• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » భారత దేశంలో అణు ఇంధనం

భారత దేశంలో అణు ఇంధనం

నాలుగు దశాబ్దాల క్రితమే, భారతదేశం అణు ఇంధనం సాంకేతిక రంగంలో కాలుమెపింది. అణు ఇంధనం ఉత్పత్తికి సంబంధించిన అన్నీ దశలలోనూ ఇప్పటికే పరిజ్ఞానాన్ని సాధించి, ఇతర దేశాలకు దీటుగా నిలిచింది. అణు ఇంధనం ఉత్పత్తికి అవసరం అయిన ఖనిజాల అన్వేషణ మొదలుకొని, ఇంధనం ఉత్పత్తి అనంతరం వెలువడే నిరుపయెగ పదార్ధాలను క్రమపద్ధతిలో శుద్ధిచేసి నియంత్రించేంతా వరకూ భారత దేశం పరిజ్ఞానం సమకూర్చుకోగలిగింది. అణు సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధిని దేశీయ పరిజ్ఞానంతో సాధించగలగటం, పరికరాలను మానవ వనరులను అందుకు అనుగుణంగా రూపొందించటం భారతదేశపు అణు ఇంధన కార్యక్రమంలో మైలురాళ్ళు. న్యూక్లియర్ రియాక్టర్లును డిజైన్ చేసి రూపొందించి, భారతదేశం కూడా ఒకటి.

అణు సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధితో అనేక రంగాలలో అనేక ప్రయెజనాలు సమకూరాయి. విద్యుత్ ఉత్పత్తితోపాటు పరిశ్రమలు పరిశోధనలు, వైద్యరంగంలో రేడియో ఐసోటోప్ ల ఉపయోగం తత్సంబంధిత పరికరాలు, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి, తదితర ప్రయోజనాలు సమకూరాయి.

కార్యక్రమాల ప్రణాళిక, అమలు సందర్ధాలలో అణు ఇంధన శాఖ సాంఘిక సంక్షేమం, పర్యావరణ సంరక్షణ, ఉపాధి శిక్షణ అవకాశాలు, ఉద్యోగుల సౌకర్యాలు, సామాజిక బాధ్యతలతో పాట, భారతీయ పరిశ్రమల అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం లాంటి అంశాలకు ప్రాధాన్యత నిస్తుంది.

అవుట్ ఫిట్స్
శాంతియుత ప్రయోజనలకోసం అణు ఇంధనాన్ని అభివృద్ధి చేసి వినియోగించేందుకు అవసరం అయిన విధాన నిర్ణయాలను చేసేందుకు గాను 1948లో ''ది అటామిక్ ఎనర్జీ కమిషన్ '' ఏర్పటయింది. మౌలిక శాస్త్రరంగలలో పరిశోధనలు నిర్వహించేందుకు స్వదేశీ వనరులను ఉపయోగించి అణు పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు 1957 లో ట్రంబే వద్ద '' ద అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిషిమెంట్'' ఏర్పటయింది. దాన్ని ఆ తర్వాత 'భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్' గా నామాంతరం చేశారు.

దేశంలో లభ్యం అయ్యే యురేనియం, ధోరియా౦ వనరులను ఉపయోగించుకుని అణు విద్యుత్ ను మూడు దశల్లో ఉత్పత్తి చేసేందుకు 1934లో భారతీయ అణు విద్యుత్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. మొదటి దశ కార్యక్రమం అధిక ఒత్తిడితో కూడిన హెవీ వాటర్ రియాక్టరను [P.H.W.R.] నెలకొల్పటం. వీటిలో యురేనియం ను ఇంధనంగా, భారజలాన్ని మోడరేటర్ గా వినియోగించి, చల్లబరుస్తారు. PHWR ల ద్వారా మొదటి దశలో తలపెట్టిన 10 వేల మె.వా. విద్యుత్ కార్యక్రమానికి దేశంలోని యురేనియం నిల్వలు సరిపోగలవని అంచనా. గత కొన్నేళ్లలో ప్లూటోనియంను అనుబంధ ఉత్పత్తిగా తయారుచేస్తున్నారు. గత కొన్నేళ్లలో జరిగిన శాస్త్రపరిశోధనల కారణంగా ప్లూటోనియంను తిరిగి ప్రాసెస్ చేసేందుకు, ఫాట్రికేట్ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం దేశంలో అభివృద్ధి చెందింది.

రెండవ దశ అను విద్యుత్ కార్యక్రమంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల [F.B.R] ద్వారా ప్లూటోనియంను వినియోగించుకుని, యురేనియా వనరులను పూర్తిగా వినియోగించుకోవటం జరుగుతుంది. దీంతో అధికంగా ఉన్నధోరియ౦ వనరులను దీర్ఘకాలిక ప్రతిపదికన వినియోగించుకునేందుకు మార్గం సుగమం అయింది. విద్యుత్ ఉత్పాదనకు వినియోగం అయ్యే పదార్ధం కంటే, FBRలు అధికంగా ఫిసైల్ పదార్ధాలను ఉత్పత్తి చేయగలవు. FBR ల ఏర్పాటుతో మొదటి దశలో వినియోగించిన యూరోనియం ప్లూటోనియంల ద్వారా 3.5 లక్షల మె.వా. మేరకు అదనపు విద్యుత్ ఉత్పాదన సామర్ధ్యం లభిస్తుంది. రెండవ దశ కార్యక్రమం చివరి భాగంలో FVRలలోధోరియంను బ్లాంకెట్ మెటీరీయల్ గా ఉపయోగించేందుకు ప్రతిపాదించారు. దీనావల్ల మరో ఫిస్సైల్ పదార్ధం యు-233 ఉత్పత్తి అవుతుంది. దీన్ని మూడవ దశ కార్యక్రమంలో రియాక్టర్లల ఇంధనంగా వినియోగిస్తారు. ట్రంబే లోని ఫ్యూయెలరీ ప్రాసెసింగ్ లాబలేటరిలో జరిపిన పరిశోధన ద్వారా ధోరియ౦ ఇంధనం నుండి యు-233ను ఉత్పత్తి చేసే విధానాన్ని రూపొందించగలిగారు.

అను పరిశోధన అభివృద్ధి తో పాటు, అణు విద్యుత్ ఉత్పత్తిని వాణిజ్యస్థాయిలో చేపట్టటం, అణు పరిజ్ఞాననాన్ని వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం తదితర రంగాలకు విస్త్రరించే బాద్యతలు కూడా అణు ఇంధన శాఖ పైనే ఉన్నాయి. 
అణు ఇంధన కార్యక్రమానికి సంబంధించిన వివిధ రంగాల శాస్త్ర సాంకేతిక విభాగాలకు చెందిన ఉద్యోగులకు శిక్షణ ఇవ్వటం అత్యున్నత ప్రమాణాలతో అణు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రవేటు రంగాలలో పరిశ్రమలను వృద్ధి చేయటం ఈ శాఖ ముఖ్యమైన కార్యక్రమాలు. పరిశోధనా కేంద్రాల నుండి ఈ శాఖ పరిజ్ఞానాన్ని పరిశ్రమలకు బదిలీ చేస్తుంది. అణువిద్యుత్ ఇంధనం ఔషధాలు వ్యవసాయ రంగాలకు సంబంధించిన ప్రయోగాత్మక కార్యక్రమాలను ఈ శాస్త్రం శాఖే రూపొందించి, అమలు పరుస్తుంది. శాస్త్రీయ పరిశోధన అధ్యాయనాలన్నీ ప్రధానంగా దీర్ఘకాలిక ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకునే నిర్వహిస్తుంది.

అణు విద్యుత్
అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణ బాద్యతల్ని చేపట్టేందుకుగాను 1967లో పవర్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ డివిజన్ ఏర్పటయింది. డిజైన్, నిర్మాణ రంగాలలో భారతీయ సామర్ధ్యాన్ని అభివృద్ధి చేయటం ఈ డివిజన్ బాధ్యత. రాజస్ధాన్ లోని రవాట్ బాతా వద్ద ఉన్న రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజెక్టు తమిళనాడు లోని కల్పకం వద్ద ఉన్న మద్రాసు అటామిక్ పవర్ ప్రాజెక్టు ఉత్తర ప్రదేశ్ లోని నరోరా వద్ద ఉన్న నరోరా అటామిక్ పవర్ ప్రాజెక్టు, గుజరాత్ లోని సూరత్ వద్ద ఉన్న కక్రాపర్ అటామిక్ పవర్ ప్రాజెక్టుల రూపకల్పన నిర్మాణం కార్యక్రమాలు ఈ డివిజన్ ఆద్వర్యంలోనే జరిగాయి. తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ను 1979 నుండే ఈ డివిజన్ నిర్వహిస్తోంది. దేశంలో అణు విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు వీలుగా 1984లో న్యూక్లియార్ పవర్ బోర్డుగా [N.P.B] పునర్వావస్ధికరించారు.
దీర్ఘకాలిక అణువిద్యుత్ కార్యక్రమంలోని మొదటి దశలో 10వేల మె.వా. విద్యుత్ ఉత్పాదన చేయాలని అంచనా. ఇందుకుగాను అవసరమైన చర్యలను చేపట్టేందుకు ఎన్ పి బి ని పబ్లిక్ రంగ సంస్థగా మార్పుచేసి 1987లో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏర్పాటు చేశారు. ఏ సంస్థ రూ.2,000కోట్లుషేర్ క్యాపిటల్ ను అధికారికంగా కల్గి ఉంది. రాజస్ధాన్ అటామిక్ పవర్ స్టేషన్-1 మినహా అన్నీ విద్యుత్ కేంద్రాలలోనూ వాటి స్థిరాస్తులను 1987 నుండి ఎన్ పి సి ఐ ఎల్ కు బదిలీచేశారు. 

NPCLఅధ్వర్యంలో ప్రస్తుతం ఎనిమిది అను విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. తారాపూర్ [మహారాష్ర్ట] రవత్ భాతా [రాజస్థాన్] కల్పక్కమ్ [తమిళనాడు] నరోరా [ఉత్తరప్రదేశ్] లలో రెండేసి చొప్పున రియాక్టర్లు పని చేస్తున్నాయి. వీటి మొత్తం విద్యుత్ ఉత్పాదక సామర్ధ్యం 1500మె.వా.సామర్ధ్యం ఉన్న మరో ఆరు రియాక్టర్లు కక్రాపర్ [గుజరాత్] కైగా [కర్నాటక] రవట్ భాతా [రాజస్థాన్] లలో నిర్మాణంలో ఉన్నాయి. అను విద్యుత్ కార్యక్రమం ప్రస్తుతం 220మె.వా. ఉత్పాదక సామర్ధ్యం ఉన్న PHWRల ఆధారితమైనది. ఈ రియాక్టర్ల నమూనాలను ప్రమాణీకరించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆరు రియాక్టర్లతో పాటు అంతేసామర్ధ్యం ఉన్న మరో నాలుగు  రియాక్టర్లను కైగాలో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం అయ్యింది.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine