• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Editorial » ముస్లిములు కేవలం గోమాంసమే ఎందుకు తినాలి?

ముస్లిములు కేవలం గోమాంసమే ఎందుకు తినాలి?

Label: Editorial

Why do Muslims just need to be grazing?
ఈ మధ్యకాలంలో ఎక్కువుగా గోవధ నినాదం వినబడుతోంది. తినకూడదని హిందువులు (ఇక్కడ హిందువులు అనే కంటే రాజకీయ వర్గాలు, లేక కొన్ని మతపరమైన సంస్థలు అంటే బాగుంటుందేమో! ఎందుకంటే హిందువులలో కూడా గోమాంసం తినే వారు ఎక్కువగానే ఉన్నారు.) ఇక మరోపక్క ముస్లింలు వాదులాడుకుంటున్నారు. మొన్నా మధ్య పరిపూర్ణానంద స్వామివారు మాంసాహార నిషేధం శాస్త్రాలలో లేదు అని చెప్పారు. అంటే దైవ దృష్టిలో మాంసాహార నిషేధం లేదన్నమాట. మనిషిని సృష్టించిన దేవునికి తెలియదా? ఏది తినాలో,ఏది తినకూడదో? అందుకే కాబోలు మనుస్మృతిలో పంది నిషేధం ఉంది. అంటే దానిని తినకూడదు. ఆవులు,గుఱ్ఱాల నిషేధం లేదు వేదంలో! ఆనాటి రోజుల్లో యాగాలలోనూ,యజ్ఞాలలోనూ వాటిని బలిచ్చిన దాఖలాలు ఎన్నో వున్నాయి. కాబట్టి దాశరధి రంగాచార్య గారన్నట్టు నేటి గోవధ నిషేధం రాజకీయ నినాదం తప్ప వేద నినాదం కాదని ఆయన తేల్చి చెప్పేశారు.

     మనుషులకీ, ఇతర జీవరాసులకీ మధ్య ఒక వ్యత్యాసం ఉంటుంది. జీవరాసులలో కేవలం మాంసాహారం తినేవి ఉంటే, మరొక ప్రక్క కేవలం శాఖాహారం మాత్రమే తివేవి ఉంటాయి. అందుకే వాటి దంతాల ప్రక్రియ కూడా వేరు,వేరుగా ఉంటుంది. కాని మనిషి పూర్తిగా వేరు. మాంసాహారి,శాఖాహారి అయ్యుంటాడు. అందుకే మనిషి యొక్క పళ్ళ వరస కూడా రెండింటికీ అనుకూలంగానే ఉంటుంది.

    ఇవేవీ అర్ధం చేసుకోకుండా మనం ఏదైతే తింటూ బ్రతుకుతున్నామో వారినీ అదే తిని బ్రతకాలంటే దారుణం కదూ? ఎవరి ఆహారపు అలవాట్లు వారికుంటాయ్. వారి కడుపుని శాసించాలని చూడడం అన్యాయం.

Why do Muslims just need to be grazing?

    ఇక నన్ను గోవధ నిషేదాన్ని సమర్ధించరా? అని అడిగితే నేను 100% ఏకీభవిస్తాను. పూర్తిగా సమర్దిస్తాను. ఎందుకంటే కొన్ని జంతువులు మాంసం కంటే అవిచ్చే పాలు ఎక్కువుగా ఉపయోగపడతాయి. అటువంటి జీవులు అంతరించి పోకుండా కాపాడడం మనధర్మం. అందుకే ఆవులను శ్రీకృష్ణులవారు కాపాడినట్టు, ఒంటెలు అంతరించి పోకుండా ప్రవక్త ముహమ్మద్ వారు కాపాడినట్టు మనం చూడగలం.అంతే గాని మాంసాహార నిషేధాలు వారేమీ విధించలేదు.

Why do Muslims just need to be grazing?

    ముస్లింలు గమనించవలసింది ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్(స)వారు గోవును ఖుర్భానీ చేసినట్టు ఎక్కడా ఒక్క దాఖలా లేదు. సరికదా గోవు మాంసం తిన్నట్టు కూడా ఆధారాలు లేవు. ఇంకా ఆయన గోవు పాలల్లో ఆరోగ్యం ఉంది, నెయ్యిలో వ్యాధి నివారణ ఉంది, మాంసంలో వ్యాధి ఉందని చెప్పారు. కాబట్టి ఒక వర్గానికి ప్రవిత్రమైన వాటిని గౌరవించడమే మంచి పని. ఆవును ఖచ్చితంగా తినాలని గాని, ఖుర్భానీ ఇవ్వాలని గాని ఎక్కడా లేదు. కేవలం ఆవును ఇవ్వక పోవడం వలన వచ్చే పాపమూ లేదు. వేరే ఎన్నో గొర్రెలూ, మేకలూ ఉన్నాయి. వాటిని ఇచ్చుకోవచ్చు. మొత్తం మాంసాహారమే నిషేధమంటే అది వేదం వ్యతిరేకమూ, మూర్ఖత్వమూ అవుతుంది. మాంసాహారం అవసరం కూడా! మనిషికి శాఖాహారంలో ప్రోటీన్లు ఉన్నటే, మామ్సాహరంలోనూ ఉన్నాయి అయితే వాటికి పరిధులూ, హద్దులూ ఉంటాయ్.

Andhra,Telangana Teachers Notifications,10th,Inter,Degree,all Groups Model Papers and Question Papers, All Govt Jobs Notifications, latest job news…More. Please Visit the Teacherguide.in

1 Response to "ముస్లిములు కేవలం గోమాంసమే ఎందుకు తినాలి?"

  1. Praveen

    Did microscopes exist during the life of Prophet Muhammad to prove bacteria in beef?

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine