• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » ARTICLES » విశ్వాసుల తల్లి హజ్రత్ ఖదీజా

విశ్వాసుల తల్లి హజ్రత్ ఖదీజా

Label: ARTICLES

ముహమ్మద్[స] ఇప్పుడు ఒక వినూత్న జీవితాన్ని ప్రారంభించారు. హజ్రత్ ఖదీజా [ర] ఉత్తమ ఇల్లాలుగా నిరూపించుకున్నారు. భర్త పట్ల వినయ విధేయతలు కలిగి ఆయన [స] సుఖదు:ఖాలలో పాలుపంచుకుంటూ ఆదర్శ గృహిణిగా ఉంటున్నారు. అమెగారు మామూలు విషయంలో కూడా తమ భర్త విభేదించేవారు కారు. భర్త పట్ల అమెగారు కి కృతజ్ఞతభావం, ప్రేమానురాగలు సమ్మిళితమై ఉన్నాయి. వివాహానికి ముందు ఆమె [ర] తన భర్తను ఎంత సౌజన్య మూర్తిగా భావించారో అంతకంటే అమితమైన, అపూర్వమైన సౌశీల్యవంతుడుగా, నీతిపరుడుగా ఆమెకు ఆయన కనిపించారు. బాహ్యంలోనే కాదు అంతరంగంలో కూడా ఆయనలో ఆమె నీతినియమాలను చూడగలిగారు. 

హజ్రత్ ఖదీజా [ర] ముహమ్మద్ [స] లాంటి ఉత్తముడైన భర్త లభించినందుకు మక్కాలోని మహిళలందరూ అసూయపడ్డారు. కానీ అంతా మాత్రాన ఒకరిని వరించిన శుభాన్ని ఇంకొకరు లాక్కొలేరు కదా! ఏది ఏమైనా హజ్రత్ ఖదీజా [ర] అదృష్టమే అదృష్టం. అది దేవుడు వ్రాసిన స్థిరమైన అదృష్టరేఖ. దానికి తిరుగులేదు.
కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ [స] గారి జీవితంలో క్రమక్రమంగా ఒక మార్పు, ఒక విప్లవం రాసాగింది. ఆయన ఏకాంతంగా కూర్చుని దైవధాన్యంలో లీనమైపోయేవారు. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గురించి, నైతిక పతనాన్ని గురించి, మార్గవిహీనతను గురించి ఆయన ఎక్కువగా ఆలోచించేవారు. ఇంకా ఆయన [స] తన జాతివారిని, విగ్రహ పూజనుండి అత్యాచారం నుండి కాపాడే విధానాన్ని గురించి ఆలోచించేవారు. విశ్వప్రభువు మానవుల నిజమైన స్వామిని ఆరాధించే సరైన విధానాన్ని వారికి తెలియజేసే విషయం గురించి యోచించేవారు. ఇందుకోసం ఆయన [స] గారు మక్కా పట్టణానికి కొంత దూరంలో ఉన్న హీరా కొండ గుహకు వెళ్ళి రోజుల తరబడి ఆరాధనలో, ఆలోచనలో నిమగ్నమైపోయేవారు. ఇంటికి తిరిగివెళ్లే కోరిక కలిగేవరకు ఆయన అక్కణ్ణే ఉండిపోయేవారు. గుహకు వెళ్ళేటపుడు ఆయన [స] తనతో భోజన సామగ్రికూడాతీసుకుపోయేవారు. అది అయిపోయిన తరువాత ఆయన [స] హజ్రత్ ఖదీజా [ర] గారి ఇంటికి తిరిగి వెళ్ళేవారు. అంతే భోజనాన్ని తీసుకుని మళ్ళీ గుహకే వెళ్ళేవారు. ఆయన [స] కు ఏకాంతవాసమే మేలైనదిగా అనిపించసాగింది. 

ఆయన [స] హీరా కొండగుహలో ఒంటరిగా ఉండేవారు. చివరకు ఆయన[స] గుహలో ఉన్నప్పుడే ఆయన[స] పై వహి [దైవవాణి] అవతరించింది. హజ్రత్ జీబ్రీల్ [అ] అకస్మాత్తుగా గుహలో ప్రత్యక్షమై 'పఠించు' అని ఆజ్ఞాపించారు. దానికి ఆయన [స] 'నేను చదువుకున్నవాణ్ణి కాను ' అని జవాబు  పలికారు. అప్పుడు హజ్రత్ జీబ్రీల్ [అ] ఆయన్ని [స] పట్టుకుని గట్టిగా నొక్కారు: అప్పుడు ఆయన [స] శక్తిహీనుడైపోయారు. ఆయన్ని [స] వదిలిపెట్టి, 'పఠించు' అని ఆయన [అ] మళ్ళీ పురమయించారు. 'నేను ఎలా పఠించాలో నాకు తెలియదు' అని ఆయన [స] అన్నారు. జీబ్రీల్ దూత [అ] ఆయన్ని [స] మళ్ళీ పట్టుకున్నారు, రెండోసారి కూడా గట్టిగా నోక్కారు. దానికి ఆయన[స] తట్టుకోలేకపోయారు, అశక్తుడైపోయారు. తరువాత ఆయన్ని[స] వదిలి పెట్టి 'పఠించు' అని జీబ్రీల్ [అ] దైవప్రవక్త [స] ను మళ్లీ ఆజ్ఞాపించారు. 'ఎలా చదవను? నేను చదువుకున్నవాణ్ణి కాదు కదా! అని ఆయన [స] సమాధానమిచ్చారు. దైవదూత జీబ్రీల్ [అ] మూడోసారి కూడా గట్టిగా అదిమివదిలిపెట్టి ఇలా అన్నారు, పఠించు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన మానవుణ్ణి పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో సృజించాడు. పఠించు, నీ ప్రభువు అత్యంత దయామయుడు. ఈ వాక్యాలనే హజ్రత్ జీబ్రీల్ పఠించుగా విని, ఆయన [స] హీరా కొండ గుహనుంచి ఇంటికి తిరిగి వచ్చారు. ఆయన [స] గారి హృదయం భయంతో తీవ్రంగా కొట్టుకోసాగింది. ప్రియా సతీమణికి హజ్రత్ ఖదీజా బినై ఖువైలిద్ వద్దకువెళ్లి 'నా మీద దుప్పటి కప్పు, నా మీద దుప్పటికప్పు అని అన్నారు. హజ్రత్ ఖదీజా [ర] తన ప్రియభర్తపై దుప్పటి కప్పారు.

దైవప్రవక్త [స] కు భయనివృత్తి కలిగిన పిదప ఆయన [స] తన సతీమణి హజ్రత్ ఖదీజా [ర] కు జరిగిన వృత్తాంతాన్ని పొల్లుపోకుండా వినిపించారు. 'నాకేమన్నా అవుతుందేమేనని నేను భయపడుతున్నాను' అని ఆమెకు చెప్పారు.
అప్పుడు హజ్రత్ ఖదీజా [ర] అలా ఎన్నటికీ జరుగదు: అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. అల్లాహ్ మిమ్మల్ని ఎన్నటికీ అవమానం పాలుచెయ్యాడు. బంధువులతో, ఆప్తులతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. బలహీనుల బరువును మీరు తెచ్చిపెడతారు. అతిధుల్ని సత్కరిస్తారు. గొడవలు, కలహాలు జరిగినప్పుడు, న్యాయం ఎవరివైపున ఉంటే మీరు వారిని సమర్ధిస్తారు' అని ఓదార్చారు.

తరువాత హజ్రత్ ఖదీజా [ర] ఆయన [స] ను తన దాయాది అయిన వర్ఖా బిన్ నౌఫిల్ బిన్ అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా దగ్గరకు తీసుకెళ్లారు. అల్నాటి అజ్ఞానపు యుగంలో ఆయన విగ్రహారాధనను త్యజించి క్రెస్తవ మతాన్ని స్వీకరించాడు. అతను హిబ్రూ భాషను చక్కగా వ్రాస్తారు. ఇంజీల్ [గస్పెల్] గ్రంధంలో ఉన్నటువంటి, అల్లాహ్ వ్రాయించదలుచుకున్నటువంటి విషయాలను ఆయన హిబ్రూ భాషలో వ్రాసేవారు. ఆయన కురువృద్ధుడు, దృష్టిని కోల్పోయారు.

హజ్రత్ ఖదీజా [ర] ఆయనతో ఇలా అన్నారు: ''అన్నయ్య! మీ సోదరుడు ముహమ్మద్ [స] మాటలు కొంచెం వినండి.' వరఖా బిన్ నౌఫిల్ దైవప్రవక్త [స] తో ఇలా అన్నారు: ముహమ్మద్ [స] నీవు చూసిందేమిటో చెప్పు బాబు .
ఆయన [స] తను చూసినడాన్ని పూసగుచ్చినట్లుగా వర్ఖా బిన్ నౌఫిల్ కు వినిపించారు. 
అప్పుడు వర్ ఖా ఇలా అన్నారు: '' ఇతనైతే  దేవుని రహస్యదూతయే. అతన్ని అల్లాహ్ మూసా[అ] పై కూడా అవతరింపజేశాడు. నిన్ను నీ జాతి వారు తమ పట్టణం నుంచి బహిష్కరించే కాలం వచ్చేవరకు నేను బ్రతికి ఉంటే ఎంత బాగుండును! ఆ కాలంలో నేను యువకునిగా ఉంటే ఇంకా ఎంత బాగుంటుంది.'' 
దైవప్రవక్త [స],'నిజంగానే వారు నన్ను బహిష్కరిస్తారు. నీవు చెప్పే మాటలు చెప్పిన ప్రతి వ్యక్తికి ప్రజలు శత్రువులయ్యారు. ఆ రోజు వచ్చేవరకు నేనుగనుక బ్రతికి ఉంటే, అప్పుడు నేను నిన్ను గట్టిగా, పూర్తిగా సమర్ధిస్తారు.'' అని వరఖా బిన్ నౌఫిల్ సమాధానమిచ్చారు. కానీ ఆ తరువాత కొన్ని రోజులకే వర్ ఖా చనిపోయారు. 
ఇంకా దైవవాణి రావటం కూడా ఆగిపోయింది ఆతరువాత దైవప్రవక్త [స] మహాశయులు ముహమ్మద్ [స] ప్రయాణంలో ఉండగా మార్గ మద్యంలో ఆకాశం నుంచి ఒక పిలుపు వినిపించింది. అప్పుడు నేను నా శిరస్సును పైకి ఎత్తి ఆకాశం వైపు చూశాను. హీరా గుహలో ఉన్నప్పుడు నా వద్దకు వచ్చిన ఆ దైవదూతయే నాకు ఇప్పుడు కూడా కనిపించాడు. అతను భూమ్యాకాశాల మధ్య ఒక పీఠం పై కూర్చొని ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూసి నేను భయంతో కంపించిపోయాను. ఇంటికి తిరిగి వచ్చి భార్యతో 'నా మీద కంబలి కప్పు, నా మీద కంబలి కప్పు' అని అన్నారు. అప్పుడు దయామయుడైన అల్లాహ్ ఈ వాక్యాలను అవతరింపజేశాడు. వస్త్రం కప్పుకుని పడుకున్న ఓ మనిషి! లే! లేచి హెచ్చరిక చెయ్యి. నీ ప్రభువు ఘనతను చాటి చెప్పు. నీ దుస్తుల్ని పరిశుభ్రంగా ఉంచుకో, మలిన్యానికి దూరంగా ఉండు.

ప్రవక్త పదవి నియామకం తొలిరోజునే స్త్రీ జాతి స్థానాన్ని సమున్నతం చేయాలని అభిలషించాడు కాబోలు దేవుడు వహితోపాటు జీబ్రీల్[అ] అవారణను ముహమ్మద్ [స] ప్రవక్త పదవిని దృవీకరించిన ఘనత ఒక మహిళాకు దక్కింది. అమెయే సయ్యద ఖదీజాతుల్ కుబ్రా [రజిఆన్ హా]   

2 Responses to "విశ్వాసుల తల్లి హజ్రత్ ఖదీజా"

  1. hari.S.babu

    దేవుణి చూడ్డానికి వెళ్ళినవాడు దేవుడు కనబడితే ఇన్నాళ్లకి కోరిక నెరవేరిందని సంతోషిస్తాడు గానీ దెయ్యాన్నో భూతాన్నో చూసినట్టు హడిలిపోయి దుప్పటి కప్పుకుని పడుకుంటాడా?పిచ్చి మతం,పిచ్చి ప్రవక్త,పిచ్చి దేవుడు:-)

    1. Unknown

      మీ అజ్ఞానం తారాస్థాయికి వెళ్ళిపోయింది. ప్రవక్త(స)చూసింది దేవుడిని కాదు జిబ్రీల్.వైదిక పరిబాషలో పరమాత్మ(దేవుడు కాదు).మానవమాత్రుడే కాబట్టి భయపడ్డాడు.అర్జునుడు విశ్వరూపం చూసి భయపడినట్టుగా! ముందు,వెనుకా చూడకుండా విమర్శించడం మీకు పరిపాటి అయ్యిపోయింది.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine