ఈరోజుల్లో ఎవర్ని పూర్తిగా నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో కూడా అర్ధం కావడం లేదు. నేను ఎన్నో సంఘటనలు చూస్తున్నాను. ఎవరికివారు డబ్బా కొట్టుకోవడం ఎక్కువయిపోయింది. పనులకంటే ప్రచారం ఎక్కువయిపోయింది. లేనిదాన్ని, ఉన్నట్లుగా చిత్రీకరించి తప్పుడు ప్రచారం చేసేవాళ్లు ఎక్కువయిపోయారు. వీళ్లనసలు ఏమి చేయాలి? మనుషుల ఆత్మగౌరవం మీద కొట్టడం, కించపరచడం, ఎదుటివారి హక్కులను బలవంతంగా నిరోధించాలని చూడడం చాలా తీవ్రకరమైన నేరం. మహాపాపం. ఛా! వీళ్లను అసహ్యహించుకోవాలి. వీళ్లకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. మనం ఎవర్ని పూర్తిగా నమ్మకూడదు. మన విషయాలు చాలా వరకూ పంచుకో కూడదు. ఒకవేళ పంచుకుంటే రేపన్నరోజు నీమీదే వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడానికి పూనుకుంటారు. ఈరోజు సమాజం చాడీలు చెప్పే వ్యక్తుల సమాజంలా మారిపోయింది. ప్రవక్త(స) వారు చాడీలు చెప్పడం,వినడం 26సార్లు వ్యభిచారం చేసిన పాపంతో సమానమని హెచ్చరించారు.