• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Bible Articles » రోమా 9:5 వచనం ప్రకారం పౌలు దృష్టిలో యేసు స్తోత్రార్హుడైన దేవుడా?

రోమా 9:5 వచనం ప్రకారం పౌలు దృష్టిలో యేసు స్తోత్రార్హుడైన దేవుడా?

Label: Bible Articles

పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. – రోమా 9:5

Whose are the fathers and of whom as concerning the flesh Christ came, who is over all, God blessed forever. Amen. -Romans 9:5

ఈ వాక్యంలో “God  blessed forever” అన్న వాక్యభాగపు అనువాదం- “దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు” అన్నది. కాబట్టి పై వాక్యాపు సరైన అనువాదం- “శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు” అన్నది. అందుకే ఈ వాక్యపు సరైన అనువాదం రోమన్ కాథలిక్ బైబిల్లో ఈ క్రింది విధంగా చేసినట్లు చూడగలం.

వారు మన పితరుల వంశీయులే క్రీస్తు మానవ జాతిరిత్యా వారి జాతివాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడును గాక. — రోమా 9:5 

అయినప్పటికీ రోమా 9:5 వాక్యంలో పౌలు, యేసునే స్తోత్రార్హుడైన దేవుడని ప్రకటించాడని వాదించే వారు తెలుసుకోవలసింది పౌలు అదే రోమా పత్రికలో అనేకచోట్ల దేవుడైన యెహోవాను స్తుతిస్తున్న క్రమంలోనే రోమా 9:5 వాక్యంలో సైతం దేవుడైన యెహోవానే స్తుతించాడన్నది.




పౌలు అదే రోమా పత్రికలో నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడని పదే పదే ప్రకటించింది యేసునా?యెహోవానా?

అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన (యెహోవా) స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్‌. –రోమా 1:25

ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌. –రోమా 11:33-36

సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,  యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను,మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతు డును అద్వితీయ జ్ఞాన వంతుడునైన దేవునికి,యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌. –రోమా 16:25-27

ఈ విధంగా పౌలు రోమా 9:5 వాక్యంతో పాటు అదే రోమా పత్రికలో అనేక వాక్యాలలో నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడని పదే పదే ప్రకటించింది యేసును కాదు! కానీ యెహోవాను మాత్రమే అన్న విషయాన్ని గమనించగలం.

పౌలు తన అన్ని పత్రికల్లోనూ నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడని ప్రకటించింది యెహోవానే!

కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము. –హెబ్రీ 13:15

నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును. – 2కోరింధీ 11:31

మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. – ఎఫెసి 1:3

మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,  క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్‌. –ఎఫెసి 3:20,21

పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము. – రోమా 6:18

నేను మీ యందరికంటె ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను; అందుకు దేవుని స్తుతించె దను. -1 కోరింధీ 14:18

అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. – 1 కోరింధీ 15:57

కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్ర హించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. -2 కోరింధీ 1:3

మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.  -2 కోరింధీ 2:14

మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. – 2 కోరింథీ 8:16

 చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.- 2 కొరింధీ 9:15

ఈ విధంగా పౌలు రోమా పత్రికలో మాత్రమే కాక నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడని ప్రకటించింది ఒక్క యెహోవానే తప్ప యేసును కాదు. దానికి కారణం స్వయంగా యేసు ఆ తండ్రి అయిన యెహోవాను స్తుతించటం మరియు ఘనపరచు దాసుడై ఉండటమే!

యేసు- తండ్రీ, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును, వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. –మత్తయి 11:25

యేసు- నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను. — యోహాను 8:49

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine