• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు!-4 (‘మానవుడు జన్మతః పాపి’ మరియు ‘యేసు రక్తం ద్వారా పాపపరిహారం’ అనే సిద్ధాతాలను పరిశుద్ధ క్రైస్తవ్యంలో ఎవరు ప్రవేశ పెట్టారు? ఎందుకు ప్రవేశ పెట్టారు?)

M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు!-4 (‘మానవుడు జన్మతః పాపి’ మరియు ‘యేసు రక్తం ద్వారా పాపపరిహారం’ అనే సిద్ధాతాలను పరిశుద్ధ క్రైస్తవ్యంలో ఎవరు ప్రవేశ పెట్టారు? ఎందుకు ప్రవేశ పెట్టారు?)

గౌరవ నీయులైన పాఠక మిత్రులారా!
గత భాగంలో ‘పరిశుద్ధ బైబిలు గ్రంధం’ పాపానికి ఎంతో హేతుబద్ధమైన పరిహార విధానాన్ని చూపిస్తుందని తెలుసుకున్నాము. అలాగే, పాప క్షమాపణకు ‘రక్తం’ ఒక్కటే పరిహారం కాదు.‘పశ్చాత్తాపం’ వలనా పాపక్షమాపణ అవుతుందని పరిశుద్ధ వాక్యాల ద్వారా తెలుసుకున్నాము.  
నేటి క్రైస్తవ ధార్మిక సమాజంలో మౌలికంగా రెండు రకాల పాపాలను గురించి ప్రస్తావన ఉంది.వాటిలో ఒకటి- ‘జన్మ పాపము’ మరియు రెండు- ‘కర్మ పాపము’.‘పరిశుద్ధ బైబిలు గ్రంధం’లో ‘కర్మ పాపము’ను గురించి తప్ప ‘జన్మ పాపము’ గురించి,అటు పాతనిబంధనలోగాని, ఇటు క్రొత్తనిబంధనలోగాని లేశమాత్రంగానూ లేదన్నది అత్యంత గమనార్హం! 
అందుకే  ‘మానవుడు జన్మతః పాపి’ అన్న విషయం- ‘వాంగ్మూలం’ (Statement) రూపంలో పూర్తి బైబిలు గ్రంధంలో కనీసం ఒక్కసారీ పేర్కొనబడి లేదు. విచిత్రం ఏమిటంటే- బైబిలు గ్రంధం ఆ సిద్ధాంతాన్ని ఖండిస్తున్న వైనం సుస్పష్టంగా కనిపిస్తుంది! ప్రస్తుత వ్యాసం మానవుడు జన్మతః పాపియా? అన్న ప్రశ్నకు ‘పరిశుద్ధ బైబిలు గ్రంధం’ ఇచ్చే సమాధానం ఏమిటి? అన్న దానిపై వాక్యాధారంగా సాగుతుంది. 

తార్కికంగా, న్యాయ బద్ధంగా మానవుడు జన్మతః పాపి కాడు!
అధిక శాతం క్రైస్తవ బోధకుల కట్టు కథలలో- ‘మానవుడు జన్మతః పాపి’ అన్నది ఒకటి! ఇది కూడా ‘వాంగ్మూలం’ రూపంలో పూర్తి బైబిలు గ్రంధంలో ఒక్కగాని ఒక్కసారీ చెప్పబడి లేదు! ఇది తర్కరహితమూ మరియు మానవాళికి అత్యంత అవమానకరమైన విషయమూనూ! ఇలాంటి తప్పుడు విషయము- ‘అత్యంత హేతుబద్ధమైన’ మరియు ‘అత్యంత తార్కికమైన’ గ్రంధమగు బైబిలులో ఎందుకు ఉంటుంది!? 

తన ప్రమేయం ఏమాత్రం లేనప్పటికీ, ఎవరో చేసిన పాపానికి మరొకనికి బాద్యునిగా చేయటం తార్కికంగా అత్యంత అసమంజసం అహేతుకం. ఇక, అవమానకరం ఎలాగంటే- మానవుడు తనకు అభం శుభం అంటూ ఏమీ తెలియని స్థితిలో కళ్లు తెరుస్తాడు. ఆ స్థితిలో వాడు ఒక స్వచ్చమైన స్వేత పత్రం లాంటి వాడు మాత్రమే! అలాంటి వానిని పట్టుకొని పాపిష్టి వాడనటం అవమానకరం కాదా!? నిజంగా ‘మానవుడు జన్మతః పాపి’ అయితే, మేజర్ కాకుండా బాల్యంలోనే చనిపోయే పిల్లలందరూ నరకానికి పోయేవారేనా? అని ప్రశ్నిస్తే మీ అంతరాత్మ ఇచ్చే సమాధానం కాదన్నదే కదా! మరి అటువంటప్పుడు ‘మానవుడు జన్మతః పాపి’ ఎలా కాగలడు!? 

బైబిలుతో సంబంధంలేని ‘మానవుడు జన్మతః పాపి’అనే ఈ దుర్మార్గపు సిద్ధాంతం క్రైస్తవ సమాజంలో ఎవరు ప్రవేశ పెట్టారు? ఎందుకు ప్రవేశ పెట్టారు?

‘పరిశుద్ధ బైబిలు గ్రంధము’లో ఏ మూలనా కనీసం చాయా మాత్రంగానైనా కనిపించని ‘మానవుడు జన్మతః పాపి’ మరియు ‘యేసు రక్తం ద్వారా మాత్రమే పాపపరిహారం’ అనే సిద్ధాతాలను అసలు పరిశుద్ధ క్రైస్తవ్యంలోనికి ఎవరు ప్రవేశ పెట్టారు? అన్న ప్రశ్నకు సమాధానం- యూదులు! ఎందుకు ప్రవేశ పెట్టారు? అన్న ప్రశ్నకు సమాధానం- ఆదిమ క్రైస్తవుల ఆగ్రహం నుండి తప్పించుకోవటానికి!! అన్నది సంక్షిప్త సమాధానం.  వివరణాత్మక సమాధానం కావాలంటే- ఈ వ్యాసం మొత్తం చదవాలి.

‘పరిశుద్ధ బైబిలు గ్రంధము’ను కాస్త జాగ్రత్తగా అధ్యయనం చేస్తే- యూదుల ఘోరమైన రక్త చరిత్ర కనిపిస్తుంది. వారు పరిశుద్ధులు, నీతి మంతులు అయిన అనేక మంది ప్రవక్తలలో ఎందరినో అత్యంత నిర్దయతో సిలువలు వేసి, మరెందరికో అతి కర్కశంగా రాళ్లురువ్వి దారుణంగా హత్యలు చేసి ఉన్నారు. వారి ధర్మ విరుద్ధ దుర్మార్గపు చేష్టలను ఎవరు ప్రశ్నించినా వారిపట్ల వారు అలాగే ప్రవర్తిస్తారు. స్థలాభావం వలన దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను మాత్రమే  ‘పాత’-‘క్రొత్త నిబంధనల’ నుండి పేర్కొంటున్నాము వాటిని ఈ క్రింది గమనించగలరు.

   మరియు యెహోవా నేను ఈ ప్రజలను [అనగా యూదులను] చూచితిని;
   ఇదిగో వారు [అనగా యూదులు] లోబడనొల్లని ప్రజలు.  
                                                       - ద్వితీయోపదేశకాండము 9:13

 23. యెహోవా మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని
చెప్పి కాదేషు బర్నేయలోనుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన
యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగబడితిరి, ఆయన మాటను
విన లేదు. 24. నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు
         [అనగా యూదులు] యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. 
                                                          -ద్వితీయోపదేశకాండము 9: 23, 24

అతడు [అనగా ఏలియా] ఇశ్రాయేలు వారు [అనగా యూదులు] నీ నిబంధనను [అనగా
ధర్మశాస్త్ర ఆజ్ఞలను] త్రోసి వేసి నీ బలిపీఠములను పడగొట్టి నీప్రవక్తలను ఖడ్గముచేత
హతము చేసిరి. సైన్యముల కధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహా రోషము
              గలవాడనై నేను ఒక డనుమాత్రమే మిగిలియుండగా వారు [అనగా యూదులు] 
              నాప్రాణమునుకూడ తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను.
                                                                    -1 వ రాజులు 19:10

20. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యా
మీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞలను
మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక 
ఆయన మిమ్మును [అనగా యూదులను] విసర్జించి యున్నాడని దేవుడు 
సెలవిచ్చుచున్నాడు అనెను. 21. అందుకు వార [అనగా యూదులు] అతని
మీద కుట్రచేసి, రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణములోపల
రాళ్లు రువ్వి అతని [అనగా జెకర్యాను] చావగొట్టిరి. 
                                              -2 వ దిన వృత్తాంతములు 24:20, 21

     51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు
          లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను
     ఎదిరించుచున్నారు. 52. మీ పితరులు [అనగా యూదులు] ప్రవక్తలలో ఎవనిని
     హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని [అనగా యేసు] రాకనుగూర్చి ముందు
     తెలిపిన వానిని [అనగా బాప్తిస్మమిచ్చు యోహానును] చంపిరి. ఆయన
     [అనగా యేసు] ను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.
     53. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి
     గాని దానిని గైకొనలేదని చెప్పెను. -అపోస్తలుల కార్యములు 7:51-53

33. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు?

34. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను
పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని
మీ సమాజమందిరములలో కొరడాలతొ కొట్టి, పట్టణము నుడి పట్టణమునకు
తరుముదురు. 35. నీతిమంతు డైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును,
దేవా లయమునకును మధ్య మీరు [అనగా యూదులు] చంపిన బరకీయ
కుమారుడగు జెకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతి మంతుల
రక్తమంతయు మీ మీదికి వచ్చును. 36. ఇవన్నియు ఈ తరము వారిమీదికి
వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 37. యెరూషలేమా,
యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడిన వారిని రాళ్లతో
కొట్టుచును ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో
ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని
మీరు ఒల్లకపోతిరి. 38. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది.                                                                                                         -మత్తయి 23:33-38

పైన పేర్కొన్న ‘పాత’-‘క్రొత్త నిబంధనల’కు చెందిన పరిశుద్ధ వాక్యాలు- యూదుల కఠిన మనస్తత్వాన్నీ, దయారాహిత్యాన్నీ, రక్తపాత ధోరణినీ, హంతక స్వభావాన్నీ ఎంతో తేటగా తెలియజేస్తున్నాయి. ఇక్కడ అత్యంత గమనార్హ విషయం ఏమిటంటే- స్వయంగా తమ సంస్కరణ కొరకు, తమ సొంత యూద వర్గంలో ప్రభవించిన తమ దైవ ప్రవక్తల పట్లే వారు అలా ప్రవర్తించారన్నది. దీనిని బట్టి వారు ఇతరుల పట్ల ఇంకెంత కౄరంగా ప్రవర్తిస్తారో అన్న ఊహకు ప్రబల నిదర్శనం- గత అరవై సంవత్సరాల నుండి పలస్తీనీయుల భూభాగాలను దురాక్రమణ చేసి, అక్కడి పెద్దలపైనే కాక, పసిపిల్లపై సైతం వారు సాగిస్తున్న దారుణమైన నరమేధమే! 

(2 వ దిన వృత్తాంతములు 24:21) ప్రకారం- యూదులు గతంలో జెకర్యా మీద కుట్రచేసి, రాళ్లు రువ్వి చావగొట్టినట్లే, యేసు మీద కూడా అచ్చం అదే పని చేద్దామనుకున్నారు. దానికి ఆధారంగా ఈ క్రింది వాక్యాన్ని గమనించగలరు.

ప్రధాన యాజకులు, పెద్దలు, కయప అను ప్రధాన యాజకుని యింటి ఆవరణలో
సమావేశమై యేసును ఏదో ఒక కుట్రతో బంధించి, చంపాలని పన్నాగం పన్నారు.                                                                    -మత్తయి 26:3, 4
ఈ కుట్ర బెడిసికొట్టి, యేసు సిలవ మరణము నుండి తప్పించ బడ్డరు. కాని,
ఎవరు తీసిన గొతిలో వారే పడతారనంట్లు యేసు హత్యానేరం మటుకు యూదులపై
పడిపోయింది! దానికి ఆధారంగా ఈ క్రింది వాక్యాలను గమనించగలరు.
మీరు [అనగా యూదులు] జీవాధిపతిని [అనగా యేసు] చంపితిరి గాని దేవుడు
ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము [అనగా ఆదిమ అపోస్తలులము]
సాక్షులము.  -అపోస్తలుల కార్యములు 3:15

ఆయన [అనగా యేసు] యూదుల దేశమందును యెరూషలేమునందును
చేసినవాటికన్నిటికిని మేము [అనగా ఆదిమ అపోస్తలులము] సాక్షులము.
ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. దేవుడాయనను మూడవ దినమున లేపి
                                                                      -అపోస్తలుల కార్యములు 10:39, 40
నాటి ఆదిమ అపోస్తలులు, నేటి క్రైస్తవుల మాదిరిగా యేసు సిలువ సంఘటనను ‘పవిత్ర బలియాగం’గా కాక, ‘యూదులు తమ పాత అలవాటు ప్రకారం పాల్పడిన  ఒక హత్య’గానే పరిగణించే వారని పైన పేర్కొన్న పరిశుద్ధ వాక్య భాగాల ద్వారా సుస్పష్టం అవుతుంది. ఈ విషయాన్ని మరింత వివరంగా తెలుసుకోవటానికి MD.N.ఫ్రకాష్ రాసిన ‘సిలువ బలియాగమా? కుట్రా?’ అన్న పుస్తకాన్ని చదవగలరు. 

క్రైస్తవులను మాయకు గురిచేసిన యూదులు!? 
యూదులు అక్రమంగా వేయించిన సిలువ దండన నుండి యేసు తప్పించబడినప్పటికీ, ఆదిమ క్రైస్తవులు దృష్టిలో యూదులు మటుకు యేసు హంతకులుగా నిలిచిపోయారు! నాడు యూదులకు మరియు క్రైస్తవులకు మధ్య గొప్ప వైరం నడిచింది. అందుకే ఎందరో యేసు శిష్యులను యూదులూ హతమార్చారు. అలాగే ఆదిమ క్రైస్తవులచే వేలాది మంది యూదులూ  హతమార్చ బడ్డారు! వారిరువురి ఈ వైరం సుమారు రెండు, రెండున్నర శతాబ్దాల వరకూ సాగింది. కాని, ఆ యూదులే కనుక లేకపోతే తమ బ్రతుకే లేదన్నంతగా నేటి క్రైస్తవులు భావిస్తున్నారు! దీనిని బట్టి క్రైస్తవులను యూదులు ఎంతగా మాయ చేశారో మీకు అర్థం అవుతుంది కదా!

గమనిక: ఒకవేళ, నేటి తరం క్రైస్తవులు యూదుల పట్ల కలిగి ఉన్న భావననే నాటి తరం క్రైస్తవులూ కలిగి ఉంటే- యూదులను ‘క్రీస్తును హత్య చేసిన హంతకులు’గా కాక, ‘సర్వ మానవాళి పాపపరిహారానికి తెరతీసిన ఘనులు!’గా చూచేవారన్నది గమనార్హం! కాని వారు అలా చూడలేదంటే- యేసు సిలువ, ‘హత్యాయత్నమే’గాని ‘పవిత్ర బలియాగం’ కాదని అర్థం కావటం లేదా!? 

ఆదిమ క్రైస్తవ సమాజానికి తమ పై ఏర్పడిన ఆగ్రహ జ్వాలలను ఆర్పటనికి తాము పాల్పడిన ‘యేసు హత్యా నేరము’ను ‘దేవ దేవుని ఆది సంకల్పము’తో జరిగిన ‘పవిత్ర బలియాగము’గా చిత్రించి, తరువాత తరాల క్రైస్తవులను యూదులు మాయ చేశారు! దానికి పైన పేర్కొన్న పరిశుద్ధ వాక్యాలలోని- ‘చంపితిరి’  మరియు ‘చంపిరి’ అన్న వాక్య భాగాలే ప్రబల గుర్తు! 
‘మానవుడు జన్మతః పాపి’ మరియు ‘యేసు రక్తం ద్వారా పాపపరిహారం’ అనే సిద్ధాతాలను పరిశుద్ధ క్రైస్తవ్యంలో ఎవరు ప్రవేశపెట్టారో, ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్థమయ్యింది కదా!!?? ఈ రెండు సిద్ధాంతాలను ‘పరిశుద్ధ బైబిలు గ్రంధము’ ఎంతగా ఖండిస్తుందో తరువాయి భాగాలలో చూడగలరు. 
M.A.Abhilash
09666488877
tmcnewstmc@gmail.com
వీడియో ప్రసంగాల కొరకు Sakshyam TV చూడండి.

3 Responses to "M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు!-4 (‘మానవుడు జన్మతః పాపి’ మరియు ‘యేసు రక్తం ద్వారా పాపపరిహారం’ అనే సిద్ధాతాలను పరిశుద్ధ క్రైస్తవ్యంలో ఎవరు ప్రవేశ పెట్టారు? ఎందుకు ప్రవేశ పెట్టారు?)"

  1. Aravind

    మనుషుల పాపాలకు మరొక అమాయకుడిని నరబలి నిర్వహించడమనేది ఒక రాక్షస ప్రవృత్తి. అటువంటివాడు దేవుడెలా అవుతాడు. ఇంగితజ్ఞానమున్న ఎవరైనా ఎవరైనా దీనిని పూర్తిగా వ్యతిరేకించడమే కాదు, అసహ్యయించుకుంటారు. రక్తం తినడం నిషిద్దమని బైబిల్,ఖురాన్ లలో ఉందని చదివాను. అటువంటప్పుడు రక్తం పాప నిర్మూలకు ఏవిధంగా పనికొస్తుంది?

    1. Unknown

      మిత్రులు అరవింద్ గారికి నమస్కారం! మనుషుల శీలాన్ని నాశనం చేసి, వారిని అథోగతికి గురి చేసి ఉంచాలనే కొందరు దుర్మార్గుల ఉద్దేశ్యం నెరవేర్చుకొనే క్రమంలో ఇలాంటి తలా-తోకా లేని సిద్ధాంతాలు కల్పించబడి, అమాయక ప్రజలచే నమ్మించబడుతున్నాయి. ఇలాంటి సిద్ధాంతాల వెనుక చాలా పెద్ద కుట్ర దాగిఉంది. ఇక్కడ అత్యంత ఆలోచించదగ్గ ఒక విషయం ఏమిటంటే- మనకు చెప్పుకోవటానికి, వినటానికి సైతం ఎంతో అసహ్యయంగా ఉన్న- ఈ దేవుడు చస్తేగాని మానవుల పాపాలను క్షమిచలేకపోవటం, దేవుడు బలులు, రక్తాలు కోరుకోవడాలు వంటివి ప్రజలలో చెలామణి కావటానికి గల కారణం ఏమిటన్నది గుర్తిచాలి. తద్ ద్వారా వాటిని తొలగించటం సుసాధ్యం కాగలదు.
      ఈ అజ్ఞాన పూరితమైన, జుగుప్సాకరమైన సిద్ధాంతాలను అమాయక ప్రలలు అంగీకరించటానికి ఏకైక కారణం- అవి ధర్మ శాస్త్ర గ్రంధాలలో ఉన్నాయని నమ్మబలకటమే! కనుక ఈ మహా అజ్ఞానం నుండి ప్రజలను కాపాడాలని కోరుకొనే వారు, అవే ధర్మ శాస్త్ర గ్రంధాలను చేత పట్టి వాటిలో ఈ విషయాలు లేవని ఒకవైపు అమాయక ప్రజలకు చెప్పాలి. మరోవైపు ఈ దుర్మార్గపు సిద్ధాంతాలను ప్రచారం చేసే బోధకులను వాటిని ఈ ధర్మ శాస్త్ర గ్రంధాల ద్వారా నిరూపించమని నిలదియ్యాలి. ఈ రెండు పనులు చెయ్యకుండా ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని తీసుకురావటం ఎప్పటికీ సాద్యం కాదు. ఈ కోణంలో మీలాంటి విజ్ఞులు ఆలోచించాలని మేము సవినయముగా మనవి చేస్తున్నాము.

  2. Unknown

    Dear Abhilash,
    1) మీరు చెప్పేది బాగున్నది కాని నూరు శాతము పుణ్యము చేసేవాల్లెవరైనా యున్నారా? లేక పొతే వారికి క్షమాపణ యెట్లు వస్తుంది?

    2) మనుష్యుని ఆత్మ మొదటినుండి పాపముతో నిండి యుంది అని ప్రార్థస్నాన మంత్రంలో చెప్పబడినది - "పాపోహం పాప కర్మోహ, పాపాత్మా పాప సంభవా; త్రాహిమాం పుండరి కాక్షం సర్వ పాప హరో హరి…”
    దీనికి మీ జవాబేమిటి?

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine