మనిషికి శాస్త్రీయ గ్రంధాల పరిజ్ఞానం కలిగి లేకపోవడమే ప్రధాన కారణం. నిజమైన సృష్టికర్తను విడిచి పెట్టి సృష్టితాలను ఆరాధించడమే ప్రధాన అజ్ఞానం. ఎవడూ ఒక వస్తువును తయారు చేసిన తరువాత ఆ వస్తువులోకి దూరిపోడు. ఆ వస్తువులో తను ఉండడు కూడా! అలాగే ఈ యావత్తు సృష్టిని తయారు చేసిన దేవుడిని ఈ సృష్టితో పోల్చడం, దానిని మొక్కితే ఆ దైవాన్ని మొక్కడం లాంటి సిద్దాంతం ఎప్పటికీ అజ్ఞాన పూరితమే! ఇదే అనేక మూఢ నమ్మకాలకు పునాది అయిపోతుంది. నిజానికి సృష్టితం అనేది సృష్టికర్త గొప్పతనాన్ని తెలియజేయడానికే గాని వేడుకోవడానికి కాదు.