• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » హేతుబద్ధంగా ఆలోచించే ఆస్తిక-నాస్తిక మిత్రులకు మా మనవి.

హేతుబద్ధంగా ఆలోచించే ఆస్తిక-నాస్తిక మిత్రులకు మా మనవి.

మీరు ప్రాథమికముగా గుర్తించవలసిన విషయం:
గీతా-బైబిల్-ఖురాన్ వంటి ధర్మశాస్త్రాలు ప్రతిపాదిస్తున్న ధర్మమునకు మరియు ఆ గ్రంధాలకు చెందిన నేటి పండితులు ప్రచారం చేస్తున్న ధర్మమునకు ఏ విధమైన సంబంధమూ లేదు! అన్నది.

దానికి ఇవే ఆధారాలు:
ధర్మశాస్త్రాలు ప్రకారం - మనిషి పాల్పడే "దురాచరణ"ను బట్టి "దేవుని శాపం" కలుగుతుంది. మనిషి చేసే "సదాచరణ"ను బట్టి "దేవుని అనుగ్రహం" లభిస్తుంది. ఈ క్రింది గమనించగలరు.

గీతాశాస్త్రం
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్…"
సాధు సజ్జనులను సంరక్షించుట కొరకును, దుర్మార్గులను వినాశ మొనర్చుటకును… -4:8

బైబిల్ శాస్త్రం
వీరు (అనీతిమంతులు) నిత్యశిక్షకును, నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు. -మత్తయి 25:46

ఖురాన్ శాస్త్రం
నిశ్చయంగా సజ్జనులు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు. నిస్సందేహంగా దుర్జనులు నరకానికి పోతారు. -82:13,14

  ఈ పై వాక్యాల ప్రకారం- హిందూ-హిందూయేతరులు, క్రైస్తవులు-క్రైస్తవేతరులు మరియు ముస్లింలు-ముస్లిమేతరులు అన్న "మత వర్గాల" పరంగా కాక, "శిష్టులు, నీతిమంతులు, సజ్జనులు' అనే "అనుకూల గుణాల" వారీగా మరియు "దుష్టులు, అనీతిమంతులు, దుర్జనులు" అనే "ప్రతికూల గుణాలు"వారీగా ప్రజలు వర్గీకరించబడుతున్నారు. ఈ వర్గీకరణ పూర్తిగా హేతుబద్ధమైనది, అత్యంత న్యాయమైనదీనూ.

    కానీ, నేటి "హిందూ-క్రైస్తవ-ముస్లిం"వర్గాలకు చెందిన అధికశాతం పండితుల ద్వారా - "తమ "మతవర్గానికి చెందిన వారికే దేవుని "అనుగ్రహం" ఉంటుంది. ఎదుటి "మతవర్గానికి చెందిన వారికి దేవుని "శాపం" కలుగుతుంది. అనే ధర్మ విరుద్ధ ప్రచారం పరస్పర మతవర్గాలలో జరుగుతుంది. ఈ వర్గీకరణ పూర్తిగా హేతువిరుద్ధమైనది. అత్యంత అన్యాయమైనదీనూ. ఎందుకంటే - ఏ వర్గంలో అయినా పూర్తిగా మంచివాళ్ళూ ఉండరు. అలాగే పూర్తిగా చెడ్డవాళ్ళూ ఉండరు.

       చూసారు కదా! "శాస్త్రాల ప్రబోధనల"కు మరియు "శాస్త్రుల ప్రచారాల"కూ మధ్య ఎంతటి వ్యత్యాసం ఉందో! ఇది ఒక మచ్చుతునక! వీరి పోకడ ప్రతి విషయంలోనూ అలాగే ఉంది.

        వివిధ మత వర్గాలకు చెందిన "అశాస్త్రీయ పోకడలు" ఆ యా మత వర్గాలకు చెందిన వంచక పండితుల "కల్పన"లే తప్ప వారి ధర్మశాస్త్రాల "ప్రబోధన"లు కావన్న విషయాన్ని గుర్తించాలన్నదే హేతుబద్ధంగా ఆలోచించే ఆస్తిక -నాస్తిక మిత్రులకు మా మనవి! 

1 Response to "హేతుబద్ధంగా ఆలోచించే ఆస్తిక-నాస్తిక మిత్రులకు మా మనవి."

  1. Zilebi


    ఆహా ! ఏమి విన్నాణం ! ఏమి విన్నాణం !

    చీర్స్
    జిలేబి

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine