• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Bible Articles » యేసు తీర్పు తీర్చును! కాబట్టి యేసు దేవుడా?

యేసు తీర్పు తీర్చును! కాబట్టి యేసు దేవుడా?

Label: Bible Articles

దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా… -2 తిమోతి 4:1

ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. – 2 కోరింథీ 5:10

పై వాక్యాలను బట్టి తీర్పు తీర్చేది యేసే కనుక యేసే దేవుడన్నది నేటి అభినవ ప్రచారకుల వాదన! ఇలాంటి స్వత విశ్వాసాలు నిర్మించుకునేవారు కాస్త గమనించాల్సింది పౌలు “మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును” “క్రీస్తు తీర్పు తీర్చును” అని చెబుతున్నాడే గాని “మనం చేసుకునే మంచీ-చెడుల “లెక్క” యేసుకు అప్పగించవలెనని” చెప్పటం లేదుకదా? కానీ మానవులు చేసుకునే  మంచీ-చెడుల “లెక్క” ఎవరికి అప్పగించాలో పౌలు చెబుతున్నా ఈ క్రింది వాక్యాలు కాస్త గమనించగలరు.


నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచు న్నాడు  అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. – రోమా 11:12

మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. – హెబ్రీ 4:13

మనం చేసుకునే మంచీ-చెడుల “లెక్క” దేవునికి మాత్రమే అప్పగించాలని పౌలు చెప్పటానికి కారణం, ఇదే విషయాన్ని యేసు అంతకుముందే ఈ క్రింది విధంగా చెప్పి ఉండటం!

నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలనుబట్టి నీతి మంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అప రాధివని తీర్పునొందుదువు. – మత్తయి 12:36

ఇప్పటి వరకు గమనించిన వివరణలో మానవులు చేసుకునే  మంచీ-చెడుల “లెక్క” అప్పగించాల్సింది- దేవ దేవుడైన యెహోవాకే తప్ప, యేసుకు కాదని తెలుసుకున్నాం.

అయితే యేసు ఇవ్వనున్న ఆ తీర్పు యేసు స్వంత తీర్పు అని పౌలు చెబుతున్నాడా? లేక యేసు, దేవుని ద్వారా పొందిన తీర్పును ఇవ్వనున్నారని పౌలు చెబుతున్నాడా?

ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. – హెబ్రీ 7:24,25

దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే… రోమా 8:34

గమనిక: నిజంగా ఒకవేళ సర్వ మానవాళికి దేవుని స్థానంలో ఉంటూ తీర్పునిచ్చేది యేసే అయితే… పరలోకంలో యేసు విశ్వాసుల కొరకు దేవుని (యెహోవా) వద్ద విజ్ఞాపనలు చేసుకోవలసిన అవసరం ఏముంటుంది! కాస్త ఆలోచించగలరు.

పై వాక్యాలను బట్టి యేసు ఇవ్వనున్న తీర్పు యేసు స్వంత తీర్పు ఎంత మాత్రం కాదు కానీ, దేవుని వద్దకు తన ద్వారా వచ్చు వారికొరకు విజ్ఞాపన చేసుకుని, దేవుని ద్వారా వెలువడే తీర్పును యేసు తనను నమ్ముకున్న వారి విషయంలో ఇవ్వనున్నారని తేటతెల్లమైంది. యేసు ఈ విషయాన్ని స్వయంగా యేసు తన మాటల్లోనే ఎంతో స్పష్టంగా ఈ క్రింది విధంగా వివరిస్తున్నారు.

అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవార లారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.-మత్తయి 25:34

పై వాక్యం ప్రళయ దినం నాడు “తండ్రి ద్వారా ఆశీర్వదింపబడిన” వారి విషయంలో యేసు ఇస్తున్న తీర్పు అన్నది గమనార్హం. అంటే అంతిమ తీర్పులో ఆశీర్వాదం లేక శాపం అనేది దేవుని వద్ద నుండి లభించేది మాత్రమే! దీనిని బట్టి  దేవుని నుండి వెలువడే ఆశీర్వాదము, శాపానికి సంబంధించిన తీర్పునే యేసు మధ్య వర్తిగా ఉంటూ తన కాలపు  సమాజం వారి విషయంలో ఇవ్వనై యున్నారని అర్థం అవుతుంది.
       
యేసు ప్రకారం, ఆదిమ అపోస్తలులు సైతం తీర్పు తీర్చనున్నారు!  

యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.  – మత్తయి 19:28

యేసు తీర్పు తీరుస్తారు కాబట్టి యేసు దేవుడనుకుంటే ఆదిమ అపోస్తలులను సైతం పై వాక్యాలను బట్టి  దైవాలుగా భావించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఆదిమ అపోస్తలులు సైతం యేసు మాదిరిగానే తమ ద్వారా దేవుని వద్దకు  ద్వారా వచ్చు వారికొరకు విజ్ఞాపన చేసుకుని, దేవుని ద్వారా వెలువడే తీర్పును ఇవ్వనై యున్నారు.

మొత్తానికి తీర్పు అనేది యేసు ద్వారా వెలువడినా, శిష్యుల ద్వారా వెలువడినా లేక అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల అనుచరుల కొరకు వారిద్వారా వెలువడినా అంతిమ తీర్పు ఇచ్చేది మటుకు దేవుడే!

గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని,తీర్పులోనికి తెచ్చును. – ప్రసంగి 12:14 

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine