"యెహోవాయే అల్లాహ్"
యెహోవా,అల్లాహ్ ఒక్కటా? కాదా? అన్న విషయంలో ఒకనాటి మహామహులైన క్రైస్తవపండితులలో ఏ భేదాబిప్రాయం ఉండేది కాదు! దానికి గొప్ప ఉదాహరణ బైబిల్ అరబీ అనువాదంలో "యెహోవా" అన్న పదాన్ని "అల్లాహ్" గా అనువదించడమే! అన్నిటికంటే గొప్ప విషయం "యేసు" .క్రొత్త నిబంధనలో తాను మాట్లాడినా అరమాయిక్ భాషలో సైతం సృష్టికర్త అయిన యెహోవాను అల్లాహ్ అని ప్రకటించడమే. అయితే ఈ కనీస విషయాల అవగాహన లేని కొందరు అభినవ క్రైస్తవ బోధకుల వాదన ఏమిటంటే .యెహోవా వేరు!,అల్లాహ్ వేరు! అన్నది. దానికొరకు వారు లేవనెత్తుతున్న విమర్శలు ఏమిటంటే…
- బైబిల్లో ప్రేమామయుడు అయిన యెహోవా వేరు! ఖురాన్ లో పాపులను ప్రేమించని అల్లాహ్ వేరు!
- ఖురాన్ లో ఎత్తులు వేసే అల్లాహ్ వేరు! బైబిల్లో యెహోవా వేరు!
- తన ఆజ్ఞలు తానే రద్దు చేసుకునే అల్లాహ్ వేరు! తన ఆజ్ఞలు రద్దు చేసుకోని యెహోవా వేరు!
- తనకు ఏ కుమారుడు లేదని ప్రకటించుకున్న అల్లాహ్ వేరు,కుమారులు కలిగిన యెహోవా వేరు!
- బైబిల్లో త్రిత్వమైన యెహోవా వేరు! ఖురాన్ లో ఒంటరి అయిన అల్లాహ్ వేరు!
కాబట్టి యెహోవా,అల్లాహ్ వేరువేరన్నది!!!
పై విమర్శలతో పాటు నేటి క్రైస్తవ బోధకులు లేవనెత్తుతున్న అనేక విమర్శకులకు సమాధానంగా వ్రాయబడిన పుస్తకమే …"యెహోవాయే అల్లాహ్"
...............................................................................................................
"సిలువ…బలియాగమా? కుట్రా?"
- యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా?
- ప్రధాన యాజకులు, యూదమత పెద్దలందరూ కలిసి యేసును చంపాలని కుట్ర పన్నడం వెనుక కారణం ఏమిటి?
- యేసు సిలువ వేయబడటం దేవుని ఆది సంకల్పమే అయితే దానికి సాతానూ ఎందుకు శ్రీకారం చుట్టాడు?
- లేఖనంలో యెహోవా చేసిన వాగ్దానం - యేసు ఎముకలను కాపాడతారన్నదా? లేక మరణం నుండి రక్షిస్తాడన్నదా?
- యేసు సిలువ వేయబడినప్పటికీ… దానిపై మరణించకుండా తప్పించబడతారని వ్రాయబడిన లేఖనాలు యేసుకు చెందినవి కావా?
- యేసును సిలువ శిక్షకు గురి చేసి యూదులు నెరవేర్చింది దేవుని సంకల్పమా?
- యేసు తనకు ఇష్టాపూర్వకంగా బలవ్వడం కోసమే ఈలోకానికి వచ్చారా?
- తమపై ఉన్న హత్యానేరానికి పరిశుద్ధ బలియాగపు రంగు పులిమి క్రైస్తవుల దృష్టికి దానిని కనుమరుగు చేయటం వెనుక యూదులు పన్నిన అతి పెద్ద కుట్ర ఏమిటి?
అత్యంత ఆలోచనాత్మకమైన పై ప్రశ్నలకు స్పష్టమైన సమాధానమే ఈ పుస్తకం!