• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » ARTICLES » మీ జీవిత లక్ష్యం మీకు తెలుసా!?

మీ జీవిత లక్ష్యం మీకు తెలుసా!?

Label: ARTICLES

ఈ సకల చరాచర సృష్టిలో మానవుణ్ణి ఉన్నతమైన, ఉత్కృష్టమైన జీవరాశి అంటారు. అంటే ఈ యావత్ ప్రపంచంలో ఉండే జీవరాశులు అనగా జంతువులు, పక్షులు, జలచరాలు, క్రిమికీటకాలు, క్షీరదాలు, సరీసృపాలు, మొ||న జీవరాశులు. వీటన్నింటి కంటే మానవుడు గొప్పవాడు. ఈ మానవుడే ఎందుకు గొప్పవాడంటే! ఈ సకల చరాచర సృష్టిలో ఉండేటటువంటి జీవరాశులన్నింటికీ లేనటువంటి ఒక ప్రత్యేకత ఈ మనిషికి ఉంది. అదే ''ఆలోచనాశక్తి  లేదా విచక్షణాజ్ఞానం''. అంధుకే మనిషి మాత్రమే తనకంటే బలమైనటువంటి పశుపక్షాదులను, జంతువులను మశ్చిక చేసుకొని, ఇంకా అనేక విధాలుగా ఉపయోగించుకోగల్గుతున్నాడు. అదే విధంగా రాతి యుగం నుంచి రాకెట్టు యుగానికి అడుగుపెట్టిన ఈ మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాలలో, ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఎంతో అభివృద్దిని సాధించాడు. ఇంకా తన ''మేదస్సు'' ద్వారా అనేక పరిశోధనలు జరిపి అనేక వస్తువులను, పరికరాలను నిర్మించి వాటి దిశా, నిర్దేశనాలను, వాటి ''లక్ష్యాలను'' నిర్మిస్తున్నాడు అని అనటంలో ఎలాంటి సందేహం లేదు. 

          అటువంటి ఈ మానవుడు ఏ లక్ష్యం కొరకు ఈ ప్రపంచానికి వచ్చాడు? ఎందునిమిత్తం అతడు సృష్టించబడ్డాడు? అసలు మనిషి ''తన జీవిత లక్ష్యం ఏమిటి ''? అని ఎప్పుడైనా తన ''జ్ఞానంతో'' ఆలోచించాడా!? తనకంటే బలమైన జంతువులను మశ్చిక చేసుకొని, ఉపయోగించుకొనే విషయంలో, ఇంకా అనేక వస్తువులను, పరికరాలను కనుగొనే విషయంలో తన ''జ్ఞానాన్ని'' ఉపయోగించిన ఈ మానవుడు, “తన జీవిత లక్ష్యాన్ని లేదా తన జీవిత గమ్యాన్ని”  తెలుసుకొనే విషయంలో తన ''బుద్దిని'' ఉపయోగించాడా!?
        అణువు నుంచి పరమాణువు వరకు ఏదైనా ఒక వస్తువును సృష్టించిన ''ఈ మానవుడే'' దానికొక 'లక్ష్యాన్ని' పెడుతున్నాడు. దానిని 'లక్ష్యరహితంగా' వదిలివేయటం లేదు. అదేవిధంగా ''మనిషిని సృష్టించిన వాడు'' కూడా మనిషికోక 'లక్ష్యాన్ని' పెడుతున్నాడు. మనిషిని 'లక్ష్యరహితంగా' వదిలివేయటం లేదు.

          మరి మనిషి తన లక్ష్యాన్ని ఎక్కడ తెలుసుకుంటాడు!? ఉదాహరణకు మానవుడు ఒక చిన్న వస్తువును తయారుచేస్తేనే దాని లక్ష్యాన్ని నిర్దేశించే [అనగా ఏ విధంగా ఉపయోగించాలి, ఉపయోగించకూడదు] విషయంలో దానికొక పుస్తకాన్ని [MANUAL] ఇస్తున్నాడు. ఉదా: సెల్ ఫోన్, టి‌వి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ మొ||వి. అటువంటిది మనిషిని తయారుచేసినవాడు కూడా మనిషి తన జీవిత లక్ష్యాన్ని [ఏ విధంగా జీవించాలి, జీవించకూడదు] తెలుసుకొనే విషయంలో మనిషికొక పుస్తకాన్ని [MANUAL] ఇవ్వడంటాడా? మన బుద్ది ఇచ్చే సమాధానం ఏమిటి? ఖచ్చితంగా ఇస్తాడన్నది! ఈ సకల చరాచర సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త అనంతకరుణాస్వరూపుడు కాబట్టే ఆయన ఆది నుంచి మానవులకు అనేక గ్రంధాలను [MANUALS] పంపించాడు. అదే వేదాలు, భగవధ్గీత, బైబిల్ మరియు ఖుర్ఆన్. 

భగవధ్గీతా శాస్త్రం:- 
నీవు చేయదగినదియు, చేయరానిదియు నిర్ణయించునప్పుడు నీకు “శాస్త్రము ప్రమాణమైయున్నది”. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలిసికొని, దాని ననుసరించి, నీవీ ప్రపంచమున కర్మము చేయదగును.    -16:24

బైబిల్ శాస్త్రం: - 
దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన “కట్టడలననుసరించి నడుచు చుండవలెను”, మానవకోటికి ఇదియే విధి.                                                                                                 -ప్రసంగి :- 12:7

ఖుర్ఆన్ శాస్త్రం :- 
మానవులారా! మీ ప్రభువు తరపు నుండి మీవద్దకు సృష్టమైన నిదర్శనం[ఖుర్ఆన్] వచ్చింది. మేము మీ వద్దకు మీకు సృష్టంగా మార్గం చూపే జ్యోతిని పంపాము. ఇక అల్లాహ్ మాటను ఆలకించేవారిని, ఆయన శరణు వేడుకునే వారిని అల్లాహ్ తన కరుణతో తన అనుగ్రహంతో కప్పివేస్తాడు. వారికి తన వైపునకు వచ్చే బుజుమార్గం చూపుతాడు.  
                                                                                                    - ఖుర్ఆన్:- 174,175

పై అధ్యాత్మిక వాక్యాల ద్వారా మనకు తెలిసేదేమిటంటే మన నిత్య జీవితంలో ఏదైనా ఒక పని చెయ్యాలన్నా, మానుకోవాలన్నా మనం శాస్త్రాలను ప్రమాణంగా చేసుకోవాలన్నది! మరి మనిషి స్వేచ్ఛా జీవి తన ఇష్టమొచ్చినట్లు జీవించడానికి అతనికి హక్కు ఉన్నది. మరి మనిషి తన ఇష్టమొచ్చినట్లు ఈ ప్రపంచంలో తన జీవితాన్ని గడిపితే కలిగే పర్యవసానం ఏమిటి? అని మన అధ్యాత్మిక గ్రంధాలను పరిశీలిస్తే! 

భగవధ్గీతా శాస్త్రం:- 
ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన యిష్టమొచ్చినట్లు, ప్రవర్తించునో, అట్టివాడు పురుషార్ధసిద్ధినిగాని, సుఖమునుగాని, ఉత్తమగతియగు మోక్షమునుగాని పొందనేరాడు.                         -  16:23

బైబిల్ శాస్త్రం: - 
నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. పట్టణములో నీవు శపించబడుడువు, పొలములో నీవు శపించబడుడువు.                          – ద్వితీ||కా||: 28:15,16

ఖుర్ఆన్ శాస్త్రం :- 
ఇక నుండి అల్లాః ఆజ్ఞలను ధిక్కరించే వారికి కఠిన శిక్ష పడటం నిశ్చయం. అల్లాః మహత్తర శక్తి సంపన్నుడు. దుష్టత్వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడూను. 3 : 4

పై అధ్యాత్మిక వాక్యాల ద్వారా మనకు తెలిసేదేమిటంటే  మనిషి ధార్మిక గ్రంధాలకు వ్యతిరేకమైన జీవితాన్ని గడిపితే అశాంతికి, తీవ్రనష్టానికి గురైపోతాడని స్పష్టమవుతుంది. 

సరే! ఎంతకీ మనిషి "తన జీవిత లక్ష్యాన్ని"  గూర్చి ఆధ్యాత్మిక శాస్త్రాలు ఇచ్చే సందేశం ఏమిటి? 

వైదిక శాస్త్రాల ప్రకారం :
“లక్ష్యం తదేవాక్షరం సోమ్య మిద్ది “
అవినాశి అయిన పరబ్రహ్మమును తెలుసుకొనుటయే నీ లక్ష్యం.       ముండకోపనిషత్ :- 2:2:3

“ప్రణవో ధనుః శరో హ్యథ్మా  బ్రహ్మ తల్లక్ష్య ముచ్యతే”
 మనస్సు బాణం, గురి బ్రహ్మము, బ్రహ్మమును లక్ష్యంతో సాధించాలి.    ముండకోపనిషత్ :- 2:2:4

బైబిల్ శాస్త్రం: - 
భూ జంతువులకంటే మనకు ఎక్కువ బుద్దినేర్పుచు ఆకాశపక్షులకంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేయుచు “నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అనుకొనువారెవరును లేరు”.          యోబు :- 35:11

నీ బాల్యదినములందే “నీ సృస్ష్టికర్తను స్మరణకు” తెచ్చుకొనుము.               ప్రసంగి :- 12:1,2

ఖుర్ఆన్ శాస్త్రం :-
నేను జిన్నాతులనూ, “మానవులనూ నా ఆరాధన కొరకు తప్ప మరిదేని కొరకూ సృస్టించలేదు”.జారియత్:-51:56 
వారు[మానవులు] దైవాన్ని ఏ విధంగా గుర్తించాలో, ఆ విధంగా గుర్తించనే లేదు. అజ్ జుమర్:-39:67

పై అధ్యాత్మిక వాక్యాల ద్వారా మనిషి “తనను సృష్టిoచిన దైవాన్ని తెలుసుకొనుటయే” అతని జీవిత లక్ష్యం అని తెలుస్తుంది. 

మరి ఆ దైవాన్ని ఎలా గుర్తించాలి ?

వైదిక శాస్త్రాల ప్రకారం :-
“యేకే ఏవనో దూత్యో”. “ద్వావ భూమిజనయాన్ దేవ ఏకః” 
దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు. భూమికి, ఆకాశానికి సృస్తికర్త ఒక్కడే     శ్వేతా|| 3:3
“అక్షరం బ్రహ్మ పరమమ్”
నాశనంకానీ సృష్టికర్త “పరమందు” ఉంటాడు                           భగవథ్గీత:- 8:3 
“న చాస్యకశ్చిజ్ఞానితా  న చాదిపః
ఆయనకు తల్లిదండ్రులు లేరు. ఆయనకు ప్రభువు లేడు.              శ్వేతా || :- 6:9
“న తస్య ప్రతిమ అస్తి”
ఆయనకు సాటి, పోలిక ఎవరు లేరు.                               యజుర్వేదం :- 32:3  

“అజమ్”       =   పుట్టుకలేనివాడు                               - భగవథ్గీత:- 10:3 
“స పర్యగాచ్చు క్రమకాయమ్ “
అతడేన్నడూ శరీరము ధరించడు.                               –యజుర్వేదమ్ :- 40:8
“ఓం జన్మరహితః జన్మప్రద “ 
దేవుడు జన్మను ఇస్తాడు కానీ, జన్మించడు                      -వేదం

“అవ్యక్తం”      =    కంటికి కనబడనివాడు                        - భగవథ్గీత:- 7:24 
దేవుని రూపము చూపుమేరలో లేదు,
కన్నులతో ఎవడును ఆయనను చూడలేడు                       - కఠోపనిషత్ :- 6:9

న వినశ్యతి  =    నాశనం లేని వాడు [మరణించడు]         - భగవథ్గీత:-  8:20

బైబిల్ శాస్త్రం ప్రకారంగా  :-
మన దేవుడైన యెహోవా “అద్వితీయుడైన” యెహోవా      - ద్వితీ||కా|| 6:4
భూమి మీద ఎవరికైననూ తండ్రి[దేవుడు} అని పేరు పెట్టవద్దు; “ఒక్కడే మీ తండ్రి[దేవుడు]”; ఆయన “పరలోకమందున్నాడు”.                                       - మత్తయి :- 23:9
నేను దేవుడను నన్ను పోలినవాడేవడును లేడు.           -యెషయ :- 46:9
కావున మీరు ఎవనితో దేవుని పోల్చెదరు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? -యెషయ :- 40:18

దేవుడు అబద్దమాడుటకు “ఆయన మానవుడు కాడు” 
పశ్చాత్తాపపడుటకు “ఆయన నరపుత్రుడు కాడు”.                 సంఖ్యా కా|| 23:19
మనుష్యులలో ఎవడును  ఆయనను చూడలేదు. ఎవడును చూడనేరడు.  -1వ తిమోతి:6:16

ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూచి యుండలేదు.                       -1వ యోహాను :-4:12

యెహోవాయే జీవముగల[మరణంలేని] దేవుడు.                        – యిర్మియా :- 10:10 

ఖుర్ఆన్ శాస్త్రం ప్రకారం :-
ఒకవేళ ఆకాశాలలో, భూమిలో “ఒక్క అల్లాహ్ తప్ప” ఇతర దేవుళ్లు కూడా ఉంటే, అప్పుడు [భూమ్యాకాశాల]
రెండిటి వ్యవస్థ చిన్నాభిన్నమై ఉండేది.                                     -అల్ అంబియా:- 21:22

ఆయనకు “సంతానం ఎవరూ లేరు”. ఆయన కూడా “ఎవరి సంతానం కాదు”. -అల్ ఇఖ్లాస్:- 112:3

అల్లాహ్ ను “పోలినది” ఈ సృష్టిలో ఏది లేదు.                              -అష్ షూరా:- 42:11
అల్లాహ్ సజీవుడు, నిత్యుడు, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు.          – అల్ ఇమ్రాన్ :- 3:2

ఆయన సజీవుడు, ఎన్నడూ మరణించనివాడు.                          – అల్ ఫుర్ఖాన్:- 25:58

పై అధ్యాత్మిక వాక్యాల ప్రకారం మానవుడు తనను పుట్టించిన దైవాన్ని అద్వితీయుడుగా, జనన మరణాలకతీతుడుగా, అవ్యక్తుడిగా, నాశనం లేనివాడిగా గుర్తించి, ఆ దైవానికి ఎవ్వరినీ సహవర్తులు లేరని గ్రహించి, ఆ ఏకైక దైవం యొక్క ఆదేశాల ప్రకారం జీవితం గడపటమే “మానవ జీవిత లక్ష్యమని” అవగతమవుతుంది.
                                                          ధన్యవాదములు
G.ఆనంద్
anandchinna321@gmail.com 

2 Responses to "మీ జీవిత లక్ష్యం మీకు తెలుసా!?"

  1. నీహారిక

    వ్యాసం చాలా బాగుంది. ఈ దేవుళ్ళకి పైన ఇంకో దేవుడున్నాడు అని చెప్పడం వల్లే మళ్ళీ మళ్ళీ కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు. ఇప్పటికే 12 నెలలకి సరిపడా దేవుళ్ళున్నారు. ఇంక మేము భరించలేము. ఉన్నవాళ్ళతోనే సర్దుకుపోతాం. కనికరించండి.

    1. Unknown

      నిజానికి పైనున్న దేవుడే అసలు దేవుడు.ఆ దేవుడిని మరుగున పడేసి క్రింద వాళ్ళందరినీ దేవుళ్ళను చేసేసి వ్యాపారం చేస్తున్నారు. ఏశాస్త్రం ప్రకారం చూసినా దేవుడు జన్మరహితుడనే ఉంది.ఇదొక కొలమానం చాలు మిగతా వాళ్ళందరూ కల్పిత దేవుళ్ళు గా గుర్తించడానికి.నిహారికగారికి కృతఙ్ఞతలు.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine