• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » ప్రకృతి ధర్మం | Sakshyam Magazine

ప్రకృతి ధర్మం | Sakshyam Magazine

'మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్నిఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతోమంది స్త్రీ పురుషులను అవనిలో వ్యాపింపచేశాడు. ఏ దేవుని పేరు చెప్పుకొని మీరు పరస్పరం మీ హక్కలను కోరుకుంటారో ఆ దేవునికి భయపడండి. బంధుత్వ, సంబంధాలను తెంచడం మానుకోండి. అల్లాహ్ మమ్మల్ని పరిక్షిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి'

ఆకలి వేసినప్పుడు భుజించడం సహజ ధర్మం. ఎండ, చలి, వాన నుండి రక్షణ పొందడానికి ఒక గుడును నిర్మించుకోవడం ప్రకృతి ధర్మం. సంతానోత్పత్తికి మగ, ఆడ జతకట్టడం మనం నివస్తున్న ఈ ప్రపంచంలో కనిపించే ఒక 'సహజ' అవసరం. కానీ ఈ సంతానోత్పత్తికే ఒక్క బుద్ధిజీవి అయిన మానవ సమూహంతోనే 'వివాహం' అనే ఒక సత్ సాంప్రదాయం అగుపిస్తుంది. వివాహం ముఖ్యఉద్దేశ్యం సంతనాభివృద్ధి, తద్వారా ఒక సత్ సమాజ స్థాపక కూడా అంతర్లీనమై ఉంది. ఈ సత్ సమాజ స్థాపనే లక్ష్యంగాదైవ ధర్మం 'వివాహాన్ని' ఒక సంప్రదాయంగా మన ముందుకు తెచ్చింది. వివాహ బంధమే కుటుంబ వ్యవస్థకు పునాది. మహాప్రవక్త ముహమ్మద్ [స] వివాహం నా సంప్రదాయం అని సెలవిచ్చారు. సంసారాన్ని త్యజించి, సన్యసించి మెక్షమార్గాన్నివెదకటాన్ని దైవ ధర్మం నిరోధించింది.

ప్రేమించుకునే ఇద్దరికీ వివాహం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు' ప్రవక్తీ [స] గారి ఈ ప్రవచనం 'వివాహం' గొప్పతనాన్ని చాటిచెబుతుంది. 'వివాహం బంధం' మానవసేవకు అవరోధంగా భావించిన కొందరు అసలు జీవితంలో వివాహాన్ని నిషేధించుకొని, తమ జీవితాన్ని మానవసేవలోనే తమ జీవితం ధన్యంగా భావించే కొందరిని మనం మన సమాజంలో చూస్తున్నాం.

అందరూ అదే విషయాన్ని గర్వంగా భావించి వివాహాన్ని భారంగా తలచి తమకు తాముగా వివాహాన్ని నిషేధించుకుంటుపోతే ఒక తరం తరవాత 'మరొక తరం' ఎక్కడి నుండి వస్తుంది? సేవ చేయటానికి మానవ సంతతి అభివృద్ధి కావాలి కదా? అందరూ సేవకులుగా మరి 'బ్రహ్మచర్యం' ఆవలంభిస్తే ముందుతరం ఎలా ముందుకు వెళుతుంది విచక్షణ జ్ఞానంతో, లోతుగా, విశాల హృదయంతో ఆలోచించిన సామాన్యులకు కూడా ఈ విషయం బోధపడుతుంది. భవబంధాలు మెక్షనికి అవరోధం కాదనే సత్యం అవగతం అవ్వటమే కాకుండా ఈ సృష్టికర్యం ద్వారానే మానవ మనుగడ ఆధారపడి ఉందనే 'నగ్న సత్యం' తెలుస్తుంది.

'మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్నిఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతోమంది స్త్రీ పురుషులను అవనిలో వ్యాపింపచేశాడు. ఏ దేవుని పేరు చెప్పుకొని మీరు పరస్పరం మీ హక్కలను కోరుకుంటారో ఆ దేవునికి భయపడండి. బంధుత్వ, సంబంధాలను తెంచడం మానుకోండి. అల్లాహ్ మమ్మల్ని పరిక్షిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి'[నిసా] ఇస్లాం సహజధర్మం. కాబట్టి మానవ సహజమైన కోర్కెలను అణచివేయక వాటిని గౌరవిస్తుంది. ఏ విషయంలోని 'అతి' ని ఇష్టపడక 'మధ్యేమార్గాన్ని' మాత్రమే సమ్మతిస్తుంది. 

నేటి సమాజంలో కోర్కెలకు అతీతంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకొనే 'స్వాములు,బాబా'ల విషయంలో బయటపడుతున్న సెక్స్ బాగోతాలు అందరికీ విధితమే. పైకి తాము కోర్కెలకు అతితతులమని చెప్పినప్పటికి, మానవ సహజ బలహీనతలకు అతీతులు కారనే నగ్నసత్యాలు ఇటువంటి ఘటనలు తెలుపుతున్నాయి. ఈ దైవధర్మం నమాజ్, ఉపవాసం [రోజా] లను ఎలాగైతే ఆరాధనగా [ఇబాదత్] గా పరిగణించబడుతుందో, అదే విధంగా 'నికహ్' అంటే వివాహాన్ని కూడా ఆరాధనగానే పరిగణిస్తుంది. కానీ నేటి వివాహ బంధాలు వాణిజ్య బంధాలుగా మారుతున్న వైనం శోచనీయం. యువతి గుణగనలకంటే ఆమె ద్వారా సంక్రమించే కట్నం వగైరా ఆస్తులపైనాఎక్కువగా మక్కువ చూపుతున్న సమాజాన్ని విక్షిస్తున్నాం.

దైవధర్మంలో వివాహ విషయంలో స్త్రీ గుణగణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. మీరు ధార్మికురాలైన స్త్రీనే ఎన్నుకోండి. మీకు మేలు కలుగుతుంది' అన్న ముహమ్మద్ [స] ప్రవచనం ఎంతైనా ఆచరణాత్మకం. ఈ దైవధర్మంలో వివాహ సమయంలో వరుడు వధువుకు మహార్ అంటే కొంతధనాన్ని కానుకగా ఇవ్వాలనే నిబంధన ఉంది.ఒక మనిషికి మన ఇష్టాన్ని తెలియచెయ్యటానికి కానుకలు ఒక చక్కటి మార్గం. ఈ బహు మతులు వాళ్లు మధ్య స్నేహబంధాలను పటిష్టం చేస్తాయి. 

ఇది ఎవరైనా కాదనలేని సత్యం. ఈ సత్యం ఆధారంగానే తన భర్త నుండి మహార్ ను పొందిన ఆ భార్య సంతృప్తి, సంతోషం పొందకుండా ఉంటుందా? ఈ మహార్ కూడా భర్త ఆర్ధికస్థితి ఆధారంగానే ఏర్పాటు చెయ్యటం జరుగుతుంది. అంటే వివాహ పవిత్ర బంధం భార్య సంతృప్తి, సంతోష, సహకారాలతో ప్రారంభమవుతుంది. దీనికి విరుద్ధంగా నేటి వర విక్రయ కార్యంలో ఎంత ఆలోచించినా అర్ధంకాని ఒక జటిల సమస్యగా స్త్రీ భావిస్తుంది. ఇది ప్రతి యువతీ ఎదుర్కొనే సవాలు. ఈ కట్న దాహనికి బలవుతూ కాటికి పోతున్న ఉదంతాలు కోకొల్లలు. ఆ కట్నం ఇవ్వలేక వయసు మీరిపోతున్న వృద్ధ కన్యలు, వయసు కోర్కెలకు కళ్ళెం వెయ్యలేక 'తప్పటడుగులు' వేస్తున్న యువతులు నేడు మనకు అడుగడు గున అగుపిస్తూనే ఉంటారు. 

తల్లిదండ్రుల నుండి బలవంతంగా డిమాండుల రూపంలో వసూలు చేసిన కట్నంతో వివాహం జరిగిన వారి మధ్య ప్రేమ బంధం ఎలా త్వరగా ఏర్పడుతుంది ఆలోచించండి? భర్తను డబ్బుతో 'కొనుక్కున్నాను' అనే అహం ఏ ములో ఆ యువతికి తప్పక ఉంటుంది. ఇది నిజం. దైవధర్మం చూపిన మార్గాన్ని విడనాడిన దాని ఫలితమే నేటి మన వివాహాల [విభేదల] చిత్రపటం .ఏ దైవగ్రంధంలో అయినా వివాహ ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను తెలుపుతుంది కానీ, వారి మధ్య పొరపొచ్చాలు, విభేదాలు వచ్చినప్పుడు వివాహ బంధాన్ని ఒక గుడిబండగా జీవితాంతం భావించనవసరం లేదని, విడాకులు తలాఖ్ ద్వారా విడిపోవచ్చు అనే ఒక వెసులు బాటును మన బలహీనతలను ఎరిగిన దైవం చేసిన ఏర్పాటు. ఈ వెసులుబాటు లేకపోయినట్లయితే తన భార్యను చంపటమె, లేక తను చావడమో, తన భర్తను చంపటమో లేక తను తనువు చలించటమో అన్న కర్కశ దశకు చేరకుండా నిరోధించిన నిజధర్మం ఇస్లాం. దైవానికి అత్యంత అప్రియమైన కార్యంగా ఈ విడకులను గురించి తెలుపుతూ ఆఖరి అస్త్రంగా గత్యంతరంలేని చిట్టచివరి దశలో మాత్రమే ఈ ప్రక్రియకు పాల్పడాలనే నిబంధనను ఏర్పాటు చేసిన విశ్వసృష్టికర్త శ్లాఘనీయుడు.

 ఇష్టంలేని భర్తతో, క్రూరుడు కర్కశుడు అయిన భర్తతో జీవనం దుర్భరం. కావున అటువంటి స్త్రీలు ఖులా అనే పద్ధతి ద్వారా విడిపోయి నూతన జీవితాన్ని,తనకు  ఇష్టమయిన వ్యక్తిని వివాహమాడే స్వేచ్చను, స్వాతంత్ర్ర్యాన్ని స్త్రీలకు ప్రసాదించిన ధర్మం ఇదే. కానీ దురదృష్టవశాత్తూ తలాఖ్ కు ఎంతో ప్రచారం జరుగుతుంది. కానీ, స్త్రీ స్వాతంత్ర్యాన్ని తెలియచెప్పే ఈ ఖులా ప్రక్రియకు ప్రచారం జరుగకపోవడం శోచనీయం. ఏదైనా దైవభితితో జరగలనే నిబంధనతో ఈ ఏర్పాటుగావించడం గమనార్హం. 

భార్యాబిడ్డలపై ఖర్చు చేసే ధనాన్ని ఒక పుణ్యకార్యంగా ఇస్లాం ధర్మం తెలుపుతుంది. వారితో సద్వర్తనతో సంసారం చేయండి [నిసా] అని దివ్యఖుర్ ఆన్  ఆదేశిస్తుంది. ఏ విశ్వసీ, విశ్వాసురాలు అయిన భార్యను అసహ్యించుకోరాదు. ఆమె అలవటోకటిఅతనికి నచ్చకపోతే, ఆమె మరో గుణమాయిన అతనికి నచ్చవచ్చు కదా; అని ముహమ్మద్[స] సెలవిచ్చారు. వివాహ బంధం యొక్కపటిష్టతపైదైవం ఇలా సెలవిచ్చారు' వారు మీకు, మీరు వారికి దుస్తుల్లాంటి వారు [బఖర] దుస్తులు శరీరానికి అంటిపెట్టుకొని ఏవిధంగా ఆకర్షణంగా, అందంగా అగుపిస్తాయే, అలాగే భార్యాభర్తలు పరస్పరం ప్రేమ, అనురాగంతో సంసారంలో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వికసింపజేసుకోవాలని విశ్వప్రభువు ఆదేశంగా తెలుస్తుంది.

వ్యభిచారాన్ని నిరోధించి, వివాహాన్ని ధర్మబద్ధం చేసిన పవిత్ర ధర్మం ఇస్లాం. నేటి సమాజంలో అశ్లీల వాతావరణం పరోక్షంగా వివాహ విచ్చిన్నతికి, ప్రత్యక్షంగా కుటుంబ జీవనానికి గొడ్డలిపెట్టుగా మారింది. ఏదైనా హత్య, ఆత్మహత్యలు జరగటానికి అంతర్గతంగా చాలా వరకు అక్రమ సంబంధాలే కారణం కావటం నేడు మనం చూస్తున్నాం. వ్యభిచారం మూలంగా జన్మించిన సంతానాన్ని అక్రమ సంతానంగా వారిని ముళ్లపోదల్లో, చెత్తకుప్పలలో పారేయడం జరుగుతుంది ఆ విధంగా జన్మించి పెరిగి పెద్దవారై సరైన ఆలనసాలనా కరువై అనైతిక శక్తులతో చెరీ సమాజనికి ఏ విధంగా చేటు చేయగలలో ఎవరైనా ఊహించగలరు. 

వ్యభిచారం అది దుష్టకార్యం దాని దరిదాపులకు కూడా పోవద్దు అని పవిత్ర ధర్మ తెలుపుతుంది. వ్యభిచారం మూలంగా సమాజం అనేక రుగ్మతల నిలయంగా మారుతుంది. ఎయిడ్స్ లాంటి భయానక వ్యాధుల, అశ్లీలత పెరగకుండా కొన్ని షరతులతో బహుభార్యత్వానికి అనుమతించింది పవిత్ర ధర్మం. స్త్రీలకు తమ తల్లిదండ్రుల ఆస్తిలో వాటా పొందే హక్కు నిచ్చింది ఈ ధర్మమే. ఆ తరువాత  12 శతాబ్దాలకు 1881సంవత్సరంలోగాని ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా చెప్పుకునే ఇంగ్లాండులో 'దైవధర్మం' ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థను అరువు తెచ్చుకోవటం జరిగింది. 

ఉత్తమ కుటుంబ నిర్మాణానికి, ఉన్నత సమాజ స్థాపనకు వివాహ బంధాన్ని ;వారధి' గా చేసిన ప్రకృతి ధర్మమే ఇస్లాం. ఈ దైవగ్రంధంలోని విషయాలను లోతుగా అద్యయానం చేసినట్లయితే అనేక అమూల్య విషయాలు అవగతం అవుతాయి. సహజ ధర్మమైన ఇస్లాం ధర్మాన్ని గురించి కూలంకషంగా అధ్యయనం చేసి తద్వారా స్వర్గప్రాప్తి పొందే భాగ్యాన్ని అందరికీ కలిగించాలని విశ్వప్రభువు అల్లాహ్ ను వేడుకుందాం.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine