• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Vedas » విగ్రహారాధన వెనుక దాగి ఉన్న కుట్ర — కుట్ర దారులు - దాని నష్టాలు!

విగ్రహారాధన వెనుక దాగి ఉన్న కుట్ర — కుట్ర దారులు - దాని నష్టాలు!

Label: Vedas

ఒకవైపు- ‘బహుదైవోపాసన’ లేక ‘విగ్రహారాధన’ వైదిక ధర్మానికి చెందినదే కానీ, ‘ఏకేశ్వరోపాసన’ ఇస్లాంకు లేక భారతీయేతర మతాలకు చెందినదనే భావనను హిందూ విగ్రహారాధనా ధ్వజవాహకులు తమ అమాయక భక్తజనంలో ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ, వాస్తవానికి విగ్రహారాధనతో అటు బైబిలు మరియు ఖురాను ప్రతిపాదిత ధర్మానికి మాత్రమే కాక, ఇటు వైదిక ధర్మంతోనూ ఎలాటి సంబంధమూ లేదు. మరొకవైపు- క్రైస్తవ, ముస్లిం విగ్రహారాధనా ధ్వజవాహకులు తమ తమ అమాయక భక్తజనానికి హిందువులు చేసేదే విగ్రహారాధన అన్నట్లు, తాముచేసే యేసు, కన్య మేరీ, సిలువ ఆరాధన మరియు సమాధుల, దర్గాల ఆరాధన విగ్రహారాధన కానట్లు భ్రమింపజేస్తూ ఉంటారు. అయితే ‘మత’ మరియు ‘పాలక’ రంగాలకు చెందిన వారిలోని వంచన, అనీతి, నిర్దయ వంటి దుర్మార్గపు స్వభావాలు  కలిగిన ‘ఒక చిన్న వర్గం’ (Minority Grope) పరస్పరం కుట్ర పూరితంగా కుమ్మక్కై, అమాయకులైన ‘ఒక పెద్ద వర్గము’ (Majority Grope) ను తమ బానిసలుగా చేసుకోవటానికి పన్నాగం పన్నారు. ఇది అనాదిగా జరుగుతున్న దౌర్జన్యమే! పై వర్గాల మౌలిక లక్ష్యాలు రెండు. వాటిలో…



1.     ప్రత్యక్షంలో ‘బహుదైవోపాసన’ లేక ‘విగ్రహారాధన’ను అడ్డం పెట్టుకోని పరోక్షంలో అమాయక భక్తజనానికి తామే అపర దైవాలై వారిపై తమ ఆధిపత్యాన్ని సంపాదించటం.

2.    వారి శ్రమనూ, సంపదనూ అడ్డంగా దోచుకోవటం.

      పైన పేర్కొన్న వాటిలో మొదటి పనికి గల కారణం- జనసామాన్యుల ‘భావ స్వేచ్ఛను హరించటం!’ ఈ ఒకే ఒక్క పని వలన వారిని తమ చేతులలో కీలు బొమ్మలుగా మార్చుకోవచ్చు అన్నది వారి దురుద్దేశ్యం. తద్వారా-మెజారిటీ ప్రజలపై ‘ఆధిపత్యం సాధించటం’ మరియు వారిని ‘అడ్డంగా దోచుకోవటం’ సులువైపోతుంది.

     అలాగే, పైన పేర్కొన్న వాటిలో రెండవ పనికి గల కారణం- తమకు వ్యతిరేకంగా ఏ విప్లవం, ఏ తిరుగుబాటు అయితే ఆ మహనీయులు అత్యంత ధైర్య సాహసాలతో తెచ్చారో దానిని కొనసాగకుండా నిర్వీర్యం చేయటమే! దానికి గాను వారు ఈ క్రింది రెండు పనులలో ఏదో ఒకటి చేస్తారు…

1.     సామన్య అమాయక ప్రజానీకం పట్ల పాల్పడుతున్న వంచనకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే సంస్కర్తలను సాధ్యమైతే, మత వ్యతిరేకులుగా లేక సంఘ వ్యతిరేకులుగా ముద్రవేసి హతమార్చటం.  
లేక
2.    ఆ విప్లవకారుల నిర్యాణం అనంతరం వారికి దైవత్వాన్ని ఆపాదించి, వారిని మానవాతీత శక్తులు కలిగిన వారిగా అబద్ధ ప్రచారం చేయటం.

      అంటే- ‘వంచకులైన మత పండితులు’ మరియు ‘నిర్దయులైన పాలకులు’ స్వయంగా వారిని చంపేసో లేక వారు చనిపోయిన తరువాతో వారిని కీర్తిస్తూ, వారి విగ్రహాలను ప్రతిష్ఠించి, వారి పేరిట నిత్య ధూపదీప నైవేద్యాల క్రతువులనో, తీర్థాలనో, జాతరలనో ప్రారంభించి, మరొక విధమైన దోపిడీని కొనసాగిస్తారు. అయితే తమ వీరులకు ఘనమైన నివాళులు అర్పించ బడుతున్నాయని అపోహపడతారు… పాపం ఈ అమాయక బడుగు జనం!

ధర్మశాస్త్రాల ప్రకారం మానవుడు స్వేచ్చాజీవి!
       మానవునిగా మీరు మీ ‘జన్మతః సంపూర్ణ స్వేచ్చాజీవి!’. కనుక ఎల్లప్పుడూ, ‘స్వేచ్చ’ మీ జన్మ హక్కుగా ఉండాలి. అయితే అది మీ నుండి తస్కరించ బడకుండా ఉండాలంటే- మీ కొరకు ఏది ‘విధి’యో మరియు ఏది ‘నిషేధ’మో స్వయంగా మీకే తెలిసి ఉండాలి. వాటి జ్ఞాన రాహిత్యమే ‘మీ స్వేచ్చ’ను ఇతరులు హరించటానికి ప్రధాన కారణమౌతుంది  .ఎందుకంటే- పాపం సామాన్య అమాయక ప్రజలకు వాస్తవంలో తమ కొరకు ఏది ‘విధి’యో మరియు ఏది ‘నిషేధ’మో తెలియదు కదా !ప్రజల ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని ‘వంచకులైన కొందరు మానవులు’ తమ స్వార్థ ప్రయోజనాల కొరకు  ‘అధికశాతం మానవుల’కు చెందిన ‘స్వేచ్చ’ను హరించి, వారిని తమకు ‘బానిసలు’గా చేకుంటున్నారుదాని కొరకు వారు ఎవరికి నచ్చిన. ‘విధి’-‘నిషేధాల’ను వారు కల్పించి ఆదేశిస్తూ, ఘోరంగా వంచిస్తూ పోతున్నారు. అలాంటి వారిని ప్రశ్నించే వారు ఎవరూ లేరు. నిరర్ధక, కాల్పనిక ‘విధి’-‘నిషేధాల’ సుడిగుండం నుండి ఎవరి సహాయమూ లేకుండా మీకు మీరుగా బయట పడగలిగే ఒక ‘గొప్ప విధానము’- గీతా-బైబిలు-ఖురాను వంటి ధర్మశాస్త్రాలను మీరు ప్రత్యక్షంగా అధ్యయనం చేయటమే! ఒకవేళ, ‘విధి’-‘నిషేధాల’ వంటివి ఏమైనా ఉంటే- అవి మీ ‘ధర్మశాస్త్రాల’ వైపు నుండి ఉండాలే తప్ప, మీ ‘నామ కార్ధ మత పండితులు’ కల్పించినవై ఉండకూడదు.

గమనిక: ఇక్కడ అత్యంత గమనార్హ విషయం ఏమిటంటే- ఒక మనిషి తన వ్యక్తిగత లాభ-నష్టాల కొరకు మరొక మనిషిపై ఆధిపత్యం సంపాదించి, అతనిపై తన అధికారం చలాయించే అర్హతను ఏమాత్రమూ కలిగి లేడన్నది.

     అయితే మానవాళి సామజిక వ్యవస్థ నడవాలంటే, ఒకని అజమాయిషి, అదుపు ఉండాలి కదా! అవును నిజమే… ఒక మానవ సముదాయాన్ని నడిపేవాడు ‘ప్రతినిధి’ అవుతాడే తప్ప ‘నాయకుడు’ కాలేడు. కారణం ఏమిటంటే- అతడు ఆ సముదాయానికి ‘ప్రాతినిధ్యం’ వహిస్తాడే గాని ‘నాయకత్వం’ వహించడు కనుక. అతని సృష్టి కర్త అతని సక్రమ జీవన మనుగడ కొరకు వివిధ కాలాలలో వివిధ దేశాలలో ‘విధి-నిషేధాల పట్టికల’ను ఇచ్చి ఉన్నాడు. వాటినే ‘ధర్మశాస్త్రాల’ని అంటారు. పండిత వర్గం వాటి ప్రకారమే ప్రజలకు మార్గదర్శకం చేయాలి. తమ ఇష్టానుసారమైన ‘ఆలోచన’ మరియు ‘ఆచరణ’ విధానాలను కల్పించి, వాటి ప్రకారం ప్రజలను నడపకూడదు. ఎందుకంటే- వాటిలో పాలకుడు-పాలితుడు, పండితుడు-పామరుడు, ధనిక-బీద మరియు అగ్ర-అల్ప వర్ణ వర్గాలను బట్టి నేటి భౌతిక చట్టలలో మాదిరిగా శిక్షా-బహుమానాల విషయంలో ఎలాంటి వ్యత్తాసాన్ని పాటించలేదు.  

       ఇది ‘దుర్మార్గపు స్వాభావం కలిగిన మైనారిటీ వర్గం’ నుండి ‘అమాయకులైన మెజారిటీ వర్గం’పై అనాదిగా సాగుతున్న అత్యంత ఘోరమైన, అత్యంత అన్యాయమైన దౌర్జన్యం! ప్రజలను భావదాస్యానికి గురిచేసి, వారిపై తమ ఆధిపత్యాన్ని చలాయిస్తూ, వారిని ఆర్థికంగా దోచుకోవటానికి అత్యంత అనువైన, సులువైన అడ్డమైన మార్గం- ‘మత రంగం!’ ఈ దుఃస్థితికి ఒక్క వైదిక ధార్మిక రంగమే కాక, ప్రపంచ వ్యాపితంగా ఉన్న సకల ధార్మిక రంగాలూ గురై ఉన్నాయ

        విగ్రహారాధన అనేది ‘బహుదైవోపాసన’కు చెందిన ఒక రూపం మాత్రమే! ఈ ‘బహుదైవోపాసన’ బహుముఖాలుగా విస్తరించి ఉంది. ఇక, విగ్రహారాధన అనగానే మన క్రైస్తవ, ముస్లిం వర్గాల మదిలో వెంటనే ‘హిందూ ధార్మిక వ్యవస్థ’ ఒక్కటే మెదులుతుంది. దీనికి మొదటి కారణం- ‘బహుదైవోపాసన’ ఎన్నెన్ని రూపాలలో విస్తరించి ఉందో వారికి తెలియకపోవటం. రెండవది- స్వయంగా తమ తమ వర్గాలలో బాహాటంగా జరుగుతున్న విగ్రహారాధనను చూడలేని గ్రుడ్డి తనము!

ఈ ఉప అంశాన్ని హేతువాద మిత్రులు ప్రత్యేక శ్రద్ధతో గమనించ మనవి. ఆస్తిక సమాజానికి చెందిన- ప్రజల భావ స్వేచ్ఛను హరించే కుట్రను బహిర్గతం చేస్తున్న హిందూ-క్రైస్తవ-ముస్లిం ధర్మశాస్త్రాలు!
 తమ ఆస్తిక ప్రజల స్వేచ్ఛను కబళించటానికి వంచక పండితులు పన్నే దుర్మార్గపు కుట్ర ఏమిటో వైదిక-క్రైస్తవ-ముస్లిం ధర్మశాస్త్రాలు ఉమ్మడిగా తెలియజేస్తున్న వైనాన్ని ఒక్కొక్కటిగా ఈ క్రింది గమనించగలరు.

      కొందరు పండితులైయున్నాను నా మాయచేత మొహితమైన చిత్తము కలవారై, అంతట నిండియున్న అత్మనగు నన్ను పొందజాలక కేవలము ఉదరము (అనగా పొట్ట) ను నింపుకొనుటకై కాకులవలె అచ్చటచ్చట సంచరించుచున్నారు. యతి (అనగా భక్తుడు) శిలామయములును, లోహమయములును, మణిమయములును, మృత్తికామయములును అగు విగ్రహములను పూజించుట పునర్జన్మ భోగకరి కాన (కావున) అది కాక తన హృదయమందలి పరమాత్మనే అర్చించవలెను. మోక్షగామియగు యతి (అనగా భక్తుడు) తన హృదయస్థితుడగు పరమాత్మనే పుజింపవలయునే గాని బహ్యార్చన చేయరాదు. –మైత్రేయోపనిషత్తు 2:26, 27

     ఈ మంత్రాల ప్రకారం- లోకమంతటా నిండియుండి, ప్రతి మనిషి హృదయమందు స్థితుడగు పరమాత్మకు బదులు శిలా, లోహ, మణి, మృత్తికామయములు అయిన వివిధ విగ్రహములను పూజింపజేసే పండితులు మాయచేత మొహితమైన మాయగాళ్ళని తేటతెల్లం అవుతుంది. ఒకవైపు- “మోక్షగామి కావాలనుకునే భక్తుడు తన హృదయస్థితుడగు పరమాత్మనే పుజింపవలయునే గాని బహ్యార్చన చేయరాదు” అన్న ఆదేశం వైదిక ధర్మశాస్త్రం ఇస్తున్నప్పటికీ, వారు దానిని తిరస్కరించి, అమాయక భక్తులచే సృష్టితాల ఆరాధన చేయించటానికి గల కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు- “కేవలము పొట్టను నింపుకోవటం కొరకే” అని పై మంత్రం సమాధానం ఇస్తుంది. ఇక, ఇలాంటి క్రైస్తవ వంచక పండితుల గురించి బైబిలు గ్రంథం ఏమంటుందో ఈ‌ క్రింది గమనించగలరు.       
వారి అవివేక హృదయము అంధకారమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు పురుగులయొక్కయు, ప్రతిమా స్వరూపముగా మార్చిరి –(రోమా 1:22, 23)… అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు. –రోమా 1:25

     అంటే- భక్తులచే సృష్టికర్త ఆరాధన చేయించకుండా మనుషుల, పశువుల ఆరాధన చేయించే పండితులు- తాము జ్ఞానులమని చెప్పుకొన్నప్పటికీ, వాస్తవంలో వారు అజ్ఞానులే అని పైవాక్యం సుస్పష్టం చేస్తుంది. వారు అలా చేయటానికి గల కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు ఈ క్రింది వాక్యం ఇస్తున్న సమాధానాన్ని గమనించగలరు. 

మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీ (క్రైస్తవుల) లోనూ అబద్ధ బోధకులుందురు… వీరిని బట్టి సత్యమార్గము (క్రైస్తవ్యం) ధూషించబడును. వారు అధిక లోభులై, కల్పనా వాక్యములను చెప్పుచు మీ (భక్తుల) వలన లాభము సంపాదించు కొందురు… -2 వ పేతురు 2:1-3

      పై వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా గమనిస్తే, అబద్ధ ప్రవక్తలు అనగా వంచకులైన మత బోధకులు- అవ్యక్తుడైన సృష్టికర్త ఒక్కడే అయినప్పటికీ, మనుషులను, పశువులను దేవుళ్లుగా కల్పించి, చెప్పుచున్నారని తెలుస్తుంది. ఇలాంటి కాల్పనిక విశ్వాసాలు ఎందుకు బోధిస్తున్నారు? అన్న ప్రశ్నకు- భక్తుల వలన లాభము సంపాదించుకొనుట కొరకు అని బైబిలు గ్రంథం సమాధానం ఇస్తుంది. అయితే వారు ఏవిధంగా కాల్పనిక విశ్వాసాలను సృష్టిస్తారో ఖురాను గ్రంథం తెలియజేస్తున్న విషయాన్ని ఈ క్రింది గమనించగలరు.

     అయితే ఈ తిరస్కారులు, నన్ను కాదని, నా దాసులను తమ కార్యసాధకులు (ఔలియ=సహాయ పడేవారు) గా చేసుకునే తలంపును కలిగి ఉన్నారా? అటువంటి అవిశ్వాసులకు ఆతిథ్యంగా మేము నరకాన్ని సిద్ధం చేసి ఉంచాము. -18:102      

     పై వాక్యంలో మాటలాడేది సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు. దేవుని సాధారణ దాసులలో కొందరు గొప్ప పుణ్యాత్ములు ఉంటారు. వారి పట్ల సామాన్య ప్రజలకు- నిష్కళంకమైన, పవిత్రమైన మరియు హృదయ పూర్వకమైన అభిమానం ఉండటం అతి సహజం. వారు బ్రతికి ఉన్నంత కాలం- వారు స్వయంగా సర్వోన్నతుడైన సర్వేశ్వరుని మాత్రమే వేడుకుంటూ, తమ అనుచరులను కూడా తమ మాదిరిగానే ఆయన ఒక్కడినే వేడుకోమని ఆదేశిస్తూ ఉండేవారు. అంటే- వారు తమ ‘అనుసరణ’ చేయమని చెప్పారే కానీ, తమను ‘వేడుకో’మని మాత్రం చెప్పలేదు.

      అయితే వారు పరమ పదించిన తరువాత, కొంత కాలానికి కొందరు వంచక పండితులు బయలు దేరి, కపటంగా వారిని అవసరానికి మించి పొగుడుతూ, కీర్తిస్తూ వారికి లేని దైవత్వాన్ని ఆపాదించి, ఒక వైపు, సామాన్య ప్రజలకు- సర్వోన్నతుడైన సర్వేశ్వరునితో ఉన్న ప్రత్యక్ష ఆథ్యాత్మిక సంబంధాన్ని తెంచి, గతించిన మహనీయులతో కలుపుతారు. రెండవవైపు, తామే- వారికి అపర దైవాలై, వారి నుండి ఘన కీర్తనలను పొందుతూ, యథేచ్ఛగా ఆర్ధిక దోపిడీకి పాల్పడుతూ ఉంటారు. ఈ దుర్మార్గపు ప్రహసనాన్ని సత్యమైనదిగా అమాయక భక్తులను నమ్మించటానికి వారు చేసే వంచన ఎంత ప్రమాదకరమైనదో ఈ క్రింది ఖురాన్ వాక్యాలలో కాస్త జాగ్రత్తగా గమనించగలరు.         

     వారిలో కొందరు, తాము చదివేది దైవగ్రంధంలోని ఒక భాగమే అని మీరు భావించాలని, గ్రంథం పఠిస్తూ తమ నాలుకలను మెలికలు త్రిప్పుతారు. కానీ, వాస్తంగా అది గ్రంథంలోని భాగం కాదు. వారు, “మేము చదివేదంతా అల్లాహ్ తరఫు నుండి వచ్చిందే” అని అంటారు. కాని అది అల్లాహ్ తరఫు నుండి రాలేదు. వారు బుద్ధిపూర్వకంగా అబద్ధాన్ని అల్లాహ్ కు అంటగడుతున్నారు. –(3:78). వాస్తవం ఏమిటంటే- అల్లాహ్ తన గ్రంథంలో ప్రవచించిన ఆజ్ఞలను దాచేవారూ, వాటిని స్వల్పమైన ప్రాపంచిక ప్రయోజనాల కొరకు (వక్రీకరించి) విక్రయించే వారూ, (దానికి ప్రతిగా వచ్చే సొమ్మును తినేవారు) నిశ్చయంగా తమ ఉదరాలను అగ్నితో నింపుకుంటున్నారు. -2:174              
అందుకే-
*       ‘సమాధులలో ఉన్న మహనీయులను దైవ శక్తులు కలిగి ఉన్నారు’ లేక ‘సమాధులలో ఉన్న మహనీయులను ఆరాధించండి!’ అన్న ‘ప్రత్యక్ష వాఙ్మూలము’ Direct Statement లను ముస్లిం పండితులు- ‘ఖురాను’లో గాని

*       ‘యేసు దేవుడు’ లేక ‘కన్య మేరీ దేవత’ లేక ‘యేసును ప్రార్ధించండి!’ లేక ‘యేసు మీకు సహాయము చేస్తాడు!’ వంటి ‘ప్రత్యక్ష వాఙ్మూలము’ Direct Statement లను క్రైస్తవ పండితులు- ‘బైబిలు’లో గాని

*       ‘విగ్రహారాధన చేయండి!’, ‘విగ్రహారాధన చేయవచ్చు!’, ‘విగ్రహాలకు నైవేధ్యం పెట్టండి!’, ‘విగ్రహాలకు పాలాభిషేకం చెయ్యండి!’, ‘విగ్రహాలకు పెళ్ళిళ్ళుచెయ్యండి!’, లేక ‘విగ్రహాలను వేడుకోండి!’ అన్న ‘ప్రత్యక్ష వాఙ్మూలము’ Direct Statement లను హిందూ పండితులు- ‘వేదాల’ లో గాని లేక ‘భాగవద్గీత’లో గాని

ఎన్నటికీ, ఎప్పటికీ చూప లేరు. కారణం ఏమిటంటే, ఖురాను ప్రకటిస్తున్నట్లు- ‘వాస్తంగా అవి (పై దృక్పథాలు) ధర్మ గ్రంథంలోని భాగాలు కావు’ కనుక! అయితే, పైన పేర్కొన్న మూడు ధర్మశాస్త్రాలూ రెండు విషయాలను మటుకు ఉమ్మడిగా చూపిస్తున్నాయి. వాటిలో…

1.     మాయకు గురైన కొందరు పండితులే స్వయంగా తమ భక్తజనానికి ధర్మశాస్త్రాలలో ఉన్న ‘ఏకదేవుని విశ్వాసము’ను మరుగు పరచి, వాటిలో లేని ‘బహుదైవోపాసన’ను లేక ‘విగ్రహారాధన’ను ఉన్నట్లు వంచిస్తున్నారన్నది.

2.    దానికి గల కారణం- భక్తజనాన్ని ఆర్థికంగా దోచుకోవటానికి అన్నది.
  
ఇటీవలి కాలపు విప్లవ కారులకు బూటకపు దివ్యత్వాన్ని ఆపాదించి, వారు వెలిగించిన విప్లవ జ్యోతిని ఆర్పేసిన వైనాన్ని గమనించగలరు! 
ప్రాచీన కాలంలో దైవధర్మాన్ని, అందించి, ఆచరించి, తమ ‘ఆరాధన’ కాక, తమ ‘ఆదర్శాల’ను మాత్రమే పాటించమని గట్టిగా తాకీదు చేసిన శ్రీరామ-కృష్ణాదులను, మహావీర్-బుద్ధులను మరియు యేసు-మరియమ్మలను ప్రారంభంలో దైవాంశసంభూతులుగా ఆ తరువాత దేవుని అవతారాలుగా చివరకు సాక్షాత్తు దేవుళ్ళుగా చేసేసి, వారి ‘ఆదర్శాల’ అనుసరణకు బదులు వారి ‘ఆరాధాన’ను చేయించటం ప్రారంభించారు.

గమనిక: ముస్లిములు ప్రవక్త ముహమ్మద్ వారికి సాక్షాత్తు దైవత్వాన్ని ఆపాదించక పోయినా, ఆయన ‘ఆదర్శాల అనుసరణ’ కంటే ఆయన పట్ల కేవలం ‘విశ్వాసం’ లేక ‘ప్రేమ’ కలిగి ఉంటే చాలనే ధోరణి అధికశాతం ముస్లిం సమాజంలో ఏర్పడి ఉంది. అందుకే- ముస్లిమేతరులలో ఉన్న సకల చెడులూ ముస్లిములలోనూ తిస్ఠవేసి ఉన్నాయి. 

సరే, ఇవన్నీ ఎప్పుడో చీకటి యుగాలలోనో, మధ్య యుగాలలోనో జరిగిన అజ్ఞాన పూరిత ఘటనలు. అయితే, ప్రపంచం ఎంతో నాగరికతను సాధించిందనుకొనే కాలంలో సంభవిచిన కొన్ని సంఘటనలను ఈ క్రింది గమనించగలరు.

సమ్మక్క సారక్కల పట్ల నిజమైన నివాళి- వారి పేరిట                  జాతరలు చేయటమా? లేక వారి ఆశయాన్ని సాధించటమా?
సమ్మక్క సారక్కలనే కోయజాతికి చెందిన ఇద్దరు వీరవనితలు కాకతీయుల ఆధిపత్యం, అణచివేతలకు వ్యతిరేకంగా- తమ జాతి స్వేచ్చా శ్వాతంత్ర్యాల కొరకు గత తొమ్మిది శతాబ్దాలకు పూర్వం కాకతీయుల శతృ సైన్యాలతో వీరోచితంగా పోరాడి, ఆత్మార్పణ చేసిన వీర నారీమణులు. సమ్మక్క సారక్కల ఆ గొప్పత్యాగం ఒక బలమైన స్ఫూర్తిగా రూపొంది, తమ జాతి పురోభివృద్ధికి ఆటంకంగా ఉన్న శక్తులను నిర్వీయం చేసే పరంపర ఆ వర్గంలో ప్రారంభం అయిపోయింది. దానిని నిర్వీర్యం చేయటానికి ఆ వీరవనితల హంతకులైన కాకతీయులే వారి చితాభస్మాన్ని గుడిలో పెట్టి పూజించటం ప్రారంభించారు!

కమ్యునిస్ట్ దేవుడు!
గత యాభై సంవత్సరాల క్రితం- కమ్యునిస్ట్ భావజాలం కలిగిన కేవల్ కిషన్ అనే ఒక వ్యక్తి ప్రజా పోరాటం ద్వారా- భూస్వాముల నుండి వేలాది మంది బీద రైతు కూలీలకు భూములను ఇప్పించాడు. తత్కారణంగా వారు పగపట్టి, అతడిని వెనుక నుండి లారీతో ఢీ కొట్టించి హత్య చేసారు. ఆయన పేరిట మెదక్ జిల్లా చేగుంట సమీపంలోని పోచంపల్లి వద్ద ప్రతి సంవత్సరం డిసెంబర్ 26 వ తేదీన జాతర జరుగుతుంది. అందులో ఆ విప్లవ కారుని విప్లవ జ్యోతిని ఆర్పి, మూఢాచారాల కర్మకాండలు నిర్వహంచబడుతున్నాయి!

‘వంచక పండితుల’ మరియు ‘నిర్దయకల పాలకుల కుట్ర’పూరితమైన ఈ చర్యల ద్వారా మహానీయుల వీరత్వాన్ని, త్యాగాన్ని ‘ఆదర్శం’గా తీసుకొని ‘ఆచరించరించాలి’ అనే అర్థవంతమైన ఆలోచన మసకబారిపోయి, వారిని ‘పూజించాలి’ అనే అర్థరహితమైన  భావన ప్రజలలో సర్వసామాన్యం అయిపోయింది. దీని వలన పై కుట్ర దారులకు రెండు ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో…

1.     తమ హక్కుల కొరకు పోరాడే ప్రజల సమస్య శాశ్వతంగా తొలగి, శత్రుశేషం అంతమైపోతుంది.

2.    ఈ జాతరల పేరిట ప్రజలు చేసే పూజల, ప్రయాణాల ఖర్చుల పేరిట బీదా బడుగు వర్గాల సొమ్ములు బడాబాబుల జేబులలోనికి సునాయాసంగా ప్రవహిస్తుంది.  
     
సమ్మక్క సారక్కల గత జాతర సందర్భంగా- కోట్లాది బీదల నుండి కేవలం కొన్ని డజనుల ధనికుల వద్దకు ప్రవహించిన కష్టార్జితుల సొమ్ము- అక్షరాలా ఐదువేల కోట్లు! ఇదీ ‘బహుదైవోపాసన’ లేక ‘విగ్రహారాధన’ వెనుక ఉన్న కుట్ర! అదే సొమ్మును ఆ కోయ వర్గ అభివృద్ధి కొరకు ఖర్చు చేసి ఉంటే, ఇటు ఆ వర్గానికి ప్రయోజనమూ కలిగేది. అటు సమ్మక్క సారక్కల మరియు కేవల్ కిషన్ ఆత్మకు శాంతీ చేకూరేది.

బహుదైవోపాసన లేక విగ్రహారాధన అన్నది పైకి ఎంత సాధారణమైన ఒక ధార్మిక క్రతువుగా కనిపిస్తుందో అది అంతర్గతంగా అంతకంటే ప్రమాదకరమైన వినాశకరమైన లక్షణాలను కలిగి ఉంది. దాని దుష్పరిణామాలలో ముఖ్యమైనవి ఈ క్రింది గమనించగలరు.
  
1.     సామాన్య ధార్మిక ప్రజానీకం ‘సశాస్త్రీయ’ దృక్పథాలు గల ధర్మశాస్త్రాల ప్రబోధనలకు దూరమైపోతారు.

2.    ప్రజలు భావదాస్యానికి గురై, వంచక పండితులు కల్పించిన ‘అశాస్త్రీయ’ దృక్పథాలకు దగ్గరై; వారి చేతులలో కీలు బొమ్మలుగా మారిపోయి, వంచక పండితులచే ధర్మం పేరిట ఏపూటకాపూట కల్పించబడే అర్థంపర్థం లేని విచిత్ర విడ్డూర ధార్మిక క్రతువులను నిర్వహిస్తూ, తాము చెమటోడ్చి సంపాదించింది పండిత వర్గానికి సమర్పించుకుంటూ ఉంటారు.

3.    మహనీయులను ‘అనుసరించాలి’ అన్న ‘ధర్మ శాస్త్రాల ఆదేశిత దృక్పథం’ ఆస్తిక ప్రజను ‘నీతిమంతులు’గా మలచితే, మహనీయులను ‘ప్రార్ధించాలి’ అన్న ‘వంచక శాస్త్రుల కాల్పనిక దృక్పథం’ ఆస్తిక ప్రజను ‘అనీతిమంతులు’గా మార్చుతుంది.
  
4.    ఎందరు దైవాలో అన్ని వర్గాలుగా విడిపోయి, ఆస్తిక ప్రజలు దారుణమైన అనైక్యతకు గురైపోతారు.

కాస్త నిశితంగా గమనిస్తే పై జాడ్యాలు నేటి హిందూ-క్రైస్తవ-ముస్లిం ఆస్తిక సమాజాలలో బలంగా తిష్ఠవేసి ఉండటాన్ని మీరు ఇట్టే  గమనించగలరు. బహుదైవోపాసన లేక విగ్రహారాధన అథ్యాత్మిక క్రతువులు- వీధీ వాడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నప్పటికీ జనసామాన్యం వాటిలో తడిసి ముద్దైపోతున్నప్పటికీ దాని వలన-
          ఒక్క ‘పండిత’ వర్గానికి,
Ø  ‘గౌరవోన్నతులు’ మరియు
Ø  ‘ఆర్థిక పరిపుష్టి’ని
కలిగించటం తప్ప,
‘భక్త’ జనానికి-
Ø  ‘మానసిక శాంతి’ని గానీ,
Ø  ‘శారీరక ఆరోగ్యము’ను గానీ,
Ø  ‘వ్యక్తిత్వాలలో నైతికత’ను గానీ,
Ø  ‘తోటి వ్యక్తుల పట్ల మానవత’ను గానీ,  
Ø  వివిధ ‘ధార్మిక వర్గాల మధ్య ఐక్యత’ను గానీ
         ఎందుకు కలిగించ లేకపోతున్నాయి!!??

రాత్రనకా పగలనక గుళ్ళూ-గోపురాలు, చర్చీలు-కూటాలు, మసీదులు-దర్గాలు ప్రవచనాల హోరుతో మరియు ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మాధ్యమాల ప్రచార జోరుతో ఎంతగా మారుమోగుపోతున్నాయో అంతకంటే ఎక్కువగా భక్తుల ప్రవర్తనలో ‘నేరాలు — ఘోరాలు’ కూడా పెట్రేగిపోతున్నాయి!! నేటి ఈ విచిత్ర విడ్డూర విషాధ అథ్యాత్మిక నేపథ్యానికి గల కారణం ఏమిటో ఆలోచించవలసిన నైతిక, ధార్మిక, సామాజిక బాధ్యతను నేటి హిందూ-క్రైస్తవ-ముస్లిం మత పండితులు, వారి మత సంస్థల నాయకులు కలిగి లేరా?  

సమకాలీన అథ్యాత్మిక విధానం వలన- ‘అపారమైన దైవ భక్తి’ మరియు ‘ఘోరమైన నేర ప్రవృత్తి’ ఆస్తికులలో కలసి కాపురం చేస్తున్నాయంటే, దానికి గల కారణం- “మీ పవిత్ర ధర్మశాస్త్రాలలోని డొల్లతనమా?” లేక “మీ పవిత్ర ధర్మశాస్త్రాలు ఖండిస్తున్న బహుదైవోపాసన విగ్రహారాధన వంటి నిరర్థక కాల్పనిక దురాచారాలా విఝ్రుంభణ?” అని సమాజం పట్ల బాధ్యత గల పౌరులాగా మేము హిందూ-క్రైస్తవ-ముస్లిం మత పండితులను నిలదీస్తున్నాము. ధర్మం పేరిట మీరు ప్రజలలో ‘ప్రచారం’ చేసే మత ‘దృక్పథాలు’ మరియు మీరు ప్రజలచే ‘చేయించే’ మత ‘క్రతువులు’ గీతా-బైబిలు-ఖురాన్ శాస్త్రాల ప్రకారమే అయితే, వాటి నుండి ఆధారాలను చూపించవలసిన నైతిక, ధార్మిక బాధ్యతను మీరు కలిగి ఉన్నారు.

ఎందుకంటే- ధర్మశాస్త్రాలలో ఉన్న ‘ఆలోచన’ మరియు ‘ణఆచర’ విధానాలను మాత్రమే ప్రజలకు బోధించవలసిన ‘బాధ్యత’ను పండితులుగా మీరు కలిగి ఉంటే, మీ బోధనలు వాటి ప్రకారంగా ఉన్నాయా? లేవా? అని మిమ్మల్ని ప్రశ్నించే ‘హక్కు’ను మేము కూడా కలిగి ఉన్నాము.  
జైహింద్!
M. A. Abhilash 
96664 88877
e-mail: tmcnwestmc@gmail.com

2 Responses to "విగ్రహారాధన వెనుక దాగి ఉన్న కుట్ర — కుట్ర దారులు - దాని నష్టాలు!"

  1. విసుకి వాడి మనస్సె ఒక విశ్వం…

    Good Work!! but seems this issue/post is lingering again and again!!

    Lets hope to create awareness but ..

  2. vahini

    అంతా బాగుంది తమ్ముడూ అందరూ మనుషులే ఆ మనుషులే దివ్య కార్యాలు చేస్తే దేవతలంటారు. గుళ్ళు గోపురాలు వాళ్ళు ఇష్టపడి కట్టినవి మీరు చెప్పే కతలు ఇప్పటివి రాముడీ టైమువి కావు. రాముడి రాజ్యం అశోకుడి రాజ్యం శాంతి సుఖాలకు పేరుపడినవి అందుకే నేటి కుహనా రాజకీయనాయకులు కూడా రామరాజ్యం తెస్తాం అంటూ డంబాలు కొడతారు. అందరు రాజులనూ ఒకే గాటన కట్టడం వాళ్ళు పడ్డ కష్టాన్ని తక్కువ చేయడమే. మనుషులందరూ చెడ్డవాళ్ళూ కారు అందరూ మంచివాళ్ళూ కారు. ఇతరుల మేలు కోరేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు సంఖ్య ఎక్కువ తక్కువ అంతే

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine