• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Vedas » VIDEOS » దేవదేవుడగు పరమాత్మను వదిలి దేవతలను ఆరాధించేవాడు Small brain కలవాడు - శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు.

దేవదేవుడగు పరమాత్మను వదిలి దేవతలను ఆరాధించేవాడు Small brain కలవాడు - శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు.

Label: Vedas, Label: VIDEOS

భగవద్గీతలోని 7:23 వ శ్లోకానికి గీతామకరందం అనువాదకులు, వ్యాఖ్యాత అయినటువంటి శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు చాలా గొప్ప వివరణ ఇచ్చారు. ఒకసారి ఆ వ్యాఖ్యానాన్ని,భగవద్గీత శ్లోకాన్ని మనం స్మరించుకుందాం!

.                 అంతవత్తు ఫలం తేషాం తద్భత్యల్పమేధసామ్
                  దేవాన్ దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామాపి. గీత 7:23
        తా:- అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలం నాశవంతమైయున్నది. (ఏలననగా) దేవతలను పూజించువారు దేవతలనే పొందుచున్నారు. నాభక్తులు (నన్ను పూజించువారు) నన్నే పొందుచున్నారు.

      వ్యాఖ్య : పరమాత్మను వదిలి ఇతర దేవతలను నారాధించువారెట్టివారో వారెత్తి ఫలితమును బొందగలరో, భగవద్భక్తులెట్టి ఫలితములను బొందగలరో ఈ శ్లోకమున వివరించబడినది. సాక్షాత్ దేవదేవుడగు పరమాత్మను వదిలి ఇతర దేవతలను నాశ్రయించువారు, భజించువారు అల్పఫలములనే పొందుదురు. కావున అట్టి నశ్వరఫలితములకై అఱ్ఱులు చాచువారు అల్పబుద్ధి (Small brain) కలవారని ఇట పేర్కొనబడినది. ఏలాయనిన పూర్ణబుద్ధి కలవారైనచో శాశ్వత ఫలమొసంగునట్టి , జన్మ రాహిత్యమును కలుగజేయునట్టి పరమాత్మనే ఆశ్రయించెడివారుగదా! " ఈ విధంగా ప్రకాశానందగిరి స్వాములవారు దేవతారాధన అల్పబుద్ధి కలిగిన వారు మాత్రమే చేస్తారంటూ ,పరిపూర్ణ బుద్ధి గలిగిన వారు దేవదేవుడగు ఆ అక్షరపరబ్రహ్మమునే వేడుకొందురనియు చాలా చక్కగా వివరించారు. నిజానికి గీతా శాస్త్రం ప్రకారము నిర్గునోపాసమే శ్రేయస్కరము. వేద శాస్త్ర ప్రకారము విగ్రహారాధన, దేవతా పూజలు మనిషిని అధో గతికి దిగజార్చేవే! శుభమ్.

8 Responses to "దేవదేవుడగు పరమాత్మను వదిలి దేవతలను ఆరాధించేవాడు Small brain కలవాడు - శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు."

  1. hari.S.babu

    @YOU
    ఈ విధంగా ప్రకాశానందగిరి స్వాములవారు దేవతారాధన అల్పబుద్ధి కలిగిన వారు మాత్రమే చేస్తారంటూ ,పరిపూర్ణ బుద్ధి గలిగిన వారు దేవదేవుడగు ఆ అక్షరపరబ్రహ్మమునే వేడుకొందురనియు చాలా చక్కగా వివరించారు. నిజానికి గీతా శాస్త్రం ప్రకారము నిర్గునోపాసమే శ్రేయస్కరము

    @HARIBABU
    ప్రకాశానందగిరి స్వాములవారు చెప్పిన దానిలో సగుణోపాసన,నిర్గుణోపాసన గురించి ఎక్కడ ప్రస్తావించారు?వారు చెప్పనివి మీరు చెప్పడం దేనికి?గీతలో కూడా మీరు ఉదహరించిన శ్లోకం దానికి సంబంధించినది కాదు.ఎవరెవరు ఏయే విధాలుగా అర్చిస్తారు అనేది నాలుగు రకాలుగా చెప్పి తాత్కాలిక ప్రయోజనం కోరేవాళ్ళు వామాచారం లాంటి తంత్రాపూజలు చహెస్తారు,ఐశ్వర్యాన్ని కోరుకనే వాళ్ళు లక్ష్మిని మురుగణ్ణీ పూజిస్తారు అని భక్తిలో ఉండే రకాల్ని చెప్పిన తర్వాత ఇది వస్తుంది.

    ఎవరెవరు నన్ను ఎట్లా కొలిస్తే వారినట్లా అనుగ్రహిస్తాను అని నొక్కి చెప్పే భాగం కూడా ఉందిగా అగీతలో,మూత్తం గీతలో ఈ ఒక్క వాక్యమే దొరికందా మీకు మా అజ్ఞాన తిమిరాన్ని వదిలించటానికి - త్రిగుణ చర్చ,దైవాసుర సమప్దిభాగం,విశ్వరూప సందర్శనం,భక్తి షట్కం,జ్ఞాన షట్కం వీటి గురించి మీకు ఎంతా తెలుసు?

    ముందు వెనకల మొత్తం సారం చెప్పకుండా దాచేసి విగ్రహారాధనకి వ్యతిరేకమైన మీ వాదనకి పనికొచ్చే ఈ ఒక్క శ్లోకాన్ని మాత్రమే చెప్పడం వెనక మీ ఉద్దేశం ఏమిటి?మొత్తం 700 పైన ఉన్న గీతలో ఈ ఒక్క వాక్యాన్ని విడదీసి మీరు హిందువుల మీదకి వదుల్తున్నారునాకు మొత్తం గీత అన్ని శ్లోకాలూ వచ్చు.తెలియని వాళ్లని మోసం చెయ్యడం మానుకోండి.

    ఆలయాలకి సంబంధించిన ప్రతి పూజ కూడా ఆగమ శాస్త్రంలో చెప్పబడినదే! ఆగమం వేద విజ్ఞానం లోని భాగం!ఆలయ నిర్మాణానికీ అర్చామూర్తుల్ని చెక్కడానికీ ప్రతిమాశాస్త్రం ఉంది.అవి రచించిన వాళ్లకి వేదం తెలియదని మీ అభిప్రాయమా?

    మీకు పూర్తిగా తెలియని దాని గురించి అన్నీ తెలిసినట్టు చెప్తున్నారు అల్లమంటే తెలియదా బెల్లం మాదిరి పుల్లగా ఉంటుంది అన్నట్టు.

    1. Unknown

      హరిబాబుగారూ…ముందుగా మీ స్పందనకు కృతజ్ఞతలు. మీరు పెట్టిన కామెంటుకు పూర్తి వివరణ (సమాధానం) తప్పనిసరిగా ఇస్తాను.

    2. hari.S.babu

      ఎంత కాలం పదుతుంది జవాబు చెప్పేతందుకు?

      అవాబుతో పాటు మీరొక సాక్ష్యాన్ని తప్పనిసరిగా చూపించాలి.నాకు తెలిసిన శ్రీ విద్యాప్రకాశాననదగిరి స్వాముల వారు గీతా మకరంద గ్రంధ రచయిత.ఇప్పుడు త్రిదండి శ్రీమన్నారాయణ చిన జియ్యర్ స్వాముల వారు పాటించే విశిష్టాద్వైత సంప్రదాయాన్ని పాటిస్తున్న ఆశ్రమవాసి.ఈ సంప్రదాయంలో భక్తులకి శంఖ చక్రాలు భుజాల మీద ముద్ర వేసి నామదీక్ష ఇచ్చే సంప్రదాయం ఉంది.ఆ దీక్ష తీసుకున్నవారికి లక్ష్మీనారాయణుల పంచలోహ విగ్రహాలు నిత్యపూజార్ధం ఇస్తారు.

      మీరు ఇక్కడ ప్రస్తావించినది కూడా వారినేనా?వారినే అయితే మీరు చేసినది నిజంగా సాహసమే!నిత్యం ఒక అర్చామూర్తిని తను ఆరాధిస్తూ భక్తులకి ఆ దీక్షని ఇస్తూ ఉందే ఒక వ్యక్తిని విగ్రఘారాదనని వ్యతిరేకించే మీ ఎజెండాకి సాక్ష్యంగా వాడుకోవటం అంటే ఒక మనిషిని తన మనస్సుకి విరుద్ధంగా దొంగసాక్ష్యం చెప్పించటమే, కాదంటారా?

      గీత విగ్రహారాధనని వ్యతిరేకించిందా సమర్ధించిందా అనేదానికన్నా మీరు ముఖ్యంగా తేల్చాల్సినది ఇదే!మీరు ఉదహరించిన స్వామి ఏనాడూ ఏ విగ్రహానికీ అర్చన చెయ్యలేదనీ విగ్రహారాధనని వ్యతిరేకించాడనీ మీరు గట్టిగా చెప్పగలరా? ఎక్కడో ఏదో ఒక ప్రసంగంలో చెప్పిన ఒక సూక్తిని పట్టుకుని చహెసే విశ్లేషనలు కాదు నిజమైన సాక్ష్యాధారాలు చూపించాలి

      వేదం గురించి నాకు తెలియదు కాబట్టి మీరు వేదమంత్రాల్ని ఎత్తి చూపిబంచినా నేను వాదన అకొనసాగించహ్దం కష్తమే,కానీ గీత విగ్రహారాధనని వ్యతిరేకించిందా సమర్ధించిందా అనే విషయం గురించి తర్వాత చర్చించుదాం,మీకు అంగీకారమేనా?

    3. Unknown

      హరిబాబుగారు.. మీరొకసారి గీతామకరందం 519 పీజీ పూర్తిగా చూడండి. ఇంకా స్పష్టంగా ఆయన నావదనను బలపర్చారు. నేను కొంతవరకే పేర్కొన్నాను. దేవదేవున్ని వదిలి దేవతలను ఆరాధించేవారు గంగానదిని వదిలి, చిన్నవావిలో నీరు త్రాగేవాడితోనూ, కల్పవృక్షమును వదిలి చిన్న చెట్టును ఆశ్రయించేవాడితోనూ ఆయన పోల్చారు. ఇక పోతే ఆయన విగ్రహారాధన చేసేవాడో,లేదో నాకు తెలియదు. అవసరం కూడాలేదు. ఎందుకంటే ప్రమాణముగా వేదోపనిషత్తులు,గీతాశాస్త్రమవుతుంది తప్ప ఏ స్వాములవారూ మనకి ప్రమాణం కాదు.అసలు విగ్రహారాధన వాస్తవికతను మనం శాస్త్రాల వెలుగులో తెల్సుకోవాల్సిన అవసరం ఉంది. మా పూర్తి జవాబులు త్వరలో టపాల రూపంలో అందిస్తాము.స్పందనకు కృతజ్ఞతలు.

    4. hari.S.babu

      గీతామకరందం 519 పీజీ నేను ఇప్పటికిప్పుడు చదవటం కుదిరే పని కాదు.
      మీరు విగ్రహారాధన "మనం" శాస్త్రాల వెలుగులో తెలుసుకోవాల్సి ఉంది అంటున్నారు.మీరు హిందువా?హైందవేతరులా?

      ఈ ప్రశ్న చాలా ముఖ్యం.ఎందుకంటే మీరు హిందువైతే ఇక్కడి గురుపరంపరని మీరు గౌరవించాలి.నేను బ్రాహ్మణుణ్ణి కాదు.నాకు సంస్కృతం చాలా కొద్దిగా వచ్చు.సనాతన ధర్మం యొక్క సాహిత్య రూపమ ఎంత విస్తారంగా ఉందో మీకు తెలుసా?ఏ ఒక్క వ్యక్తి అయిన అసరే మొత్తం సాంగోపాంగంగ అకాకుండా రేఖామాత్రంగా చదవటానికైనా సరే ఒక జీవిత కాలం సరిపోదు.అందుకే బ్రాహ్మణులు కూడా కొన్ని శాఖలుగా ఏర్పడి ఒక్కొక్క శాఖ వారూ ఒక్కొక్క భాగాన్ని మౌఖికంగా తరాల తరబడి అందించుకుంటూ వచ్చి గ్రంధస్థం చెయ్యటం కూడా ఇటీవలనే జరిగింది.అందులో కిలిష్టమైనవి ఆయిన అతప్పనిసరైగా ప్రజలకి అవసరమని అనుకున్నవాటిని ఇతర రూపాల్లో,అంటే రామాయణ మహాభారతాల వంటి కధా రూపాల్లోనూ గీత లాంటి సంకలనాలు గానూ ఇచ్చారు.

      అవును గీత ఓక సంకలనం - సనాతాన్ ధర్మమ పప్టి వరకు చెప్పిన దాన్ని ఎబ్రిడ్జి చహెసి ఓక్చోట చెప్పడం జరిగింది.ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక భావం, మళ్ళీ ఓకే అధ్యాయంలో వేరు వేరు అంశాలను చెప్పి వీటిమధ్య ఒక లింకుని పెట్టడం - ఈ లింకుల్ని వొదిలేస్తే ఒక అంశం మరొక అంశంతో విభేదిస్తున్నట్టు అనిపిస్తుంది.ఉదాహరనకి భక్తిని గురించి చెప్పేటప్పుడు ఆలోచనకి తావివ్వకుండా తను ఏం చెప్పాడో దాన్ని గుడ్డిగా నమ్మెయ్యమని చెప్పినట్టు ఉంటుంది.అదే జ్ఞానం గురించి చెప్పిన చోట నేను కాదు నీ గురువు కాదు ఎవరు చెప్పినా నమ్మకు,నీ అంతట నువ్వు తెలుసుకో అని చెప్తున్నట్టు ఉంటుంది.ఇవన్నీ కలిపి చదివితేనే గీత యొక్క పరిపూర్ణమైన స్వరూపం తెలుస్తుంది.మీరేమో అక్కడో ముక్కా ఇక్కడో ముక్కా ఎత్తి చూపిస్తూ గీతలో ఈ ఒక్క ముక్కే ఉందంటున్నారు,ఏంటిది?

      మనిషికి అవసరాలు రెండు రకాలు - ఒక సమస్య వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది,మొత్తం జీవితమంతా ఎలా ఉండాలీ అనేది.సరిగ్గా ఆ రెంటిని గురించీ సనాతన ధర్మం కూడా మారని ధర్మం,మారే ధర్మాం అని విభాగించి చెప్తుంది.ఈ రెండూ ఒకోసారి క్లాష్ అవ్వొచ్చు.అలాంటప్పుదు దేన్ని పాటించాలి అనేది తెలుసుకోవటానికి గురువు చాలా అవస్రం. తాత్కాలిక ధరం,శాశ్వత ధర్మాం క్లాష్ అయినప్పుడు మనిషి దేన్ని పాటించాలి అనేది మీరు జనరలైజ్ చేసి చెప్పగలరా?చెయ్యలేరు!ఎందుకంటే అది మనిషి మనిషికీ మారుతుంది - సన్నివేశాన్ని కూడా పట్టించుకోవాలి,అవునా?

      ఓక్ 10వ తరగతి చదివే కుర్రాడు దేవుణ్ణి మోక్షం గురించి అడుగుతాడా?అలా అడగ్టం కరెక్తని మీరు భావిస్తున్నారా?మీరు ఇప్పుడు పట్టుకుని వ్రేలాడుతున్న "విగ్రహారాధనని ఈ ప్రపంచంలో జరగనివ్వకూదదు" అనే ఎజెండాతో మీరు చేస్తున్న పులుముడు వాదనలు పాటించి ఆ వయస్సులోనే మోక్షం కోరుకుంటే మానవజాతి ఎప్పుడో అంతరించిపోయి ఉండేది, కాదంటారా?మరి వయస్సులో ఉన్నవాడు ఇప్పుడు రాసిన 10వ తరగతి పరిక్షల్లో మంచి మార్కులు రావాలి,చదువు పూర్తి కాగానే మంచి ఉద్యోగం రావాలి అని గుడికెళ్ళి దేవుడికి దణ్నం పెట్టుకోవటాన్ని మీరు small brain అంటున్నారా?మీరు గీతామకరందంలోనుంచి ఉదహరించిన భావం కూడా విగ్రహారాధన గురించి కాదు చెప్తున్నది,సరిగ్గా అర్ధం చేసుకోండి

      TO BE CONTINUED

    5. hari.S.babu

      CONTINUED FROM ABOVE
      మీరు ఉదహరించిన శ్లోకానికి ముందరి శ్లోకాలు ఇవి:

      నానా కామహృత జ్ఞానుల్ కొల్చెద రన్యదేవులన్,
      ప్రకృతి వశ్యులై వారి కేవేవొ మొక్కుకొంచును
      7-20
      ఏయే మూర్తుల మద్భక్తున్ దర్చించగోరు శ్రద్ధగా
      ఆయా మూర్తులనై నేనె వారిలో శ్రద్ధ నిల్పెదన్
      7-21
      అమిత శ్రద్ధతో వాడు వార్ని కొల్వగ బూనును
      నేనె తీర్తును తద్వాంచలు వాడును చరితార్ధుదౌన్
      7-22

      మరి ఇందులో ఇనత్ స్పష్తంగా కొన్ని మూర్తులకి మొక్కులు మొక్కుకుంటూ కొల్చినా నేను కూఅడా ఆయా రూపాల్లో కనబడుతూ వారి కోరికలు తీరుస్తాను అని ఇంత ఖండితంగా చెప్పిన భాగం ఉందా అలేదా?

      గీతలో శ్రీకృష్ణుడు నేను అని చెప్తున్నది "మోక్ష్ప్రాప్తి కోసం పూజించాల్సిన దేవాధిదేవుడు" అనబడు అంతిమ లక్ష్యం.మూఢుకు ఇతర దేఅవతల్ని కొలుస్తారు అనది అర్ధార్ధులై కొలిచే దేఅవతల గురించి.మెరు దాని సరిగ్గ్గా అర్ధం కకనో అర్ధమయినా తెలియని వాళ్లని మోసం చెయ్యటానికో విగ్రహాలకి అప్లై చెస్తున్నారు
      ఇప్పుడు చెప్పండి, పైన మీరు ఉదహరించిన శ్లోకం నిజంగా విగ్రహారాధాన్ని వ్యతిరేకిస్తుందా?

      నేను మొదటి కామెంటులో టచ్ చేశానే భక్తుల్ని క్లాసిఫై చహెశాడని ఆ భాగం ఇది:
      నాల్గు విధమ్ములౌ వారు నన్ను భజింతు రర్జున
      జిజ్ఞాసు,వార్తు,డర్ధార్ధి,జ్ఞానియున్ భరతర్షభ
      7-16
      వారిలో జ్ఞని నిత్యయుక్తుండు,భక్తుడు,శిష్టుడు
      నాపై అత్యంతమౌ ప్రీతివానికటులె నాకును వానిపైన్
      7-17
      ఉదారుల్ నల్వురున్,ఐన జ్ఞాని నా కాత్మయే నిజం
      యుక్తాత్ముండుండు నాయందే అనుత్తమ గతిన్ గనున్
      7-18
      బహు జన్మల అంతాన జ్ఞాన్వంతుడు పొందు నన్ను
      వాసుదేవుడె సర్వమ్మంచెంచు వార రతిదుర్లభుల్
      7-19
      మళ్ళీ దీని తర్వాత నానా కామహృత్ శ్లోకం వస్తుంది. ఇంత స్పష్టంగా అందరు భక్తులూ ఉదారులే,ఎవరు ఏ మూర్తిగా భావించి మొక్కినా నేను ఆ మూర్తినై వారిని కరుణిస్తాను అని చెప్తుంటే మీరేమో గెత అసలు విగ్రహారాదహాన్ చెయ్యవద్దంటునది అంటున్నారు,దీని అర్ధ మేమిటి?

      అయితే ఒకటి దాన్ని మూఢత్వం అన్నాడు గదా అని మీరనొచ్చు.దీని గురించి మరొక చెట మరొక అధ్యాంలో విస్తారంగా చెప్తుంది.ఇప్పుడు మీకు మొత్తం గీత అంతా ఇక్కడ ఎత్తి రాయాల్సి ఉంటుంది.సూక్ష్మంగా చెప్పాలంటే బాల్య,యవ్వన,కౌమార,వ్ర్ద్ధాప్య దసలని కూడా గీత పట్టించుకుంటుంది - వ్యాసుడు మీకన్నా నాకన్నా చాలా ప్రాక్టికల్!తొలి దశలో అర్ధం కోరి ఇతర దేవతల్ని బజించినా ఇస్తాను,కానీ ఆ దశ దాటినాక కూడా మోక్షార్ధి కానివాడిని అక్కద మూఢుడు అంటున్నాడు గానీ మీరు పులిమి చెప్తున్నట్టు విగ్రహారాదహనకి వ్యతిరేకంగా కాదు.

      అక్కడ ఉన్నది ఒకటయితే మీరు ఇంకొకటి చెప్పడం మోసం చెయ్యడం కాదా?ప్రతి మతంలోనూ ఉన్నట్తే ఇక్కడా సర్వేశ్వరుడూ ఉన్నాడు,ఇతర దేవతా మూర్తులూ ఉన్నారు.ఇతర దేవతల గురించి చెప్ప్తున్న దాన్ని విగ్రహాల గురించి చెప్తున్నట్టు అర్ధం చెప్పడం ఏంటి?

      మీరు హైనదవెతరులుగా ఇటువంటి పనిని కొనసాగించితే మీ మూలంగానే మతకలహాలు చెలరేగే అవకాశం ఉంది.ఇంతటితో ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది.

  2. Zilebi


    మీ టపా ల ధోరణి కి సరి పోయే టట్టు ఉపన్యాసాలు ఇచ్చే స్వాములు మీకు బాగా దొరుకుతారండి బాబు :)

    జిలేబి

  3. Zilebi


    హరిబాబు గారు :)

    సేహభేష్ !

    ఇట్లా చెబ్తే గాని అర్థం కాదను కుంటా సనాతన ధర్మ విశాల దృక్పథం

    పట్టదురా మీ అరచేతిన గట్టిగ మూత బెట్ట లేరురా యిదియే సనాతనం

    త్రీ చీర్స్ తో
    జిలేబి

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine