• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » ARTICLES » Editorial » హిందువులు వేదశాస్త్రాలను ఎందుకు ప్రతిష్టించరు?

హిందువులు వేదశాస్త్రాలను ఎందుకు ప్రతిష్టించరు?

Label: ARTICLES, Label: Editorial

Rig Veda-Sakshyam-magazine
మన భారతదేశంలో హిందువులలో అత్యధికంగా క్రైస్తవమత మార్పిడి పెరిగిపోయింది. ఎక్కడ చూసినా క్రైస్తవులుగా మారిన హిందువులే కన్పిస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది?

ఒకప్పుడు బ్రిటీష్ పరిపాలనా కాలంలో అట్టడుగు స్థాయి (సామాన్యులు-పేదరికపు) ప్రజలు కూడు,గుడ్డ కోసం బ్రిటీష్ బోధనలకు, వారి ఆదరణకు లోబడిపోయి క్రైస్తవులుగా మారిపోయేవారు. అప్పటి రోజులలో పండితవర్గం,లేక బ్రాహ్మణ వర్గం వారిని ముఖ్యంగా దళితులను దరిదాపులకు రానీయకపోవడం కూడా క్రైస్తవమత వ్యాప్తికి కారణమయ్యింది.

కాని నేటి రోజుల్లో కూడా అంతకంటే ఎక్కువుగా క్రైస్తవమత వ్యాప్తి పెరిగిపోతుంది. పైగా ఈ క్రైస్తవమత స్వీకరణలో కేవలం పేదవారే ఉన్నారనుకుంటే పెద్ద పొరపాటు. ఎవరినైతే అగ్రకులాలని చెప్పుకుంటున్నామో వారు కూడా ఉన్నారు. అన్నీ పుష్కలంగా ఉంది తులతూగుతున్న ధనికులు కూడా చేరిపోతున్నారు. మరొక ముఖ్య విషయమేమిటంటే బ్రాహ్మణ వర్గస్తులలో కూడా అనేకులు చర్చి ఫాదర్లుగానూ, బోధకులుగానూ అవతారం చెందుతున్నారు.

Baptisim-Sakshyam-magazine

నిజం చెప్పాలంటే బ్రాహ్మణ పురోహిత్యం క్రమేపీ తగ్గుతూ క్రైస్తవ పురోహిత్యం పెరిగిపోతుంది. హిందూ సమాజం ఇలా మార్పు చెందడానికి కారణం ఏమిటి? ఏం జరుగుతోంది? అనే విషయ పరిజ్ఞానం మీద దృష్టి వదిలి పెట్టి " హిందువుగా పుట్టావు,హిందువుగా జీవించు" అనే నినాదం మాత్రం ప్రచారం అవుతుంది. దీని వలన ఉపయోగం ఏముంది? అలాగని క్రైస్తవులను దండించడం, లేక శిక్షించడం లాంటి పనులు కూడా మూర్ఖపు పనులుగానే మిగిలిపోతాయి. ఇది క్రస్తవ మాట వ్యాప్తికి మరింత తోడ్పడుతుంది తప్ప ఏ విధంగానూ హిందూ సమాజానికి ఉపయోగం కలిగించదు.

దీని సమస్యకు ఒక్కటే పరిష్కారం వుంది. మన వైదిక శాస్త్ర బోధనలను ప్రజలలో సర్వసామాన్యం చేయాలి. శాస్త్ర విరుద్ధమైన క్రతువులను రూపుమాపాలి. ఈ పని సాధ్యమేనా అన్నది సందేహమే! ఎందుకంటే హిందుత్వాన్ని వ్యాపారం చేసుకున్న బడాబాబుల చేతుల్లో నుండి, భగవంతుణ్ణి స్థానంలో కూర్చుని కాళ్ళకు మొక్కించుకుని దైవ భక్తిని పూర్తిగా వదిలి పెట్టించేసి, కేవలం గురు భక్తిని మాత్రమే ప్రతిపాదిస్తూ లాభాన్ని పొందుతున్న గురువులనుండి, వేదం శాసనం కంటే తమ స్వకల్పిత శాసనాలతో ప్రజలను నమ్మిస్తున్న స్వామీజీల కూటముల నుండి నిజమైన వేద ప్రతిష్టను స్థాపించడం కష్టమే!

Rig Veda-Sakshyam magazine

ఈ పని జరగాలంటే మాత్రం ప్రజలలో, సామాన్య ప్రజలలో సైతం వేద శాస్త్ర అవగాహన పెరగాలి. వేదాన్ని అడ్డుపెట్టుకుని నేడు కల్పించబడుతున్న తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు విశ్వాసాలు అప్పుడే ప్రజలకు తెల్సిపోతాయి.అప్పుడే మనిషి జ్ఞాన పరిపక్వత చెందుతాడు. అప్పుడు ఎవరికీ వారు నిజమైన సాధువు అవుతాడు. అది జరిగిననాడు నేటి కాల్పనిక సాధువులు మటుమాయమవుతారు. ఇది సాధ్యమేనా? అన్నది సందేహమే!!

ఈ వేదం జ్ఞాన ప్రతిష్టత జరగక పొతే ఈ మోసాలన్నీ తెల్సుకున్నవారు, ఈ తప్పుడు సిద్ధాంతాలు గందరగోళానికి గురైనవారు మతమార్పిడి చేసుకోవడం తధ్యమయిపోతుంది. ఎందుకంటే వారికి వేదజ్ఞానం లేక అసలు హిందూ ధర్మమంటేనే ఇంతేనేమో అన్న అపోహ మాత్రమే మిగిలిపోతుంది. అటువంటప్పుడు "హిందువుగా పుట్టావు, హిందువుగా జీవించు" అనే నినాదం ఎందుకు పనికొస్తుంది? ఈ పనికి బదులు "వేదశాస్త్ర" అవగాహనకు కృషి చేయడమే ఉపయోగపడుతుంది. దీనికి మీరేమంటారు?

1 Response to "హిందువులు వేదశాస్త్రాలను ఎందుకు ప్రతిష్టించరు?"

  1. Andhra Talkies

    గుడ్ ఆర్టికల్ సర్! చాలా బాగుంది
    ఫుల్ ఎంజాయ్ మెంట్ బ్లాగ్… వీలయితే ఒకసారి ఇది కూడా చూడండి.

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine