• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » బైబిలు కోరే బలి - పశువులను తెగ నరకటమా? లేక తన సంపద పట్ల ఉన్న ప్రేమను బలి చేయటమా? -7

బైబిలు కోరే బలి - పశువులను తెగ నరకటమా? లేక తన సంపద పట్ల ఉన్న ప్రేమను బలి చేయటమా? -7

సర్వశక్తిగల దేవుని పేరుతో…    
యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
 -సామెతలు 21:30
 పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:
యేసు సిలువపై మరణించ లేదు!-7



(బైబిలు కోరే 'బలులు' అర్పించటంలోని ఆంతర్యం దేవ దేవుని ఆగ్రహాన్ని చల్లార్చటానికా? లేక సాంఘీక వ్యవస్థను నడపటానికా?)

గౌరవ నీయులైన పాఠక మిత్రులారా! 
గత వ్యాసం ద్వారా పాత నిబంధన ప్రకారం- నేటి అధికశాతం క్రైస్తవ బోధకులు ప్రకటిస్తున్నట్లు దేవ దేవుడు బలులను రక్తాన్ని కోరుకోవటం కాదుకదా అసహ్యించుకున్నాడని తెలుసుకున్నాము. అలాగే మానవులు తమ పాపాల పరిహారానికి, చేస్తున్న పాపాలను విడనాడటం, నీతిని అనుసరించటం, తోటి మానవులకు సహాయపడటం తప్ప దేవునికి చెల్లించేది ఏమీ ఉండదనీ తెలుసుకున్నాము. ఎందుకంటే- ఆయన స్వయం సమృద్ధి కలిగిన నిరపేక్ష పరుడు కనుక.               
మా వ్యాసాలు చదువుతున్నప్పుడు- పరిశుద్ధ బైబిలు గ్రంధం ప్రతిపాదించే ధర్మం ‘అత్యంత హేతుబద్ధమైనది’ మరియు ‘అత్యంత తార్కికమైనది’. అయితే ఆ గ్రంధాన్ని ప్రబోధించే అర్హులుగా చెప్పుకునే అధిక శాతం క్రైస్తవ బోధకులు ప్రతిపాదించే ధర్మం మటుకు- ‘అత్యంత హేతు విరుద్ధమైనది’ మరియు ‘అత్యంత తర్కరహితమైనది’ అన్న విషయం మీ దృష్టియందు ఉండాలి.
పాత నిబంధన (తోర ధర్మశాస్త్రం) ఒక సంపూర్ణ జీవన వ్యవస్థ!
మోషేకు ఇవ్వబడిన 'తోర' అనే ధర్మశాస్త్రం ఒక సంపూర్ణ జీవన వ్యవస్థను కలిగి ఉంది. కనుక అందులో ఆధ్యాత్మిక విషయాలతో పాటు ఒక సామాజిక వ్యవస్థను నడపటానికి కావలసిన శాసన నియమాలతో పాటు, ఆర్ధిక వనరులను సమీకరించే (రెవిన్యు) విధానాలూ అందులో ఉన్నాయి. అందులో భాగంగానే ప్రజలను తమవలన జరిగే వివిధ తప్పులకు, పొరపాట్లకు బదులుగా- ఆనాటి ఆర్ధిక మారకాలైన పశువులను, పిండి పదార్ధాలను, వెండి-బంగారాలను అపరాధరుసుము (పెనాల్టి) క్రింద వసూలు చేసేవారు. ఆ వచ్చిన రాబడిని ఒకవైపు- ఆనాటి  దేవాలయమే 'సచివాలయం' కనుక దాని నిర్వాహణ కొరకు మరోవైపు సమాజంలోని  బీదసాదలకు సహాయపడటానికి ఉపయోగించేవారు. ఇదీ పాత నిబంధన కాలం నాటి బలుల అసలు వాస్తవికత.


పాత నిబంధన కాలంలో- ప్రధాన పాపాల కొరకు బలులిచ్చారా?  

పాతనిబంధన కాలంలో బలులు, రక్త ప్రోక్షణములు వగైరా ఉన్నాయి కదా! నిజమే ఉన్నాయి. అయితే అవి ఏ విధమైన పాపాల కొరకు ఉన్నాయి? ఎందుకున్నాయి? అని ప్రశ్నిస్తే- నేటి అధిక శాతం క్రైస్తవ బోధకులు చేప్పే విధంగా లేవు! అవి చాలా అర్ధవంతమైన సామాజిక కారణం కొరకు ఉన్నాయి. వాటిని రాబోయే అంశాలలో గమనించగలరు. 

బైబిలు గ్రంథంలో వివిధ రకాల పాపాలు ఉన్నాయని గతంలో తెలుసుకున్నాము. అలాంటి వాటిలో- 1. నర హత్య, 2. వ్యభిచారము, 3. దొంగతనము అలాగే బైబిలు చెప్పనప్పటికీ, క్రైస్తవ బోధకులు చెప్పే ఒక పాపము ఉంది. అది- 4. 'జన్మ పాపము!' వగైరా… .
పాత నిబంధన కాలంలో ప్రతి పాపానికి రక్త ప్రోక్షణం ద్వారా మాత్రమే పరిహారం ఉండేదని వాదించే వారు- పైన పేర్కొన్న నాలుగు రకాల పాపాలకు గాని, వాటిలో ఏదో ఒక పాపానికి గాని జంతుబలుల ద్వారా చిందించ బడే 'రక్తము'ను దేవునికి పరిహారంగా ఇచ్చినట్లు ఒక్కగాని ఒక్క ఆధారాన్ని చూపించ లేరు!  అన్నది ఇక్కడ అత్యంత గమనార్హం. పాత నిబంధన కాలంలో అలాంటి ప్రధానమైన పాపాలకు శిక్షలే తప్ప రక్త ప్రోక్షణం ద్వారా పరిహారం జరగలేదు. 
దీనిని బట్టి 'పాత నిబంధన కాలంలో- ప్రధానమైన పాపాల కొరకు దేవ దేవుడు బలులను కోరలేద'ని తెలుస్తుంది. అలాంటి ప్రధానమైన పాపాలకే రక్త ప్రోక్షణం ద్వారా పరిహారం జరగనప్పుడు, ఇక, ఏ పాపాల పరిహారం కొరకు యేసు బలియాగం ద్వారా 'రక్తం' కార్చినట్లు!?

పాత నిబంధన కాలంలో ఏ విధమైన పాపాల కొరకు బలులు ఇచ్చారు?
          పాతనిబంధన కాలంలో బలుల గురించి నేటి అధిక శాతం క్రైస్తవ బోధకులు చెప్పేది వింటే- దేవ దేవుడు- 'రక్తము'ను తనకు మంచి శక్తినిచ్చే టానిక్కులా కోరుకునేవాడనిపిస్తుంది!! ఎందుకంటే- వారు, దేవుడు ప్రతి పాపానికీ రక్తం కోరుకొనేవాడని చెబుతుంటారు కాబట్టి. అయితే బైబిలు ప్రకారం- అన్నిరకాల పాపాల కొరకు బలులు ఇచ్చేవారా లేక కొన్ని రకాల పాపాలకు బలులు ఇచ్చేవారా అన్నది ఈ క్రింది గమనించగలరు.

పొరపాటుగా చేసిన చిన్మ చిన్న తప్పిదాలకు క్షమాపణ కొరకే బలులు!
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైన యెడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసినయెడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. -లేవీకాండము 4:1-3

ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదముచేసి, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరానిపని చేసి అపరాధులైనయెడల వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియ బడునప్పుడు, సంఘము పాపపరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వార మునకు దానిని తీసికొని రావలెను. సమాజముయొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడెమీద తమ చేతు లుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను.-లేవీకాండము 4:13-15

అధికారి పొరబాటున పాపముచేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధియైనయెడల అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగమేక పిల్లను అర్పణముగా తీసికొని వచ్చి ఆ మేకపిల్ల తలమీద చెయ్యి ఉంచి, దహనబలి పశువును వధించుచోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. -లేవీకాండము 4:22-24

మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరానిపనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైన యెడల తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడిన యెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి పాపపరిహారార్థ బలి పశువుయొక్క తలమీద తన చెయ్యి ఉంచి, దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను.-లేవీకాండము 4:27-29

1. ఒకడు ఒట్టు పెట్టుకొనినవాడై తాను చూచినదాని గూర్చిగాని తనకు తెలిసినదానిగూర్చిగాని సాక్షియై యుండి దాని తెలియచేయక పాపము చేసినయెడల అతడు తన దోషశిక్షను భరించును. 
2. మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టినయెడల, అది అపవిత్రమృగ కళేబరమేగాని అపవిత్రపశు కళేబరమేగాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమేగాని అది అపవిత్రమని తనకు తెలియక పోయినను అతడు అపవిత్రుడై అపరాధి యగును. 
3. మనుష్యులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండ అంటిన యెడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన యెడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి యగును. 
4. మరియు కీడైనను మేలైనను, మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసెదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసెదనని యొకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిన యెడల, అది తెలిసిన తరువాత వాడు అపరాధియగును. 
కాబట్టి అతడు వాటిలో ఏవిషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాపవిషయమై యెహోవా సన్నిధికి మందలోనుండి ఆడు గొఱ్ఱపిల్లనేగాని ఆడు మేకపిల్లనే గాని పాప పరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును.-లేవీకాండము 5:1-6

పురిటాలి రక్తస్రావం విషయమై ప్రాయశ్చిత్తము కొరకు బలి!
అతడు యెహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లనుగాని ఆడు పిల్లనుగాని కనిన స్త్రీని గూర్చిన విధి. ఆమె గొఱ్ఱ పిల్లను తేజాలని యెడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని, పాపపరిహారార్థబలిగా ఒక దానిని తీసికొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. -లేవీకాండము 12:7, 8

       పైవాక్యంలో- 'పురిటాలికి పవిత్రత' కలుగుటకే గాని పుట్టిన బిడ్డకు 'జన్మ పాపము' తోలగి, పవిత్రత కలగటానికి కాదన్నది అత్యంత గమనార్హమైన విషయము. 

తమకు మేలు కలిగితే చేస్తామని మొక్కుకొనే  బలులు!

కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను. -యోనా 2:9

        ప్రవక్త యోనా తనకు కలిగిన ఆపద నుండి రక్షించబడితే బలులను అర్పిస్తానని మొక్కుకున్నాడు.  
పైన పేర్కొన్న వాక్యాలన్నిటి ద్వారా తెలిసే విషయం మటుకు ఒక్కటే. అదేమిటంటే- బుద్ధి పూర్వకముగా కాని, కుట్ర పూరితంగా కాని పాల్పడే 'ఘోర నేరాలకు' కాక, పొరపాటున గాని, అజ్ఞానం వలన గాని జరిగే 'చిన్న చిన్నతప్పిదాలకు' మాత్రమే బలులు కోరబడ్డాయన్నది.

          అయితే యూదులు పాల్పడిన యేసు హత్యాయత్నాన్ని పవిత్ర బలియాగంగా సర్దిచెప్పాలనుకునే వారికి ఎక్కడ కాస్తంత 'రక్తం' కనపడినా అదొక మహా వరంగా కనిపిస్తుంది! అందుకే- 'అమ్మయ్య పాత నిబంధన కాలంలో మొత్తం మీద రక్తానికి ప్రాధాన్యత ఉన్నట్లే కదా!' అని సంతృప్తి పడిపోతుంటారు. తదుపరి అంశాలను గమనిస్తే అలాంటి  వారికి నిరాశే మిగులుతుంది!

దేవుడు- ప్రాణమూ, రక్తమూ ఉన్న వాటినే 'బలి'గా కోరుతున్నాడా!?
       నేటి అధిక శాతం క్రైస్తవ బోధకులు చెప్పేది వింటుంటే- దేవ దేవునికి 'రక్తం' అంటే వల్లమాలిన ప్రీతి! అనిపిస్తుంది. అందుకేనేమో పాత నిబంధన కాలంలో మనుషుల పాపాలకు పరిహారంగా ఒక్క 'రక్తం' తప్ప మరి దేనినీ ఇష్ట పడేవాడు కాదనిపిస్తుంది. ఈ రకమైన ప్రచారాలు చేసే వారికి ఈ క్రింది వాక్యాల జ్ఞానం లేదనే చెప్పలి.

వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమును బట్టి అర తులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అర తులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ. ఇరువది సంవత్సరములు గాని అంతకంటె యెక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులముకంటె ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్య కూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్దనుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసికొని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవనిమిత్తము దాని నియమింప వలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థ ముగా నుండును.-నిర్గమకాండము 30:13-16

            పై వాక్యములలో గమనార్హ విషయము- దేవ దేవుడు 'ప్రాణము', 'రక్తము' ఏమాత్రమూ లేని 'లోహము'ను కూడా ప్రాయశ్చిత్తార్థమైన అర్పణగా స్వీకరించటం. అయితే అది ఎందుకు తీసుకో బడింది? దానితో యెహోవా ఉంగరాలేమైనా చేయించుకుంటాడ? లేదు. మరెందుకు? వాక్యభాగాన్ని గమనించగలరు- 'ప్రత్యక్షపు గుడారము అనగా గ్రామ సచివాలయం యొక్క సేవనిమిత్తము దాని నియమింపవలెను'. అని దేవ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దీనిని బట్టి- ఈ 'వెండి అర్పణ' అన్నది, మానవాళి భౌతిక ప్రయోజనం తప్ప దేవ దేవునికి ఇందులో ఎలాంటి ప్రయోజనము లేదు కదా! అలాగే ఈ క్రింది వాక్యాలను గమనించగలరు. 
రెండు తెల్ల గువ్వలైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకనియెడల పాపముచేసినవాడు తూమెడు గోధుమపిండిలో పదియవవంతును పాపపరిహారార్థబలి రూపముగా తేవలెను. అది పాప పరిహారార్థబలి గనుక దానిమీద నూనెపోయవలదు. సాంబ్రాణి దానిమీద ఉంచవలదు.-లేవీకాండము 5:11

మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను అహరోనుకు అభిషేకముచేసిన దినమున, అతడును అతని సంతతివారును అర్పింపవలసిన అర్పణమేదనగా, ఉదయ
మున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమపిండిలో పదియవవంతు. -లేవీకాండము 6:19, 20

ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంటలను అర్పింపవలెను.-లేవీకాండము 7:11, 12

పైవాక్యాల ప్రకారం- దేవ దేవునికి 'రక్తం' అంటేనే ఇష్టం కనుక ఒక్క 'రక్తం' గల పశువులను తప్ప మరి వేటినీ 'అర్పణలు'గా 'బలులు'గా స్వీకరించే వాడు కాదు, అందుకే అందరి కొరకు యేసు తన 'రక్తము'ను చిందించ వలసి వచ్చింది! అని సువార్త పేరిట ప్రకటించబడేది… పరిశుద్ధ బైబిలు బోధకు వ్యతిరేకమే కదా! ఎందుకంటే- 'ప్రాణము', 'రక్తము' వంటివి ఏమాత్రం లేని 'వెండి', 'పిండి వంటలు', 'అప్పడాలు', 'రొట్టెలు' కూడా 'అర్పణలు'గా 'బలులు'గా దేవ దేవుడు స్వీకరించాడు కదా! అంటే వాటిని దేవుడు తన ఆహారంగా తినటానికి తీసుకుంటున్నాడ? ఆ అవసరం ఆయనకు లేదు! 

అయితే ఈ  తిండి పదార్థాలను 'అర్పణలు'గా 'బలులు'గా స్వీకరించటంలో ఉన్న భౌతిక ప్రయోజనం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే-  'ప్రత్యక్షపు గుడారము' అనగా 'గ్రామ సచివాలయం' కార్యాకలాపాలు నిర్వహించే ఉద్యోగులుగా ఉన్న యాజకుల, పరిచారకుల ఆహారము కొరకు మరియు వారి జీతభత్యాల (Maintenance) కొరకు వాటిని ఉపయోగించేవారు.

పశు సంబంధమైన మాంసము, ప్రేవులు, రక్తములను ఏం  చేసేవారు?
మాంసము:
నీ ధాన్యములో నేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి నీ గొఱ్ఱ మేకల మందలోని దేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్చార్పణమును ప్రతిష్ఠార్పణమును నీ యింట తినక నీ దేవు డైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ యింట నుండు లేవీయులు, కలిసికొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని (భుజించి) సంతోషించుదువు.-ద్వితీయోపదేశ కాండము 12:17-18

ఈ విధంగా దేవుని పేరిట అర్పించబడిన పశువుల మాంసము, వివిధ పిండివంటలు వగైరాల భౌతిక ఉద్దేశ్యము ఏమిటో పైవాక్యాలలో సుస్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఆరోగ్యకరమైన కుటుంబానికి ఉండవలసిన ఉత్తమ లక్షణాలు అందులో కనిపిస్తున్నాయి. కుటుంబ సబ్యులు మరియు ఇంటి పనివారు అన్న భేద భావం లేకుండా అందరూ కలసిమెలసి భోజనలు చేయటం అన్నది ఎంత గొప్ప విషయం!? అలంటి కుటుంబాలతో ఉన్న దేశం ఎంత అద్భుతంగ అలరారుతుందో ఊహించుకోవచ్చు.   

రక్తము:
మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేలమీద పారబోయవలెను.  -ద్వితీయోపదేశకాండము 12:16
యాజకుడు బలిపీఠముమీద వాటిని దహింప వలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.-లేవీకాండము 3:16, 17
పై వాక్యాలలో 'రక్తము'ను గురించి పరిశుద్ధ బైబిలు గ్రంథం ఏది చెప్పిందో అచ్చం అదే- నేటి భౌతిక ఆరోగ్య శాస్త్రము కూడా చెబుతుంది. దీనిని బట్టి- పరిశుద్ధ బైబిలు గ్రంథ ప్రతిపాదిత జీవన విధానము ఎంతో శాస్త్రీయతను కలిగి ఉందని తెలుస్తుంది.

పశువుల మాంసాలు వాటి రక్తాలు దేవ దేవునికి ఏమైనా అవసరమా!? 
సర్వోన్నతుడైన యెహోవా దేవుడు ఇచ్చేవాడేగాని పుచ్చుకొనే వాడు కాదు. అయన మానవులకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించటం వలన తోటి మానవులకే వాటి ప్రయోజనాలు కలుగుతాయి. వాటిని పాటించకపోవటం వలన నష్టపోయేది వారే! దేవునికి పెరిగేదీ లేదూ ఒరిగేదీ లేదూ! మానవులు బలులు ఇచ్చే పశువు మాంసాలు గాని, వాటి రక్తాలు గాని ఆయనకు ఏమయిన అవసరమా? అన్న ప్రశ్నకు అయన ఇచ్చే సమాధానమును ఈ క్రింది గమనించగలరు.

వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?-కీర్తన 50:13

 పై వాక్యం ప్రకారం- యెహోవా దేవునికి రక్త-మాంసాలతో ఏమాత్రం పనిలేదని తెలుస్తుంది. అయితే ఈ బలులూ, అర్పణలూ, అర్చలూ ఎవరి కొరకు? అని ప్రశ్నిస్తే, ఈ అంశములో సాగిన పరిశీలన ప్రకారం- మానవుల కొరకే! అన్నది సమాధానం. నిజమే ఇదంతా ఎంతో శాస్త్రీయంగానూ, హేతుబద్ధంగానూ ఉంది. ఈ పరిశీలనను బట్టి- బైబిలు కోరే 'బలులు' అర్పించటంలోని ఆంతర్యం దేవ దేవుని ఆగ్రహాన్ని చల్లార్చటాని కాదు. కానీ సాంఘీక వ్యవస్థను నడపటానికే అని సుస్పష్టం అయ్యింది!

యేసు సిలువ మరణములో ఉన్న శాస్త్రీయత ఏమిటి!?  
యేసు మన పాపాల కొరకు ప్రాణం పెట్టారని నమ్మి, మతం మారితే మన పాపాలు పోతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానిని ఏలా అర్థం చేసుకోవాలి?

1. మన కొరకు అయన ప్రాణం పెట్టటం ఏమిటీ?
2. క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే పోయేవి- చేసుకున్న పాపాల? చేయబోయే పాపాల? లేక జన్మ పాపమా?      
3. మతం మారిన వారిలో పాపాల పట్ల ఏహ్యభావం ఏమీ కలగటం లేదే!
4. యేసు రక్తంలో కడగబడిన వారే (క్రైస్తవులే) ఘోరాల్లో-నేరాల్లో ఎందుకు ముందున్నారు!?
5. యేసును నమ్ముకున్న వారు, పాపాల పట్ల ప్రత్యేక నియంత్రణను కలిగి ఉండనవసరం లేదా?
6. "ఉండాలి!" అంటే- ఇతర మతాలు చెప్పేదీ అదే! అలాగైతే ఇక క్రైస్తవ్యాన్ని స్వీకరించ వలసిన  అవసరం ఏమిటి?
మా గౌరవనీయులైన క్రైస్తవ బోధకులు పైపశ్నలకు బయటి ఉపమానాలతోకాక, కేవలం పరిశుద్ధ బైబిలు గ్రంథం వెలుగులో మాత్రమే సమాధానాలను ఇవ్వాలని మనవి చేస్తున్నాము.
బైబిలు బోధలలో శాస్త్రీయత ఉంది.  
కాని 
క్రైస్తవ బోధకుల బోధలో శాస్త్రీయత కనిపించటం లేదు!
M.A.Abhilash 
91+96664 88877
tmcnewstmc@gmail.com 

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine