది.

'శిక్ష' మరియు 'బహుమానాల' నాగరిక పధ్ధతి ఏవిధంగా ఉంటుంది?
దేవ దేవుడు ఒకవైపు- 'తప్పులు' మరియు 'ఒప్పులు' అంటే ఏమిటో విడమరచి చెప్పే 'బుద్ధి'ని ప్రసాదించి, మరోవైపు- 'మంచి' అయితే చెయ్యమని, 'చెడు' అయితే చెయ్యవద్దని ఘోషించే ఒక 'బలమైన అంతరాత్మ'ను ప్రతి మనిషి అంతరంగంలో అమర్చి పెట్టేశాడు. కనుక ఏవ్యక్తికైనా సాంకేతిక తదితర విషయాల అవగాహన ఉండవచ్చూ, ఉండకపోవచ్చు. కాని 'తప్పులు' మరియు 'ఒప్పులు' అలాగే 'మంచి' మరియు 'చెడు' అన్న 'నైతిక' విషయాల జ్ఞానం జన్మతః ప్రకృతి సిద్ధంగా ప్రతి మనిషీ కలిగి ఉంటాడు.

అటువంటప్పుడు- అతనికి విధించే 'శిక్షలు' అతను పాల్పడే 'చెడు'లకు పర్యవసానంగా విధించాలి. అలాగే అతనికి ఇచ్చే 'బహుమానాలు' అతను ఆచరించే 'మంచి'కి ప్రతిఫలంగా ఇవ్వాలి. 'శిక్ష' మరియు 'బహుమానాల'కు సంబంధించి ఈ పధ్ధతి (Method) నే ఏ నాగరిక సమాజమైనా లేక కనీస ఇంగితజ్ఞానమున్న ఏ వ్యక్తీ అయినా అవలంబిస్తాడు. అవలంబించాలి కూడా. అయితే ఈనాటి అధికశాతం క్రైస్తవ బోధకులు ప్రచారం చేస్తున్న అత్యంత హాస్యాస్పదమైన 'శిక్ష'-'బహుమానాల' పధ్ధతి (Method) ని పరిశుద్ధ బైబిలు గ్రంధం చుపిస్తుందా? లేక గొప్ప నాగరికమైన  'శిక్ష'-'బహుమానాల' పధ్ధతి (Method) ని చుపిస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానంగా ఈ క్రింది వాక్యాలను జాగ్రత్తగా గమనించగలరు.

కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవా యెడలను మీ యెడలను పాపము చేసితిని. 17. మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీద నుండి యీ చావు మాత్రము తొల గించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా 18. అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్లి యెహోవాను వేడు కొనెను. 19. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱ సముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలువలేదు. -నిర్గమకాండము 10:16-19

నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును. -2. వ దినవృత్తాంతములు 7:14

పైవాక్యాలను గమనిస్తే, ప్రస్ఫుటమయ్యే ప్రధాన విషయం ఏమిటంటే- ఎవడు 'వ్యక్తిగతము'గా 'పాపము' చేసాడో వాడే 'వ్యక్తిగతము'గా తాను పాల్పడిన ఆ 'పాపము'నకు పరిహారాన్ని చెల్లించి, దాని (పాపము) నుండి విడుదల పొందాడన్నది. ఇది అత్యంత కీలకమైన విషయం. అంటే- తాను పాల్పడిన పాపాల పారిహారానికి జంతు బలులు లేక ఎవరో పుణ్యాత్ముల, అయ్యగార్ల ప్రార్ధానల వంటి బయటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించకపోవటం. ఈ విషయం మరింత వివరంగా తెలుసుకోవటానికి క్రింది అంశాన్ని జాగ్రత్తగా గమనించగలరు.

ఒక వ్యక్తి చేసే 'పాపము'తో ఎవరెవరికి సంబంధించి ఉంటుంది?
‘ఆజ్ఞ అతిక్రమమే పాపము  (1 వ  యోహాను 3:4) పాపము వలన వచ్చు జీతము మరణముž’ (రోమియోలకు 6:23) అని బైబిలు తెలుపుతున్న విషయాన్ని మూడవ వ్యాసంలో చూచి ఉన్నారు. మనుషులు పాల్పడే పాపాలు మౌలికంగా ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఉంటాయి. వాటిలో…

మొదటిది- ఒకవ్యక్తి, వ్యక్తిగతంగా తన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఇంకా తన భౌతిక-నైతిక వికాసాన్ని కలిగించుకోవటానికి దోహదం సేచే దేవుని ఆజ్ఞలు అతిక్రమించి, వ్యక్తిగత జీవితంలో  'స్వీయ వినాశనానికి పాల్పడటం'. ఇది- తన పట్ల తానే చేసుకొనే పాపము. ఇక్కడ నేరస్థుడూ (First Party) అతడే మరియు బాధితుడూ (Second Party) అతడే!

రెండవది- ఇతరుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఇంకా ఇతరుల భౌతిక-నైతిక వికాసాన్ని కలిగించటానికి దోహదం సేచే దేవుని ఆజ్ఞలను అతిక్రమించి, సామూహిక జీవితంలో 'ఇతరుల వినాశనానికి పాల్పడటం'. ఇది- ఒక వ్యకి ఇతరుల పట్ల పాల్పడే పాపము. ఇక్కడ నేరస్థుడు (First Party) అతడే. కాని, బాధితుడు ఎదుటివాడు (Second Party).

మూడవది- అతని చేష్టలతో ఎలాంటి సంబంధమూ లేని ఇతరులు మూడవ పక్షము (Third Party) నకు చెందిన వారు.

ఇక, సర్వసృష్టి కర్త అయిన దేవ దేవునికి మానవులు పాల్పడే 'చెడు' పనులతో 'కించిత్తు నష్టం' గాని మరియు వారు చేసే 'మంచి' పనులతో 'కించిత్తు లాభం' గాని కలగదు. ఆయన కేవలం నిమిత్తమాత్రుడు. ఆయనది కేవలం తీర్పరి (Judge) స్థానం మాత్రమే! వారి వారి కర్మలను బట్టి మానవులకు 'శిక్షా'-'బహుమానాలు' ఇవ్వటమే అయన పని!

ఈ మొత్తం విశ్లేషణను దృష్టియందు ఉంచుకొని ఆలోచిస్తే ఎవరి పాపానికి వారే బాధ్యత వహించాలని అర్థం అవుతుంది. నిజమే నాగరిక సమాజాలకు చెందిన లౌకిక చట్టాల ప్రకారమూ ఎవరు నేరం చేశాడో వాడే శిక్షను అనుభవించాలి. ఉదాహరణకు: "నా స్నేహితుడు చేసిన నేరానికి నాకు శిక్ష విధించండి!" అని అన్నా లేక "నా స్నేహితుడు 'భవిష్యత్తు'లో చేయబోయే నేరానికి పరిహారంగా అతని తరఫున నాకు 'వర్తమానం'లోనే శిక్ష విధించండి!" అని అన్నా ఈ లోకంలోని సకల నాగరిక చట్టాలు దానిని అత్యంత మూర్ఖత్వంతో కూడిన చర్యగా పేర్కొని తిరస్కరిస్తాయి.

ఎందుకంటే, అతడు- మొదటి పక్షానికి (First Party) చెందిన వాడూ కాడు. రెండవ పక్షానికి (Second Party) చెందిన వాడూ కాడు. మూడవ పక్షానికి (Third Party) చెందినా వాడు! కనుక అతడు శిక్షను అనుభవించటం ఏవిధంగానూ సాధ్యమూ కాదు. న్యాయమూ కాదు. కనీసం మానవుని ఇంగిత జ్ఞానం సైతం ఒప్పుకోని అలాంటి ఒక తప్పుడు విధానాన్ని పరిశుద్ధ బైబిలు వంటి ఒక గొప్ప గ్రంథం అవలంబించటం ఏలా సాధ్యం? ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.

పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. -యెహెజ్కేలు 18: 20

ప్రతి వాడు తన దోషము చేతనే మృతి నొందును; ఎవడు ద్రాక్ష కాయలు తినునో వాని పళ్లే పులియును. -ఇర్మీయా 31:30

పైన పేర్కొన్న రెండు వాక్యాలూ చెప్పే ఉమ్మడి విషయం ఒక్కటే. అది- 'ఎవడి క్రియలకు వాడే బాధ్యుడు!'. చూచారా, పరిశుద్ధ బైబిలు చట్టం చూపే న్యాయం ఎంతటి విజ్ఞతగా మరెంతటి నాగరికంగా ఉందో!

ఒకవైపు- అత్యంత నాగరికమైన మరియు అత్యంత న్యాయవంతమైన  విధానాన్ని 'పరిశుద్ధ బైబిలు గ్రంథం' చూపిస్తూ ఎవని పాపానికి వాడే బాధ్యత వహించాలి అని ప్రకటిస్తుంది. ఇంకా ఒక తండ్రి తన సొంత కుమారుని పాపానికి బదులుగా అలాగే- ఒక కుమారుడు తన సొంత తండ్రి పాపానికి బదులుగా శిక్షింప బడటం ఎట్టి పరిస్థితులలోను సాధ్యం కాదు. కాకూడదు అని పరిశుద్ధ బైబిలు గ్రంథంలో దేవ దేవుడు తీర్మానిస్తుంటే మరోవైపు- అదే బైబిలు గ్రంధాన్ని చేత పట్టుకొని, మానవులు 'చేసిన' లేక 'చేయబోయే' పాపాలకు మూడవ పక్షానికి (Third Party) చెందిన యేసు శిక్షింప బడ్డారని అధిక శాతం క్రైస్తవ బోధకులు బాహాటంగా ప్రచారం చేస్తున్నారు! ఇది ఎంత దారుణమైన వాక్య అతిక్రమణో ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిచండి. 
  
 M. A. Abhilash 
91+96664 88877
tmcnewstmc@gmail.com

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine